koodali

Wednesday, February 29, 2012

నేను M.A, చదివాను. కానీ,.....



నేను B.A. చదవలేకపోయాను కదా !

నేను ఎక్కువ చదువుకోలేదని కొందరు నన్ను ఎగతాళి చేయటం ఇవన్నీ చూసి మా నాన్నగారు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసినా చేయకపోయినా డిగ్రీ వరకైనా చదువుకోవాలని భావించి మా చెల్లిని హిందీ లో
Ph.D. వరకూ చదివించారు. ( నన్ను కూడా డిగ్రీ వరకూ చదివించాలనుకుంటే నేను గ్రూప్ మార్చుకోవటం వగైరా సంగతులు ఇంతకుముందే వ్రాసాను కదా ! )



మా తమ్ముడు డాక్టర్ చదివాడు. మా నాన్నగారు మా తమ్ముడిని పశువులకు సంబంధించిన వైద్యం చదివించాలనుకున్నారు. ఎందుకంటే , మనుషుల కన్నా నోరు లేని పశువులకు వైద్యం చేయటం పుణ్యమని మా నాన్నగారి అభిప్రాయం. కానీ తరువాత మనుషులకు సంబంధించిన వైద్యం చదివించారు.


ఇలా మా తమ్ముడు, చెల్లెలు పెద్ద చదువులు చదివిన తరువాత ....

మా అమ్మనాన్నగార్లు,చెల్లి, తమ్ముడు , నేను పెద్ద చదువులు చదవలేకపోయానని బాధ పడటం మొదలుపెట్టారు. వాళ్ళు నన్ను ప్రైవేటుగా ఏదైనా డిగ్రీ చదవమని ప్రోత్సహించారు.


అప్పుడు నా భర్త యొక్క ఉద్యోగరీత్యా మేము చెన్నైలో ఉంటున్నాము. చెన్నైలో చాలా యూనివర్సిటీలు B.A. చదవకపోయినా డైరెక్ట్ గా M.A. చదవటానికి వీలు కల్పిస్తున్నాయి.


ఈ విషయం గురించి నా భర్తను అడిగితే ఆయన ముందు B.A. చదివి తరువాత M.A. చదివితే తేలికగా అర్ధమవుతుందని సలహా చెప్పారు. అదంతా చాలాకాలం పడుతుందని నేను డైరెక్ట్ గా M.A. చదవటానికి ఫీజు కట్టేసాను.


మళ్లీ ఇంగ్లీష్ మీడియమే. నేను చదవగలనా అని భయపడ్డాను. కానీ, రామకృష్ణమఠంలో నేర్చుకున్న ఇంగ్లీష్ వల్ల ధైర్యం వచ్చింది.


హిస్టరీ సబ్జక్ట్ తీసుకున్నాను. నేను వార్తాపత్రికలు బాగా చదువుతాను కాబట్టి,  ఫరవాలేదు నెమ్మదిగా పాసవ్వచ్చులే అనుకున్నాను.


కానీ నేను అనుకున్నంత తేలికగా ఏమీ లేదు పరిస్థితి. చాలా కాలం తరువాత చదవటం, ఇంగ్లీష్ మీడియం, హిస్టరీ అంటే బోలెడు సంవత్సరాలు గుర్తు పెట్టుకోవాలి.


హిస్టరీ అంటే....
ఇంటెల్లెక్చువల్ హిస్టరీ ఆఫ్ తమిళనాడు, ఇండియన్ హిస్టరీ , యూరోప్ హిస్టరీ, అమెరికా హిస్టరీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్,..ఇలా ఉన్నాయి సబ్జెక్ట్స్. ఇక అంతా గందరగోళం.


నా భర్త ఆఫీసుకు, పిల్లలు స్కూలుకు వెళ్ళాక నేను చదవటం, ఎంత చదివినా గుర్తు ఉండేవి కాదు.


మా పిల్లలు కేంద్రీయ విద్యాలయంలో చదివేవారు. ఆ స్కూల్ సాయంత్రం మూడు గంటలకే అయిపోతుంది.


ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పాలి. ఆ స్కూల్ ప్రిన్స్ పాల్ గారు తెలుగువారు. ఆయన స్కూల్ లో చదివే తెలుగు పిల్లలకు తెలుగు నేర్పించాలని ఒక తెలుగు టీచర్ ను నియమించారు. ఆమె రోజూ స్కూల్ అయ్యాక మూడు గంటలకు వచ్చి ఒక గంట సేపు పిల్లలకు తెలుగు నేర్పించేవారు.


పిల్లలు తెలుగు క్లాసులో ఉంటే నేను బయట కూర్చుని M.A. పుస్తకాలు చదువుకునేదాన్ని. ఈ చదువు వల్ల నాకు ఇంట్లో పనికి సమయం సరిపోయేది కాదు.


ఏదో వంట చేసుకుని తినటం అంతే . అదివరకులా పావుబాజీ, పానీపూరీ ఇలా వంటకాలు చేయటానికి సమయం సరిపోయేది కాదు. . మా అమ్మగారు వాళ్ళు ఊరి నుంచీ పిండివంటలు బాగా వండి పంపించేవారు.


