koodali

Wednesday, June 1, 2011

డబ్బు బాగా ఉన్నవాళ్ళలో కూడా పేదలు ఉంటారు............ (రెండవ భాగం.).....

 

ఈ రోజుల్లో చాలా మంది తమకు డబ్బు సరి పోవటం లేదు అంటున్నారు.

పేదవాళ్ళు అలా అన్నారంటే అర్ధముంది. కొంచెం డబ్బు బాగా ఉన్నవాళ్ళు కూడా అలాగే అంటున్నారు.

ఇదంతా చూస్తే ఏమనిపిస్తుందంటే. ........... ప్రజలకు కోరికల చిట్టా పెరిగిపోవటం వల్ల వచ్చిన సమస్య ఇదంతా అనిపిస్తుంది.

పూర్వం వాళ్ళకు ఇన్ని కోరికలు, ఉండేవి కావు. పుష్టికరమైన ఆహారం తినేవారు. అవసరమైన కొద్దిపాటి సామానుతో పొదుపుగా జీవించేవారు.

దీనివల్ల పర్యావరణానికి కూడా హాని కలిగేది కాదు...... ఎక్కడ చూసినా వాడిపారేసిన వస్తువులతో నిండిన చెత్త కుప్పలు ఉండేవి కాదు.

ఇప్పుడేమో కార్లు కావాలి..........ఇంట్లో అన్ని రకాల వస్తువులు ఉండాలి............లేటెస్ట్ నగా,నట్రా ఉండాలి. ........ విదేశీ యాత్రలు ,........ విమానం టిక్కెట్లు .......ఇలా....... ఇవన్నీ కనీస సౌకర్యాలు అన్నట్లు ప్రజలు భావిస్తున్నారు.


పిల్లల స్కూల్, కాలేజీ ఫీజులు వేలు, లక్షల్లో ఉంటాయి. ...... అలాంటి స్కూల్లో చదివితేనే పిల్లలు అభివృద్దిలోకి వస్తారని ఇప్పటి వాళ్ళ అభిప్రాయం.


అభివృద్ది అంటే  లక్షల్లో  సంవత్సరాదాయం వచ్చే ఉద్యోగాలు పొందటం........... నలుగురిలో సోషల్ స్టేటస్ వగైరా....

 ( ఇదేనా అభివృద్ది అంటే ? ఇవి ఉంటే జీవితంలో ఆనందం తప్పనిసరిగా ఉంటుందా ?

ఇవన్నీ ఉన్న కుటుంబాల్లో కూడా ..... ఎన్నో సమస్యలు ఉంటున్నాయిగా మరి.. ఆ సమస్యలు భరించలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు కొందరు. )


పిల్లల అభివృద్ది కోసమంటూ తల్లి ఒక దగ్గరా........తండ్రి ఒక దగ్గరా ఉండి ఉద్యోగాలు చేస్తారు ... అలా సంపాదిస్తూ బోలెడు డొనేషన్స్ కట్టి పిల్లలను స్కూల్లో వేస్తారు పెద్దవాళ్ళు.

ఇహ పిల్లలు పొద్దున లేచి రాత్రి పడుకొనేవరకూ స్కూలూ , వరుస ట్యూషన్లూ ............ఇక వాళ్ళు పెద్దవారయి ఉద్యోగంలో చేరాక తమ చదువు కోసం కట్టిన డొనేషన్స్ కు తగ్గట్టు తిరిగి డబ్బు సంపాదించాలి కదా !

ఇంకా .. తమకు పుట్టిన పిల్లల అభివృద్ది కోసం కూడా డబ్బు సంపాదించాలి కదా !


ఇక వీళ్ళు మళ్ళీ పొద్దస్తమానం కష్టపడటం మొదలు పెడతారు. .  ఈ క్రమంలో ముసలితనం వచ్చేస్తుంది. ...... కాలం ఎవరి కోసం ఆగదు కదా ! ఇక వ్యాధులు మొదలవుతాయి.... అప్పుడు అలసటతో వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితమంతా శూన్యంగా కనిపిస్తుంది.


మనిషికి డబ్బు అవసరమే. కానీ డబ్బుతో కొనలేనివి ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి.

ఒక స్థాయికి మించి డబ్బు సంపాదించటం వల్ల మన వాళ్ళు అనుకున్న వాళ్ళ వల్లే ప్రమాదం రావచ్చు.

డబ్బు కోసం సొంతవాళ్ళే తమ వారికి హాని కలిగిస్తున్నారు.

అందుకని సంపాదన కోసం అతి వెంపర్లాట తగ్గించుకోవటం అందరికి శ్రేయస్కరం.

* ఇంతకు ముందు టపాలో చెప్పినట్లు డబ్బు ఉన్నవాళ్ళకు కూడా కష్టాలూ ,నష్టాలూ,  రోగాలూ, రొష్టులూ ఉంటాయి.

డబ్బు ఎంత ఉన్నా కొందరి ఇళ్ళలో కుటుంబసభ్యులు ఆప్యాయతలు లేకుండా ఎవరికి వారు బ్రతుకుతుంటారు.


కొందరు పేదవారి ఇళ్ళలో డబ్బు అంతగా లేకపోయినా ................ కుటుంబ సభ్యులు ,బంధువులు ఆప్యాయంగా కలసిమెలిసి ఉంటారు. .......... ఈ మధ్యన వాళ్ళూ తిట్టుకోవటం మొదలుపెట్టారు లెండి.

* అందుకే సంతోషంగా ఉండాలంటే డబ్బు కన్నా .......... మనసు యొక్క తీరు ముఖ్యపాత్ర వహిస్తుంది.

అందుకని ధనవంతులు ప్రపంచంలో సంపదంతా పోగేయాలనే దురాశ వదిలిపెట్టినప్పుడే ......... వారికీ , చుట్టుప్రక్కలవారికీ సుఖం.

పేదవారు కూడా తాము డబ్బు లేని దురదృష్టవంతులం అని నిరాశపడకుండా కష్టపడితే............ జీవితంలో అభివృద్ది సాధిస్తారు.

అలాంటప్పుడే సమసమాజం ఏర్పడుతుంది..



2 comments:

  1. మీ బ్లాగు క్రమం తప్పకుండా చదువుతున్నాను. మీ భావాలు నాకు నచ్చాయి.

    ReplyDelete
  2. కృతజ్ఞతలండి.
    మేము ఊరు వెళ్ళి ఈ రోజు ఉదయమే వచ్చామండి. మీ కామెంట్ ఇప్పుడే చదవటం జరిగింది. ఆలస్యంగా జవాబు ఇస్తున్నందుకు దయచేసి క్షమించండి..

    ReplyDelete