koodali

Monday, February 6, 2012

స్వధర్మం మరియు అసమానతలు వంటి కొన్ని విషయాలు............



ఒక వ్యక్తి రాజుగా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు .. ప్రజల రక్షణ , రాజ్య రక్షణ కోసం యుద్ధాలు కూడా చేయవలసి వస్తుంది.
రాజ్యం పైకి శత్రువులు దండెత్తి వచ్చి ప్రజలను హింసిస్తున్నప్పుడైనా రాజుకి యుద్ధం చేయకతప్పదు.

అంతేకానీ, ఇతరులను చంపటం పాపం కాబట్టి, నేను యుద్ధం చేయను అంటే కుదరదు కదా ! అలా తప్పించుకుంటే అది అతని స్వధర్మాన్ని తప్పినట్లవుతుంది.

రాజుగా బాధ్యతలను స్వీకరించిన వ్యక్తి యొక్క ధర్మం ఏమంటే ..... యుద్ధం చేసి అయినా ప్రజలను రక్షించటం.

యుద్ధం చెయ్యకూడదు అనుకున్నప్పుడు.... రాజు తన బాధ్యతల నుండి తప్పుకొని తనకు ఇష్టమయిన ధర్మాన్ని
స్వీకరించవచ్చు. ఉదా... తపస్సు వంటివి .

కొందరు రాజులు కోరికలు తీరటానికి కొంతకాలం తపస్సు చేసి ( తాత్కాలికంగా రాజ్య బాధ్యతలను ఇతరులకు అప్పగించి ) మరల రాజుగా బాధ్యతలను స్వీకరిస్తారు. ఇది వేరే విషయం.

అయితే , విశ్వామిత్రుడు మహర్షి అయినా కూడా అవసరమైనప్పుడు ..... అంటే మునులను రాక్షసులు హింసిస్తున్నప్పుడు రామలక్ష్మణులకు యుద్ధవిద్యలను నేర్పించారు.


ఇవన్నీ నిశితంగా గమనించితే స్వధర్మం గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి.

ఇంకా,
ఎవరైనా వ్యక్తి ..శక్తి లేక అసహాయుడై  స్వధర్మాన్ని సరిగ్గా ఆచరించ లేని పరిస్థితిలో..తనకు చేతనైనంత వరకు ఆచరించినా మంచిదే అని నాకు అనిపించింది.

ఇంకా,
నేను ఇంతకుముందు ఒకటపాలో వ్రాసినట్లు పెద్దలు సమాజంలోని అన్ని బాధ్యతలనూ విభజించి అందరికి అప్పగించారు.

అందరూ ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటే సమాజం సాగేదెలా ? అందుకే బ్రాహ్మణులకు దైవపూజ,ఇంకా కొన్ని బాధ్యతలు, క్షత్రియులకు రాజ్యరక్షణ
ఇంకా, కొన్ని బాధ్యతలు,... అప్పగించారు.


శూద్రులు బ్రాహ్మణులకు వలె ఎక్కువగా పూజలు చెయ్యకపోయినా, శూద్రులు తమ స్వధర్మాన్ని చక్కగా పాటించినా చాలు.... తేలికగా దైవకృపను పొందుతారు అని చెప్పారు. ఉదా...ధర్మవ్యాధుని కధ....
అయితే అంటరానితనాన్ని పెద్దలు ప్రోత్సహించలేదు.

కర్మసన్యాస యోగము లో ...18 వ శ్లోకంలో భగవానుడు ఏం చెప్పారో చదవండి.


**********************

ఒక వ్యక్తికి అతని అర్హతలు, వృత్తి నైపుణ్యం ఆధారంగా ఉద్యోగంలో హోదా, జీతభత్యాలు నిర్ణయించబడటం సరైనదే అయినప్పుడు ........,

..ఒక వ్యక్తి చేసిన పాపపుణ్య కర్మల ఆధారంగా మరు జన్మ  నిర్ణయించబడటం..కూడా
సరైనదే కదా !

