koodali

Saturday, September 18, 2010

.భగవంతుడా నాకు ఇంతే ఓపిక దయచేసి నన్ను క్షమించు అని..... ..

 
ఈ రోజుల్లో కొన్ని పధ్ధతులు పాటించటం కుదరకపోవచ్చండి.

ఉదా.......ఏదైనా గుడికి గానీ పుణ్యక్షేత్రములకు గానీ వెళ్ళేముందుగానీ, తిరిగి అక్కడినుండి వచ్చేటప్పుడు గానీ ఇతరుల ఇళ్ళకు వెళితే మన పుణ్యములు వారికి, వారి పాపములు మనకు తగులుతాయని నేను ఒక దగ్గర చదివానండి. ఇది పాటించటం ఒకోసారి చాలా కష్టంగా ఉంటుంది.


అయితే పాతకాలంలో కొందరు ఊళ్ళు తిరుగుతూ బంధువుల ఇళ్ళలో రోజులతరబడి ఉండేవారట. ఇప్పటికీ తిరుపతిలో నివసించేవారికి బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుందని అనుకుంటుంటారు. ఇలాంటి ఇబ్బందులు తప్పించటానికి ఒకవేళ పెద్దలు పై విధముగా చెప్పారేమోనని నా ఊహ.


అయితే ఒకోసారి మనకు బాగా దగ్గర బంధువుల ఇళ్ళకి వెళ్ళాలని మనకీ ఉంటుంది. అంతదూరం వెళ్ళి వెళ్ళకపోతే వారూ బాధపడతారు. ఇలాంటప్పుడు ఏమి చెయ్యాలో నాకు అర్ధం కాదు.


ఇంకో సంఘటన. ........మేము  చెన్నైలో ఉన్నప్పుడు ఒకసారి ఒక గుడికి వెళ్ళామండి.  తిరిగి వచ్చే
టప్పుడు  మా  ఇంట్లో వారు  ఫ్రెండ్స్ ఇంటికి,  షాప్స్ కు వెళ్ళాలంటారు.  నాకేమో గుడినుంచి సరాసరి ఇంటికి వెళ్ళాలని.  నేను అలా ఎవరింటికీ వెళ్ళకూడదట..అని చెప్తే చిన్న గొడవ అవుతుంది.
 
నిజం చెప్పాలంటే నాకూ షాపింగ్ కు వెళ్ళాలని ఉంది. కానీ గుడినుంచి షాపింగ్ కు వెళ్తే మన పుణ్యం షాప్ వారికి, వారి పాపం మనకు వస్తే ఏది దారి ......ఆఖరికి ఇంటికే వెళ్ళామనుకోండి.

కానీ గుడికి వెళ్ళివచ్చిన ప్రశాంతత ఏమాత్రం లేదు. ఇంట్లో   సీరియస్ గా కూర్చున్నారు. సెలవు రోజు అంత దూరం వెళ్ళి షాపింగ్ కు వెళ్ళలేదని వారి బాధ.

ఇలా కొన్ని సార్లు జరిగాక నేను గుడికి రమ్మంటే మాకు పనులున్నాయి అని ........ అలా ఏదో వంక చెప్పి తప్పించుకోవటం మొదలుపెట్టారు మా కుటుంబసభ్యులు.

వారి దృష్టిలో నాది చాదస్తం. భక్తి ఉండాలి గానీ చాదస్తం ఉండకూడదని మా కుటుంబసభ్యుల కామెంట్. నిజమే కానీ నేను చదివిన మరియు , విన్న దాని ప్రకారం అలా చేయకపోతే కష్టములు వస్తాయేమోననే భయంతో అలా చేసాను మరి..

ఆ తరువాత నాకు ఏమనిపించిందంటే కుదరనప్పుడు ఏం చేస్తాము ఇలాంటిపరిస్థితులలో పిల్లలకు మరియు మనకు కూడా దేవుని యందు కొంచెమయినా భక్తి ఉండేలా చూసుకుంటే అదే పదివేలు అని.

