koodali

Friday, February 10, 2012

కొన్ని విషయాలు.........



నేను రకరకాల వార్తా పత్రికలు చదువుతాను. రెండు ఆర్టికల్స్ గురించి వ్రాయాలనుకుంటున్నాను.

1. " luminescence ."...... సౌరశక్తి ద్వారా విద్యుత్ తయారీ కనిపెట్టారట....శాస్త్రవేత్తలు .

( మొక్కల్లో సహజంగా జరిగే కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ మాదిరిగా ఈ ప్రక్రియ పనిచేస్తుందట. ఇదేదో వింటుంటే బాగానే ఉందనిపిస్తోంది.

2......వేదాలు ఎంతో గొప్పవి. ఈ క్రింది విషయాలు చదవండి. .

రాజమండ్రిలో కృష్ణనగర్ లో నివసించే మధుర కృష్ణమూర్తి శాస్త్రి అనే ఆయన గొప్ప పండితులట.


వీరి సలహాల కోసం దేశవిదేశాల నుంచి ఫోన్ల ద్వారా సంప్రదిస్తారట. వివిధ విశ్వవిద్యాలయాల నుంచి శాస్త్రవిషయాలపై పత్రాలు సమర్పించమని లేఖలు వస్తుంటాయట.


వారు విమానాలను పాశ్చాత్యులు కనిపెట్టటానికి పూర్వమే భరద్వాజ మహర్షి వైమానిక శాస్త్రాన్ని రచించారని.

భోజరాజు నౌకానిర్మాణ రహస్యాలను " నౌకా విహారం " అనే గ్రంధంలో రచించారని

"అంశుభోదినీ తంత్రం " అనే గ్రంధంలో విద్యుత్ ఉత్పాదన చేసే ప్రక్రియ వివరించబడిందని తెలియజేస్తున్నారట.

మన శాస్త్రాలను గురించి పాశ్చాత్య శాస్త్రవేత్తలు ఎంతో లోతైన పరిశోధనలు చేస్తున్నారట.

ఉదా...ఫ్రెంచ్ రచయిత ఫ్రిట్జ్ స్టాల్ రచించిన Agni: The Vedic Ritual of the Fire Alter (2 Vols.) అన్న గ్రంధం మన హోమాలు, యజ్ఞయాగాలను గురించిన పరిశోధనా గ్రంధమట.



విదేశీయులు ఈ విధంగా మన గ్రంధాలను తెలుసుకోవాలని ఉత్సాహాన్ని చూపిస్తుంటే ........ మన దేశీయులు కొందరు ప్రాచీనగ్రంధాలను ఎగతాళి చేయటానికి ఉత్సాహాన్ని చూపించటమే విషాదం..
..................................................

ఈ విషయం కూడా దయచేసి చదవండి.........

కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను ఇతర బ్లాగులలో వ్యాఖ్యానించటం కొంతకాలం మానెయ్యాలని గత కొంతకాలం నుంచి అనుకుంటున్నాను. అయితే ఇలా చేస్తే నన్ను అపార్ధం చేసుకుంటారేమోనని భయపడ్డాను.

( ఇలా అనుకోవటానికి కారణాలను ఇప్పుడు చెప్పలేను. ) ( అయితే నా బ్లాగులో ఎవరైనా వ్యాఖ్యానించవచ్చు. ) ఇదంతా దయచేసి తప్పుగా అర్ధం చేసుకోవద్దండి.


ఇది ఇలా ఉండగా అనుకోని విధంగా నామీద విమర్శలు వచ్చాయి కదా !

పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు, నేను అందరూ మంచిగా ఉండాలని అనుకుంటే ఇలా జరిగిందేమిటి ? అని బాధనిపించింది.


ఆ విమర్శలను చదివిన తరువాత కొద్దిగా బాధనిపించినా నేను కూడా చాలాసార్లు ఇతరులను విమర్శించాను కదా !
అనుకున్నాను.