ఆస్తికులు తాము చేసిన కర్మల ఆధారంగానే వచ్చే జన్మ ఆధారపడి ఉంటుందని నమ్ముతారు. అందుకని ఆస్తికులతో ప్రాబ్లం లేదు. వారి పుట్టుక ఎలంటిది అన్నది.. వారు క్రితం జన్మలో చేసిన కర్మ ద్వారానే నిర్ణయించబడుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలలో ఆస్తికులు బాధపడకూడదు.


పుట్టుక ఎలాంటిదయినా తమ సత్కర్మలతో దైవాన్ని మెప్పించి కష్టాలను పోగొట్టుకున్న భక్తులెందరో ఉన్నారు.

నాస్తికులు పాపపుణ్యాల ఆధారంగా వచ్చే జన్మపరంపరను నమ్మము అంటారు. అందరూ సమానమే కదా ! అంటారు. వారి మాటలకు చేతలకు పొంతన ఉండదు. 
 
అందరూ సమానమే అనే వారు .. రోజంతా కష్టపడే ఒక కూలీకి, రోజంతా కష్టపడే ఒక ఉద్యోగికి ఒకే రకంగా హోదా, జీతభత్యాలు ఇస్తే ఒప్పుకుంటారా ?


ఒక డాక్టరుకు, ఒక నర్సుకు ఒకే రకం హోదా , జీతభత్యాలు, ఇస్తే ఒప్పుకుంటారా ?
ఎందుకంటే ఒక డాక్టరు వైద్యం చేస్తూ కష్టపడినట్లే , ఒక నర్సు రోగుల సేవలో కష్టపడతారు.

టార్గెట్ రీచ్ అవటం అనే టెన్షన్ ఒక ఉన్నత స్థాయి ఉద్యోగికి ఉంటుంది. క్రింది స్థాయి ఉద్యోగికి ఉంటుంది. కానీ, వారి హోదా జీతభత్యాలలో ఎంతో తేడా ఉంటుంది.

సమాజంలో ఎందరో పేదలుండగా .. కొందరు ధనికులు కోట్లాది రూపాయల సంపదను తరతరాలకు సరిపడా ప్రోగుచేసుకుంటున్నారు. ఈ పాపాలకు వాళ్ళు వచ్చే జన్మలో బిచ్చగాళ్ళుగా పుట్టినా ఆశ్చర్యం లేదు.

లక్షలాది రూపాయలు విలాసాలకు .. అంటే ఆభరణాలు, కార్లు, బంగ్లాలు కొనటానికి ఖర్చుచేస్తుంటారు.


ఇలా.. డబ్బున్న వాళ్ళు, లేనివాళ్ళ మధ్య అసమానతలు బాగా పెరిగిపోయాయి.

డబ్బున్న వాళ్ళు శూద్ర కులానికి చెందినా అందరూ గౌరవిస్తారు.

డబ్బు లేనివాళ్ళు బ్రాహ్మణకులానికి చెందినా గౌరవించటం లేదు.

మనుషులందరి కష్టం ఒకటే.

అలాంటప్పుడు సంపద, హోదా, జీతభత్యాల విషయంలో ఇన్ని అసమానతలు ఉండకూడదు కదా !

ఎర్రని ఎండలో, వానలో, చలిలో పనిచేసే కూలీకి రోజుకి 100 రూపాయల ఆదాయం వస్తే ఏసీ గదిలో పనిచేసే ఉద్యోగికి రోజుకి 1000 రూపాయల ఆదాయం వస్తుంది. కూలీకి మరుసటి రోజు పని దొరుకుతుందన్న గ్యారంటీ కూడా ఉండదు..

ఈ ఆర్ధిక అసమానతలను సరిదిద్దినప్పుడే మనుషుల మధ్య అసమానతలు తగ్గుతాయి..


************************

పెద్దలు అంటరానితనాన్ని పాటించమని చెప్పలేదు. ఇది ప్రజల తప్పే.


కొందరు స్వార్ధపరులైన వాళ్ళు , ఇంకా కొందరు తెలిసీతెలియని వాళ్ళ వల్ల ఇలా అసమానతలు పెరిగాయి.


