koodali

Wednesday, September 15, 2010

ఇది ఒక వింత పరీక్ష..............

సాయి.

ఇప్పుడు చెప్పబోయే విషయం కొద్దిగా వేరేగా ఉంటుందండి. ఒక 10 సంవత్సరములు అయ్యుంటుంది ఇది జరిగి.

మేము ఉంటున్న అపార్ట్మెంట్స్ లో ఒక పెద్దాయన వాళ్ళ కుటుంబం ఉండేవారు.


ఒకరోజున మా ఇంటికి వచ్చి తాను ఏదో వ్యాపారం చేద్దామనుకుంటున్నానని, మమ్మల్ని కూడా అందులో భాగస్వాములుగా చేరమని అడగటానికి వచ్చారు. ఆ వ్యాపారంలో లక్షలు, కోట్లు వచ్చేస్తాయని ఎంతో చెప్పారు.


అంతా తానే చూసుకుంటానని, మేము మా వాటా డబ్బులు ఇస్తే చాలని అన్నారు. ఆయన చెప్పినది మాకు నచ్చలేదు. కానీ ఆయన రోజూ ఇంటికి రావటం, నచ్చచెప్పటానికి ప్రయత్నించటం ఇలా చేసేవారు.


ఇంతకీ అసలు విషయం చెప్పనేలేదు కదండి. దయచేసి నన్ను అపార్ధం చేసుకోవద్దు. అది మద్యమునకు సంబంధించిన వ్యాపారం లెండి. మేము ఎంతో చెప్పాము. మా పెద్దలు ఇవన్నీ వింటే కోప్పడతారు. అలాంటి వ్యాపారములు చేయటము పాపము , మాకు ఇష్టం లేదు అని.


ఒక పదిరోజులు రోజూ రావటం మా ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చచెప్పటానికి ప్రయత్నించటం.

ఇక నాకు వళ్ళు మండి లక్షలు, కోట్లు వచ్చినా సరే, ఇతరుల కుటుంబాలు పాడుచేసే వ్యాపారములు మేము చేయం.

ఇక ముందు ఈ ప్రసక్తి తెస్తే బాగుండదు. విషయం మీ వాళ్ళకు చెప్పాల్సి వస్తుంది అని గట్టిగా చెప్పేసరికి అప్పటితో మరి రాలేదు. అనారోగ్య కారణాల వల్ల ఒక సంవత్సరం తరువాత ఆయన కాలం చేసారు.


ఇలా ఒకోసారి మొహమాటాలు ప్రక్కనపెట్టి గట్టిగా ఉండి తీరాలి. లేకపోతే మన కొంప మునుగుతుంది. ఆయన అసలు మా ఇంటికి ఎందుకు వచ్చి అడిగారో నాకు ఇప్పటికి అర్ధంకాదు.


అప్పుడు మా దగ్గర మా ఊరులో అమ్ముకున్న ఆస్థి తాలూకు సొమ్ము కొంచెం ఉంది. ఇంకా నాకు ఏమని అనిపిస్తుందంటేనండి ,....... మేము డబ్బుకొరకు ఆశ పడతామా లేదా అని.........
మాకు దైవం పెట్టిన పరీక్ష ఏమో ఇది అని....... ఏమైనా ఆ దైవం దయవల్ల కాపాడబడ్డాము.


మేము నిజంగా ఆ వ్యాపారం చేసినా మాకు నష్టమే. లేక ఆయన మా డబ్బు తీసుకుని మమ్మల్ని మోసం చేసినా మాకు సొమ్ము నష్టమే.

మొత్తానికి భగవంతుని దయవల్ల ....ఆ సమయములో మంచి ఆలోచనను, గట్టిగా నిలబడే శక్తిని ప్రసాదించిన దైవానికి కృతజ్ఞతలు.


దైవానికి వ్యతిరేకమయిన అధర్మపు పనులు చేసి, ఆ తరువాత శాపాల పాలై కష్టాలు పడే దురవస్థ మాకు తప్పింది. ఒకోసారి ఇలాంటి వింత పరీక్షలు ఎదురవుతుంటాయి.


ఇప్పుడు మాకు కోట్లాది రూపాయలు లేకపోయినా బాధలేదు. సంపద అంటే డబ్బు మాత్రమే కాదు కదా...

 

2 comments:

  1. ఒక బుట్టలో కొన్నఐ పళ్ళు ఉన్నాయి. ప్రతి నిమిషానికి అవి రెట్టింపు అవుతున్నాయి. 60 నిమిషాల తరువాత బుట్ట నిండి పొతే, 59 వ నిమిషములో ఎన్ని పళ్ళు ఉంటాయి? సగం పళ్ళు. అలాగే ముల్తిలేవేల్ కంపెనీ దివాలా తెస్తే 50 % మనుషులు లాస్ అవుతారు. ఈఫ్ ఇట్ ఇస్ 1 -2 చిన్ అయితే. 1 -6 అయితే ఎంత మంది అవుతారూ?...

    ReplyDelete
  2. అయ్యా ఈ టపా చదివినందుకు నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నాకసలే లెక్కలు రావు. నేనేదో సామాన్యముగా బ్రతికితే చాలనుకుంటున్నాను. విశ్వం యొక్క రహస్యాలు నాకెందుకు ?దాని వల్ల ఏమిటి ప్రయోజనం ? దానికన్నా ఆ విశ్వకర్తనే మంచిచేసుకోవటానికి ప్రయత్నించటము మంచిదేమో అనుకునే అల్పప్రాణిని.

    ReplyDelete