koodali

Friday, February 3, 2012

పెద్దలు చెప్పినది...మనము చేస్తున్నది.



రమణగారు వ్రాసిన టపాలో కులాల గురించిన టాపిక్ చదివిన తరువాత , నాకు కూడా కులవ్యవస్థ గురించి నాకు తోచింది చెప్పాలనిపించింది.
అంతేకానీ నేను రమణగారి టపా గురించి ఏమీ తప్పుగా కామెంట్ చెయ్యలేదు .

రమణ గారు కూడా నన్ను ఏమీ తప్పుగా అనలేదు..
నేను ఎలాంటి వ్యక్తిని అన్నది దైవానికి తెలుసు. నేను సమాజంలో అందరూ సంతోషంగా ఉండాలని ఇలా వ్రాస్తున్నాను.

నేను చేసిన తప్పేమిటి ? సమాజానికి అన్ని వృత్తుల వాళ్ళూ అవసరమే కాబట్టి, పూర్వులు అలా బాధ్యతలను అప్పగించి ఉంటారు అనిపించి అలా వ్రాశాను.

కులవ్యవస్థ ఏర్పడిన కొత్తలో అన్ని కులాల వాళ్ళూ బాగానే ఉండేవారు అనుకోవచ్చు. క్రమంగా సమాజంలో ఈ అసమానతలు చోటుచేసుకున్నాయి అనిపిస్తుంది.

అంటరానితనం పాటించమని పెద్దలెవరూ చెప్పలేదు.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు  అందరూ సమానమేనని చెప్పటం జరిగింది.


ఒక యోగి ఆత్మకధలో.. లాహిరీ మహాశయుల వారికి అన్ని కులాల నుంచి శిష్యులు ఉండేవారని చెప్పటం జరిగింది.
రామకృష్ణపరమహంస అంటరానితనాన్ని పాటించలేదు. రామకృష్ణమఠంలో అన్ని కులాలు, మతాల వాళ్ళకి ప్రవేశం ఉంది.

ఆది శంకరాచార్యుల జీవితంలోని ఒక సంఘటన ద్వారా .... అంటరానితనం తప్పు అని తెలుస్తోంది.


శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ జీవిత చరిత్రము గ్రంధములో కూడా ఇలాంటి విషయాలు చెప్పబడ్డాయి.
ఇంతమంది పెద్దలు అంటరానితనం తప్పు అని చెబుతున్నారు కదా !

శ్రీరాముడు శబరి అందించిన ఫలాలను తినలేదా ! శ్రీకృష్ణుడు నంద గోకులంలో పెరిగారు కదా ! ఇవన్నీ గమనిస్తే అందరూ సమానమేనని పెద్దలు చెప్పినట్లు తెలుస్తోంది కదా !


బ్రాహ్మణులకు మాత్రం కొన్ని నియమాలు చెప్పారు. వాళ్ళు దైవపూజలు చేస్తారు కాబట్టి నిష్ఠ అవసరం కాబట్టి.
అంతేకానీ అంటరానితనాన్ని పాటించమని చెప్పలేదు.

ఒక శూద్రుణ్ణి తాకిన గాలే అందరినీ తాకుతుంది.

వర్షం వస్తే శూద్రుల ఇంటి చుట్టు ప్రక్కల నీళ్ళు కూడా చెరువుల్లో, నదుల్లో కలుస్తాయి. ఆ నీళ్ళు అందరూ వాడుకుంటారు.

కులం అన్నది పుట్టుకతోనూ వస్తుంది,. ఇంకా వ్యక్తి యొక్క వృత్తి, ప్రవృత్తిని బట్టి కూడా ఉండే అవకాశం ఉందని గ్రంధాలను నిశితంగా పరిశీలిస్తే తెలుస్తుంది.


శివకేశవులకు మధ్యన భేదాన్ని చూపించేవారు నరకానికి పోతారని పెద్దలు గ్రంధాలలో చెప్పటం జరిగింది.
 
కానీ, పెద్దలు చెప్పినది వినకుండా .... శివుడే గొప్ప అని కొందరు ... విష్ణువే గొప్ప అని కొందరు వాదులాడుకుంటున్నారు.

కులాల పేరుతో ప్రజలను కొట్లాడుకొమ్మని పెద్దలు చెప్పలేదు. అలా వాదులాడుకోవటం ప్రజల తప్పు.

*

No comments:

Post a Comment