koodali

Monday, September 12, 2011

అసలు స్థానికత అంటే ఏమిటో నాకు తెలియటం లేదు..

 

* మాకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల లొనూ బంధువులున్నారు. మాది బదిలీలతో కూడిన ఉద్యోగమండి. ఈ బదిలీల వల్ల మంచీ ఉంది. చెడూ ఉందనిపిస్తుంది.


ఒకసారి బదిలీ వల్ల ఒక ప్రాంతానికి వెళ్ళాము. యధాప్రకారం చుట్టుప్రక్కల వారితో పరిచయాలు అయ్యాయి.

కొంతకాలం తర్వాత , ఒకరోజు మా పొరుగామె ఒకామె మా ఇంటికి వచ్చారు.


ఆమెతో నాకు మంచి స్నేహమే ఉంది. నాకన్నా వయసులో పెద్ద. అలా మాటల్లో ఇళ్ళ అద్దెలు, స్థలాల రేట్ల ప్రసక్తి వచ్చింది.

నేను, ఇక్కడ వాటి రేట్లు ఎలా ఉంటాయండి ? అని అడిగాను.

అంతే, అప్పటివరకు చక్కగా కబుర్లు చెబుతున్న ఆమె ఒక్కసారిగా .


* ఏం ? కొంటారా ? బదిలీపై వచ్చారు. అద్దెకుండి మీ పని అయ్యాక వెళ్ళిపొండి. అంతే. ఇక్కడ రేట్లతో మీకేం పని ? అలా అనేసింది.

నేను ఒక్క క్షణం బిత్తర పోయి, అబ్బే నేను కొనాలని అడగలేదండి. అన్నాను.

* నిజంగానే , నేను కొనే ఉద్దేశంతో అడగలేదు. నాకు అలా విషయసేకరణ చేయటం అలవాటు.విషయ పరిజ్ఞానం పెంచుకుందామని పనీపాటా లేక అలా అడిగానంతే.


కానీ, ఆమె ముఖం మీదే అలా అనేస్తుందని అనుకోలేదు.

అప్పటినుంచీ ఎవరితో ఏం మాట్లాడితే ఏం తంటానో అని తక్కువగా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాను.

ఇంకోసారి ఇంకొకామె ఇతరప్రాంతం వాళ్ళు ఇక్కడికొచ్చి స్థిరపడుతున్నారని వారిని తిట్టటం జరిగింది.

ఇతర ప్రాంతాల నుంచీ వలసలు మితిమీరి పెరిగితే స్థానికులు ఆందోళన పడటం , వలసలవల్ల తమకు ఉపాధి అవకాశాలు తగ్గుతాయని భయపడటం జరుగుతుంది.


* ఈ భయం ప్రపంచవ్యాప్తంగా ఉంది. అందుకే నేను ఎక్కడివాళ్ళు అక్కడే జీవించటం వల్ల ఇలాంటి గొడవలు తగ్గే అవకాశం ఉంది అంటాను.



ఇదంతా
సంకుచితతత్వం అంటే నేనేమీ చెప్పలేను. గొడవలు రాకుండా ఉంటాయేమోనని ఇలా చెబుతున్నాను.అంతే.


సరే, అప్పుడు వాళ్ళు నాతో అలా అన్నందుకు నాకు బాధతో పాటు ఆశ్చర్యము, ఎన్నో ఆలోచనలు కూడా కలిగాయి.


* ఎందుకంటే , నన్ను అలా అడిగిన వాళ్ళ యొక్క పిల్లలు, బంధువులు, చాలామంది ఇతర ప్రాంతాలలోనూ, రాష్ట్రాల్లోనూ, ఇంకా కొందరు ఇతరదేశాల్లోనూ ఉద్యోగ, వ్యాపారరీత్యా ఉంటున్నారు.

వారు అక్కడ ఆస్తులూ కొనుకుంటున్నారు.

మరి అలాంటప్పుడు ఆమె నన్ను అలా అడగటం న్యాయమా ?

కొందరు తమకొక నీతి ఇతరులకు ఒక నీతిగా ప్రవర్తిస్తుంటారు.

* మా ఊరు ఎవరూ రాకూడదు అనేవారు ఇతరుల ఊళ్ళు కూడా వెళ్ళకూడదు కదా !