అయితే నాకు ఒక పక్క చదువు, ఒక పక్క ఇంటిపనులు, పిల్లలను చదివించటం ఇవన్నీ కష్టంగా ఉండేవి..... ఇప్పుడు చదవమన్నారని మా అమ్మవాళ్ళను కూడా విసుక్కున్నాను.


పిల్లలను చదివించటానికి కూడా నాకు నీరసంగా అనిపించేది. హిస్టరీ లోని సంవత్సరాలు గుర్తుపెట్టుకోలేక నా తల గిర్రున తిరుగుతునట్లు నీరసంగా అనిపించేది.


ప్రైవేటుగా చదివి తీసుకున్న డిగ్రీలంటే చాలామంది గొప్పగా భావించరు..... కానీ, అన్నామలై యూనివర్సిటీ వాళ్ళు చాలా
స్ట్రిక్ట్ .. . పరీక్ష హాల్లోకి హాండ్ బ్యాగు కూడా తీసుకు వెళ్ళనివ్వలేదు.


నేను సరిగ్గా వ్రాయని సబ్జక్ట్స్ లో ఫెయిల్ అయ్యాను కూడా..... అంత
స్ట్రిక్ట్ గా పేపర్స్ దిద్దుతారు అన్నమాట .....ఇలా రెండు సంవత్సరాల్లో చదవవలసిన చదువు ఎక్కువ కాలమే పట్టింది.


ఆఖరి పరీక్ష రోజయితే ఇక నాకు శక్తి అంతా పోయి బాగా ఏడ్చేసి దైవం మీద భారం వేసి బయలుదేరాను. మొత్తానికి దైవం దయ వల్ల పాసయ్యానండి. సంతోషంగానే అనిపించింది అందరికీ. యూనివర్సిటీ వారు డిగ్రీ సర్టిఫికెట్ కూడా పంపించారు.


ఇలా అంతా బాగానే ఉండగా ..... కొంతకాలం తరువాత.... ఒకరోజు తీరిగ్గా టీవీ చూస్తుంటే ..... జరజరా సాగిపోతున్న స్క్రోలింగ్ చూసిన నేను ఒక్కసారి ఉలిక్కిపడ్డాను.


ఎందుకంటే  B.A. చదవకుండా
డైరెక్ట్ గా M.A. వంటి చదువులు చదవటానికి అర్హత లేదని నిర్ణయించారని వార్తా సారాంశం. ఇక అప్పుడు నాకు ఎలా ఉంటుందో చెప్పండి.


నాకు డిగ్రీ పూర్తయింది కాబట్టి నాకు ఏమీకాదని కొందరు, నీకు కూడా ఆ నిర్ణయం వర్తిస్తుందని కొందరు వ్యాఖ్యానాలు చేస్తున్నారు.


నా సంగతి అలా ఉంచండి. నేను డిగ్రీ తీసుకున్నా...తీసుకోకున్నా దేశానికి వచ్చే నష్టమేమీ లేదు.


కానీ ఎందరో వికలాంగులు, డైరెక్ట్ గా యూనివర్సిటీల్లో చదవలేని పేదవారు వచ్చి పరీక్షలు వ్రాసారు. వారి సంగతి ఏమిటని ? నాకు చాలా బాధ కలిగింది.


డైరెక్ట్గా పీజీ చదవకూడదు అన్నప్పుడు .... ముందే ఆ విషయం ప్రజలకు స్పష్టంగా అర్ధమయ్యేటట్లు తెలియచెప్పాలి కదా ! అలా చర్యలు కూడా తీసుకోవాలి.


ప్రైవేట్ యూనివర్సిటీలు పెద్దయెత్తున వార్తాపత్రికల్లో యాడ్స్ ఇవ్వటం అందరికీ తెలిసిందే. అప్పుడంతా ఊరుకుని విద్యాశాఖ వారు సడన్ గా మేల్కొని మేము ఊరుకోము . అంటే , చదువు సగంలో ఉన్న వారి పరిస్థితి ఏమిటి?

 

12 comments:

  1. Good Question. vijnaaniki kolabaddalu..degree lu kaadandee!!! adi telusukunte chaalu.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
    మీరు చెప్పింది నిజమండి.........

    అయితే ఈ రోజుల్లో సామాన్యుల సమస్యలను పట్టించుకుని పరిష్కరించటం తగ్గిపోయింది. సామాన్యులకు కూడా న్యాయం జరిగినప్పుడే సమాజం సంతోషంగా ఉంటుంది.

    ReplyDelete
    Replies
    1. బహుషా ఆ రూల్ అప్పటి నుండే ఐవుంటుంది . మీకు యూనివర్సిటీ నుంచె డిగ్రీ పంపాకా దానికి వాల్యూ లేదని ఎలా అంటారు ?

      Delete
    2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      కొద్దిసేపటి క్రితమే మీ వ్యాఖ్యను చూశాను. . పని వత్తిడి వల్ల జవాబివ్వటం ఆలస్యమయ్యింది. క్షమించండి.