జీవితంలో విమర్శలు, ప్రశంసలు సహజం .......అని కష్టాలలోనూ, సుఖాలలోనూ స్థితప్రజ్ఞత అవసరం....... అని పెద్దలు చెప్పినది గుర్తు చేసుకుంటూ దైవ నామాన్ని స్మరించుకుంటూ ఉంటే మనసు ప్రశాంతంగా అవసాగింది.

ఇంతలో నా మనసులో ఒక ఆలోచన తళుక్కున మెరిసింది.

ఈ సంఘటన వంక పెట్టి నేను ఇతర బ్లాగుల్లో వ్యాఖ్యలు వ్రాయటం మానటం వల్ల  ఎవరూ నన్ను అపార్ధం చేసుకోరు కదా ! అనిపించింది.

ఈ ఆలోచన వచ్చిన తరువాత అనిపించింది...... దైవం దయ వల్ల నా సమస్యకు యిలా పరిష్కారం దొరికింది అని.

విమర్శల వల్ల కూడా మనకు లాభముంది.

మనం చేసిన పొరపాట్లను సరిదిద్దుకొనే అవకాశం వస్తుంది.. ఇంకా మనకు కొత్త కొత్త ఆలోచనలు కూడా వస్తాయి .


మనకు సమస్యలు వచ్చినప్పుడు ఒకోసారి బంధువులతో కూడా చెప్పుకోలేము .
కానీ ఎప్పుడైనా, ఎక్కడైనా సర్వకాలసర్వావస్థలలోనూ మనము మనసు విప్పి చెప్పుకోగలిగేది దైవం తోనే.


ఎప్పుడూ మన వెంట ఉండేది దైవమూ ,ఇంకా మనం చేసిన ధర్మము, అధర్మము.

ఈ విమర్శల విషయం ఇంతటితో ముగించుదాము అనుకుంటున్నానండి.
..................

.... luminescence

......... Agni: The Vedic Ritual of the Fire Alter (2 Vols.)

ఈ రెండు విషయాల గురించి అంతర్జాలంలో కూడా వివరాలు ఉన్నాయండి..


6 comments:

  1. మీరు ఎవరో ఏదో అనుకుంటారు అని మానెయ్యకండి. ఏంచేసినా మీకోసం చెయ్యండి. మీకు నచ్చితే చెయ్యండి నచ్చనినాడు మానెయ్యండి.

    మీ భావాలతో నేనెంతమాత్రమూ అంగీకరించను. కానీ దానర్ధం మీరు రాయడం మానెయ్యాలనికాదు. ఒకవేళ రేపెప్పుడైనా నెను తప్పని తెలిస్తే ఆశ్రయించడానికి మీరాతలు నాకవసరమౌతాయేమో కదా. కాబట్టి మీరు రాస్తూనే ఉండండి. మీరు రాసింది నాకు ఏమాత్రమూ నచ్చకపోతే (విపరీతంగా నచ్చినాకూడా) మనం మళ్ళీ ఇక్కడే కలుసుకుందా. :) .

    ReplyDelete
  2. వ్యక్తిగత విమర్శల్ని ఖాతరు చెయ్యల్సిన అవసరం లేదండి. చెంపఛెళ్ళుమనేలా జవాబివ్వఖ్ఖర్లేదు గానీ చెంపఛెళ్ళుమనేలా నిర్లక్యం వహించండి చాలు.

    ReplyDelete
    Replies
    1. వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలండి.

      నావంటి గృహిణులకు అభిప్రాయాలను చెప్పటానికి బ్లాగు మంచి అవకాశం. నేను నా అభిప్రాయాలను చెప్పాలనుకుంటున్నానండి. మీకు మరొక్కసారి కృతజ్ఞతలు.

      Delete
  3. మీ భావాలతో నెను అంగీకరించను. మీరు రాస్తూనే ఉండండి.

    ReplyDelete
    Replies
    1. మీరు రాస్తూనే ఉండండి....అన్నందుకు కృతజ్ఞతలండి.

      నేను ఒకప్పుడు నాస్తిక వాదిని. ఇప్పుడు ఆస్తికవాదిని. అంతా దైవం దయ..

      Delete