koodali

Monday, June 20, 2011

భార్యాభర్తల మధ్యన మూడో వ్యక్తి ప్రవేశించటం ............

 

*ఒక సవరణ .. భక్తుల కోరిక మేరకు అమరనాధ్ యాత్రకు మొదటివిడత కొంతమందిని పంపటం జరిగిందని న్యూస్ లో చూసి , అమరనాధ్ యాత్ర మొదలయిందని ఇంతకుముందు ఒక టపాలో వ్రాశానండి.

మళ్ళీ ఈ రోజు వార్తాపత్రికలో చదివాను.. అమరనాధ్ యాత్ర ఇంకా మొదలవలేదని. జరిగిన పొరపాటుకు దయచేసి క్షమించమని కోరుతున్నానండి..

................................................................

భార్యాభర్తల మధ్యన మూడో వ్యక్తి ప్రవేశించటం.... తద్వారా కూలిపోతున్న కాపురాల గురించి ఈ మధ్యన తరచుగా వింటున్నాము.


ఈ రోజుల్లో మారిన సమాజపు పోకడ వల్ల వ్యవస్థలోను , వ్యక్తులలోను ఎన్నో మార్పులు వచ్చాయి.

వ్యక్తుల మధ్య పరిచయాలకు ఎంతో అవకాశం ఏర్పడింది.

కొందరి విషయంలో ఆ పరిచయాలు పెడత్రోవ పడుతున్నాయి.

అంతే, అప్పటివరకు ఉన్నదాంట్లోనే సరిపెట్టుకుని ఒద్దికగా గడిపిన భార్యాభర్త వారి పిల్లలతో కూడిన కుటుంబం అనే ఆ బంధం విచ్చిన్నమయిపోతుంది.


పోయిన వారు పోగా మిగిలిన వారు ఒంటరి పక్షుల్లా మిగిలిపోతారు నిస్సహాయంగా.

అలా ఒంటరిగా మిగిలిపోయిన భార్య గానీ భర్త గానీ వారి పరిస్థితి అయోమయమే .. వారి పిల్లల పరిస్థితి అంతకన్నా అయోమయం.

అప్పుడు ఆ ఇంట్లో పిల్లల మానసిక పరిస్థితి ఎలాఉంటుంది ? ఉత్తమ పౌరులుగా తయారవవలసిన ఆ పిల్లల మనస్తత్వంలో ఒక తేడా తప్పకుండా ఉంటుంది.

అయినా ఇలా ఇతరుల కుటుంబములో చిచ్చుపెట్టడం న్యాయమా ?

మన దగ్గర కొన్ని ఉండకపోవచ్చు . అవి ఇతరుల దగ్గర ఉండవచ్చు. అంతమాత్రాన అవి మన సొంతమవాలని కోరుకోవటం ఏం న్యాయం ?

ప్రపంచంలో మనకు నచ్చినవన్నీ మన సొంతమవుతాయా ? చెప్పండి.

మనకు నచ్చాయని ప్రక్కింటి వారి కుక్క పిల్లనో, కుందేలు పిల్లనో మచ్చిక చేసి మన ఇంటికి తెచ్చేసుకుని మన సొంతం చేసుకుంటానంటే ఎవరూరుకుంటారు ?

మన పెరట్లోని మామిడి పండ్లకు ఆశపడి ఎవరో తెంపుకు వెళ్ళిపోతే .. వారిని ఏమంటారో అందరికీ తెలుసు.

అంతెందుకు, ఆకలితో ఉన్న ఒక పేదవ్యక్తి చేతిలో చిల్లిగవ్వ లేక ఆకలికి తాళలేక ఏ స్వీటు షాపు నుంచో ఒక స్వీటు ముక్క తీసుకున్నాడనుకోండి. ఎవరూ జాలి చూపరు. పైగా అలా చేయటం తప్పు అనే .అంటారు.


మన దగ్గర ఎక్కువ డబ్బు లేదు కదా అని ... ఎదుటివారి డబ్బు కావాలని ఆశ పడి ప్రయత్నిస్తే ఏమవుతుంది ? వారిని ఏమంటారు ?


మరి ఇతరుల వస్తువుల కొరకు ఆశపడితేనే తప్పుగా భావిస్తున్నారే... అలాంటిది, వ్యక్తుల విషయంలో ఇంకా ఎన్నో రూల్స్ ఉండాలి కదా !

ఉదా. ఒక జంట వివాహ సమయంలో
ఎన్నో ప్రమాణాలు చేస్తారు. కష్టసుఖాల్లో తోడుగా కడదాకా కలిసి ఉంటామని.... అలాంటి భార్యాభర్తల కాపురాన్ని కల్లోలపరచటం ఏం న్యాయం ?


వీలయితే భార్యాభర్తల మధ్య గొడవలుంటే వాటిని పరిష్కరించటానికి ప్రయత్నించాలి గానీ ..వాటిని ఆసరాగా తీసుకుని వారి కాపురాన్ని కూల్చటానికి ప్రయత్నించటం ఈ మూడో వ్యక్తులకు తగదు.



* ఇతరుల వస్తువులు లాక్కునేవారికి శిక్షలున్నాయి. కానీ ఇతరుల కాపురాన్ని..?

ప్రపంచంలో మనకు నచ్చినవన్నీ అధర్మంగా అయినే సరే పొందాలనుకోవటం అన్యాయం,.


*
ఒక జంట వివాహ సమయంలో ఎన్నో ప్రమాణాలు చేస్తారు. కష్టసుఖాల్లో తోడుగా కడదాకా కలిసి ఉంటామని .. భార్యాభర్తలు కూడా బయటి ఆకర్షణల విషయంలో తప్పుటడుగులు వేయకూడదు మరి.

 

2 comments:

  1. prashnalu shathaghnulu.alaa ndachukune varu samaadhaanam itharaluki cheppakapoyinaa..vaallaki vallu cheppukunte chaalu.

    ReplyDelete
  2. మీకు కృతజ్ఞతలండి.
    నిజమేనండి. సమాధానం వాళ్ళకు వాళ్ళు చెప్పుకుంటే చాలు.
    సెలెబ్రిటీల నుంచీ సామాన్యుల వరకూ చాలా మంది జీవితాల్లో ఇలాంటి అన్యాయాలు జరగటం మీడియాలో చూస్తూనే ఉన్నాము .. వీటివల్ల ఎన్నో కాపురాలు కూలిపోతున్నాయి..

    ReplyDelete