      మీరన్నట్లు ఆ రూల్ అప్పటి నుండే ఐవుంటుంది . ఆ రూల్ గురించిన వివరాలను మేము యూనివర్సిటీ వారిని కనుక్కోలేదు.


      కొన్ని వార్తాపత్రికల్లో ఏం వ్రాసారంటే ...... కొందరు ఉద్యోగస్తులు ప్రమోషన్స్ కోసం ఇలా పీజీ చదివి ప్రమోషన్స్ పొందుతారట. ఈ రూల్ వల్ల అలా పొందిన ప్రమోషన్స్ కూడా రద్దవుతాయి . అన్నట్లు వ్రాసారు.


      ఒకసారి పొందిన డిగ్రీ ఎలా రద్దవుతుందో నాకూ అర్ధం కాలేదు.


      నాకు డిగ్రీ పూర్తయింది. . కానీ , ఇలాంటి ప్రకటనల వల్ల చదువు సగంలో ఉన్నవారి పరిస్థితి అయోమయంగానే ఉంటుంది.

      క్రొత్త బ్యాచ్ నుంచీ మాత్రమే ఈ రూల్ ను అమలుచేయాలి.

      నేను పరీక్షలకు వెళ్ళినప్పుడు చూసానండి. ఎందరో పేద, మధ్య తరగతి వాళ్ళు పరీక్షలు వ్రాశారు. వాళ్ళ పరిస్థితి తలచుకుంటే బాధనిపించింది.


      సామాన్యులు న్యాయం కోసం పైవాళ్ళను అడగలేరు కదా ! అందరికీ న్యాయం జరిగేటట్లు నిర్ణయాలు తీసుకోవాలి...

      Delete
  3. మీ శైలి చూస్తుంటే గుళ్ళో రెండు చేతులూ కట్టుకుని బుద్ధిగా ప్రసాదం పంచిపెడుతున్నట్టుందండీ.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      కొద్దిసేపటి క్రితమే మీ వ్యాఖ్యను చూశాను. . పని వత్తిడి వల్ల జవాబివ్వటం ఆలస్యమయ్యింది. క్షమించండి.

      Delete
  4. డిగ్రీ కోసం తంటాలు పడలేదు.పోనివ్వండి. నవ్విన వాళ్ళ పళ్ళు బయటపడతాయి. నాకు డిగ్రీలు లేవు, అన్నట్లు మీకుందిగా.......

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      కొద్దిసేపటి క్రితమే మీ వ్యాఖ్యను చూశాను. . పని వత్తిడి వల్ల జవాబివ్వటం ఆలస్యమయ్యింది. క్షమించండి.

      Delete
  5. @వనజవనమాలిFeb 29, 2012 07:30 AM:

    అయిదు వందల కోట్ల (hundred million dollars @ 50/-) విలువయిన మాట చెప్పారు!

    ఈ రోజులలో టీవీలో తమ పాండిత్యం గురించి సొంత డబ్బా కొట్టుకునే చాలా మందికి విషయ పరిగ్యానం లేదు సరికదా కనీసం నలుగురిలో ఎలా ప్రవర్తించాలో కూడా తెలీదు. ఎప్పుడో సంపాదించిన డిగ్రీల పేరు చెప్పుకొని మురిసిపోతుంటారు తప్ప సమకాలీన విజ్యానం కూడగట్టుకునే ప్రయత్నం వీరు చెయ్యరు.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      కొద్దిసేపటి క్రితమే మీ వ్యాఖ్యను చూశాను. . పని వత్తిడి వల్ల జవాబివ్వటం ఆలస్యమయ్యింది. క్షమించండి.

      Delete
  6. ముందుగా మీకు అభినందనలు ... చదువు విలువ తెలియాలంటే ఓపెన్ ఉనువర్సితి ఫీజు కట్టడానికి పోస్ట్ ఆఫీసు లో q లో ఉన్న వారి మాటలు వింటే తెలుస్తుందని ఓ సారి పిల్లలకు చెప్పాను. ఉస్మానియా డిస్టెన్స్ సెంటర్ లో ౬౦ ఏళ్ళ వాళ్ళు కూడా పరీక్ష ఫీజు కట్టడం చూసి సంతోషం వేసింది .. వయసులో ఉన్నప్పుడు యేవో కారణాలతో చదవలేక పోయినా వారు పదవి విరమణ తరువాత కూడా చదువుతారు . డిగ్రి ఉండ లేదా వివాదం వదిలేసి మీరు ఇంకా చదవండి . పేరు గుర్తు లేదు కానీ బహుశా సిరివెన్నెల సీతారామ శాస్త్రి అనుకుంటా డిస్టెన్స్ లో m a తెలుగు చదివారని స్నేహితులు చెప్పారు

    ReplyDelete
  7. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    నిజమేనండి. ఓపెన్ యూనివర్సిటీలవల్ల ఏ వయసు వారైనా చదువుకునే అవకాశం కలిగింది.

    ReplyDelete