koodali

Wednesday, September 29, 2010

మరి కొన్ని సంగతులు...........


ఒకప్పుడు నేను ఎవరిదగ్గరయినా ఉపదేశము తీసుకుందామని ప్రయత్నించానండి కుదరలేదు. ఒకసారి మేము చెన్నైలో ఉన్నప్పుడు ధ్యానమును నేర్చుకుందామని ఒక ఫ్రెండ్ , నేను ధ్యాన కేంద్రమునకు వెళ్ళామండి.

సరే,    వారినుంచి వివరములను తెలుసుకున్న తరువాత వారు రమ్మన్నరోజున వెళ్ళాము. వెళ్ళే ముందు గుడికి వెళ్లి దైవ ప్రార్ధన చేసి తరువాత అక్కడకు వెళ్లాను. వారు క్రొత్తగా జేరిన మా అందరికి ఎవరికి ఏ దేవుడు ఇష్టమని అడిగారండి.


ఆ తరువాత కొన్ని విషయములను ఉపదేశించి , ఆ తరువాత ధ్యానం ఎలా చేయాలో నేర్పించారు. అలా ఉపదేశించిన విషయములను గురించి అందరికి చెప్పకూడదట.


అప్పటినుంచి ధ్యానమయితే అంతగా చేయటము లేదు కానీ, నాకు కుదిరినప్పుడు , శుచిగా ఉన్నప్పుడు వారు ఉపదేశించిన విషయమును చేస్తున్నాను. ఇక ఇతర సమయములలో నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు సాయి నామమును అనుకుంటున్నాను.


ఇక్కడ ఇంకో సంగతి నేను శ్రీ దేవీ భాగవతములో ఒక కధ చదివానండి.


ఒక ముని కుమారుడు కొన్ని కారణముల వల్ల అడవులకు వెళ్ళి ఒంటరిగా ఉంటూ ఉంటాడు,. తనకు తెలియకుండానే కొన్ని నియమములను పాటిస్తూ జీవిస్తుంటారు.


అలా కాలం గడుస్తూ ఉండగా జరిగిన ఒక సంఘటన లో ఆయన ఐ, అను ఒక శబ్దమును విని దానినే మననము చేస్తూ ఉండటం జరుగుతుంది. ఆ శబ్దము వాగ్బీజమునకు సంబంధించిన శబ్దము.


ఐం అనేది వాగ్బీజము. ఆ వాగ్బీజమును సంపూర్ణముగా కాకుండా ఐ,ఐ అని అనుకున్నంత మాత్రమునే అమ్మవారు ప్రసన్నమై ఆయనకు అనేక వరములను అనుగ్రహిస్తారు.


ఇక్కడ నేను గ్రహించిన విషయము ఏమంటే ఆ జపసమయములో ఆయన తనకు తెలియకుండానే మంచి నియమబధ్ధమైన జీవితమును గడుపుతున్నారు.


ఇంకా నాకు ఏమని అనిపించిందంటే నండీ ........ కొన్ని మంత్రములను అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ , మరియు ఇలా బీజాక్షరములకు సంబంధించిన మంత్రములను గురూపదేశం ద్వారా పొంది కొన్ని నియములను పాటిస్తూ జపించటము వలన పొరపాట్లు జరగకుండా ఉత్తమ ఫలితములను పొందవచ్చని అనిపించిందండి.
ఏమీ తెలియని వారికి భగవంతుడే గురువు అని కూడా అనుకోవచ్చేమో .

ఇలాంటి మంత్రజపమునకు వీలైనంతవరకు విధివిధానములు పాటిస్తే అనుకున్నదానికన్నా మంచిఫలితములు వస్తాయేమోనని కూడా నాకు అనిపిస్తోంది అండి. .



ఓం నమో భగవతే వాసుదేవాయ ..అనే మంత్రమును నారదుడు ప్రహ్లాదుడికి ఉపదేశించారట.

ఇంకా శ్రీ సాయిబాబా జీవితచరిత్రము గ్రంధములో ఇలా చెప్పారండి.

కృతయుగములో శమదమములు {అనగా నిశ్చల మనస్సు, శరీరము } త్రేతాయుగములో యాగము, ద్వాపరయుగములో పూజ, కలి యుగములో భగవన్మహిమలను పాడుట, మోక్షమార్గములు. నాలుగు వర్ణముల వారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును. తక్కిన సాధనములు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంబించుట కష్టతరము. కాని భగవంతుని కీర్తిని, మహిమను పాడుట యతి సులభము. మన మనస్సును మాత్రము అటువైపు త్రిప్పవలెను. అని ఉందండి...


అందుకే కలి యుగములో అందరికి సులభమైన ఉపాయము దైవ నామమేనని పెద్దలు చెప్పి ఉంటారు.
ఇందులో తప్పులున్నచో ఆ దైవం దయచేసి క్షమించవలెను.


No comments:

Post a Comment