koodali

Wednesday, September 22, 2010

అసలు ఏమిచెయ్యాలో ? ఏమి చెయ్యకూడదో అర్ధం కాక అంతా అయోమయంగా ఉంది.

 

దైవాన్ని ఆరాధించటములో ఎవరి పధ్ధతులు వాళ్ళవి . మా అమ్మ,నాన్నగార్లు భక్తులే గానీ అండి, మరీ ఎక్కువగా తీర్ధయాత్రలకు వెళ్ళరు. మన ఇంట్లో కూడా దైవాన్ని ప్రశాంతముగా పూజించుకోవచ్చు అంటారు. అప్పుడప్పుడువెళ్తుంటారు .


అదే మా మామగారు,అత్తగారు వాళ్ళకి మొదటినుంచి తీర్ధయాత్రలు చేయటం అలవాటు. వారు ఉత్తరదేశయాత్రలు కొన్నిటికి వెళ్ళారు. వాళ్ళు రోజుల్లో ఒక కారు మాట్లాడుకుని తోడుకోసం ఇద్దరు,ముగ్గురు బంధువులనుతీసుకుని వెళ్ళేవారట.


ఒక పొయ్యి కూడా వెంట తీసుకువెళ్ళి వంట చేసుకునేవారట. { ఆరోగ్యం పాడవకుండా ఇలా చెయ్యటం } మధ్య ఓపిక లేక వెళ్ళటం లేదు. అయితే మధ్యనే కాశీ, అలహాబాద్ వెళ్ళివచ్చారు.


నాకు కూడా కాశీ వెళ్ళిరావాలని ఉంది. దైవం దయ ఎప్పుడో ? ఇక మేము వీలు కుదిరితే తీర్ధయాత్రలకు వెళ్తామండి. లేకపోతే ఇంట్లోనే పూజించుకుంటామండి.

సరే, నేను కొంతకాలం క్రితంకొన్ని సందేహములు వచ్చి మా తల్లిదండ్రులను ఇలా అడిగానండి.


ఒకోసారి ఎంత జాగ్రత్తగా ఉన్నా, పూజలో కొన్నిలోటుపాట్లు జరుగుతున్నాయి. కొందరేమో భగవంతుడు ఏమీ అనడు అంటున్నారు. మరి కొందరేమో ఇలా చేస్తే చాలాకష్టములు వస్తాయి అంటున్నారు. పూజలో కొన్ని లోటుపాట్లు జరిగినా క్రొత్త కష్టములు వస్తే ఎలా ? అసలు ఏమిచెయ్యాలో ? ఏమి చెయ్యకూడదో అర్ధం కాక అంతా అయోమయంగా ఉంది. కానీ భగవంతుని అండ తప్పక కావాలి. అని వారితో నా సందేహములు చెప్పుకున్నప్పుడు .............


వాళ్ళు ఇలాఅన్నారండి. చిన్నప్పుడు దేవుడే లేడని అనే నువ్వు భక్తిగా మారటమే ఆశ్చర్యం అని ,

దేవుడు మనం చెడ్డ పనులు చేస్తేకోపగించుకుంటాడు కానీ, పూజలో తెలిసీ తెలియక మనం చేసే లోటుపాట్లకు కోపగించుకోడు. చెడ్డ పనులు చేసిన వాళ్ళుకూడా పశ్చాత్తాపపడి మారితే ఆ దైవం క్షమిస్తారు. అయినా నువ్వు చాలాసేపు అలా దేవుని మందిరంముందు కూర్చుంటే కుటుంబం ఎలా ? నువ్వు నీకు వీలు కుదిరినంత సేపు ప్రశాంతముగా పూజ చేసుకున్నా చాలు. ఇంకా ......... నీ రోజువారీ పనులు చేసుకుంటూనే ............. కుదిరినంతవరకూ లోపల భగవన్నామాన్ని అనుకుంటూ ఉండు. భగవన్నామ స్మరణం ఎంతో గొప్పదని పెద్దలు చెబుతున్నారు. దైవం దయ వలన......... నామమే నిన్ను సరి అయినదారిలో నడిపిస్తుంది. .......ఇలా అన్నారండి. .,..


{ నిజం చెప్పాలంటే నాకు కూడా ఎక్కువసేపు అలా కూర్చున్నప్పుడు ధ్యాస నిలిచిపోయిన పనులమీద ఇంకా ఎక్కడో ఉంటుంది. }

మరి కొన్ని వివరములు ఇంకొకసారి అండి.

No comments:

Post a Comment