* అయినా ఆమె నన్ను పరాయి ప్రాంతం వాళ్ళగా భావించింది కానీ, మాకు ఆ ప్రాంతం వారితో వివాహబంధుత్వాలు కూడా ఉన్నాయి.


* మాకు రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లోనూ బంధువులు, ఆత్మీయులు ఉన్నారండి.

భార్యా భర్తలు వేరేవేరే ప్రాంతాలకు చెందిన కుటుంబాల్లో ఈ స్థానికత అనే విషయాలపై అపార్ధాలు కూడా చోటుచేసుకుంటున్నాయి.



ఇక, బదిలీలవల్ల మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. అందుకు బాధగా కూడా ఉంటుంది.

ఎందుకంటే, ఇలా సమస్యలు వచ్చినప్పుడు మీది ఏ ప్రాంతం ? అని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలో తెలియదు.


మేము మా పూర్వీకులు నివసించిన ప్రాంతం పేరు చెబుతుంటాము.మాకు అక్కడ బంధువులు కూడా ఉన్నారు లెండి.

* ఇవన్నీ ఆలోచిస్తే అసలు నేటివిటీ అనేది ఎలా నిర్ధారిస్తారు ? దేని ఆధారంగా ? అన్నది మాకు తెలియటంలేదు.

మాలాంటి వారు ఆస్తిపాస్తులను ధైర్యంగా కొనుక్కోవాలన్నా మా ప్రాంతం ఏది అన్నది తెలిస్తే మాకు ధైర్యంగా ఉంటుంది.


* ఇది మన రాష్ట్రం అనుకునేంతలో మీ రాష్ట్రం కాదంటున్నారు. మన ప్రాంతం
అనుకుంటే మీ ప్రాంతం కాదంటున్నారు.


* అందుకని మేధావులు ఇవన్నీ ఆలోచించి కొన్ని ఊళ్ళు ఒక ప్రాంతంగా నిర్ణయించి ,....... ఇక అక్కడి వాళ్ళు బయటికి పోకుండా అక్కడనే జీవించేటట్లూ ఉపాధి అవకాశాలు కల్పించాలి.

దిలీలు కూడా ఆ పరిధిలోని ఊళ్ళలోనే జరగాలి.

ఇదంతా సంకుచితతత్వం అంటే నేనేమీ చెప్పలేను. గొడవలు రాకుండా ఉంటాయేమోనని ఇలా చెబుతున్నాను.అంతే.

. ఇంకా నాకు ఏమనిపిస్తుందంటే
,.............

ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన వెంటనే హైదరాబాద్ ను రాష్ట్ర ముఖ్య రాజధానిగాచేసి.. కర్నూలు, వైజాగ్, విజయవాడలను
.. మిగతామూడు ప్రాంతాలకూ ఉప రాజధానులుగా చేసి , అభివృద్ధి చేస్తే బాగుండేదని అనిపిస్తుంది.

* అంటే
,ఒక ముఖ్య రాజధాని , మూడు ఉప రాజధానులు అన్నమాట..

అప్పుడు ఎక్కడికక్కడ అభివృద్ధి జరిగి అక్కడి ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసలు రాకుండా అందరూ బాగుండేవారు అనిపిస్తుంది.

* రాష్ట్రంలోని ప్రజలందరూ ప్రతిచిన్నపనికీ హైదరాబాదుకు రాకుండా హైదరాబాదులోని ముఖ్య కార్యాలయాలకు ఉప కార్యాలయాలను ఉప రాజధానుల్లోనే ఏర్పాటు చేస్తే బాగుండేది అనిపిస్తుంది. .

* అన్ని ప్రాంతాల పెట్టుబడిదారులు కూడా తమ పెట్టుబడులను తమ ప్రాంతంలోనే పెట్టి అభివృద్ధి చేసుకుంటే , ఇప్పుడు ఇలా బాధపడవలసి వచ్చేది కాదు అనిపిస్తుంది.


బదిలీ ఉద్యోగాలు మీద తిరిగే మాలాంటి వారు ఆస్తులను కొనాలంటే చాలా ఆలోచించాలి.

మన పూర్వులు నివసించిన ఊరిలో మనకు బాగా దగ్గరిబంధువులు ఉంటే , వాళ్ళు ఇవన్నీ చూస్తారు. అలా లేనివారి పరిస్థితి ఏమిటి ?


ఈ రోజుల్లో ఎవరిపనులు వాళ్ళే చేసుకోవటానికి సమయం సరిపోవటం లేదు. ఇక మన పనులు చక్కబెట్టడానికి బంధువులైనా , వారికి తీరిక ఉండొద్దూ ?

