koodali

Friday, February 3, 2012

నాకు తెలిసినంతలో....ఉడుతా భక్తిగా...



ఓం..శ్రీ మహా విష్ణువుకు, భీష్ముల వారికి అనేక నమస్కారములు.

సమాజంలో అందరూ గౌరవంగా, సంతోషంగా జీవించాలని నేను కోరుకుంటున్నాను.

కొందరు పురాణేతిహాసాలలోని విషయాలను అపార్ధం చేసుకుంటున్నారని నాకు అనిపించింది. ఇంకా, కొంతకాలం క్రిందట ఇన్నయ్య గారి బ్లాగులో కొన్ని విషయాలను చదివాను. తెలకపల్లి రవి గారి బ్లాగులో శ్రీ రాముడు శంభుకుణ్ణి చంపిన విషయం చదివాను. , ఇవన్నీ నాకు బాధను కలిగించాయి. ఈ విషయాల గురించి నాకు అంతగా తెలియకపోయినా ఉడుతా భక్తిగా నాకు తెలిసినంతలో చెప్పటానికి ప్రయత్నిస్తున్నాను. అంతేనండి.
...............

శ్రీరామువారు  శంభూకుని సంహరించటం అంటే...నాకు ఏమనిపిస్తోందంటే..

శంభుకుడి వ్యక్తిత్వం మనకు తెలియదు.

కొందరు మంచి కోరికలతో, ఉద్దేశ్యాలతో తపస్సులు చేస్తారు....... కొందరు మనసులో స్వార్ధపరమైన కోరికలతో, ఉద్దేశ్యాలతో తపస్సులు చేస్తారు.

ప్రహ్లాదుని వంటివారు రాక్షస జాతికి చెందినా దైవ భక్తులై దైవానుగ్రహాన్ని పొందారు. . కానీ కొందరు రాక్షసులు స్వర్గాన్ని , దేవతలను జయించాలని తపస్సులు చేసారు.

మరి శంభుకుడు ఎందుకు
  తపస్సు మొదలుపెట్టాడో ఎవరికి తెలుసు ?

..................................
ఇంకా...

పెద్దలు అంటరానితనాన్ని ప్రొత్సహించేవారే అయితే మహాభారతంలో ధర్మవ్యాధుని కధ ఉంటుందా? ఉండదు కదా .

వర్ణవ్యవస్థ అనేది పుట్టుక ద్వారా మాత్రమేనా లేక వ్యక్తి యొక్క వృత్తి.... ప్రవృత్తి ద్వారా కూడా నిర్ణయించే అవకాశం ఉందా ?

భగవద్గీతలో ఇలాంటి విషయాలగురించి ఏమని చెప్పబడింది ?

ఇలాంటి ఆసక్తికరచర్చలు ఇంతకుముందు చాలామంది చేసారు.

భగవద్గీతలో భగవానుడు .. అందరినీ గౌరవించాలని చెప్పటం జరిగింది. అంటరానితనాన్ని పాటించమని ఎక్కడా చెప్పలేదు.

అంటరానితనం తప్పు అని పెద్దలు ఎందరో చెప్పటం జరిగింది. అయినా అంటరానితనం పాటిస్తున్నారంటే అది పెద్దల తప్పు కాదు. ప్రజల తప్పు.


ఈ విషయాలను గురించి మరింత స్పష్టంగా తెలుసుకోవాలనుకొనేవారు తప్పక శ్రీపాదశ్రీవల్లభ సంపూర్ణ
చరితామృతము గ్రంధాన్ని చదవాలి. ( ఈ గ్రంధం ఇంగ్లీషులో ఉందో లేదో నాకు తెలియదండి. )

కులం లేక వృత్తిని బట్టి అంటరానితనాన్ని పెద్దలు ప్రోత్సహించలేదు అని నాకు అనిపిస్తుంది.

ఈ కులవివక్ష  సమాజంలో పెరిగిపోవటానికి కారణం పెద్దలు కాదు. స్వార్ధపరులైన ప్రజలే.


కులం అన్నది
పుట్టుకతోనూ వస్తుంది. ఇంకా వ్యక్తి యొక్క వృత్తి, ప్రవృత్తిని బట్టి కూడా ఉండే అవకాశం ఉందని గ్రంధాలను నిశితంగా పరిశీలిస్తే తెలుస్తుంది.


