koodali

Wednesday, September 8, 2010

ఆఖరి జన్మ దగ్గరపడుతున్న కొద్దీ.................

 

ఒకోసారి సత్ప్రవర్తనతో జీవిస్తూన్న మంచివారికి కూడా రాకూడని పెద్ద కష్టాలు రావటం మనం చూస్తున్నాము.

నాకేమనిపిస్తుందంటేనండి ......... వారి ఇప్పటి సత్ప్రవర్తన కన్నా వారు పూర్వ జన్మలలో చేసిన పాపకర్మ ఎక్కువగా ఉండటం ఒక కారణం కావచ్చు.


.ఇంకా ఏమనిపిస్తుందంటేనండీ ఈ అభిప్రాయం సరైనదో కాదో తెలియదుగానీ ... ఆఖరి జన్మకు దగ్గరయ్యే కొద్దీ పరీక్షలు, మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటాయేమోనని.


ఉదా......కొండమీదున్న దైవాన్ని దర్శించటానికి నడిచివెళ్ళేటప్పుడు ముందు ఓపికగా ఉన్నా ఆఖరికి వచ్చేసరికి కళ్ళుతిరిగి పడే పరిస్థితి కూడా వస్తుంది. గుడిని చేరుకున్నాక ఆ కష్టాన్ని మరచిపోతాము.


అలానే ఒక వ్యక్తి డాక్టర్ కావాలంటే ఆఖరు సంవత్సరం వచ్చేసరికి ఓపిక నశిస్తుంది. పరీక్షలు ఎంతో కష్టంగా ఉంటాయి. ఎన్నో సంవత్సరాలు ఎన్నో త్యాగాలు చెయ్యవలసి వస్తుంది. పరీక్ష పాసయ్యాక అన్నీ కష్టాలు గట్టెక్కుతాయి.

మరి అత్యుత్తమయిన మోక్షమును సాధించాలంటే ఎన్నో పరీక్షలను తట్టుకోవాలి.

ఈ బాధలన్నీ ఎవరు పడతారు ....మాకు మోక్షం వద్దు. ఈ లోకంలోనే ఉంటాము అనటానికి వీల్లేదు మరి. ప్రతి జీవి మోక్షమును పొంది బాధలు లేని పరమానందమును పొందాలని భగవంతుని అభిప్రాయము.


ఆ మోక్షము ఎంతో గొప్పది కాబట్టే,  దైవం అలా అందరూ మోక్షమును సాధించాలని ఆశిస్తారు. మనకు ఆ మోక్షానందం తెలియదు.


ఉదా.... మామిడిపండు తిన్నవారికి మాత్రమే ఆ రుచి తెలుస్తుంది. తిననివారికి దాని గురించి ఎంత వర్ణించినా ఆ రుచి తెలియదు కదా !


కొందరికి ఎక్కువజన్మలు, కొందరికి తక్కువ జన్మలు అంతేగాని, మోక్షాన్ని పొందటం అందరికి తప్పనిసరి లక్ష్యం. మనం అంతా పరమాత్మకు సంబంధించిన వాళ్ళమే మనం తిరిగి మన నిజనివాసానికి వెళ్ళటానికి అభ్యంతరం దేనికి ?


మనకు దైవలీలలు అర్ధం కావు. ఎందరి జబ్బులనో తగ్గించి ప్రాణదానం చేసినవారు సాయి , పాముకాటు నుండి , నోటివాక్కుతో శ్యామా ప్రాణాన్ని కాపాడినవారు సాయి, మరి సాయినే దైవంగా నమ్మిన కాకాదీక్షిత్ కూతురు ఎనిమిది సంవత్సరాల అమ్మాయి శిరిడీలో అకస్మాత్తుగా చనిపోయింది మరి. { ఈ సంగతి పెద్దలు వ్రాసిన ఒక పుస్తకములో చదివాను }


ఇంకా సాయినే నమ్ముకున్న మహల్సాపతి, కనీసం కుటుంబావసరాల కొరకు ఎన్నో ఇబ్బందులు పడేవారు. కొందరు సంపన్న భక్తులు మహల్సాపతికి పెద్దమొత్తములో డబ్బు ఇవ్వబోతే సాయి వద్దని వారించారు.


భక్తుల గతకర్మను పూర్తి చేసి మోక్షమును ప్రసాదించాలని సాయి అభిప్రాయం కావచ్చు ఏమో.. అని నాకు అనిపించింది.

మనకు మన ఈ ఒక్క జన్మ మాత్రమే తెలుసు. యోగులకు మనయొక్క ఎన్నో గత జన్మ కర్మలు తెలుసు కాబట్టి , మనకు భవిష్యత్తులో ఏది మంచిదో దానిని బట్టి మన కోరికలను తీరుస్తారు.


ఇంకొక విషయం అండి జీవులు మరణానంతరం మోక్షమునకు ముందు పైలోకాలకు వెళ్ళినప్పుడు అక్కడ వారి గతజన్మలలోని బంధువులు { అప్పటికి పునర్జన్మను పొందని బంధువులు } కనిపిస్తారట. వింటుంటేనే వెరైటీగా ఉంది కదండి.


మంచివాళ్ళు ఇహలోక మోహంలో పడుతున్నారని అనిపించినప్పుడు ............ దైవం వారికి కష్టాలను కల్పించి మోక్షమార్గంలోకి తీసుకువస్తారు ఏమో అని కూడా అనిపిస్తుంది నాకు.

 

2 comments:

  1. జీవితం లో కష్టాలతో నలిగి పోతున్న వాళ్ళు కనపడితే మీకు తోచిన సహాయం చెయ్యండి. వాళ్ళు చేసిన పాపాలతో వాళ్ళు కొట్టు మిట్టు ఆడుతున్నా మనము చూస్తూ కూర్చోటం కుడా మహా పాపము. మరు జన్మ లో మనం కూడా ఆ బాధలు పడవలసి వచ్చునేమో. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

    ReplyDelete
  2. చదివినందుకు కృతజ్ఞతలండి. మీరు చెప్పిన విషయం ఎంతో నిజమండి. మనం ఇతరులకు మనకు చేతనయిన సాయం చేయాలి.

    ReplyDelete