koodali

Friday, February 3, 2012

తిరుప్పావైలో...నంద గోకులం..



పూర్వం అన్ని కులాల వాళ్ళూ బాగానే ఉండేవారు. క్రమంగా సమాజంలో ఈ అసమానతలు చోటుచేసుకున్నాయి అనిపిస్తుంది. .

పూర్వపు భారతదేశంలో పేదరికం లేదని విదేశీ పర్యాటకులే తమ గ్రంధాలలో వ్రాయటం జరిగింది.

మన చరిత్రకారులు ఇలా వ్రాస్తే నమ్మము కానీ అలా వ్రాసినది విదేశీయులు. కాబట్టి నమ్మక తప్పదు.

ఇవన్నీ గమనించితే పూర్వం అన్ని వృత్తుల వారూ భోగభాగ్యాలతో చక్కగా జీవించి ఉంటారు అని మనం అనుకోవచ్చు కదా !

ఎందుకంటే . అప్పట్లో ఏ వస్తువు అవసరమైనా శూద్రులైన చేతివృత్తుల వాళ్ళ వద్దే కొనేవారు . అందువల్ల శూద్రులు కూడా సిరిసంపదలతో చక్కగానే జీవించిఉండవచ్చు కదా !

ఇప్పుడంటే వస్తువులను తయారు చేసే వ్యాపార సంస్థలు కొన్ని బడా కంపెనీల చేతుల్లో మాత్రమే ఉండి అందరూ వారి వద్దే ఉద్యోగలు చేస్తున్నారు. పూర్వం అలా కాదు మరి.
..........................................

పూర్వం నందగోకులంలోని యాదవులు క్షత్రియులా ? శూద్రులా ? అన్నది నాకు తెలియదు కానీ, ఆ గోకులంలో పశుపోషణ వృత్తిలో ఉన్నవాళ్ళు కూడా చక్కటి భోగభాగ్యాలతో జీవించారని తిరుప్పావై ద్వారా తెలుస్తోంది.

ద్వాపర యుగంలో గోపికలు కాత్యాయనీ వ్రతం చేసారు. అలాగే ఆండాళ్ మాత శ్రీవిల్లిపుత్తూరులో కాత్య్యాయనీ వ్రతాన్ని ఆచరించారు.

తన తోటి ఆడపిల్లలను గోపికలుగానూ ,శ్రీ విల్లిపుత్తూరును నందగోకులంగానూ భావించి ఆమె కాత్యాయనీ వ్రతాన్ని ఆచరించింది.

ఆ పాశురాలలో రామావతారం అప్పటి విషయాలు, శ్రీకృష్ణుడు ఉండే నందగోకులం యొక్క వైభోగం, అప్పటి చల్ల చిలుకుతున్న గొల్లభామల నగల చప్పుళ్ళు, ఇవన్నీ వర్ణించబడ్డాయి.

ఇప్పుడు కూడా మనం అయోధ్య నగరం గురించి చెప్పుకుంటున్నాము కదా ! తిరుప్పావైలో నంద గోకులం గురించి ఆండాళ్ మాత వర్ణించటం జరిగింది.

ఆండాళ్ మాత అందరు చూస్తూండగానే శ్రీరంగనాధుని అర్చామూర్తిలో లీనమవటం జరిగింది.
ఇవన్నీ కొందరు నమ్మరు. నమ్మనివారిని ఏం చేయగలం ?

తిరుప్పావై గురించి కొత్తావకాయ బ్లాగులో వారు కూడా చక్కగా వ్రాశారు.

తిరుప్పావై గురించి ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే.....చూడవచ్చు....

.తిరుప్పావై ప్రవచనం - జై శ్రీమన్నారాయణ
sites.google.com/site/jaisrimannaaraayana/tiruppavai-pravacanam.............

*************

కామెంట్స్ చదివిన తరువాత కొన్ని విషయాలను ఇక్కడ వ్రాయటం జరిగింది. అన్ని వృత్తుల వారికి ఎవరి కష్టసుఖాలు వారికి ఉన్నాయి. ఈ విషయాలను ఇంతకుముందు పోస్టులలో వ్రాసాను. 