పెద్దలు కులాల మధ్య అసమానతలను కల్పించలేదు.ఏ వృత్తిలో ఉండే కష్టాలు వారికున్నాయి.


బ్రాహ్మణులకు ఎక్కువ భాగం పూజలు చేయటం , ఎన్నో నియమనిష్ఠలు , చెప్పారు. ( ఇవన్నీ పాటించటం చాలా కష్టం. ) వీరికి కుటుంబానికి సరిపడా సంపాదించుకోవటానికి కూడా సమయం చాలదు.



అందుకే పూజలు, వ్రతాలు చేయించుకునేటప్పుడు బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వటాన్ని ఆచారంగా ఏర్పాటు చేసారు. కొందరు సంపన్నులు బోలెడు ఖర్చుపెట్టి పూజలు చేయించుకుని బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చే విషయంలో బేరాలాడతారు. అలా వచ్చిన కొద్ది చాలీచాలని డబ్బుతోనే జీవించే బ్రాహ్మణులెందరో ఉన్నారు.



రాజుల విషయంలో అయితే ఎప్పుడు ఏ యుద్ధంలో మరణిస్తారో అనే ప్రమాదం పొంచి ఉంటుంది. . వారి కుటుంబానికి ఎప్పుడూ శత్రు భయమూ, విషప్రయోగ భయాలే.


శూద్రులకు సంఘంలో బ్రాహ్మణులకు, క్షత్రియులకు ఉన్నంత హోదా లేకపోయినా జీవితంలో స్వేచ్చ ఉంది.


శూద్రులకు బ్రాహ్మణులకు లాగా నియమనిష్ఠలు పాటించనవసరం లేదు. క్షత్రియులకు లాగా యుద్ధాలు, శత్రుభయం ఉండదు. ( కొద్దిమంది సైనికులకు తప్ప ) ఇలా అన్ని వృత్తులలోనూ కష్టాలు, సుఖాలు ఉన్నాయి.


.వస్తూత్పత్తి , వాటిని విక్రయించటం అనే పనులను వైశ్యులు, శూద్రులు నిర్వహించేవారు.

శూద్రులు కూడా సమాజంలో అందరికీ కావలసిన వస్తువులను తయారుచేసి అందిస్తూ వారూ ఆర్ధికంగా మంచిగానే జీవించి ఉంటారు .
 
.ఇలా ఎవరి బాధ్యతను వారు నిర్వహిస్తూ అందరూ చక్కగా జీవించేవారు అనిపిస్తుంది.

వర్ణవ్యవస్థ వంటివి సున్నితమైన అంశాల గురించి . మరీ ఎక్కువగా చర్చించటం బాగుండదేమో అని నాకు అనిపిస్తోంది. నా అభిప్రాయములు నచ్చిన వారికి, నచ్చనివారికి అందరికి కృతజ్ఞతలండి.

వ్రాసిన విషయాలలో పొరపాట్లు ఉంటే దైవం దయచేసి క్షమించాలని కోరుకుంటున్నాను..

15 comments:

  1. మీరు నిజంగా ఇలాగే ఆలోచిస్తారా !!?

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. కొద్దిసేపటి క్రితమే మీ వ్యాఖ్యను చదివానండి. మీ ప్రశ్న నాకు సరిగ్గా అర్ధం కాలేదండి. ఇదంతా చూస్తే నేను నా అభిప్రాయాలను అందరికి అర్ధమయ్యేలా సరిగ్గా చెప్పలేకపోతున్నానేమో అనిపిస్తోంది.

    ఎందుకంటే నేను అందరి మంచి కోరుతున్నా కూడా ఎన్నో విమర్శలు వస్తున్నాయి. నిజమే, మనుషుల మధ్య ఇన్ని అసమానతలు లేకుండా అందరూ సమానంగా ఉంటే బాగుండేది అని అందరికి అనిపిస్తుంది.

    కానీ, మరి సమాజంలో అన్ని వృత్తుల వాళ్ళు అవసరమే కదా ! మరి క్రింది స్థాయి ఉద్యోగాలను ఎవరు చేస్తారు. ? అన్న ప్రశ్న వచ్చింది.

