koodali

Monday, September 13, 2010

మాకు ఎదురైన ఒక విపత్కర పరిస్థితి........

 

నేను పుట్టిన సంవత్సరం 1966. అండి. మా అమ్మగారు, నాన్నగారు, మామగారు, అత్తగారు దేవుని దయవల్ల క్షేమంగా ఉన్నారు. మాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి.


ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి నాకు ఎన్నో సందేహాలు వస్తూఉంటాయి. రోజువారీ జీవితంలో ఒకోసారి మనకు ఎలా ప్రవర్తించాలో తెలియని పరిస్థితులు ఎదురవుతుంటాయి. అలా నాకు ఎదురైన కొన్ని సంఘటనలగురించి వ్రాస్తానండి.


భగవంతుని దయవలన మాకు అనారోగ్యం కొంచెము తక్కువగానే వస్తుంటుంది. ఉదా....మేము చెన్నైలో ఆరు సంవత్సరములు ఉంటే షుమారు పదహారు సార్లు వెళ్ళామేమో డాక్టర్ దగ్గరికి .......మేము ఎక్కువగా ఆయుర్వేదం, హోమియో వాడుతాము. ఒకోసారి అల్లోపతి వాడుతాము. { ఇక్కడ నేను ఏ వైద్యాన్ని తక్కువ చేయటం లేదు. దేని గొప్ప దానిదే. }


...అలాంటిది ఒకసారి మా అమ్మాయి చిన్నతనములో అంటే ఒకటవ తరగతి చదివేటప్పుడు అనుకుంటాను తనకి తలలో చిన్న కురుపు వచ్చింది. అది కొంతకాలానికి పెద్ద పుండు అయ్యింది.


మేము హోమియో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము. ఆయన చాలా బాగా మందులు ఇచ్చేవారు. అయితే అమ్మాయి తోటి పిల్లలతో ఆడుకునే సమయంలో ఆ తలకు దెబ్బ తగలటం , పుండు మళ్ళీ పెద్దదవటం ఇలా రెండు, మూడు సార్లు జరిగింది.


ఇక్కడ అసలు విషయమేమిటంటేనండి, మేము తనకి తలనీలాలు గుడిలో ఇస్తామని అనుకున్నాము. అల్లోపతి వైద్యుల దగ్గరకు తీసుకువెళ్తే తప్పకుండా వాళ్ళు ఆ పుండు ఉన్న ప్రదేశాన్ని కత్తిరించి శుభ్రం చేసి కుట్లు వేసి మందులు వేస్తారు. మళ్ళీ హెయిర్ సరిగ్గా వస్తుందో రాదో కూడా తెలియదు.


ఒక ప్రక్క చూస్తే ఆ కురుపు తగ్గటంలేదు. ఒక ప్రక్క దేవుని సెంటిమెంట్. ఏమి చెయ్యాలి ?

సీతాఫలం ఆకు రుబ్బి పుండు పైన ఉంచితే బాగా ఫలితముంటుందని రోజూ ఆ మందు కూడా వాడాము. కురుపు పైన పెచ్చులా గట్టిపడినా చీము వస్తూండేది. ఇలా రెండునెలలు గడిచాయి.


మాకు తెలిసిన వాళ్ళు ఇదంతా చూసి మమ్మల్ని కోప్పడ్డారు. మీ చాదస్తం మండిపోను. ఇది ఇలా వదిలేయటం చాలా డేంజర్. ఇన్ ఫెక్షన్ అయితే పిల్ల తలకే ప్రమాదం .. ఇలా భయపెట్టేసరికి మాకు ధైర్యం జారిపోయింది.



మరుసటి రోజు అల్లోపతి డాక్టర్ దగ్గరకు వెళ్దాము అని ......... తలస్నానం చేయిస్తూ ఆ కురుపును శుభ్రం చెయ్యటం కోసం నెమ్మదిగా రుద్ది చూసేసరికి పెచ్చు కొద్దిగా ప్రక్కకు వచ్చింది....... అప్పుడు నిజంగా మేము ఎంతో ఆశ్చర్య పోయాము. అక్కడ కొద్దిగా పచ్చిగా ఉండటం తప్ప పుండు అంతా మానిపోయింది.


దాంతో ఇక బాగా శుభ్రం చేసి , హోమియో మందు కొన్నాళ్ళు వాడేసరికి పూర్తిగా మానిపోయింది. దేవునికి తలనీలాలు కూడా సమర్పించాము. అంతా ఆ భగవంతుని దయ.


ఇదంతా జరిగిన కాలంలో అందరు దేవుళ్ళను ప్రార్ధించటము, చేసేవాళ్ళం. మా అమ్మాయి కూడా నమస్కారం చేసేది. తను చిన్నప్పటినుంచి సాయి బాబా కు నమస్కరిస్తుంటుంది. మేము కూడా సాయిని ఎంతో ప్రార్ధించాము. అంతా దైవందయ. ఆ సాయి దయ.


కాని ఇప్పుడు అదంతా తలచుకుంటే కొంచెం భయంగా నే ఉంటుంది. చిన్న పిల్ల అంత బాధ భరించింది కదా ........ అని తలచుకుంటే బాధగా కూడా ఉంటుంది. మేము కూడా హోమియో మందులు వాడుతూనే ఉన్నాము కదా అనే ధైర్యంతోనే అలా అంతకాలం ఆగాము.
ఇప్పుడు చాలా చిన్న చుక్క అంత మచ్చ ఉంటుంది తలలో అంతే. .


ఒకరకంగా మాకు మంచే జరిగింది. ఇంగ్లీష్ వైద్యుల దగ్గరకు వెళ్తే వైద్యంలో భాగంగా హెయిర్ కొంచెం కత్తిరించవలసివస్తుంది, అప్పుడు గుడిలో తలనీలాలు ఇచ్చే సెంటిమెంట్ కు దెబ్బ తగుల్తుంది. ఇలా అనుకుని మేము హోమియో, ఆయుర్వేదం వాడాము.

మొత్తానికి దైవం దయ వలన ఆఖరికి మంచే జరిగింది. అమ్మాయి తలలో పెద్దమచ్చ పడలేదు.


సీతాఫలం ఆకు కూడా ఇలాంటివాటికి బాగా పనిచేస్తుందని తెలిసింది. అయితే ఈ ఆకులు విషపూరితమయినవి కావటం వల్ల ఏమాత్రం కళ్ళకు తగలకుండా , పిల్లలు ఆ చేతులు నోట్లో పెట్టుకోకుండా జాగ్రత్త వహించాలి. పిల్లలకు వాడకపోవటమే మంచిది. అప్పడు మాకు ఆ ఆకులు విషపూరితమయినవని తెలియదు.


ఏమైనా భగవంతుని దయవల్లా రక్షించబడ్డాము కానీ ......... నేను ఏమనుకుంటానంటే దేవుడా ! ఇలాంటి పరిస్థితులలో మా బుద్ధిని సరిఅయిన మార్గములో నడిపించు అని....

No comments:

Post a Comment