 పూర్వపు భారతదేశంలో పేదరికం లేదని విదేశీ పర్యాటకులే తమ గ్రంధాలలో వ్రాయటం జరిగింది. మన చరిత్రకారులు ఇలా వ్రాస్తే నమ్మము ....కానీ అలా వ్రాసినది విదేశీయులు. కాబట్టి నమ్మక తప్పదు. వన్నీ గమనించితే పూర్వం అన్ని వృత్తుల వారూ భోగభాగ్యాలతో చక్కగా జీవించి ఉంటారు అని మనం అనుకోవచ్చు కదా ! 

 

అంటరానితనం అనేది మాత్రం తప్పే. ప్రాచీనులు అంటరానితనాన్ని చెప్పలేదు. అది కొందరు స్వార్ధపరుల వల్ల వ్యవస్థలోకి వచ్చింది.  మనుషుల మనస్తత్వంలో మార్పు రానంతవరకూ వివక్ష, అసమానతలు ఏ వ్యవస్థలోనైనా ఉంటాయి. ఆధునికకాలంలో కూడా పేద,ధనిక అసమానతలున్నాయి. పేదల పట్ల  వివక్ష ఉంది. ఎంతో నిరుద్యోగ సమస్య కూడా ఉంది.  ఒకే కుటుంబంలో కూడా వివక్ష, అసమానతలు ఉంటాయి. గడుసు మనస్తత్వం ఉన్న వాళ్ళు మెతకగా ఉండేవారిపట్ల పెత్తనం చేస్తారు.  దేశాల మధ్య కూడా అంతే. అగ్రదేశాలు అనే దేశాలు మెతకగా(soft) ఉండే దేశాల పట్ల పెత్తనం చేస్తారు.


ఇంకా చెప్పాలంటే, మనుషులు తమకన్నా బలహీనమైన పశుపక్ష్యాదులను చంపి తినటం కూడా వివక్ష, అసమానతే అవుతుంది. వాటిని చంపి తినే హక్కు మనకు ఎక్కడిది? అవి మూగజీవులు..చంపుతుంటే ఎదురుతిరగలేక భయంతో, నొప్పితో, నిస్సహాయంగా చూస్తూ మరణిస్తాయి. ఇలా జీవహింస చేసేవాళ్లు కూడా మనుషుల మధ్య వివక్ష, అసమానతలు అంటూ మాట్లాడుతుంటారు.


 సాటి జీవులను ఇబ్బందిపెట్టటం, పర్యావరణాన్ని పాడుచేసి  జీవులకు హాని కలిగించటం వంటివి కూడా వివక్ష, అసమానతలే. ప్రపంచంలో మనుషులకు మాత్రమే హక్కులు ఉంటాయా? పశుపక్ష్యాదులకు హక్కులు ఉండవా? ప్రపంచం అన్ని జీవులదీ. కానీ, మనుషులు బలవంతులు కాబట్టి, ఇతర జీవులపట్ల పెత్తనం చేస్తున్నారు.


 మనుషులు తమ అతికోరికలను తగ్గించుకుని, స్వార్ధం లేకుండా దయతో జీవిస్తే సమాజంలో వివక్ష, అసమానతలు చాలా తగ్గుతాయి.

 

7 comments:

  1. "పూర్వం అన్ని కులాల వాళ్ళూ బాగానే ఉండేవారు. క్రమంగా సమాజంలో ఈ అసమానతలు చోటుచేసుకున్నాయి అనిపిస్తుంది."

    ఎందుకు చోటు చేసుకున్నాయి?

    అన్ని కులాల వారూ అంతకు ముందు బాగానే ఉండేవారనే ముందు ఈ ప్రశ్నకు సమాధానం ఆలోచిస్తే బాగుంటుందేమో.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      క్రమంగా మనస్తత్వాలలో మార్పు రావటం, మనం అనే భావం తగ్గిపోయి నేను అనే భావం పెరిగిపోవటం, విపరీతంగా పెరిగిపోయిన పోటీతత్వం , సంపాదన, మరియు అధికార దాహం పెరిగిపోవటం ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయండి.

      కొంతకాలం క్రిందట ఉమ్మడికుటుంబాలు ఉండేవి. కుటుంబం కోసం అందరూ కష్టపడేవారు. తరువాత వేరువేరు కుటుంబాలు అయిపోయాయి.

