koodali

Tuesday, January 24, 2017

ఇలాంటి నీరు వాడితే...


 
ఈ రోజుల్లో చాలా ప్రాంతాలలో నీరు ఆరోగ్యానికి హానిచేసే విధంగా ఉంటోంది.

కొన్ని సంవత్సరాల క్రితం వరకూ కూడా పల్లెటూళ్ళలో చెరువు వద్ద నూతిలోనుండి నీటిని తెచ్చుకుని వాడుకునేవారు.


ఈ రోజుల్లో శుభ్రమైన త్రాగు నీరు లభించక నీటిని శుద్ధిచేసే యంత్రాన్ని ఇంట్లో అమర్చుకుంటున్నారు.
కొందరు మంచినీటి కాన్లు కొనుక్కుని శుద్ధిచేసిన నీటిని వంటకు, త్రాగటానికి వాడుతునారు.

అయితే, బోరు నీళ్ళు మరియు ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో శుద్ధిచేయని కఠిన జలాన్ని శరీరాన్ని శుభ్త్రం చేసుకోవటానికి వాడేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.


 ఉదా..గాఢమైన నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకునేటప్పుడు ఆ నీరు కంట్లో పడకుండా జాగ్రత్తగా ఉండాలి.
 బోరు నీరు మరియు   ఫ్లోరైడ్ నీటితో కళ్ళు శుభ్రం చేసుకోకూడదు.


కొన్నిసార్లు శుద్ధిచేసిన నీటిలో కూడా శరీరానికి హానిచేసే పదార్ధాలు మిగిలే ఉంటున్నాయేమో? అనే సందేహమొస్తోంది.


మీ  ఇంట్లో నీటిని పరిశీలించండి . .. 

 త్రాగునీటిని ఒక గ్లాసులో పోసి రెండురోజులు అట్టేపెట్టేస్తే గ్లాసు అడుగు భాగంలో వేలితో టచ్ చేస్తే బరకలా (స్కేలింగ్)ఏర్పడటం గమనించవచ్చు.
 
ఇలాంటి నీరు త్రాగితే కిడ్నీలు పాడయ్యే ప్రమాదముంది.
ఇలాంటి నీటితో కళ్లు కడుక్కుంటే కళ్ళు పాడయ్యే అవకాశముంది.

 కడిగిన గిన్నెలు  బోర్లించకుండా కొన్నిరోజులు ఉంచితే  గిన్నె లో తెల్లటి మరకలు ఉండటం కూడా జరుగుతుంది.


ఇలాంటి నీళ్ళు నింపే బకెట్లకు పైన తెల్లటి పొర ఏర్పడి రంగు మారిపోతుంటాయి.


 టాయ్లెట్స్ కూడా యాసిడ్ వేసి శుభ్రం చేయవలసి ఉంటుంది. మరి, ఇలాంటి నీళ్ళు వాడితే ఆరోగ్యం ఏమవుతుంది?


ఇంతకుముందు కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఇలాంటి పరిస్థితి ఉండేది.
ఇప్పుడు నదుల ప్రక్కన ఉండే జిల్లాలలో కూడా నీటి తీరులో మార్పులు వస్తున్నాయి.

ఎన్నో కారణాల వల్ల భూగర్భంలో మంచినీరు ఉప్పగా మారటం, మంచినీటి స్థానంలో సముద్రపు నీరు చొచ్చుకు రావటం జరుగుతోందంటున్నారు.


భూమిలో , నీటిలో కలుస్తున్న కాలుష్యాలు, బోర్లు విపరీతంగా త్రవ్వి భూగర్భజలాన్ని బాగా వాడేయటం.. వంటి చర్యల వల్ల భూగర్భ జలం త్రాగటానికి పనికిరాని విధంగా మారుతోంది.
ఇందువల్ల, అందరూ పర్యావరణం పాడుకాకుండా కాపాడుకోవాలి.



No comments:

Post a Comment