koodali

Wednesday, January 25, 2017

అనేక అవసరాల కోసం భూమిని ...


ఈ రోజుల్లో అనేక అవసరాల కోసం భూమిని బాగా తవ్వుతున్నారు. ఖనిజాల కోసం, నీటి కోసం, సహజవాయువు, పెట్రోల్ కోసం..ఇలా భూమిని విపరీతంగా తవ్వుతున్నారు.


భూమిని అదేపనిగా  తవ్వి సహజవనరులను తీయటం వల్ల  ..

.  భూమిలోపల బాగా ఖాళీ ప్రదేశం ఏర్పడి ..  సర్దుబాటు జరిగే ప్రక్రియలో  భూకంపాలు రావటం, మంచినీటి స్థానంలో సముద్రపు నీరు చొచ్చుకురావటం..వంటి ప్రమాదాలు ఉన్నాయంటున్నారు.


ఇప్పటికే చాలాచోట్ల మంచినీటి స్థానంలో ఉప్పు నీరు వచ్చేసింది. నీరు బాగా కలుషితమయ్యింది.


నదులను దేవతలుగా పూజించే ఈ పుణ్యభూమిలో నదులు ఎంతో కలుషితమైనా అంతగా పట్టించుకోవటం  లేదు.


ఊళ్ళోని కాలుష్యాలను తీసుకెళ్లి నదులలో కలుపుతున్నారు చాలామంది.


ఈ రోజుల్లో జబ్బులు మరింత ఎక్కువవుతున్నాయి. అందుకు ప్రధానకారణాలలో ఒకటి మనం పర్యావరణాన్ని కలుహితం చేయటం.


ఖనిజాలు ఏర్పడాలంటే ఎన్నో వేల సంవత్సరాలు పడుతుంది.

పొదుపుగా వాడుకోవలసిన భూమిలోని సంపదను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నాం.


ముందుతరాల గురించి ఆలోచనే లేకుండా, మన అంతులేని కోరికల కోసం పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాం.


సృష్టిలోని సంపదను మనం సృష్టించామా? లేదు కదా!

మరి తమ ఇష్టారాజ్యంగా అన్నింటినీ నాశనం చేసే హక్కు మానవులకు ఎక్కడిది?


  పర్యావరణాన్ని నాశనం  చేయటమంటే మనిషి  చేజేతులా తన నాశనాన్ని తాను ఆహ్వానించినట్లే.


అంతులేని కోరికలను అదుపులో పెట్టుకోవాలి.సృష్టిలోని సహజవనరులను పొదుపుగా వాడుకోవాలి. అప్పుడే ప్రకృతి మనల్ని కాపాడుతుంది.

No comments:

Post a Comment