koodali

Friday, September 9, 2011

దైవ విగ్రహాలు పెరగటం గురించి..........



కొన్ని దైవ విగ్రహమూర్తులలో కాలంతో పాటూ పెరుగుదల కనిపిస్తోంది.

ఉదా..కాణిపాకంలోని స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి. ఇంకా, యాగంటి లోని నందీశ్వరుడు .

కాణిపాకాన్ని శివ వైష్ణవ క్షేత్రంగా చెబుతారు . శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయానికి కొంత దూరంలో శ్రీ వరదరాజస్వామి ఆలయం కూడా ఉంది..

,కాణిపాకంలో స్వామివారికి కొంతకాలం క్రిందట భక్తులు చేయించిన వెండి కవచం ఇప్పుడు సరిపోవటం లేదు.

కొంతకాలం క్రిందట యాగంటిలోని నందీశ్వరుని చుట్టూ ప్రదక్షిణలు చెయ్యటానికి స్థలం సరిపడా ఉండేదట.

ఇప్పుడు అలా ప్రదక్షిణ చెయ్యటానికి , అంత స్థలం లేనంతగా నంది విగ్రహంలో పెరుగుదల కనిపిస్తోంది. ఇవన్నీ దైవలీలలే.

హేతువాదులు ఏమంటారంటే, కొందరేమో రాళ్ళు పెరుగుతాయి అంటున్నారు.

కొందరేమో రాళ్ళలో జీవం ఉండదు కాబట్టి ఎలా పెరుగుతాయి ? అలాంటి పెరుగుదల అసంభవం.
అంటున్నారు. ఇలా వాళ్ళలో వాళ్ళకే తేలటం లేదు.

ఇంకా కొంద
రు, ఒక్కోసారి భూమిలో వచ్చే మార్పుల వల్ల కొంతభాగం పర్వతాలు ఏర్పడుతాయి..అలాగే విగ్రహాలు పెరుగుతాయి అంటున్నారు.

పర్వతాలు ఏర్పడటానికీ, విగ్రహాలు పెరగటానికి పోలికే లేదు.

మరి , విగ్రహాలు పెరుగుతున్నా కూడా అవి ఒక పద్ధతిగా పెరుగుతున్నాయి.

అంటే వినాయకుని మూర్తి అలాగే చక్కగా ఒక పద్ధతిలో పెరుగుతోంది.

నందీశ్వరుని ఆకారం, ముఖకవళికలు , పాదాలు ,ఇతర
శరీరాకృతి చెక్కుచెదరకుండా చక్కగా అలాగే ఉండి పెరగటం జరుగుతోంది.

అంటే , ఇష్టంవచ్చినట్లు కాకుండా పూర్వపు ఆకారంలోనే పెరుగుదల కనిపిస్తోంది. కాబట్టి ఇదంతా దైవలీల.

సమాజంలో సవాలక్ష సమస్యలుండగా దేవుడు లేడని నిరూపించటానికి కొందరు ఎందుకు ఇంతగా తాపత్రయపడతారో అర్ధం కాదు.


సృష్టిలోని వ్యవస్థ పనిచేయటం గురించి కొద్దిగా తెలుసుకున్న శాస్త్రవేత్తలను ఎంతో గౌరవిస్తారు.

కానీ ఆ విధంగా వ్యవస్థను ఏర్పాటు చేసిన సృష్టికర్త అయిన మహాశక్తిని ఒప్పుకోము అని అగౌరవపరుస్తారు. ఇది చాలా అన్యాయం..

అంటే ;గాలిలో ఆక్సిజన్ ఉంటుందని కనిపెట్టిన శాస్త్రవేత్తను గౌరవించినంతగా,

గాలిలో ఆక్సిజన్ ఉండేలా ఏర్పాటు చేసిన భగవంతుని గౌరవించరు కొందరు హేతువాదులు.,

అంతటితో ఊరుకోకుండా, దైవం అంటూ ఎవరూలేరని కూడా చెప్పటానికి కొందరు చాలా తాపత్రయపడతారు..

ఎవరు ఎలాంటి పేరుతో పిలిచినా దైవము ఒక మహా శక్తి ..


6 comments:

  1. ప్రపంచంలో సవాలక్ష సమస్యలుండగా దేవుడు లేడని నిరూపించటానికి కొందరు ఎందుకు ఇంతగా తాపత్రయపడతారో అర్ధం కాదు.
    -----------------
    అదే అర్ధం కాదు. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

    ReplyDelete
  2. ఎవరు ఎలాంటి పేరుతో పిలిచినా దైవము ఒక మహా శక్తి

    ReplyDelete
  3. కృతజ్ఞతలండి.
    నాకూ శాస్త్రవేత్తలంటే గౌరవమే. అయితే దేవుని కన్నా శాస్త్రవేత్తలే గొప్ప అని కొందరు అంటున్నందువల్లే బాధగా ఉంది. దైవమే గొప్ప .

    ReplyDelete
  4. కృతజ్ఞతలండి.

    ReplyDelete
  5. ఈ నాస్తికు లంతా యే సైంటిస్త్టుల థీరీల్ని చూపించి దేవుడు లేడంటున్నారో ఆ సైంటిస్తులు దేవుడ్ని నమ్ముతున్నారు. అది మామూలు వాళ్ళకి తెలీని సీక్రెట్టూ.వాళ్ళు మేము నిజాల్ని నమ్మూతామంటూనే దాచేసే పెద్ద నిజం. ఐనా గయ్యాళి తనం తో కొట్టుకొస్తున్నారు,అంతే.

    ReplyDelete