    ( దీనికి ఆఫీసులో అన్ని స్థాయిల ఉద్యోగులు అవసరం వంటి ఎన్నో ఉదాహరణలు కూడా ఇచ్చాను. )

    అలా వ్రాసినదే " ఈ సమస్యను మీరయితే ఎలా పరిష్కరిస్తారు ? " అన్న అ టపా .దానికి సరైన జవాబు ఎవ్వరూ చెప్పలేదు.

    కానీ నా గురించి విమర్శలు మాత్రం జడివానలా కురుస్తున్నాయి. ఎందరు విమర్శించినా నేను ఎలాంటి వ్యక్తిని అన్నది భగవంతునికి తెలుసు.

    అందరికి సమాన హోదా ,జీతభత్యాలు ( సమానం కాకపోయినా ... ..విపరీతమైన అసమానతలు లేకుండా ) అన్న పరిష్కారం నాకు నచ్చింది.

    జీవులను భూమి మీదకు పంపేటప్పుడు ఆ జీవికి ఎలాంటి జన్మ ఇవ్వాలి ( ఎలాంటి కుటుంబంలో ) ? అన్న ఆలోచన భగవంతుని కైనా వస్తుంది.

    ఏ ప్రాతిపదిక ఆధారంగా భగవంతుడు జీవులకు మరు జన్మను ప్రసాదించాలి ?

    అంటే .... ఆ జీవి క్రితం జన్మలో చేసిన పాపపుణ్యాల ఆధారంగానే ఉన్నత జన్మను గానీ, తక్కువ జన్మలోగానీ పుట్టిస్తారు. అన్నది నాకు న్యాయంగానే అనిపించిందండి.

    మనం చేసిన పాపపుణ్యాల ఆధారంగానే మనకు జన్మ లభిస్తున్నప్పుడు మనం ఇతరులను తిట్టటం ఎందుకు ?

    ఒక వ్యక్తి ఈ జన్మలో ఒక కులంలో పుడితే అతను చేసిన కర్మ ప్రకారం. మరు జన్మలో ఇంకో కులంలో పుట్టవచ్చు అని నాకు అనిపించిందండి.

    ఎవరి ప్రతిభ, అర్హతను బట్టి వారికి హోదా, జీతాలు ఇవ్వటం అన్నది సరైనది అయినప్పుడు....... ఎవరి పూర్వకర్మను ( పాపపుణ్యాలను ) బట్టి వారికి జన్మలు వస్తాయి అన్నది కూడా సరైనదే కదండి.

    కులం విషయమే కాదు ... వ్యక్తికి తాను చేసిన పాపపుణ్య కర్మలను బట్టే జీవితంలో చదువు, ధనం, సంపదలు లభిస్తాయని ఆస్తికులు నమ్ముతారు కదా !

    అంటరానితనాన్ని పెద్దలు ప్రోత్సహించలేదు . అని అన్నాను. అందులో తప్పేమిటో అర్ధం కావటం లేదండి.

    ఇప్పుడు కులవ్యవస్థ అంత బలంగా లేదు కదా ! అయిన అన్ని కులాలలోనూ ఎందరో నిరుపేదలున్నారు.

    బాగా డబ్బు ఉంటే ఏ కులం వాళ్ళనయినా అందరూ గౌరవిస్తారు కాబట్టి ....... ప్రజల మధ్య ఆర్ధిక అసమానతలు తగ్గాలి అన్నది నా అభిప్రాయం. .

    అన్ని కులాల వాళ్ళు సంతోషంగా ఉండాలన్నది నా అభిప్రాయమండి...

    . ****ఈ చర్చ అంతా కులవ్యవస్థను పూర్వులు ఎందుకు పెట్టారు ..... అన్న దాని గురించి ........ అంతేకానీ కులవ్యవస్థ ఇప్పుడు ఉండాలా ? వద్దా ? అన్నదాని నేను మాట్లాడటం లేదండి..