      ఇప్పుడు భార్య ఒక దగ్గర ఉద్యోగం, భర్త ఒకదగ్గర ఉద్యోగం, పిల్లలు వేరు వేరు దగ్గర హాస్టల్ చదువులు .. ఇప్పుడు ఇలాంటి కుటుంబాలు చాలా కనిపిస్తున్నాయి.

      ఒకప్పుడు ఉమ్మడిగా ఉండే సమాజం క్రమంగా కాలం గడిచేకొద్దీ .......సమాజం కూడా ఇలాగే కుంచించుకు పోతోంది అనిపిస్తుంది.

      మనుషుల్లో తానే గొప్పగా ఉండాలనే స్వార్ధం పెరిగిపోవటం, నా హక్కులు అంటూ ఆలోచించటం, అధికార దాహం, కోరికలు పెరిగిపోవటం వల్లా ఇలా జరిగి ఉండవచ్చు.

      కొంత కాలం క్రిందట మంచి ఆహారం, ఇల్లు, దుస్తులు ఇలా ఉంటే చాలు అనుకునేవారు.

      కానీ ఇప్పుడు ... ఒకప్పటి విలాసవస్తువులు ఇప్పుడు కనీసావసరాలుగా మారిపోయాయి. .మార్కెట్ లోకి వెల్లువలా వచ్చి పడుతున్న వస్తువులను కొనటానికి ఎక్కడి డబ్బూ చాలటం లేదు.

      ఇలా సమాజంలో మార్పులు రావటానికి ఎన్నో కారణాలు.... ..

      Delete
    2. మీరు చెప్పిన మార్పులు పట్టణ ప్ర్రాంత మధ్య తరగతి వారి జీవితంలో జరిగినవి. ఆలోచించే కోణం అదే అయినప్పుడు సరిగ్గానే కనిపిస్తుంది.

      ప్రపంచమంతా అలాగే ఉందని అనుకోవడం సరి కాదేమో? ఉదాహరణకు ఉమ్మడి కుటుంబాలు ఉన్నా లేకపోయినా కాయకష్టం చేస్తూ బతికి వారికి ఒరిగేదేమీ లేదు.

      నా ప్రశ్నకు (ఎందుకు చోటు చేసుకున్నాయి?) సమాధానం మీరు చెప్పనే లేదు.

      Delete
    3. అసమానతలు ఎందుకు చోటు చేసుకున్నాయి ? అంటే..మీ అభిప్రాయం నాకు స్పష్టంగా అర్ధం కావటం లేదండి.

      క్రమంగా అందరిలో స్వార్ధం పెరగటం ,ఇలా ఎన్నో కారణాల వల్ల వల్ల అసమానతలు పెరిగిఉండవచ్చు.

      పెద్దలు కులాల మధ్య అసమానతలను కల్పించలేదండి. అంటరానితనాన్ని పాటించమని కూడా చెప్పలేదు. ఇది ప్రజల తప్పే.

      కొందరు స్వార్ధపరులైన వాళ్ళు , ఇంకా కొందరు తెలిసీతెలియని వాళ్ళ వల్ల ఇలా అసమానతలు పెరిగాయి.

      పెద్దలు కులాల మధ్య అసమానతలను కల్పించలేదండి. ఏ వృత్తిలో ఉండే కష్టాలు వారికున్నాయి.

      బ్రాహ్మణులకు ఎక్కువ భాగం పూజలు చేయటం , ఎన్నో నియమనిష్ఠలు , చెప్పారు. ( ఇవన్నీ పాటించటం చాలా కష్టం. ) వీరికి కుటుంబానికి సరిపడా సంపాదించుకోవటానికి కూడా సమయం చాలదు.

      అందుకే పూజలు, వ్రతాలు చేయించుకునేటప్పుడు బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వటాన్ని ఆచారంగా ఏర్పాటు చేసారు. కొందరు సంపన్నులు బోలెడు ఖర్చుపెట్టి పూజలు చేయించుకుని బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చే విషయంలో బేరాలాడతారు. అలా వచ్చిన కొద్ది చాలీచాలని డబ్బుతోనే జీవించే బ్రాహ్మణులెందరో ఉన్నారు.