(కులం అన్నదిపుట్టుకతోనూ వస్తుంది,. అయితే వ్యక్తి యొక్క వృత్తిని....... అతని కులాన్ని బట్టీ , ఇంకా ప్రవృత్తిని బట్టి కూడా .....వృత్తిని ఎంచుకునే అవకాశం ఉందని గ్రంధాలను నిశితంగా పరిశీలిస్తే తెలుస్తుంది.)

భగవధ్గీతలో .. జ్ఞానయోగం, మోక్షసన్యాస యోగంలో చాలా వివరాలు ఉన్నాయి. .

నేను అతిగా వ్రాస్తున్నానని కొందరు భావిస్తున్నారు. . కానీ అంతర్జాలంలో .... ఈ క్రింద వ్రాసినవి చదివి
తే..మనకంటే ముందే ఇలాంటి చర్చలు ఎందరో చేసారని మీకూ తెలుస్తుంది.

౧....Bhagavad Gita: Varna system misunderstanding - Hindu Dharma Forums


2..Vedic Literature Says Caste by Birth is Unjust

By Stephen Knapp (Sri Nandanandana dasa)..

 

3 comments:

  1. మీ వ్యాఖ్యను కొద్దిసేపటి క్రితమే చదివానండి.


    ఒక్క టపాలో చాలా విషయలు వ్రాస్తే గందరగోళంగా ఉంటుందేమోనని, ఇంకా నేను సరిగ్గా వ్రాయలేనేమోనని నిన్న నాలుగు టపాలు వ్రాశానండి. దయ చేసి అవి కూడా చదవండి.
    .............

    Indyan Minerva....మీరు తల్లిదండ్రులు తమ సంతానాన్ని తమ వృత్తులు స్వీకరించమని ప్రోత్సహించడాన్నీ (పోనీ బలవంతపెట్టడాన్నీ), కులవృత్తి తప్ప ఇంకో గత్యంతరం లేనితనాన్నీ పోల్చుతున్నారు.........రెండింటికి ..పొలిక ఉందని నాకు అనిపించిందండి. మీరంటున్న వర్ణ వ్యవస్తలోనే ఒక తండ్రి తనవృత్తి తన పిల్లలకు వద్దనుకుంటే ఏమిచేయగలరు? మార్చుకొనే స్వాతంత్ర్యం ఉందా?

    anrd.... ఏ కులంలో పుట్టినా వృత్తిని మార్చుకునే స్వాతంత్ర్యం ఉందని పెద్దలు చెప్పటం జరిగింది. ఈ విషయాలను గురించి వివరంగా తెలుసుకోవాలంటే ఈ లో చాలా వివరాలు ఉన్నాయండి. కులం అన్నది పుట్టుకతో వస్తుంది,. అయితే వ్యక్తి యొక్క వృత్తిని అతని కులాన్ని బట్టీ , ఇంకా ప్రవృత్తిని బట్టి కూడా వృత్తిని ఎంచుకునే అవకాశం ఉందని గ్రంధాలను నిశితంగా పరిశీలిస్తే తెలుస్తుంది.

    ఈ విషయాలను గురించి మరింత స్పష్టంగా తెలుసుకోవాలనుకొనేవారు తప్పక శ్రీపాదశ్రీవల్లభ సంపూర్ణ చరిత్రము గ్రంధాన్ని చదవాల్సిందే. ( ఈ గ్రంధం ఇంగ్లీషులో ఉందో లేదో నాకు తెలియదండి. )

    ౧....Bhagavad Gita: Varna system misunderstanding - Hindu Dharma Forums


    2..Vedic Literature Says Caste by Birth is Unjust

    By Stephen Knapp (Sri Nandanandana dasa).................