అందుకే చాలామంది తాము నివసించే ప్రాంతంలోనే స్తిరాస్తులు కొనుక్కుంటారు.

మాకూ స్వంత ప్రాంతంలోనే నివసించాలనీ ఉంటుంది. అసలు స్థానికత అంటే ఏమిటో తెలుసుకోవాలని ఉంది.

* చదివిన ప్రాంతం ఆధారంగా స్థానికత నిర్ణయిస్తే ఒకే ఇంట్లోని కుటుంబసభ్యులు వేరేవేరే ప్రాంతాల్లో చదవటం వల్ల అలా ఒకే ఇంట్లో కుటుంబసభ్యులు వేరేవేరే ప్రాంతాలకు చెందే అవకాశం ఉంది.

ఆ మధ్య ఒక చానల్లో ఒక ప్రసారం చూశాను.

* తెలుగువాళ్ళు చాలామంది శిరిడీలో స్థిరపడ్డారట. అక్కడ స్థిరాస్తులు కొనుక్కున్నారట.

మొదట్లో ఎంతో బాగా మాట్లాడి, సహాయం చేసిన అక్కడి స్థానికులు ఇప్పుడు ముభావంగా ఉంటున్నారట. ఇలా చాలా విషయాలు చెప్పారు.

ఈ మధ్య ఉత్తరాంధ్రలో ఇతర రాష్ట్రాల వారికి ఎక్కువగా ఉద్యోగాలు ఇవ్వటం గురించిన వార్తలు వచ్చాయి. ముంబాయ్ లో కూడా ఇలాంటి ఉద్యమాలు జరిగాయి.

ఇవన్నీ చూసాక ఈ గొడవలన్నీ ఎందుకు ? ఎక్కడివాళ్ళు అక్కడే జీవించాలని నాకు అనిపించటంలో తప్పుందంటారా ?

ముందుముందు ఉద్యోగాలు చెయ్యబోయే ఇప్పటి విద్యార్ధులు ఈ సమస్యలన్నీ ఎదుర్కోవలసి ఉంది.


* ఇప్పటి విద్యార్ధులు భవిష్యత్తులో ఉద్యోగాలు ,వ్యాపారాలు కొరకు ఇతర రాష్ట్రాలు, దేశాలు వెళ్ళకుండా ఉంటారా ?

* ఎవరికైనా విదేశాల్లో మంచి జీతంతో ఉద్యోగావకాశం వచ్చిందనుకోండి.

" నా మాతృభూమి ఎంత అందమైనదీ "  అని పాటలు పాడుకుంటూ విదేశాలకు వెళ్ళకుండా ఇక్కడే ఉండే వారు ఈరోజుల్లో ఎందరు ఉంటారు ?


అందుకని స్థానికత అనే విషయం గురించి మేధావులు గట్టిగా ఆలోచించాలి. ప్రజల మధ్య అపార్ధాలు తొలగటానికి తోడ్పడాలి.


* రాష్ట్రం విడిపోయినా, విడిపోకున్నా ఎప్పటికీ ప్రక్కప్రక్కనే జీవించవలసిన ప్రజల మధ్యన ఇంతలా అపార్ధాలు, ఆవేశాలూ పెరగటం మంచిదికాదు.

అది ముందుముందు అనర్ధాలకు దారి తీస్తుంది.

* ఎంతైనా మనమందరం ఒకటి.


* సమస్యలు సామరస్యంగా , త్వరగా పరిష్కారం అవ్వాలనీ ,అప్పుడు పేదప్రజల సమస్యల పరిష్కారానికి ఎక్కువసమయం ఉంటుందని ఆశిద్దాము.


ఇంకా, స్వాతంత్ర్యం వచ్చి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రాంతం ఏదైనా ప్రజల పేదరికం పోలేదు. పెద్దగా అభివృద్ధి జరగలేదు. ఇప్పటికీ రైతులు, చేనేతలవారు, వేలాదిగా ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. ఫ్లోరైడ్ సమస్య అలాగే ఉంది.

నాయకులలో కొందరు నిజాయితీగానే ఉన్నా, చాలామంది ధనికులు మరింత ధనికులు అవుతున్నారు. పేదలు మరింత పేదలు అవుతున్నారు. అసలు సమస్యలు అవీ. వాటి గురించి బాధపడాలి..

