koodali

Wednesday, September 7, 2011

డెమాక్రసి అంటే ..........................


డెమాక్రసి ....

«Government of the people, by the people, for the people»

ఇది అబ్రహం లింకన్ డెమోక్రసీ గురించి ఇచ్చిన నిర్వచనం.

కొన్ని దేశాల్లో ప్రజలకు ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే హక్కు కూడా ఉంది.

కానీ మన దేశంలో మాత్రం అవినీతిని తగ్గించే పటిష్టమైన బిల్లు గురించి గట్టిగా మాట్లాడితేనే తప్పుగా భావించటం ఆశ్చర్యంగా ఉంది.

ప్రజాస్వామ్యవ్యవస్థలో సహజవనరుల వంటివాటిని ప్రజలందరూ సమానంగా అనుభవించాలి. అలా పేదరికం పోవటానికి ప్రభుత్వాలు కృషిచెయ్యాలి.

కానీ మితిమీరిన ప్రైవేటీకరణ వల్ల అవన్నీ ధనికుల అజమాయిషీలో ఉంటున్నాయి.

.డబ్బు ఉన్నవాళ్ళు లంచం ఇచ్చి పనులు త్వరగా చేయించుకుంటారు . మరి డబ్బు లేనివాళ్ళ సంగతి ఏమిటి ?

లంచాలకు అలవాటుపడ్డవారు ఊరికే పనులు చేయరు కదా !

ఈ అవినీతి, లంచగొండితనం వల్ల డబ్బులేని పేద వారు లంచాలు ఇవ్వలేక , పనులు సకాలంలో పూర్తి చేసుకోలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

డబ్బు ఉండి లంచం ఇచ్చేవాళ్ళు కూడా అలా లంచాలు ఇచ్చీ ఇచ్చీ .. ఆ డబ్బు సంపాదించటానికి తిరిగి వాళ్ళూ లంచం తీసుకుంటారు. ఇదొక విషవలయం.

ఇక్కడ ప్రజల తప్పు కూడా ఉంది.

ఎన్నికల సమయంలో ఉచితహామీలు ప్రకటించని పార్టీలను ప్రజలు గెలిపించటం లేదు.

ప్రజలకు ఉపయోగపడేవి ఉచితహామీ
పధకాలు కాదు. ఉపాధి హామీ పధకాలు.

ప్రజలు ఎన్నికల సమయంలో ఉచితవస్తువులు తీసుకోవటానికి ఆశ పడకూడదు.

పార్టీలు ఎన్నికలఖర్చు కోసం చాలాడబ్బు ఖర్చు చెయ్యవలసి వస్తోంది. దానికివారు విరాళాలు సేకరిస్తారు.

అలా విరాళాలు ఇచ్చినవారు ఆ భారాన్ని తాము ఉత్పత్తి చేసిన వస్తువులపైనే వేస్తారు.

అలా ధరలు పెరుగుతాయి. ప్రజలు ధరలు పెరిగాయని మళ్ళీ గోల పెడతారు.

ఉచితహామీలకు ఆశ పడితే అంతే మరి.

ప్రజలంటే రాజకీయపార్టీలవాళ్ళు, పారిశ్రామికవేత్తలు , మధ్యతరగతివారు, సామాన్యులు .. ఇలా అన్ని వర్గాల వారు కలిపితేనే ప్రజలు.

రాజకీయనాయకులు, పారిశ్రామికవేత్తలు వంటి వారిలో కూడా లంచం ఇచ్చి పనిచేయించుకోవటం , అవినీతి వంటి చర్యలు ఇష్టం లేనివారు చాలా మంది ఉంటారు.

కానీ, తప్పనిపరిస్థితుల్లో అలా ఇస్తుంటారు. ఇలాంటివారందరూ అవినీతి, లంచగొండితనం పోవాలనే అనుకుంటారు.

అందుకని మనం ప్రతిఒక్క రాజకీయనాయకుణ్ణీ, పారిశ్రామికవేత్తను అనుమానించనక్కరలేదు.

ప్రజలు కూడా ఎన్నికసమయంలో ఉచితహామీలకు ఆశపడకుండా పేదరికాన్ని పోగొట్టే వారికి, అభివృద్ధి పాలన అందించేవారికే ఓట్లు వేస్తే పార్టీలు కూడా ఓట్ల కోసమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు.

ఈ అవినీతి వంటి విషయాల్లో ఎవరోవచ్చి ఏదో చేస్తారని కాకుండా ప్రజలందరూ తమవంతు ప్రయత్నం తాము చెయ్యాలి.

భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి వారు రాబోయే తరాలకోసం తమ నిండు జీవితాలను అర్పించారు.

ఇంకా కొందరు, దేశానికి స్వాతంత్ర్యం సంపాదించటం కోసం ఆస్తులను కోల్పోయారు, యుక్తవయస్సులో జీవితాన్ని జైళ్ళలో గడిపారు.

ఈ నాటి వారు అంతలేసి త్యాగాలను చెయ్యనక్కరలేదు కానీ, తమవరకు తాము అవినీతికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి.

సినిమాలు, క్రికెట్టు, లగ్జరీ జీవితం, వీటిపై పెట్టే శ్రద్ధలో కొద్ది భాగం ... దేశసమస్యలను పరిష్కరించటంలో తనకు చేతనైనంతలో శ్రద్ధ చూపిస్తే మన బ్రతుకులే బాగుపడతాయి.


ఇక జనలోక్ పాల్ బిల్లు వల్ల ప్రజాస్వామ్యానికి మంచే జరుగుతుంది తప్ప చెడు జరగదు.

ఇంకా భయపడేవాళ్ళు ఇలా ఆలోచించవచ్చు.

ఈ బిల్లువల్ల ......కి హాని కలిగే సందర్భం ఒకవేళ భవిష్యత్తులో వస్తే ? ( రాదు. ) ఆ సందర్భంలో ఆ సమస్యను పరిష్కరించే అధికారం న్యాయవ్యవస్థకు ఉండేలా బిల్లును తెస్తే ఇక అనుమాలుండవు.

 

2 comments:

  1. "ఇదొక విషవలయం."
    -----------------
    అల్లాగే కనపడుతుంది. దీనికి విరుగుడు ఆశలకి పోకుండా తనకి ఉన్నదానితో జీవించటానికి ప్రయత్నించటం. ఎందుకంటే ఆశలకి అంతు ఉండదు. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

    ReplyDelete
  2. అవునండి . అన్ని అనర్ధాలకూ కారణం పెద్దలు చెప్పినట్లు మితిమీరిన కోరికలే. నేనే మీ బ్లాగులో వ్యాఖ్య వ్రాద్దామనుకుంటున్నాను. ఇంతలో మీరే వ్రాశారు. మీకు కూడా కృతజ్ఞతలండి...

    ReplyDelete