    Indyan Minerva....కర్మఫలాన్ని అనిభవించవలసిందే కానీ క్రితం జన్మలో చేశామో లేదో తెలియని కర్మఫలాన్ని ఈ జన్మలో రుద్దడం అనేది ఒక కుటిలమైన పొలిచ్య్ అని మీకు అనిపించలేదా? ఒక వ్యక్తి నిజంగానే గత జన్మలో దుష్కర్మలాచరించాడని ఎలా వెరిఫ్య్ చెయ్యగలం? దేవుడు నిజంగా అంత సమర్ధుడే అయితే స్వర్గాన్నీ, నరకాన్నీ తన ఆధీనంలోనే ఉంచుకున్న ఆపెద్దాయన మనుషుల్ని కర్మఫలపు బ్యాలెన్సు ఇంకా జీవుడి ఖాతాలోనే ఉండగా నేలమీదకి పంపడందేనికి? అదేదే ముగిసేదాకా అక్కడే ఎక్కడో ఉంచుకోవచ్చుకదా? ఇంక ఆమాత్రానికి ఆలోకాలెందుకు?

    anrd.... కొద్దిగా బ్యాలెన్స్ ఉండగానే నేల మీదకు ఎందుకు పంపుతారంటే ....... జీవులకు కర్మఫలం అంతా పూర్తయిపోతే ఇక జన్మ ఉండదు కాబట్టి. అలా అందరి కర్మలు స్వర్గ, నరక లోకాల్లోనే పూర్తయిపోతే ఇక సృష్టిలో జీవం ఉండక సృష్టి జడం అయిపోతుంది. స్వర్గ, నరకాల ద్వారా కాకుండా మరల జన్మను పొంది నిష్కామకర్మను ఆచరించటంద్వారా జీవుడు కర్మను పూర్తి చేసుకుని దైవాన్ని ( మోక్షాన్ని ) పొందటం అన్నది ఒక మార్గం.

    Indyan Minerva....ప్రజాస్వామ్యంలో పాలకుడు అవినీతిపరుడైతే పదవీచ్యుతుడిని చేయగల అవకాశమైనా ఉంది. మీరు అంటున్న వ్యవస్థలో అలాంటి అవకాశం ఉందా? ప్రస్తుతం మనదేశ్డంలో నెలకొన్న పరిణమాలన్నీ ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోవలేకపోవడమేమోగానీ అసలు అవకాశమే లేకపోవడమైతే కాదుకదా! పోనీ ఆ "మాట్లాడకూడదు" అని అన్నవారైనా అలా అని చట్తంచేయలేకపోయారు గమనించారా? దీనికితోదు ప్రజల్లో "వారిపాపానికి వారేపోతార్లే" అనే అత్తితుదె తోడయితే ఏమవుతుందో ఊహించగలరా?

    anrd....రాజులు అధర్మపరులైతే వాళ్ళను ఇతరరాజ్యాలకు చెందిన ధర్మపరులైన రాజులు యుద్ధంలో ఓడించి పదవీచ్యుతులను చేసే మార్గం ఉంది. లేక దైవమే అధర్మపరులైన రాజులను శిక్షిస్తారు.
    ఈరోజుల్లో మార్చటానికి ఒక్క రాజు కాదు కదా ! ఎందరో రాజులు. ఎందరినీ మార్చినా మళ్ళీ అలాంటివారే వస్తున్నారు. ఇక ప్రజలు ఏం చేయగలరు ?

    Indyan Minerva....వద్దంటే పోదన్నది నేనూ ఒప్పుకుంటానండి. వదులైన పట్టు మళ్ళి బుగుసుకోవాలనీ, మళ్ళీ అందులో గౌరవించుకోవాలనీ మీరంటున్నారు. ఎలా మొదలైనా అది చివరకు పరిణమించింది అవమానాల తీరుగా. ఇహ దానిలో గౌరవాలెలా సాధ్యమండీ. మీ సమస్యలోనే భటుడు చిన్నవాడనీ, ఎవరో ఒకరిచేత బలవంతంగా ఆవేషం వేయించక తప్పదనీ అన్న భావం ప్రస్ఫుటంగానే కనబ్వడుతుంది గమనించారా? మరి ఇలాంటప్పుడు గౌరవం సాధ్యమా?

    anrd....మీరు నన్ను సరిగ్గా అర్ధం చేసుకోవటంలేదండి. ఇప్పుడు కులవ్యవస్థ ఉండాలా ? వద్దా ? అన్న విషయం గురించి నేను అస్సలు మాట్లాడటం లేదు. భటుడు చిన్నవాడనీ, ఎవరో ఒకరిచేత బలవంతంగా ఆవేషం వేయించక తప్పదనీ అని నా అభిప్రాయం కాదండి. సమాజంలో భటుడి వంటి వృత్తులు కూడా అవసరమే కదా ! మరి ఆ వృత్తులను ఎవరు చేస్తారు అన్న సమస్యను అందరి ముందు ఉంచాను. ఏ వృత్తి చేసే వారైనా నాకు చాలా గౌరవం. అందరినీ గౌరవించాలని పెద్దలే చెప్పటం జరిగింది. దైవం భక్త కన్నప్పను ప్రేమించలేదా ! శూద్రుడైన నందనార్ అనే మహా భక్తుని కధ చదివితే దైవం దృష్టిలో కులభేదాలు లేవని తెలుస్తుంది.
    ......................

