koodali

Monday, February 6, 2012

వేదములు ఎంతో గొప్పవి.


వేదములు ఎంతో గొప్పవి. వాటిలో అంతా మంచే ఉంటుంది అన్నది నా అభిప్రాయం.

వేదాలలోని విషయాలలో పైకి కనిపించే అర్ధాలే కాకుండా అంతరార్ధాలు అనేకం ఉంటాయట.

వేదాలలో ఉన్న విషయాలను గురించి సామాన్యులు సరైన రీతిలో అర్ధం చేసుకోవాలంటే ...... పురాణేతిహాసాల ద్వారా , అవతారమూర్తుల జీవితాల ద్వారా ,గొప్ప గ్రంధాల ద్వారా ( శ్రీ దేవీ భాగవతము, శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము...వంటివి. ) తెలుసుకోవచ్చు.


ఈ మధ్య వర్ణవ్యవస్థ గురించి అంతర్జాలంలో వెతుకుతుంటే కొన్ని వివరాలు కనిపించాయండి. అవి ఇంగ్లీష్ లో ఉన్నాయి.

నాకు అర్ధం అయినంతలో వాటిలో వర్ణవ్యవస్థ గురించిన చాలా వివరాలు కనిపించాయి.

నాకు ఇంగ్లీష్ అంతబాగా తెలియకపోయినా బ్లాగుల్లో చాలా మందికి ఇంగ్లీష్ బాగా వస్తుంది కదా ! అని


2..Vedic Literature Says Caste by Birth is Unjust


By Stephen Knapp (Sri Nandanandana dasa)................. ఈ రెండు లంకెలు ఇచ్చాను.

ఇంట్రస్ట్ ఉన్నవారికి......ఇంకో కొత్త లంకె.......Varna Ashrama and Hindu Scriptures Compiled by Rakesh Bahadur 2003..

అని వెళ్ళి ......చూడాలి..... Varna Dharma.


నా భావాలను దయచేసి తప్పుగా అర్ధం చేసుకోవద్దని కోరుకుంటూ........


4 comments:

  1. >>"వేదములు ఎంతో గొప్పవి. వాటిలో అంతా మంచే ఉంటుంది అన్నది నా అభిప్రాయం."

    If you are committed to such a thought, then what is there to discuss for anybody ?

    >>"వేదములు ఎంతో గొప్పవి."
    I agree with this part.

    >>"వాటిలో అంతా మంచే ఉంటుంది అన్నది నా అభిప్రాయం"
    I don't agree with that view and totally reject this view as the basis for any of my discussions.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యను కొద్దిసేపటి క్రితమే చూశానండి. ఆలస్యమైనందుకు క్షమించండి.

      దైవం ఎంతో గొప్ప అని నమ్ముతాము.

      అలా నమ్మినప్పుడు., వారు చేసే చర్యలను అపార్ధం చేసుకోకూడదు. ఆ చర్యల వెనుక మనకు తెలియని అంతరార్ధాలు ఎన్నో ఉంటాయని నమ్మాలి.


      అలాగే , వేదములు ఎంతో గొప్పవి .

      మరి గొప్పవి అని మనం నమ్మినప్పుడు ..... అందులోని విషయాలు కూడా గొప్పవే అని కూడా ఒప్పుకున్నట్లే కదా !.



      వేదములను అపార్ధం చేసుకోకుండా అంతరార్ధాలను తెలుసుకోవాలని ( అసలు అర్ధాలను ) నాకు తోచిన అభిప్రాయం.


      ప్రజలకు వారివారి కర్మలను బట్టి ( పాపము, పుణ్యం ) వారికి అర్ధాలు తెలుస్తాయనిపిస్తుంది.


      ఉదా..... భారతంలో ధర్మరాజు జూదంలో ఓడిపోయి రాజ్యాన్ని పోగొట్టుకుని కష్టాలను అనుభవించారు.


      ఈ సంఘటనను ఒక వ్యక్తి ........ ధర్మరాజంతటి గొప్ప వ్యక్తే జూదం ఆడటం వల్ల అన్ని కష్టాలపాలవటం జరిగింది కాబట్టి ... నేను జూదం ఆడకూడదు. అని అర్ధం చేసుకుని జీవితంలో జాగ్రత్తగా ఉంటాడు.


      ఈ సంఘటనను ఇంకొక వ్యక్తి ......... ధర్మరాజంతటి గొప్ప వ్యక్తే జూదం ఆడగాలేనిది ... నేను ఆడితే తప్పేమిటని జూదం జోరుగా ఆడి నష్టపోతాడు.

      Delete
    2. అయితే సమస్య ఎక్కడ వస్తుందంటేనండి ,

      కొందరు తెలిసీతెలియని వాళ్ళు, కొందరు స్వార్ధపరులు గ్రంధాలలోని అర్ధాలను వేరేవిధంగా చెబుతుంటారు.

      Delete
  2. >> "కొందరు తెలిసీతెలియని వాళ్ళు, కొందరు స్వార్ధపరులు గ్రంధాలలోని అర్ధాలను వేరేవిధంగా చెబుతుంటారు."

    అదేనండీ, కొందరేమో వక్ర భాష్యాలు చెబుతారు, కొందరేమో లేని పోని మహోన్నత నిగూఢార్థాలు చెబుతారు.

    >>"ప్రజలకు వారివారి కర్మలను బట్టి ( పాపము, పుణ్యం ) వారికి అర్ధాలు తెలుస్తాయనిపిస్తుంది."

    నాకైతే, ఇక్కడ మీరు చేసిన వాదన చాలా సిల్లీగానూ, అమాయకంగానూ కనిపిస్తుందండీ. మీ నమ్మకాలు మీవి.

    ReplyDelete