ప్రజల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తే ఇన్ని సమస్యలు ఎందుకుంటాయి ?


*
సమస్యలూ త్వరగా పరిష్కారం అవ్వాలని ఆశిద్దాము..


12 comments:

  1. నాకు ఇది ఇక్కడి కొచ్చాక అనుభవం లోకి వచ్చింది.. ఇతరుల వల్ల కాదు... మన సంస్కృతి కోల్పోయి... ముఖ్యం గా మా వరంగల్ నీ.. కొంత హైదరాబాద్ నీ .. అందుకే వేరే ప్రాంతాల్లో కొద్ది కాలం కోసం వెళ్ళొచ్చు కానీ .. ఎక్కడి వాళ్ళు అక్కడ స్థిర పడటమే మేలు.. ఇక్కడికొచ్చిన చాలా మంది సంస్కృతిని విడవలేక.. బ్లాగుల్ల రూపంలో , వివిధ కార్యక్రమాల రూపం లో ఆ లోటు తీర్చు కునే ప్రయత్నం చేస్తుంటారు..

    ఇక్కడ రాజధానులు ఎక్కువగా అభివృద్ధి చెందవు అని కాదు కానీ... రాజధాని కన్నా ఎక్కువ అభివృద్ధి చెందిన నగరాలు చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి...

    అందుకని కొంత కాలం చూసి తిరిగి వచ్చేయాలనుకుంటున్నా..

    ReplyDelete
  2. మీరు చెప్పకపోయినా, ఈ వాఖ్య తెలంగాణ గురించేనని స్పష్టం. తెలంగాణలో (ముఖ్యంగా హైదరబాద్ లో) ఇతర భాషల వారికి లేని భయం, అనుమానం ఆంద్ర వారికి మాత్రమె కలగడానికి కారణం ఏమిటి? జాగ్రతగా ఆలోచిస్తే, భాషా దురభిమానమే ముఖ్య కారణమని చెప్పక తప్పదు.

    Everyone who came to Telangana (including Andhras) in the past accepted the culture and contributed to it. Only post-1956 Andhras refused the culture. This situation deteriorated once the Y2K andhras (or KPHB andhras) started arriving in the late nineties.

    "ఇది మన రాష్ట్రం" అనుకోవడం మంచిదే కానీ మన రాష్ట్రం లో ఉండేవాల్లందరూ మనలాగే ఉండాలనుకోవడం జరగని పని. The concept of "be a Roman when in Rome" works everywhere (city, street or even house).

    మీకు ఇతర రాష్ట్రాలకు బదిలీలు లేవా? Many landlords in Delhi prefer South Indian tenants!

    ReplyDelete
  3. అంతా దైవం దయ. మీకు కృతజ్ఞతలండి.

    ReplyDelete
  4. మీకు కృతజ్ఞతలండి..
    ఎవరెన్ని అనుకున్నా మనమందరమూ భారతీయులం. తరువాత తెలుగు ప్రజలం. మాకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ బంధువులున్నారు కాబట్టి మాకు అన్ని ప్రాంతాలూ సమానమేనండి.

    ఇక మీరు చెప్పినట్లు "అందుకే వేరే ప్రాంతాల్లో కొద్ది కాలం కోసం వెళ్ళొచ్చు కానీ .. ఎక్కడి వాళ్ళు అక్కడ స్థిర పడటమే మేలు.." నాకు కూడా ఇలాగే అనిపిస్తుంది. కానీ అన్ని ఊళ్ళు తిరుగుతూ చివరిదశలో మన ఊరు వెళ్తే అక్కడ కూడా మనల్ని పరాయివారిగా చూసే ప్రమాదం కూడా ఉంది. అందుకని మధ్యమధ్య సెలవల్లో అయినా మన ఊరు వెళ్తూ ఉండాలండి.

    కొన్ని ఊళ్ళు రాజధాని కన్నా అభివృద్ధి అయినట్లుగా పైకి కనిపించినా రాజధానిలో ఉన్నంతగా విద్యా, ఉపాధి అవకాశాలు లేవండి. అందుకే ఎక్కువమంది రాజధానికి వెళ్తున్నారు అనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే ఇతర నగరాల్లో కూడా కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి.

    రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల లోనూ ఉపాధి అవకాశాలు బాగా పెరిగే చర్యలు తీసుకుంటే , అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి అవుతాయి. పెట్టుబడిదారులు కూడా తమ ప్రాంతాల్లోనే పెట్టుబడులు పెట్టడం వల్ల వారికీ లాభం. ఆ ప్రాంత ప్రజలకూ లాభం.

    ఇంకా, కొన్ని నగరాలకు ఉపరాజధాని హోదా ఇచ్చి, అన్ని కార్యాలయాల శాఖలను ఏర్పాటు చేస్తే , ప్రజలు ప్రతి చిన్న పనికి ముఖ్య రాజధానికి వచ్చే అవసరం లేకుండా ఉంటుంది. అలా వలసలు తగ్గి ప్రజల మధ్య అపార్ధాలు రావు అనిపిస్తుందండి... .
    కారణాలు ఏమైనా ప్రజల మధ్య ఇలా అపార్ధాలు రావటం చాలా బాధగా అనిపిస్తోంది...

    ReplyDelete
  5. మీకు కృతజ్ఞతలండి.
    మీరు దయచేసి గమనించండి. నాకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానమే.

    మన పరిస్థితి ఇలా అవటానికి .... మీరు అన్నట్లు ... భాషా దురభిమానమే ముఖ్య కారణమని నేను అనుకోవటం లేదండి. మనమంతా తెలుగు వాళ్ళమే కదా ! అనే భాషాభిమానం మనకు లేకపోవటం కూడా ఒక కారణం అనుకుంటున్నాను.

    తెలుగు వాళ్ళకి ఇతరులను బాగా గౌరవించటం, సాటి తెలుగువాళ్ళను తక్కువగా గౌరవించటం అలవాటే కదా ! ఇద్దరు తెలుగువాళ్ళు తెలుగులో కాకుండా వేరే భాషలో మాట్లాడుకుంటారని జోక్ కూడా ఉంది.

    ఈ రోజుల్లో మన తెలుగువాళ్ళు ఎక్కువగా మాట్లాడే భాష ఇంగ్లీషు , ఎక్కువగా అనుకరిస్తున్నది పాశ్చాత్య సంస్కృతిని .

    ఇక్కడ చాలామంది తెలుగు పిల్లలకు తెలుగు చదవటం కూడా రాదు. కానీ ....... మన భాష, మన యాస అంటూ మనలో మనం తిట్టుకోవటం చూస్తేనే ఆశ్చర్యంగా ఉంది.

    మీరు చెప్పిన ...".The concept of "be a Roman when in Rome" works everywhere (city, street or even house).." ఇది పూర్తిగా సరైనది కాదనిపిస్తుంది.

    మనవాళ్ళు విదేశాలకు వెళ్ళినంతమాత్రాన మన సంస్కృతిని, వేషభాషలను వదిలేసి , పూర్తిగా వాళ్ళలా ఉండి , అక్కడి ఆచార వ్యవహారాలు, సంస్కృతినే పాటించాలి అనటం న్యాయం కాదు కదండి.


    ఇక మాకు ఇతర రాష్ట్రాలకూ బదిలీలు ఉంటాయి. ఒకసారి అలాగే భువనేశ్వర్ వేశారు. కానీ మేము పైవాళ్ళను బ్రతిమాలి ( మేము అక్కడికి వెళ్ళక ముందే ) దక్షిణభారతదేశానికి మార్చుకున్నాము.

    మాకు ఉత్తరభారతదేశం అంటే గౌరవమే. ముందుముందు అక్కడ వేస్తారేమో తెలియదు.

    కారణాలు ఏవైనా , ప్రజల మధ్య ఇలా అపార్ధాలు రావటం చాలా బాధగా ఉందండి. మనలో మనం తిట్టుకోకుండా ఈ సమస్య సామరస్యంగా పరిష్కారం కావాలని కోరుకుంటున్నానండి.

    ఈ రాష్ట్ర ప్రజలతో పాటూ ప్రపంచ దేశాలలోని ప్రజలందరూ ,ఇంకా లోకమంతా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను..

    ReplyDelete
  6. @anrd:
    తెలంగాణా ప్రజలు (ముఖ్యంగా హైదరాబాద్ వాళ్ళు) అన్ని భాషల్ని గౌరవిస్తారు. ఉర్దూ భాష అనాదిగా ఇక్కడ lingua franca గా గుర్తింపు పొందింది. ఇది అర్ధం కాని (లేదా ఒప్పుకోని) ఆంధ్రా వాళ్ళు ప్రతి ఒక్కరూ తెలుగే మాట్లాడాలని expect చేయడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి.

