koodali

Friday, September 3, 2010

ఒక పంఖాను { ఫాన్ } ఒక వాహనచోదకుడిని { డ్రైవర్ } నమ్మినదానికన్నా ఎక్కువగా మనము .......

 

ఎప్పటినుండో ఇలా వ్రాయాలనుకుంటున్నానండి. మనము స్వధర్మమును నిష్కామముగా ఆచరిస్తూ , ఫలితమును భగవంతునికి అర్పించాలని పెద్దలు తెలియజేశారు. ఒక జనక మహారాజు , ఒక శుక యోగి లాంటి గొప్పవాళ్ళు చరిత్రలో కనిపిస్తారు. మనకు అంత లేకపోయినా ....... అందులో ఆవగింజంత అమలుపరచినా మన బ్రతుకులు బాగుపడతాయి కదా...


భగవంతుడు సర్వ శక్తిమంతుడు. ఆయన తలచుకుంటే కానిదేముంటుంది. ఇక్కడ ఒక విషయం నాకు చాలా ఆశ్చర్యమనిపిస్తుంది. అన్ని విషయాలు తెలిసికూడా మనమెందుకు ........ దైవం పైన భారం వేసి , ప్రశాంతంగా బ్రతకలేక , ప్రతిదానికి ఆందోళన పడిపోతాము అని ?


ఉదా......ఒక పంఖా ను { ఫాన్ } చూడండి. అది బాగా వేగంగా తిరుగుతున్నప్పుడు పడిపోతుందేమో అనిపిస్తుంది. అవి బోల్టులు ఊడి పంఖాలు క్రింద పడిన సంఘటనలు చాలా ఉన్నాయి. అయినా మనకు ఫాన్ అవసరం కాబట్టి భయం ఉన్నా చేసేదేమీ లేక హాయిగా నిద్రపోతాము. { పంఖా అని వ్రాయాలా లేక ఏమి అని వ్రాయాలో నాకు సరిగ్గా తెలియదండి. }


ఇలాగే ఇంకో ఉదా..ఎప్పుడైనా రాత్రిపూట రహదారిపై కారులోగాని, బస్సులో గానీ ప్రయాణించేటప్పుడు ,చూడండి. ఆ వాహన చోదకుడు {డ్రైవర్ } ఒక లిప్త పాటు కళ్ళు మూసుకుంటే చాలు , ప్రమాదం జరగటానికి. ఇలా చాలాసార్లు ప్రమాదం తృటిలో తప్పటం మనకందరికి అనుభవమే అయ్యుంటుంది. భయంగా ఉన్నా, కొంచెంసేపు మెలకువగా ఉండి ఇక చేసేదేమీ లేక , అలసటతో నిద్రపోతాము కదా.


ఇలాంటప్పుడు పెద్దలు చెప్పింది గుర్తుకొస్తుంది. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం , రెప్పపాటు జీవితమ్ ....... అని అయితే ఇక్కడ వాహన చోదకుడు కన్ను తెరిస్తే వాహనంలో అందరికి జననం, వారు కన్ను మూస్తే అందరికీ మరణం అయ్యే అవకాశాలు కూడా దండిగా ఉన్నాయి. {ఇక్కడ కన్ను అన్నది కరెక్టా, లేక రెప్ప అన్నది సరైనదో గుర్తు రావటం లేదండి. }


సరే ఈ విధంగా ఒక ఫాన్ ను, ఒక డ్రైవర్ ను నమ్మి నిద్రపోయినప్పుడు, సర్వశక్తిమంతుడైన ఆ దైవాన్ని నమ్మి మనం ఎల్లప్పుడూ ప్రశాంతముగా ఎందుకు ఉండకూడదు ? అలా గనక మనము ఉండగలిగితే జీవితములో ఎంతో ప్రశాంతత ఉంటుంది.


మన శక్తికొలది ధర్మమును పాటిస్తూ, ఫలితాన్ని ఆ దైవానికి వదిలిపెట్టి, మనం ఆందోళన లేకుండా ఉండగలిగితే ఎంతో ఉత్తమం. ఒకోసారి మనం ఏమీ చేయలేని విధముగా పరిస్థితులు చుట్టుముడతాయి. కనీసం ఇలాంటప్పుడైనా గాభరాపడి గుండెనెప్పి తెచ్చుకోకుండా నిబ్బరంగా ఉండటానికి పైవిధంగా ప్రయత్నించాలి.


అయితే మనకు తెలుసు. ఇదంతా చెప్పినంత తేలిక ఎంతమాత్రం కాదు అని. ఇలాంటి మానసిక ధృఢత్వం రావాలన్నా భగవంతుని కృప తప్పక ఉండాలి అని.

ఆ దైవాన్ని ప్రార్ధించగా, ప్రార్ధించగా ఎప్పటికైనా ఆ స్థితి వస్తే ఎంతో అదృష్టవంతులం. . ....

 

8 comments:

  1. చాలా చక్కగా సింపుల్ గ వ్రాశారు. దేవునిఫై నమ్మకము ఉంచ మనటానికి మంచి ఉదాహరణలు. stress,depression దగ్గరకు రాకుండా ఉండటానికి మార్గము చెప్పారు. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

    ReplyDelete
  2. చాలా చాలా చాలా చాలా చాలా మంచి విషయం చెప్పారు అండి , నెనర్లు

    ReplyDelete
  3. మీ అభిప్రాయములు తెలిపినందుకు ధన్యవాదములండి.

    ReplyDelete
  4. మీ అభిప్రాయములు తెలిపినందుకు ధన్యవాదములండి.

    ReplyDelete
  5. మీ అభిప్రాయములు తెలిపినందుకు ధన్యవాదములండి.

    ReplyDelete
  6. బాగుంది అండీ, నిజమే ఆ స్తితి కి రావటం తేలిక కాదు కాని రావటానికే ప్రయత్నించాలి. మనకు మనం చేసుకున్న మన సృష్టీ మీద ఎంతటి అహాంకారపూరితమైన నమ్మకం కదా దానిని దాటి చూపు సారించటం మరి అంత తేలికా.

    ReplyDelete
  7. మీ అభిప్రాయములు తెలిపినందుకు ధన్యవాదములండి.

    ReplyDelete