koodali

Wednesday, June 8, 2011

సినిమాలు తియ్యటం చాలా కష్టమే.

 
సినిమాలు, సీరియల్స్ ఇలాంటి వాటి ప్రభావం సమాజం పై ఎంతో ఉంటుందని మనస్తత్వ శాస్త్రవేత్తలు తో సహా ఒప్పుకుంటున్నారు.

పూర్వం సినిమాల్లో అశ్లీలత తక్కువగా ఉండేది. కుటుంబసమేతంగా చూడగలిగేటట్లు ఉండేవి.

ఈ మధ్యన వచ్చిన వాటిల్లో కూడా అసభ్యత లేకుండా సరదాగా సాగే సినిమాలు కొన్ని ఉన్నాయి. ఉదా. పెళ్ళిపుస్తకం, ఏప్రిల్ 1 విడుదల, మిస్సమ్మ ( నీలకంఠ గారిది. , ) లీడర్ ( ఇది సరదా సినిమా కాదు లెండి. )............ వీటికన్నా కూడా నాకు నచ్చిన సినిమాలు ఇంకా ఉన్నాయి. కొన్ని సినిమాల పేర్లు మాత్రమే రాసాను.


ఇక డ్యూయెట్లు పేరిట హీరో,హీరోయిన్స్ చెట్లమ్మట పుట్లమ్మట గెంతటం అన్నది నిజజీవితంలో అరుదుగా కనిపిస్తుంది.

సరే ఏదో కాసేపు సరదాకి చూద్దాములే అనుకుంటే ఇప్పుడు అవి అసభ్య నృత్యాల స్థాయికి దిగజారిపోయాయి.

పూర్వం భార్యాభర్తల సరదాలు పిల్లల కంటబడకుండా గుట్టుగా ఉండేవి.


ఇప్పుడు టి.విల పుణ్యమాని చిన్నపిల్లలు ఈ డ్యూయెట్ల పేరుతో వస్తున్న, ........... వాళ్ళ వయసుకు చూడకూడని ఇలాంటి దృశ్యాలనే బాహాటంగా చూస్తున్నారు...... ఇలాంటి దృశ్యాల ప్రభావం పెరిగే పిల్లలపై చాలా ఉంటుందన్నది అందరికి తెలిసిందే.


.గన్స్.... మొదలైన వాటితో ఆడే వీడియో గేంస్ వల్ల పిల్లలలో సున్నితత్వం తగ్గి క్రూరత్వం పెరుగుతుందని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు.

సినిమాలు తియ్యటం చాలా కష్టమే.

మనం తెరమీద కొద్దిసేపు చూసే దృశ్యం తీయటానికి బయట ఎంతో సమయం పడుతుంది. షూటింగ్ మధ్యలో అందరికీ టిఫిన్స్, భోజనాలు ఇలా అన్నీ అమర్చటం అబ్బో, ఆ అట్టహాసం......... అవన్నీ ఎంతో ఖర్చుతో కూడిన విషయాలు.

అంత కష్ట పడి కొందరు సినిమాలు తీస్తే ఆ సినిమాలను కొందరు చాటుగా చూసేస్తే (
పైరసీ ద్వారా ) చెప్పలేనంత బాధగా ఉంటుంది. అలా చూడటం ధర్మం కూడా కాదు.


ఈ మధ్య కొన్ని సినిమాల్లో అసభ్యత ఎక్కువగా చూపిస్తున్నారు. దానికి వారేమంటారంటే., సినిమా ఆడాలంటే యువతను కూడా దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీయాలి,.............పాతకాలంలోలాగ నిండా బట్టలు వేస్తే యువత సినిమా చూడరు అంటున్నారు.......... యువత అందరూ ఇలా ఆలోచిస్తారని నేను అనుకోను............ఈ యువతలో మీ పిల్లలూ, మీ బంధువుల పిల్లలూ కూడా ఉంటారు మరి.


ఈ మధ్య కొన్ని సినిమాల్లో హీరోను నీతి నియమాలు లేకుండా , జులాయిగా తిరిగే వెధవ గానూ , హీరోయిన్ను అర్ధనగ్నంగా తిరిగేదానిగానూ చూపించేస్తున్నారు.. ఆ సినిమాలు పదేపదే వెర్రిగా చూసే యువత అందులో హీరో, హీరోయిన్స్ లాగే తయారవుతారు.


అలా తయారయిన వాళ్ళు సినిమాను దొరల్లాగ ఎందుకు చూస్తారు ? దొంగల్లాగే చూస్తారు. అయ్యో ! సినిమాను నిర్మాత ఎంత కష్టపడి తీశారో అనే సున్నితత్వం వాళ్ళకి ఎలా ఉంటుంది ?


ఇప్పుడు ఎవరెంత లబలబలాడినా ఇలాంటి ప్రేక్షకులని మార్చటం కష్టమే. సమాజాన్ని చెడ్డగా మార్చటానికి ఎక్కువ సమయం పట్టదు..... కానీ ........ దారి తప్పిన సమాజాన్ని మంచిగా మార్చటానికి చాలా సమయం పడుతుంది.


టి.వి చానల్స్ వాళ్ళు కూడా చాలా మంచి కార్యక్రమాలు చూపిస్తారు . కానీ అర్ధరాత్రి అయితే అసభ్య దృశ్యాలతో కూడిన పాటలు , ప్రసారం చేస్తారు.