    ReplyDelete
  2. ఇప్పుడు కులవ్యవస్థ ఉండాలా ? వద్దా ? అన్న విషయం గురించి నేను అస్సలు మాట్లాడటం లేదు.

    పెద్దలు ఏర్పరిచిన కులవ్యవస్థ విషయంలో పెద్దలను కొందరు విమర్శిస్తున్నారు కాబట్టి ......ఇలా నాకు తెలిసిన విషయాలను చెబుతున్నాను. అంతేనండి.


    సమాజంలో చిన్నా, పెద్దా అన్ని వృత్తులూ అవసరమే ...... కాబట్టి వర్ణవ్యవస్థ ఏర్పాటు చేసి ఉంటారని ..... చెప్పటం నా ఉద్దేశ్యం.

    ఏ కులంలో పుట్టినా అన్ని వృత్తులను ఎంచుకునే స్వేచ్చను పెద్దలు కల్పించారని ..... చెప్పటం నా ఉద్దేశ్యం.

    అంటరానితనాన్ని పెద్దలు ప్రోత్సహించలేదని ..... చెప్పటం నా ఉద్దేశ్యం.
    ...................................................

    నేను నిన్న వ్రాసిన నాలుగు టపాలలోని కొన్ని వాక్యాలు. ..............

    కులం లేక వృత్తిని బట్టి అంటరానితనాన్ని పెద్దలు ప్రోత్సహించలేదు అని నాకు అనిపిస్తుంది.

    ఈ కులవివక్ష ..... సమాజంలో పెరిగిపోవటానికి కారణం పెద్దలు కాదు. స్వార్ధపరులైన ప్రజలే.

    శ్రీరాముడు శబరి అందించిన ఫలాలను తినలేదా ! శ్రీకృష్ణుడు నంద గోకులంలో పెరిగారు కదా ! ఇవన్నీ గమనిస్తే అందరూ సమానమేనని పెద్దలు చెప్పినట్లు తెలుస్తోంది కదా !

    బ్రాహ్మణులకు మాత్రం కొన్ని నియమాలు చెప్పారు. వాళ్ళు దైవపూజలు చేస్తారు కాబట్టి నిష్ఠ అవసరం కాబట్టి.

    అంతేకానీ అంటరానితనాన్ని పాటించమని చెప్పలేదు.

    ఒక శూద్రుణ్ణి తాకిన గాలే అందరినీ తాకుతుంది.

    వర్షం వస్తే శూద్రుల ఇంటి చుట్టు ప్రక్కల నీళ్ళు కూడా చెరువుల్లో, నదుల్లో కలుస్తాయి. ఆ నీళ్ళు అందరూ వాడుకుంటారు.


    పూర్వపు భారతదేశంలో పేదరికం లేదని విదేశీ పర్యాటకులే తమ గ్రంధాలలో వ్రాయటం జరిగింది.

    మన చరిత్రకారులు ఇలా వ్రాస్తే నమ్మము ....కానీ అలా వ్రాసినది విదేశీయులు. కాబట్టి నమ్మక తప్పదు.

    ఇవన్నీ గమనించితే పూర్వం అన్ని వృత్తుల వారూ భోగభాగ్యాలతో చక్కగా జీవించి ఉంటారు అని మనం అనుకోవచ్చు కదా !!.

    ReplyDelete
    Replies
    1. వ్యాఖ్యను పెద్దగా వ్రాసి పొస్ట్ చేయటానికి చూస్తే ప్రాబ్లం వచ్చిందండి.

      అది అలా ఉంచి వ్యాఖ్యను రెండు భాగాలుగా చేసి ఈ టపాలో పోస్ట్ చేసాను. అదండి జరిగింది.

      Delete