    ReplyDelete
  3. మీ అలోచనలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించానేగానీ నా మటుకు నేనైతే విమర్శల జడివాన కురిపించలేదనే అనుకుంటున్నానండీ.

    >>"ఆ జీవి క్రితం జన్మలో చేసిన పాపపుణ్యాల ఆధారంగానే ఉన్నత జన్మను గానీ, తక్కువ జన్మలోగానీ పుట్టిస్తారు. అన్నది నాకు న్యాయంగానే అనిపించిందండి."

    ఎక్కువ జన్మలూ, తక్కువ జన్మలూ ఉంటాయని మీరు అనుకుంటున్నారా అనేదే నా వ్యాఖ్య ఉద్దేశ్యం

    >>నేను అందరి మంచి కోరుతున్నా కూడా ఎన్నో విమర్శలు వస్తున్నాయి.ఎందరు విమర్శించినా నేను ఎలాంటి వ్యక్తిని అన్నది భగవంతునికి తెలుసు

    ఇలాంటివన్నీ ఎందుకండీ అసలు. మీరెలాంటివారూ అనేది అప్రస్తుతం. మిమ్మల్ని వ్యక్తిగతంగా కొంచపరిచే హక్కు ఎవరికీ లేదు. మీరు దాని గురించి ఆలోచించకుండా హాయిగా మీకనిపించిన వాటిని రాస్తూ ఇతరులు చెప్పేదాన్ని గురించి ఆలోచించడానికి ప్రయత్నించండి.

    ReplyDelete
    Replies
    1. కృతజ్ఞతలండి. మిమ్మల్ని అనలేదండి.

      నేను దైవాన్ని నమ్ముతాను కాబట్టి ఇవన్నీ నమ్ముతానండి.

      ఒక కంప్యూటర్ విడిభాగాలను విడదీసి ఒక గదిలో పడవేసి సంవత్సరం తరువాత చూసినా అవి అలాగే ఉంటాయి గానీ...కంప్యూటర్ గా మారవు. అలా మారాలంటే ఒక మనిషి గానీ, మనిషి నడిపించే రోబోట్ గానీ లేనిదే కంప్యూటర్ దానికదే పూర్తవదు,.

      అలాగే అద్భుతమైన ఆలోచనా శక్తిగల మహాశక్తి ప్రమేయం లేకుండా ఇంత అద్భుతమైన సృష్టి రచన సాధ్యం కాదండి. .

      ఎక్కువ తక్కువ జన్మలంటే....చెట్లకు కూడా ప్రాణముంటుందట. పండ్ల చెట్లన్నీ భగవంతునితో ప్రజలు మమ్మల్ని రాళ్ళతో కొడుతున్నారు. మమ్మల్ని మనుషులుగా మార్చు. అని అడిగి మనుషులుగా మారిపోయాయనుకోండి. మనం పండ్లను ఎలా తినగలము ?

      జీవులు వారి కర్మలను బట్టి మొక్కలు, జంతువులుగా కూడా జన్మిస్తారట...

      Delete
  4. దైవాన్ని నమ్మడం నమ్మకపోవడం కాదండీ ఇక్కడ సమస్య. మన ఙానానికి అంతు చిక్కని విషయాల గురించి మనం చేసుకునే ఊహాగానలన్నిటినీ దైవం పేరుతో నిజాలుగా చెలామణి చెయ్యాలనుకోవడం మనుషులువ బలహీనత. ఒక థియరీ గానీ, ఒక ఊహగానీ చెయ్యడంలో తప్పులేదు కానీ దాన్ని దైవంతో ముడిపెట్టి అదిమాత్రమే సత్యం అనేలా అమాయకంగా నమ్ముతూ ఇతురలని నమ్మిచడానికి ప్రయత్నిస్తేనే వస్తుంది సమస్య.

    ప్రపంచాన్ని నడిపించే లేదా సృష్టించిన ఒక మహాశక్తి ఉంటుంది అదే దైవం అని నమ్ముతారు దానికి వేరు వేరు రూపాలూ, పద్దతులూ సృష్టించుకుంటాం. కానీ మనం అనుకున్నవాటినన్నిటినీ ఆ మహా శక్తి ఉద్దేశ్యాలుగా భ్రమ పడుతుంటాం. అదీ సంగతి.