ఇలాంటి వాటి వల్ల చాలా మందికి ఇబ్బందులు ఉన్నాయి.


పిల్లలు కొందరు అర్ధరాత్రి దాటేవరకూ చదువుకుంటారు. చదువుకుంటూ మధ్యలో కాసేపు రిలాక్సేషన్ కోసం టి.వి పెట్టారంటే ఇక అప్పటివరకూ చదివిందంతా అంతే సంగతులు.

ఈ రోజుల్లో రకరకాల కారణాల వల్ల 30 ఏళ్ళ వరకు వివాహం కానివారూ, వివాహం అయినా ఉద్యోగం వల్ల వేరువేరు ఊళ్ళలో ఉంటున్న భార్యాభర్తలూ, , ఎక్కువగా కనిపిస్తున్నారు. ..... ఇక విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎంతగా పెరిగిందో చెప్పక్కర్క్లేదు.


ఈ మధ్య వార్తల్లో చూస్తున్నాము, కొందరు పసిపిల్లలు ,అమాయకులైన ఆడపిల్లలు ... బంధువులు, పరిచయస్తులైన వారి వల్ల కూడా అత్యాచారాలకు గురయ్యే సంఘటనలు జరుగుతున్నాయని .

ఈ మధ్య వేద పాఠశాలలో జరిగిన సంఘటనలు ( బయట హాస్టల్స్ లో కూడా కొన్ని చోట్ల ఇలా జరిగి వెలుగులోకి రాకుండా ఉండే అవకాశం ఉంది. ) ఇవన్నీ సమాజంలో పతనమవుతున్న నైతికవిలువలకు సంకేతాలు.


చిన్నపిల్లలు, మూలనున్న ముసలమ్మలు కూడా అత్యాచారాలకు గురవుతున్నారంటే ....ఏం చెప్పాలి ?



*పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల కూడా ( సెల్ ఫోన్స్ వగైరా..... ) అసభ్యకరమైన ఉద్రేకపూరితమైన ప్రసారాలు అందుబాటులోకి రావటం కూడా నైతికవిలువల పతనానికి ఒక కారణం... . వీటి ప్రభావం సమాజం పైన ఎంతో ఉంటుంది.


* మీడియా ప్రభావం సమాజంపైన ఎంతో ఉందన్నది
అందరికి తెలిసిందే. .... ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో వీళ్ళందరూ సమాజాన్ని ప్రభావితం చేయగలిగే ఉత్తమ స్థానంలో ఉన్నారు.


మీలో ఎందరో ఉన్నత ఆదర్శాలు కలవారున్నారు. సమాజాన్ని మంచి దారిలో పెట్టాలనే తపన కల ఉత్తములున్నారు. దయచేసి మీరందరూ దారి తప్పుతున్న సమాజాన్ని మంచిదారిలోకి తీసుకురావటానికి ప్రయత్నం చేసి పుణ్యం కట్టుకోండి.


*ఒకప్పుడు ధర్మాన్ని నిలబెట్టటానికి రాజ్యాన్ని తృణప్రాయంగా భావించిన సత్య హరిశ్చంద్రుడు , శ్రీరామచంద్రుడు, వంటి మహనీయుల గురించి విన్నాము.


ఈ మధ్యకాలంలో కూడా దేశ స్వాతంత్ర్యం కోసం ఆస్తులను పోగొట్టుకుని జైళ్ళ పాలయిన వారి గురించి విన్నాము.

ఇప్పుడు డబ్బు కోసం సమాజం తప్పుదారి పట్టినా ఫరవాలేదు, దేశసంస్కృతి ఏమైపోయినా ఫరవాలేదు అని భావించే వారి గురించి వింటున్నాము.

అసభ్యంగా చిత్రాలు తీసి యువతను ఆకర్షించి ఆ యువత దారి తప్పితే వారిని కన్న తల్లిదండ్రుల శాపాలు వీరికి తగిలే అవకాశం కూడా ఉంది.


* అధర్మంగా డబ్బు సంపాదించేవారు ఎవరైనా, ఏ వృత్తిలో ఉన్నా, ఆ పాపపు సొమ్ము వల్ల వారు ఎప్పటికయినా ( వచ్చే జన్మలో అయినా సరే ) అష్టకష్టాలు అనుభవించవలసి వస్తుందన్నది పెద్దల మాట... ధర్మబద్దంగా సంపాదించినది కొద్ది సొమ్ము అయినా దైవకృపకు దగ్గర చేస్తుంది.అన్నది కూడా
పెద్దల మాట..


*
పెద్దవాళ్ళు తమ పిల్లలకు ఏం చెప్పాలంటే ,   'సినిమాలు, సీరియల్స్ వేరు....జీవితం వేరు " అని పిల్లలకు వివరించి అవగాహన కలిగించాలి.

అందులో చూపించే చెడును ఆదర్శంగా తీసుకోకుండా వదిలెయ్యాలని పిల్లలకు అవగాహన కలిగించాలి. అలా పిల్లలకు మంచి చెడు చెప్పి , ఎటువంటి పరిస్థితుల్లో అయినా ధర్మంగా జీవించగలిగేలా వారిని పెంచాలి. పెద్దవాళ్ళు తాము కూడా మంచి నడవడికను కలిగి ఉండాలి.



No comments:

Post a Comment