      రాజుల విషయంలో అయితే ఎప్పుడు ఏ యుద్ధంలో మరణిస్తారో అనే ప్రమాదం పొంచి ఉంటుంది. . వారి కుటుంబానికి ఎప్పుడూ శత్రు భయమూ, విషప్రయోగ భయాలే.

      శూద్రులకు సంఘంలో బ్రాహ్మణులకు, క్షత్రియులకు ఉన్నంత హోదా లేకపోయినా జీవితంలో స్వేచ్చ ఉంది.

      శూద్రులకు బ్రాహ్మణులకు లాగా నియమనిష్ఠలు పాటించనవసరం లేదు. క్షత్రియులకు లాగా యుద్ధాలు, శత్రుభయం ఉండదు. ( కొద్దిమంది సైనికులకు తప్ప ) ఇలా అన్ని వృత్తులలోనూ కష్టాలు, సుఖాలు ఉన్నాయి.

      శూద్రులు కూడా సమాజంలో అందరికీ కావలసిన వస్తువులను తయారుచేసి అందిస్తూ వారూ ఆర్ధికంగా మంచిగానే జీవించి ఉంటారు. ఎందుకంటే వస్తువులను తయారుచేయటం విషయంలో వారికి ఇతర కులాల వారినుంచీ పోటీ ఉండదు కదా !

      ఇలా ఎవరి బాధ్యతను వారు నిర్వహిస్తూ అందరూ చక్కగా జీవించేవారు అనిపిస్తుంది.


      అయితే క్రమంగా యంత్రాలు రావటం వల్ల వస్తువుల తయారీ వేగంగ జరిగిపోవటం , కొందరు వ్యక్తులు పది రోజుల్లో తయారుచేసే వస్తువులను యంత్రం ఒక్క గంటలో తయారుచేయటం, ఇవి కూడా తరువాత కాలంలో కులవృత్తుల వారి ఆర్ధిక పరిస్థితి దిగజారటానికి, వారి నిరుద్యోగానికి కారణాలు. ..అనిపిస్తుంది.

      Delete
    4. విదేశీదాడుల వల్ల ఆర్ధిక వ్యవస్థ బగా అస్థవ్యస్థం అవటం అన్నది పెద్దకారణమే. ఇంకా, సంపద అందరికీ కాకుండా కొందరి వద్దే ప్రోగుపడటం ఇలా అసమానతలు పెరగటానికి ఎన్నో కారణాలున్నాయి.

      Delete
    5. I will respond in English with your permission.

      According to you, the caste system divided people into different occupation groups. Each group was considered equal i.e. all were considered equal. Over a period of time, inequalities set in.

      Q: Why did this happen?

      Your A: Certain people converted this "egalitarian" system to a stratified model by introducing hierarchy.

      Q. Who are these people?

      The most obvious answer is those who benefitted from the system.

      Q. Why did they introduce hierarchy when there are alleged "కష్టాలు" in their "occupation"?

      ఇలా ప్రశ్నలు అడుగుతూ పోవచ్చు, అంటూ ఉండదు. నిజమయిన సమాధానం ఒక్కటే: "కుల వ్యవస్తలో వివక్ష కాకతాళీయంగానో, కొందరి స్వార్థం వల్లనో రాలేదు. వివక్షలు, అసమానతలు చాతుర్వర్ణ వ్యవస్తలో అంతర్లీనంగా ఉన్న విడదీయలేని అంశాలు."

      Delete
    6. నాకు ఇంగ్లీష్ అంత బాగా రాదండి.

      వర్ణ వ్యవస్థ గురించిన వివరాలు తెలుసుకోవాలంటే దయచేసి మీరు అంతర్జాలంలో.....Varna Ashrama and Hindu Scriptures Compiled by Rakesh Bahadur 2003..
      అని వెళ్ళి ......చూడండి. ..... Varna Dharma.

      పైన ఇచ్చిన లింక్ లోని విషయాలు నాకు అంత అర్ధం కాకపోయినా మీకు కొన్ని వివరాలు తెలుస్తాయని ఆశిస్తున్నానండి...

      Delete