    ReplyDelete
    Replies
    1. ఇక్కడ నా ఊహలు, ధియరీలు సంగతి అలా ఉంచితే, వ్యక్తి యొక్క పాపపుణ్యాలను బట్టే జన్మలు, జీవితంలో కష్టాలు, సుఖాలు, ఆధారపడిఉంటాయని పురాణేతిహాసాలలో అనేకమంది చెప్పటం జరిగింది.

      ivannii నేను అందరికి అర్ధం అయ్యేటట్లు చెప్పలేకపోతున్నాను కాబట్టే ... శ్రీపాదశ్రీవల్లభ సంపూర్ణ చరిత్రము వంటి గ్రంధాలను చదవమని చెప్పాను. చదివితే చాలా విషయాలు తెలుస్తాయి కదండి. .

      Delete
  5. పురాణేతిహాసాలైనా శ్రీపాదశ్రీవల్లభ సంపూర్ణ చరిత్రమైనా ఏదైనా ఒకటేనండీ, వ్యక్తుల పాప పుణ్యాల ఫలితంగా జన్మలు ఉంటాయి, ఆ జన్మలు ఏ వర్ణాలలో ఉండాలో ఆవిధంగానే నిర్ణయించబడుతుంది అని చెప్పేదాన్ని నేనైతే అంగీకరించను.

    అలా నమ్మాలనుకుని నమ్మే వాళ్ళతో నాకు సమస్య లేదు. ఆ నమ్మకాల అధారంగా సమాజాలూ వ్యక్తులూ నడవాలని ప్రభోదిస్తేనే సమస్య.

    ReplyDelete
  6. >>ఇక్కడ నా ఊహలు, ధియరీలు సంగతి అలా ఉంచితే

    మీ ఊహలూ థియరీల సంగతి కాదండీ, వేదాలైనా, పురాణేతిహాసాలైనా, శ్రీపాదశ్రీవల్లభ సంపూర్ణ చరిత్రమైనా అలాంటి థియరీలే నని చెప్తున్నాను. కాలం గడిచేకొద్దీ, ఙానం పెరిగేకొద్దీ వాటికంటే మెరుగైన వాటిని ఏర్పరుచుకోవాలి. వాటిల్లో ఉన్న లొసుగుల్ని అర్థం చేసుకోవాలి. అలా క్రమంగా సత్యసోధనలో ముందుకెళ్ళాలి. అంతేగానీ, ముందు తరాల్లో పూర్వులు చెప్పారు, వేదాల్లో చెప్పారు అని వాటిల్లో ఉన్నవాటికి లేని పోని వక్రభాష్యాలూ, మహోన్నత ఆదర్శాలూ ఆపాదిస్తూ మనల్ని మనం మోసం చేసుకోకూడదు అనిపిస్తుందండీ.

    కొంతమందేమో వక్ర భాష్యాలు చెప్పేవాళ్ళతో ప్రమాదం అంటారు. మరికొందరేమో మహోన్నత ఆదర్శాలు ఆపాదించేవాళ్ళతో ప్రమాదం అంటారు. నా దృష్టిలో అయితే రెండూ ఒకటే :)

    ReplyDelete
  7. వీకెండూ, ఈయనకి ఇవన్నీ తెలియవని చెప్తున్నారుగా, మిగిలిన ధర్మ పరిరక్షకులని అడగరాదూ ఈ ప్రశ్నలన్నీ?

    ReplyDelete
    Replies
    1. WP. గారూ ఉదా.......మీరు మీ ఆఫీసులో కొందరు ఉద్యోగులను నియమించుకోవాలనుకుంటారు.

      ఒక మేనేజర్, ఒక ఆఫీసర్ ఒక క్లర్క్, ఇలా నియమించుకోవాలంటే ఏం చేస్తారు ?