    Another problem is accent & "dialect". తెలంగాణా భాషను యాసను ఎవ్వరూ ఎప్పుడూ గేలి చేయలేదని మీరు మనస్సాక్షిగా చెప్పగలరా?

    భాషాభిమానం తప్పు కాదు కానీ అన్ని భాషల్ని గౌరవించాలి. తమిళాన్ని "అరవం" అని, ఉర్దూని "తురకం" అని వెక్కరిస్తే వాళ్ళు కూడా react అవుతారు కదా?
    I think you did not understand my "Roman in Rome" analogy. మనం మన సంస్కృతిని, ఆచారాలను వదిలేయాలని నేను అనలేదు. అక్కడి వారి lifestyle గౌరవించడం మర్యాద కదా? వాళ్ళు మన భాష, యాస నేర్చుకోవాలనడం ఎంత వరకు సబబు?
    The solution is simple and worked for me in several places. Acknowledge that I am going to a new place, respect local customs and integrate to the extent I can.

    ReplyDelete
  7. @anrd:

    ప్రతి మాటను transliterate చేసేంత ఓపిక లేక English లో రాస్తున్నాను, క్షమిచండి.

    The concept of "ఉపరాజధాని" will not work. Hyderabad was a fully developed city even before it became capital. Similarly Pune, Kanpur, Surat etc. developed well even though they are not capitals.

    Capitals may be formed in big cities but the converse is not true. No city will develop just because it becomes a capital.

    ReplyDelete
  8. నేను కూడా అన్ని భాషల్నీ గౌరవిస్తానండి. ప్రతి ఒక్కళ్ళు తెలుగే ఎందుకు మాట్లాడుతారు ? ఎవరి మాతృభాషను వారు మాట్లాడుతారు. అదే పద్ధతి.

    తెలుగువాళ్ళు అన్ని భాషలనూ గౌరవిస్తారు. కానీ తోటి తెలుగువారినే వారు అంతగా గౌరవించరు అనిపిస్తుంది.

    మన భాష మీద మనమే జోకులేసి నవ్వుకునేంత విశాలహృదయం మనకుంది.

    మీకు మన భాష, మన యాస మీద నిజంగా గౌరవముంటే మీరు తెలుగులో మాట్లాడవచ్చుకదా ! ఇప్పుడు మీరు ఎక్కువగా ఇంగ్లీషే వాడుతున్నారు.

    మనది ఎంతో విశాల హృదయం. మరి మనకు మన భాష, మన యాస, మన ప్రాంతం, వంటి సంకుచిత భావాలు, దానికోసం ఇన్ని గొడవలు ఎందుకు చెప్పండి ?

    మాకు అన్ని ప్రాంతాల్లోనూ బంధువులు, ఆత్మీయులు ఉన్నారండి. భార్యా భర్తలు వేరేవేరే ప్రాంతాలకు చెందిన కుటుంబాల్లో ఈ విషయాలపై అపార్ధాలు కూడా చోటుచేసుకుంటున్నాయి.

    ఎంతో గౌరవించాల్సిన యమధర్మరాజు వంటి వారినే సినిమాల్లో కామెడీ పాత్రలుగా చూపించి తప్పు చేస్తున్నారు. ప్రజలూ విరగబడి చూస్తున్నారు. మనం ఏం చెయ్యగలం ?

    ఉపరాజధానుల సంగతి............ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన క్రొత్తలో ఇలా ఉప రాజధానులు ఏర్పడిఉంటే, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి జరిగి ...ఇప్పుడు ఇలా సమస్యలు వచ్చేవి కాదు అన్నాను.

    ఉప రాజధానుల వల్ల అధికార వికేంద్రీకరణ జరుగుతుంది. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయి.

    ఇప్పుడు రాజధానిలోనే ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉండటం వల్లే కదా ! అన్ని ప్రాంతాల వాళ్ళూ అక్కడికి రావటం, ఇలా సమస్యలు రావటం మొదలయ్యింది.

    ప్రతి చిన్నపనికి హైదరాబాదుకి రాకుండా ఎక్కడివాళ్ళు అక్కడే ఉంటే ఈ గొడవలు వచ్చేవి కాదు కదా ! అని అలా ఉప రాజధానుల గురించి చెప్పాను.

