koodali

Monday, February 13, 2012

తోటి బ్లాగు సోదరసోదరీమణులకు ....



తోటి బ్లాగు సోదరసోదరీమణులకు కృతజ్ఞతలండి. ఎందుకంటే ..... ఏమో అలా వ్రాయాలనిపించింది అంతే.



భార్యా.....భర్త , తల్లిదండ్రులు...పిల్లలు, అత్తా......కోడళ్ళు, టీచర్లు.... పిల్లలు, అధికారులు...ఉద్యోగులు ........ ఇలా అందరు తమ జీవితాల్లోని కష్టసుఖాలను చెప్పుకోవటం వల్ల ఒకరి సమస్య ఇంకొకరికి అర్ధం అయి కొందరయినా మారే అవకాశం ఉంది.



అంతేకానీ మనకు నచ్చని అభిప్రాయాన్ని ఎవ్వరూ చెప్పకూడదంటే ఎలా ?


ఈ పోటీ ప్రపంచంలో శక్తికి మించి చదవలేక ........ తల్లిదండ్రులతో తమ నిస్సహాయతను సరిగ్గా చెప్పుకోలేక .....చెప్పినా వారు అర్ధం చేసుకోలేక మానసికంగా నలిగిపోతున్న పిల్లలు ఎందరో ఉన్నారు.


కష్టంలో సుఖంలో తోడునీడగా కడదాకా కలిసి ఉంటామని వివాహ సమయంలో ప్రతిజ్ఞలు చేసి ..........


ఇంకొకరి మోజులో పడి భాగస్వామికి అన్యాయం చేసినప్పుడు ......... ఆ జంటలో ఒకరు ఆత్మహత్య చేసుకున్న వారి కధలు కూడా వింటున్నాము.


అలాంటి ఇళ్ళలో పిల్లల మానసిక పరిస్థితి ఏమిటి ? ఇలా సమాజంలో ఎన్నో సమస్యలున్నాయి.


ఇలాంటి వాటి గురించి చర్చలు జరగటం వల్ల సమాజానికి మంచే జరుగుతుంది కానీ చెడు జరగదు.


అయితే బ్లాగుల్లో కూడా చర్చలకు కొన్ని పరిమితులు ఎటూ ఉంటాయి.


పూర్తిగా మన అభిప్రాయాలను చెప్పటానికి కుదరదు.


అయితే కొద్దిగానన్నా స్వేచ్చగా చెప్పగలం.


అంతేకానీ అసలు చర్చించటమే తప్పు ....... అంటే ఇక బ్లాగుల అవసరం ఏమిటో అర్ధం కావటం లేదు.


నా బ్లాగులో నేను వ్రాసే టపాలు మీకు నచ్చినట్లయితే .... నచ్చాయని వ్యాఖ్యలు వ్రాయవద్దని ప్రార్ధిస్తున్నానండి .


నేను వ్రాసే విషయాలలో మీకు ఏమైనా సందేహాలు వచ్చినప్పుడు , లేక ఏమైనా అభ్యంతరాలు ఉన్నప్పుడు
.......


వ్యాఖ్యలు
ద్వారా మీ అభిప్రాయాలు తెలియజేస్తే.... నాకు వీలయినంతవరకు సమాధానం చెప్పటానికి ప్రయత్నిస్తానండి.

ఒకవేళ నేను వ్రాసిన దానిలో తప్పులుంటే సరిదిద్దటానికి ప్రయత్నిస్తాను.

నేను ఎంత వివరించినా నా అభిప్రాయాలు మీకు నచ్చలేదనుకోండి .......

లాంటి సందర్భంలో ఎవరి అభిప్రాయం వారిది అనుకోవటం తప్ప.... నేను చేయగలిగింది ఏమీ లేదు.

  నా అభిప్రాయాలు కొంచెం భిన్నంగా ఉంటాయి.

ఉదా...ఒక గ్రూప్ వారి విధానాలు, అభిప్రాయాలలో కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు.

ఇంకొక గ్రూపు వారి
విధానాలు, అభిప్రాయాలలో కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు.

ఒకే టీవీ చానల్లో వచ్చే కొన్ని ప్రోగ్రాంస్ నచ్చుతాయి. కొన్ని నచ్చవు.

( అందుకే నాకు ఎవరితోనూ  స్నేహమూ ఉండదు. ఎవరితోనూ శత్రుత్వమూ ఉండదు.. )

నాలో కూడా కొన్ని గుణాలు నాకు నచ్చుతాయి. కొన్ని నాకే అస్సలు నచ్చవు.

అయితే నాలో నాకు నచ్చని వాటిని మార్చుకోవటానికి ప్రయత్నిస్తుంటాను.......

 

5 comments:

  1. ఎవరి ఇష్టం వారిది, లోకో భిన్న రుచిః

    ReplyDelete
    Replies
    1. కృతజ్ఞతలండి.

      మీరు చెప్పింది చాలా కరెక్ట్ సార్.

      Delete
    2. ఈ రోజున సమాజంలో ఎవరి గోల వారిదే.. వ్యక్తిగత స్వేచ్చకి మాత్రమే ప్రాధన్యం యిస్తూ సమాజ స్రేయస్సుని కోరుకునే వారు తక్కువ. మన కడుపు నిండిందా లేదా? మన బతుకు ఏదో మనం గడుపుదాం.. మిగిలిన వాళ్ళ బాధలు మనకేల అనుకుంటూ వారి వారి వృత్తులకి సరైన న్యాయం చెయ్యటం లేదు.. ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ చేసే వాళ్ళు, (వైద్యులు, లాయర్లు, పోలీసులు, ఉపాధ్యాయులు, రవాణా వ్యవస్థ కి సంబంధించిన వాళ్ళూ) కాస్త బాధ్యతగా వ్యవహరించాలి.. ఇంకా పత్రికా, సినీ, టీవీ ల వాళ్ళూ సమాజం ఎడల బాధ్యతా రహితంగా వుండటం వల్లే ఇన్ని అనర్ధాలు.. మరి ప్రజా ప్రతినిధుల గురించి వేరే చప్పాలా.. రాజ్యాంగంలో పొందుపరచిన హక్కుల గురించి పోరాడతారు గాని బాధ్యతని గురించి పట్టించుకోరు..

      Delete
    3. మీ వ్యాఖ్యను ఈ రోజే చూశానండి. జరిగిన ఆలస్యానికి దయచేసి క్షమించండి.

      ఈ రోజుల్లో ఏం మాట్లాడినా తప్పుపడుతున్నారు.

      ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఊరుకున్నా తప్పుపడుతున్నారు.

      ప్రపంచం వింతగా ఉందండి..

      Delete
    4. మీ వ్యాఖ్యను ఈ రోజే చూశానండి. జరిగిన ఆలస్యానికి దయచేసి క్షమించండి.

      నిజమేనండి. చాలా మంది మీరు చెప్పినట్లే ప్రవర్తిస్తున్నారు.

      ఇలాంటి వాటి గురించి మాట్లాడితే కొందరు తప్పుపడుతున్నారు........ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఊరుకున్నా కొందరు తప్పుపడుతున్నారు.

      ప్రపంచం వింతగా ఉందండి...

      Delete