koodali

Monday, September 27, 2010

కావలసినది ప్రేమాస్పదమయిన భక్తి మాత్రమే అని తెలియజేసారు...

 

నామస్మరణం గురించి ఇంకొంచెం వ్రాయాలనిపించిందండి. మన పెద్దలు కలియుగమునకు దైవనామస్మరణం తరుణోపాయమని చెప్పారు. కాబట్టి ఏ నామమైనా స్మరించుకోవచ్చు అని నాకు అనిపిస్తోందండి.


కాని నాకు అసలు ఈ నామస్మరణము ... . మరియు ..... మంత్ర జపము ఈ రెండిటికి గల తేడా ఏమిటి ? రెండూ ఒకటేనా లేక వేరువేరునా ? అనే శాస్త్ర విషయములు తెలియవండి.


రామ, హరి. శివ ఇలా అయితే నామమును స్మరించటము, లేక ఈ నామములకు ఓంకారమును జోడించి ఉపదేశమును పొందితే మంత్ర జపం చేయటం అవుతుందా ? ఇలాంటి విషయములు నాకు తెలియవండి.


ఒక పుస్తకములో నేను ఇలా చదివానండి. ఒక పెద్దాయన తన అనుభవమును ఇలా వ్రాసారండి. వారు ఒక ఉపన్యాసములో " ఓం నమో భగవతే వాసుదేవాయ " అను మంత్రమును విని కొన్నాళ్ళు జపించారట. అప్పుడు వారికి కొన్ని కష్టములు వచ్చాయట.


ఇలా ఎందుకు జరిగిందని ,కారణము ఏమిటని వారు ఒక యోగిని అడిగితే .......ఏముందీ నీవు భక్తి, జ్ఞాన, వైరాగ్య, తపస్సులను అడిగావు. వాసుదేవుడు ఇచ్చారు. అందుకే ఈ కష్టాలు. అని ఈ మంత్రము ముక్తి మంత్రమని, చాలా శక్తివంతమైనదని తెలియజేసారట.


ఇలాంటివి చదివినప్పుడు చాలా సందేహములు వస్తాయి. నామస్మరణం యొక్క విధివిధానములు నాకు తెలియవు కాబట్టి, తెలుసుకున్నా ............ వాటిని పాటించే అంత శక్తి నాకు ఉంటుందోలేదో అన్న అనుమానంతో ............ నేను విధివిధానములు, పట్టింపులు అవసరం లేని సాయి,సాయి అన్న నామస్మరణం చేస్తున్నానండి.


మా దగ్గర ఉన్న శిరిడి సాయి బాబా జీవితచరిత్రము పుస్తకములో ఒక దగ్గర సాయి స్వయముగా ఎన్నో విషయములను తెలియజేసిన సందర్భములో ఇలా కూడా అన్నారు.......... సాయిసాయి ............ యను నామమును జ్ఞప్తి యందుంచుకున్న మాత్రమునే మంచి జరుగుతుందని తెలియజేసారు.


వారు ఓంకారమును గాని శ్రీ కారమును గాని జోడించమని చెప్పలేదు. నేనయితే సాయిసాయి అనే అనుకుంటున్నాను.


మొదట్లో ఎన్నో దేవుని నామములు ప్రయత్నించానండి. ఆఖరికి ఏ పేరు కాకుండా అమ్మా అమ్మా ......... అని కూడా అమ్మవారిని స్మరించుకోవచ్చు కదా అని అలా కూడా చేసాను. కానీ అలా అనుకోవటం కొంచెము కష్టముగా అనిపించిందండి.


తరువాత సాయిసాయి అన్న నామము సౌకర్యముగా, సులువుగా అనిపించిందండి. యోగాసనములు సరిగ్గా వెయ్యకపోతే ఒళ్ళు నెప్పులు వస్తాయి. అలాగే మనకు సులువు అలవాటు అవటానికి కొంచెం సమయము పడుతుంది.


ఇంకో విషయము కూడా వ్రాయాలనిపిస్తోదండి. సాయిబాబాను కొందరు ఆదిపరాశక్తి అవతారముగా భావించేవారట. భక్తులలో కొందరికి శివునిగా, కొందరికి కృష్ణుడుగా, కొందరికి గురువుగా ,కొందరికి వారివారి ఇష్ట దైవముల రూపములో దర్శనమిచ్చారట.


శిరిడీలో పాదుకలను స్థాపించే విషయములో శ్రావణ పౌర్ణమి నాడు వాటిని ప్రతిష్టించమని ఆజ్ఞాపించారట. బాబా ఆ పాదుకలను తాకి అవి భగవంతుని పాదుకలని చెప్పి, చెట్టుక్రింద ప్రతిష్టించమని చెప్పారట.


బాబా శిరిడీలో శ్రీరామ నవమి నాడు పగలు హిందువులచే శ్రీరామనవమి ఉత్సవము, మరియు జెండా యుత్సవము, రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము జరిపించేవారట.

సాయి నవవిధ భక్తులు గురించి తెలియజేసారు.

ఇంకా భక్తి లేని సాధనములన్ని నిష్ప్రయోజనములని చెబుతూ కావలసినది ప్రేమాస్పదమయిన భక్తి మాత్రమే అని తెలియజేసారు. 

 

2 comments:

  1. నాకు తెలిసినంతవరకూ మనస్సులో స్మరణ/ధ్యానము చేసుకునేది (మాన్ త్రము)మంత్రము.

    ReplyDelete
  2. మీ అభిప్రాయములు తెలియజేసినందుకు మీకు నా కృతజ్ఞతలండి. మీరు చక్కగా చెప్పారండి. పైకి వినిపిస్తూ చేసే జపమునకన్నా మనస్సుతో చేసే జపమునకు ఎక్కువ శక్తి ఉంటుందని ఒక దగ్గర చదివానండి... అలాగని భజన, సంగీతం యొక్క శక్తి కూడా తక్కువ ఏమీ కాదు ..ఏదైనా భక్తి శాతం ఎంత ఉందన్నది ముఖ్యమేమోనండి......

    .ఏమైనా ఆలోచించేకొద్దీ సందేహాలు పెరిగిపోతుంటాయి. అందుకని ఒకోసారి ఏమనిపిస్తుందంటేనండీ ఎక్కువ ఆలోచించటం కన్నా మన కర్తవ్యం మనం చేసి భారం దైవం పైన వేసేయ్యటమంత సుఖం లేదని.

    ReplyDelete