    మన రాష్ట్రం విషయంలో ఎలా ఉన్నా..... ఉప రాజధానులు అన్న కాన్సెప్ట్ చక్కగా పనిచేస్తుంది.

    ఇంకా, స్వాతంత్ర్యం వచ్చి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రాంతం ఏదైనా ప్రజల పేదరికం పోలేదు. పెద్దగా అభివృద్ధి జరగలేదు. ఇప్పటికీ రైతులు, చేనేతలవారు, వేలాదిగా ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. ఫ్లోరైడ్ సమస్య అలాగే ఉంది.

    నాయకులలో కొందరు నిజాయితీగానే ఉన్నా, చాలామంది ధనికులు మరింత ధనికులు అవుతున్నారు. పేదలు మరింత పేదలు అవుతున్నారు. అసలు సమస్యలు అవీ. వాటి గురించి బాధపడాలి..

    ప్రజల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తే ఇన్ని సమస్యలు ఎందుకుంటాయి ?

    ReplyDelete
  9. anrd గారూ,

    ఒక నగరం అభివృద్ధి చెందడానికి అది రాజకీయ కేంద్రం కానక్కరలేదు. జిల్లా కేంద్రాలయిన బందరు, కాకినాడ, చిత్తూరులతో బెజవాడ, రాజమండ్రి, తిరుపతిలను పోల్చి చూస్తె ఈ విషయం తెలుస్తుంది. రాష్ట్ర రాజధానుల విషయానికి వస్తే, ఇదే పరిస్తితి మనకు ఉత్తరప్రదేశ్ (Kanpur vs. Lucknow), మధ్యప్రదేశ్ (Indore vs. Bhopal) లాంటి రాష్ట్రాలలో కూడా కనిపిస్తుంది.

    అభివృద్ధి చెందిన నగరం లో రాజధాని పెట్టుకుంటే పాలనా యంత్రాంగం సులువు. ఒకప్పటి ఆంద్ర రాష్ట్రంలో ఏ నగరంలోనూ ప్రభుత్వ కార్యాలయాలు కట్టుకోవడానికి కనీస వసతులు కూడా లేవని టంగుటూరి వారు వాపోయారని చర్తిత్ర చెపుతుంది.

    హైదరాబాద్ నగరం అభివృద్ధికి ఎన్నో కారణాలు ఉన్నాయి. 400 ఏళ్లపాటు జరిగిన అభివృద్ధి, చక్కని వసతులు, బ్రహ్మాండమయిన రవాణా సౌకర్యాలు, మంచి వాతావరణం ఇవన్నీ ఒక ఎత్తయితే, బహుభాషా సంస్కృతి (cosmopolitan culture), ప్రజల ఆప్యాయత అనురాగాలు, తరతమ భేదాలు లేకుండా అందరిని ఆహ్వానించే మంచితనం మరొక ఎత్తు. ఈ human capital ఇతర ప్రాంతాలలో లేదని కాదు, ఇక్కడ ఉన్నాయని జగద్విదితం అవడం వల్ల లాభం చెందింది.

    ప్రభుత్వరంగ పెట్టుబడులు వచ్చిన మాట వాస్తవమే కానీ దాని కారణాలను కూడా చూద్దాము. దేశరక్షణకు సంబందించిన సంస్థలు సరిహద్దులకు, సముద్రతీరానికి దూరంగా ఉండడం మంచిదనే వ్యూహం తోటి ఇలాంటి సంస్థలు (BHEL, BEL, ECILతో సహా) హైదరాబాద్, పూణే, బెంగుళూరు నగరాలలో పెట్టారు. ఒక రాష్ట్రానికి రాజధాని అయినా కాకపోయినా ఇవి వచ్చేవి.

    ఇదే వ్యూహం విశాఖకు కూడా కలిసి వచ్చింది. అమృతరావు గారి నేతృత్వంతో ఉక్కు కర్మాగారం కూడా రావడంతో, విశాఖ చాలా వేగంగా అభివృద్ధి చెంది బెజవాడను దాటి బాగా ముందుకి వెళ్ళింది. నిజానికి VSP పెట్టుబడిలో కానీ, ఉద్యోగాలలో కానీ, ఇతర ఏ parameterలో కానీ రాష్ట్రంలో మిగిలిన అన్ని ప్రభ్హుత్వరంగసంస్థలన్నిటిని కలిపినదాని కన్నా ఎక్కువే.