కానీ, నాకు సందేహం ఏమిటంటే, మరి టిఫిన్, భోజనం.. తినడానికి హోటల్స్ కు వెళ్ళకుండా కుదరదు కదా.. అనిపిస్తుంది.
 
విచారించదగ్గ విషయమేమిటంటేనండీ , షాపింగ్ లాంటి ఇతర విషయాలలో ఎంతసేపయినా విసుగు రాకపోవటము ఏమిటో అర్ధం కాదు. . ఇంకా ఏమని అనుకున్నానంటేనండి .......భగవంతుడా నాకు ఇంతే ఓపిక దయచేసి నన్ను క్షమించు అని..
 

9 comments:

  1. మంచి వాక్యానం

    ReplyDelete
  2. god is only benevolent& not punishing

    ReplyDelete
  3. చదివి మీ అభిప్రాయములు తెలిపినందుకు మీకు నా ధన్యవాదములండి..

    ReplyDelete
  4. చదివి మీ అభిప్రాయములు తెలిపినందుకు మీకు నా ధన్యవాదములండి.. మీరు చెప్పినట్లు భగవంతుడు ఎంతో దయామయుడండి.

    ReplyDelete
  5. opika lekapote gudiki maatram yenduku vellaali
    yintilo devunipataanikimokkadamo ledaamanasulo raama
    krishnaa ano anukovatchukadaa

    ReplyDelete
  6. ఇంక నుంచీ ఫిఫ్టీ ఫిఫ్టీ చెయ్యండి. అంటే మీకోసం పిల్లలు ఒక పని చేస్తే,మీరు వారికోసం ఇంకొకటి చేయాలి. మీ ఆవిడ మిమ్మల్ని సమర్దిస్తుంది అని అనుకుంటాను, లేకపోతే పిల్లలతో కలిస్తే వారు చెప్పినట్లు చెయ్యాల్సిందే.

    ReplyDelete
  7. పైన చెప్పినది మా ఇంట్లో జరిగే వ్యవహారం. మీకూ పనికొస్తుందనుకుంటా.
    అన్నిట్లోనూ మనం విన్ చెయ్యలేము.

    ReplyDelete
  8. చదివి అభిప్రాయములు తెలిపినందుకు ధన్యవాదములండి. మీరన్నట్లు మనస్సులో దైవప్రార్ధన చేయటం మంచిపధ్ధతి అండి. ఇలా మనము పనిచేసుకుంటూ కూడా ఇతరులకు తెలియకుండా దైవనామాన్ని తలుచుకోవచ్చు. కానీ ఒకోసారి గుడిలోని పవిత్రత అక్కడి శక్తి వల్ల మనకు వెళ్ళాలనిపిస్తుందండి. మా కుటుంబసభ్యులకు దేవుడంటే ఇష్టమే కానీ అండి ఇలా గుడికి వెళ్ళే ముందూ, వెనుక ఎవరి ఇంటికి వెళ్ళరాదు లాంటి విషయముల దగ్గరే గొడవలు వస్తూంటాయండి...

    ReplyDelete
  9. చదివి మీ అభిప్రాయములు తెలిపినందుకు ధన్యవాదములండి. మా ఇంట్లో కూడా మీరు చెప్పినట్లే .......... నేను కొంచెం వారిమాట వింటాను. వారు కొంచెం నా మాట వింటారు. ఇప్పుడు నేను గుడికి వెళ్ళినతరువాత వారి ఇష్ట ప్రకారం కూడా చేస్తున్నాను. ఈ ప్రపంచములో అందరికన్నా, ఆఖరికి మన మనస్సు కన్నా కూడా .......... భగవంతునికి చెప్పుకోవటం తేలికైన పని అని నా అభిప్రాయం. అంటే ఒకోసారి మన మనస్సు కూడా మన మాట వినదు కదా. ............ ఎంతైనా భగవంతుడు పాపం ఎంతో దయామయుడు. .......

    ReplyDelete