koodali

Wednesday, January 18, 2017

కొన్ని విషయాలు...


ఈ రోజుల్లో మన దేశంలో చాలామంది.. కొన్ని విషయాలలో విదేశాల వారిని అనుకరించటానికి బాగా ప్రయత్నిస్తున్నారు.


 ఇతరులలో ఉన్న మంచిని  మనం గ్రహించాలి.

 చాలామంది మంచి ఆలోచనలు, మంచి అలవాట్లు ఉన్నవారు ఉంటారు.

****************

 రసాయనిక పురుగుమందులను విదేశీయులే కనుగొన్నారు.

అయినా,  వాటివల్ల కలిగే నష్టాలను గుర్తించి .....  రసాయన పురుగుమందులను వాడని ఆహారాన్ని తీసుకోవటానికి వాళ్ళు  ప్రాముఖ్యత ఇస్తున్నారు.


భారతదేశం నుంచి ఎగుమతి అయిన కొన్ని పంటల ఉత్పత్తులను పురుగుమందుల అవశేషాలు ఉన్నాయనే కారణంతో విదేశాల వాళ్ళు తిరస్కరించటం కూడా జరిగింది.


అయినా మనలో చాలామంది రసాయన పురుగుమందులను విచ్చలవిడిగా వాడుతూనే ఉన్నారు.



 భారతీయులు  తిరిగి మన సేంద్రియవ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉంది.

ఉదా.సుభాష్ పాలేకర్ గారు తెలియచేస్తున్న సేంద్రియ వ్యవసాయం చేయాలి.


***********

ఇంకో విషయం ఏమిటంటే,  ఎందరో విదేశాల వాళ్ళు  తమ విద్యుత్ అవసరాల కోసం  సోలార్ విద్యుత్ వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

అపారంగా సూర్యరశ్మి లభించే మనదేశం వాళ్ళేమో సోలార్ విద్యుత్ కు ప్రాధాన్యత ఇస్తూనే, ఇంకా ధర్మల్ విద్యుత్ కేంద్రాలు నిర్మించటం కోసం తాపత్రయపడుతున్నారు.


***********

ఎంతో గొప్ప విలువలు, విజ్ఞానం వారసత్వంగా కలిగినది భారతదేశం.

అయితే, మన దేశంలోనే  కొందరు .. భారతీయ విధానాలను తక్కువచేసి మాట్లాడుతుంటే ఎందరో విదేశాల వాళ్ళు యోగా, ధ్యానం, భారతీయ ఆయుర్వేద పద్ధతులు.. మొదలైన విషయాల గురించి ఆసక్తి చూపటం  ఆశ్చర్యకరమైన విషయం.



No comments:

Post a Comment