    ఇటీవలి కాలానికి వస్తే, హైదరాబాద్ పరిసరాలల్లో ఉన్న నిజాం కాలం నాటి sarf-e-khas భూములు అధికారంలో ఉన్నవారికి "బందుమిత్రానుకూల పెట్టుపడుదారి వ్యవస్థ" (crony capitalism) అమలు చేయడానికి, తద్వారా తాము కూడా లబ్ది పొందడానికి అవకాశం ఇచ్చింది.

    ఏ వ్యాపారవేత్తయినా లాభాల కోసమే పెట్టుబడి పెడతాడు, అందులో తప్పు లేదు. కానీ దానికి భాషాభిమానం అంటకట్టి "మా రాష్ట్ర రాజధాని కాబట్టే మేము పెట్టుబడి పెట్టాం" అని వాదించడం అవివేకం. కర్నూల్ రాజధానిగా ఉంటె (బెజవాడ వాళ్ళు ఉండనివ్వాలి కదా!) హైదరాబాద్ కంటే ఎక్కువగా పెరిగేదనే ప్రగల్బాలు హాస్యాస్పదం.

    అధికార వికేంద్రికరణ జరగాల్సిందే, ఆర్ధిక వికేంద్రికరణ కూడా ఈరోజటి అవసరం. కానీ ఈ రెండు విషయాలకు సంబంధం లేదని నా మనవి. రెండో శ్రేణి నగరాలను అభివృద్ధి చేయడానికి ఉపరాజదానులుగా చేయడం కాదు, ఇతర పద్ధతులు (రవాణా, మూలవసతులు లాంటివి) చేపట్టాలి. Coimbatore, Nagpur, Calicut, Aurangabad లాంటి నగరాల పురోగామాన్ని అధ్యయిస్తే ఉపయోగమని నా అభిప్రాయం.

    చివరిగా నాదొక మనవి. ఒక నగరం అభివృద్ధి చెందితే ఆ ప్రాంత ప్రజలకు ఏమి ఒరగదు. హైదరాబాద్ లో (అలాగే విశాఖలో కూడా) జరిగినట్టు చెప్పడుతున్న "అభివృద్ధి"లో ఆయా ప్రాంతాలకు చెందిన వారు భాగస్వాములు కాలేదన్నిది వాస్తవం, ఇప్పటి పాలకులు వారితో అభివృద్ధి ఫలాలు పంచుకోరన్నది నిర్వివాదాంశం. పోలవరం నిర్వాసితులు, సోంపేట జాలర్లు మొదలైనవారందరూ రాళ్ళు మోసే కూలీలు గానే మిగిలిపోతున్నరనేది నిష్టూరమైనా మారని, మార్చగాజాలని నిజం.

    ReplyDelete
    Replies
    1. కొన్ని ఊళ్ళు రాజధాని కన్నా అభివృద్ధి అయినట్లుగా పైకి కనిపించినా రాజధానిలో ఉన్నంతగా విద్యా, ఉపాధి అవకాశాలు లేవండి. అందుకే ఎక్కువమంది రాజధానికి వెళ్తున్నారు .

      ఉదా...సివిల్స్ లేక మరేదైనా ముఖ్యమైన కోచింగ్ తీసుకోవాలంటే హైదరాబాద్ లోనే మంచి అవకాశాలున్నాయి. విజయవాడ, వైజాగ్, కర్నూల్ వంటి నగరాలలో కూడా చక్కటి అవకాశాలు లేకపోవటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

      రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర వాళ్ళు తమ నగరాలను అభివృద్ధి చేసుకోవటానికి గట్టిగా ఎందుకు ప్రయత్నించటంలేదో అర్ధం కాదు. తమ ప్రాంతపు నగరాలను అభివృద్ధి చేసుకోకపోవటం వాళ్ళ తెలివితక్కువతనమే.


      Delete
  10. "ప్రతి మాటను transliterate చేసేంత ఓపిక లేక English లో రాస్తున్నాను,"

    ఇలా మీరు వ్రాసినది చదివాక మీరు తెలుగు వాళ్ళు కాదేమోనని నాకు అనిపిస్తోంది.

    తెలుగులో వ్రాయమన్నందుకు దయచేసి తప్పుగా భావించకండి.. మీరు తెలుగువాళ్ళు అన్న అభిప్రాయంతో అలా అన్నాను.. ..

    ReplyDelete