koodali

Friday, June 17, 2011

అవీ............ఇవీ కొన్ని విషయాలు.

 

ఈ సంవత్సరపు అద్భుతమైన అమరనాధ్ యాత్ర ప్రారంభమయింది....

స్వామి నిగమానంద గారు గంగానది కాలుష్యాన్ని తగ్గించాలన్న విషయం గురించి దీక్ష చేస్తూ అమరులయ్యారు... సాటి మనుషులు వారి త్యాగాన్ని గుర్తించినా గుర్తించకపోయినా ఆ దైవం దగ్గర ఇలాంటి త్యాగమూర్తులకు చక్కటి స్థానం ఉంటుంది. .......................................................................

చర్యకు ప్రతి చర్య ఉన్నట్లే ఎవరైనా పాపాలు చేస్తే కష్టాలు ... పుణ్యాలు చేస్తే సుఖాలు అనుభవిస్తారని పెద్దలు చెబుతారు.


తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుతుంది కదా ! అలాగే మనం తెలిసి చేసినా తెలియక చేసినా ఈతరుల పట్ల చెడ్డగా ప్రవర్తిస్తే వారు బాధలు పడతారు. దానికి ప్రతిచర్యగా మనకు కష్టాలు వస్తాయి.

నేను ప్రాణిక్ హీలింగ్ కొంతకాలం నేర్చుకున్నానండి. అప్పుడు వారు ఏం చెప్పారంటే... మనం ఎవరికయినా చెడు చేస్తే అది గోడకు కొట్టిన బంతిలాగ తిరిగి మనకే తగులుతుందట.


అలాగే మనము ఎవరికయినా మంచి చేస్తే గోడకు కొట్టిన బంతిలాగ తిరిగి మనకు మంచి జరుగుతుందట.

అందుకే మనం సంతోషంగా ఉండాలంటే మనం ఇతరులను కష్ట పెట్టకూడదు అన్నమాట.

ఈ రోజుల్లో చాలామంది ఒక చేత్తో పూజలు ఒక చేత్తో పాపాలు చేస్తున్నారు,. మళ్ళీ అలా పాపాలు చెయ్యటం వల్ల కష్టాలు వచ్చాయనుకోండి. ఎన్ని పూజలు చేసినా దేవుడు కష్టాల నుంచి తప్పించటం లేదు . అంటూ తిరిగి దేవున్నే నిష్టూరంగా మాట్లాడుతారు.


మనం పాపాలు చేసి ,.కష్టాలు వస్తే . దేవుణ్ణి అనటం తప్పు కదా !

పాపాలు చేసినా శిక్షలు ఉండకూడదు అనుకుంటారు కొందరు. అలా ఎలా కుదురుతుంది ?

ఉదాహరణకు ఒక వ్యక్తి నేరం చేశాడనుకుందాము. తీర్పు చెప్పే జడ్జి అతని తాతగారే అయినా సరే,అతనికి శిక్ష వేయకుండా తప్పదు కదా !

ఒక విద్యార్ధి పరీక్షల్లో కాపీలు చేస్తున్నాడనుకుందాము.ఆ కాలేజీ ప్రిన్సిపల్ అతని తండ్రి గారే అయినా సరే,ఆ విద్యార్ధిని డిబార్ చెయ్యవలసిందే కదా!

కన్నబిడ్డలే అయినా సరే , తప్పులు చేసినప్పుడు తల్లిదండ్రులు ఆ పిల్లలను దండిస్తారు కదా !

అలాగే వ్యక్తులు పాపాలు చేసినప్పుడు భగవంతుడు వారిని శిక్షించవలసిన పరిస్థితులు ఏర్పడుతాయి. ( భగవంతుడు ఎంత దయామయుడయినా కూడా ).

భగవంతుడు ఇలా ఎందుకు శిక్షించటం జరుగుతుందంటే వారు మరింతగా పాపాలు చెయ్యకుండా ఉండటానికి, ఇంకా వారిని చూసి ఇతరులు బుద్దిగా నడుచుకుంటారని.

ఇంకా, మనుషులు ఎక్కువగా ఎలా ఆలోచిస్తారంటే....ఎన్ని తప్పులు చేసినా తనకు మాత్రం శిక్ష పడకూడదని..ఇతరులు తప్పు చేస్తే మాత్రం వారికి తప్పకుండా శిక్ష పడాలనీ అనుకుంటారు..తనకొక నీతి ఎదుటివారికి ఒక నీతి అన్నమాట.

ఉదా..ఒక వ్యక్తి కొన్ని నేరాలు చేశాడనుకుందాము. మనం ఏమని అంటామంటే , అటువంటి క్రూరులను కఠినంగా శిక్షించాలి అనే కదా అంటాము. పాపం ! ఏదో తెలిసో తెలియకో పేదరికం వల్ల గానీ, కొందరి చెప్పుడు మాటలు విని గానీ అలా తప్పులు చేశాడులే ! చిన్న శిక్ష విధిస్తే చాలులే పాపం ! అని ఏ మాత్రం జాలిని చూపించము కదా !


ఇంకా ఏమంటామంటే , అతనికి శిక్ష తగ్గిస్తే అందరికీ భయం పోతుంది. అని కూడా సమర్ధించుకుంటాము. అది కూడా నిజమే !

తప్పు చేసిన వాళ్ళకు శిక్షలు లేకపోతే ప్రజలకు భయమన్నది లేక తప్పులు చేస్తూనే ఉంటారు. అందుకే భగవంతుడు పాపాత్ములను శిక్షించటం జరుగుతుంది.

అయితే మన విషయానికి వచ్చేసరికి మాత్రం ఏదో ! తెలిసీతెలియక తప్పులు చేసేశాం . ఈసారికి క్షమించేయి దేవుడా ! అని బ్రతిమలాడుకుంటాము.

ఎదుటివారికయితే శిక్షలు పడాలనుకుంటాము. మనకు మాత్రము ఎటువంటి శిక్షలు పడకూడదు అనుకుంటాము. మానవ నైజం ఎక్కువగా ఇలాగే ఉంటుంది.

అందుకే ఈ శిక్షలు, కష్టాలు ఉండకూడదు అనుకుంటే మాత్రం పాపాలు చేయటం పూర్తిగా ఆపి .. సత్కర్మలు చేస్తూ ,పెద్దలు చెప్పిన విధంగా ధర్మబద్దంగా జీవించాలి..

కొందరు నైతికవిలువలను పెద్దగా పాటించకపోయినా, భక్తి అంతగా లేకున్నా, నలుగురిలో ఆడంబరంగా కనిపించటానికి పూజలు చేస్తుంటారు.

అయితే అలా పూజలు చేయగాచేయగా, క్రమేణా వారి ప్రవర్తన మంచిగా మారుతుంది. ( కొందరి విషయంలో అలా మారటానికి వారికి ఇంకో జన్మ ఎత్తే సమయం కూడా పట్టవచ్చు . ఇదంతా వారివారి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. )

మంచిపనులు ఇష్టపడి చేసినా, కష్టపడి చేసినా ఎప్పటికయినా మంచి ఫలితాన్నే ఇస్తాయి కదా !

 

 

No comments:

Post a Comment