      వారివారి విద్యార్హతలను బట్టి ఇంకా ఇతర అర్హతలను బట్టే ఉద్యోగంలోకి తీసుకుంటారు కదా ! వారి అర్హతలను బట్టే జీతాలనూ నిర్ణయిస్తారు.


      అలాగే జీవులను పుట్టించేటప్పుడు వారివారి పూర్వ కర్మల యొక్క అర్హతలను బట్టే దైవం పుట్టించటం అన్నది నాకు న్యాయంగానే అనిపించిందండి.

      ఒక జన్మలో ఒక వర్ణంలో పుట్టిన వ్యక్తి మరుజన్మలో ఇంకొక వర్ణంలో పుట్టవచ్చు కదా !

      కొందరు తక్కువ వర్ణంలో పుట్టినా జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన వ్యక్తులూ ఉన్నారు. ( ధర్మవ్యాధుడు, గుహుడు ) .


      కొందరు ఉత్తమ వర్ణంలో పుట్టినా జీవితంలో తక్కువకు దిగిపోయిన వారూ ఉన్నారు...( కౌరవులు )..

      Delete
    2. ఈ ఉదాహరణలను చూస్తే నాకు ఏమనిపించిందంటేనండి.

      ఏ వ్యక్తిని గౌరవించాలన్నా ఆ వ్యక్తి యొక్క వర్ణాన్ని బట్టి కాకుండా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవించాలి అన్నది నా అభిప్రాయం.


      ఇంకా ఈ రోజుల్లో డబ్బు ఉన్నవాళ్ళను గౌరవిస్తున్నారు కాబట్టి సమాజంలో ఏ వృత్తి ఆచరిస్తున్నా , వారి జీతభత్యాల విషయంలో విపరీతమైన తేడాలు ఉండకూడదనీ.,


      మనుషుల మధ్య ఆర్ధిక అసమానతలు తగ్గాలనీ .అంటరానితనం ఉండకూడదనీ ..

      సమసమాజం ఏర్పడాలని నా అభిప్రాయాలండి.

      Delete
    3. ఈ వర్ణములు అన్నవి పుట్టుకతో వస్తాయా , పుట్టుకతో వచ్చినా మధ్యలో మారే అవకాశం ఉందా ? ఇలాంటి వివరాలు కొన్ని శ్రీపాదశ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము గ్రంధంలో ఉన్నాయండి.


      అయితే ఇలాంటి గొప్ప గ్రంధాలలోని విషయాలు ...... మొదటిసారి చదివినదానికన్నా నాలాంటి వారికి చదువుతున్న కొద్దీ అర్ధమవుతాయేమో అనిపిస్తుంది....

      Delete
    4. వృత్తులు వారసత్వంగా వచ్చే విధానాన్ని కొందరు విమర్శిస్తారు .

      ఇలా విమర్శించేవారు కూడా ఈ రోజుల్లో రాజకీయాల్లో వస్తున్న వారసత్వాన్ని విమర్శించలేరు. . వాళ్ళకే ఓట్లు వేస్తారు.

      అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి.

      ఆ వారసులు గనుక ప్రతిభావంతులు అయితే వారిని విమర్శించటం తప్పే అనిపిస్తుంది.

      ఎందుకంటే వారి ప్రతిభకు వారసత్వం వల్ల అడ్డంకులు ఏర్పడటం అనేది న్యాయం కాదు కాబట్టి.

      Delete
  8. >>" పూర్వ కర్మల యొక్క అర్హతలను బట్టే దైవం పుట్టించటం అన్నది నాకు న్యాయంగానే అనిపించిందండి"

    నాకు మాత్రం ఎప్పుడో తయారు చెయ్యబడిన ఒక విఫలమైన థియరీ లాగా కనిపిస్తుందండీ.

    ReplyDelete
  9. మీరు మీ ఆఫీసులో ఉద్యోగస్తులను నియమించుకోవాలంటే , ఏ ధియరీ ప్రకారం అభ్యర్ధులను నియమించుకుంటారు ? అభ్యర్ధుల విద్యార్హతలను , ఇతర అర్హతలను పరిగణలోకి తీసుకోరా ?


    ReplyDelete