koodali

Wednesday, July 15, 2015

రామాయణంలో వాలి వధ.....

 
శ్రీరాముడు  వాలిని  చంపటం  గురించి  కొందరు  తప్పుగా  మాట్లాడతారు. 

వాలి  మరణించేముందు  అడిగిన సందేహాలకు రాములవారే సమాధానాలు చెప్పి సంశయాలను తీర్చారని పెద్దలు తెలియజేసారు. కొన్ని  విషయాలు....

వాలి పలుకులను ఆలకించి రాముడు శాంతంగా ఇలా అన్నాడు –

 ఇంద్ర నందనా! నీ సందేహాలు తీర్చడం నా కర్తవ్యం. అందువలన నీ అంత్యకాలం ప్రశాంతంగా ముగియవచ్చును.

నేను వేట మిష మీద నిన్ను చంపలేదు కనుక భష్యాభక్ష్య విచికిత్స అనవసరం.   ధర్మ రక్షణార్ధమే నిన్ను చంపాను. ప్రభువైన భరతుని ప్రతినిధులం గనుక మా రాజ్యంలో ధర్మహీనులను దండించే బాధ్యతా, హక్కూ మాకున్నాయి. నీ తమ్ముడు జీవించి ఉండగానే అతని భార్యను నీవు వశం చేసుకొన్నావు.

 నీ ప్రవర్తనలో దుష్టత్వం ఉన్నది. అందుకు మరణ దండనయే సరైన శిక్ష. కనుకనే మన మధ్య ప్రత్యక్ష వైరం లేకున్నా నిన్ను శిక్షించాను. ధర్మానికి శత్రు మిత్ర తత్వాలుండవని కిష్కింధకు రాజైన నీకు తెలుసు.

ఇక చెట్టుమాటునుండి చంపడం గురించి. నీ మెడలోని కాంచనా మాలా వర ప్రభావాన్ని నేను మన్నించాలి గనుక ఉపాయాంతరంగా కూల్చాను. ధర్మ పరాఙ్ముఖుడైన వధ్యుని వధించడానికి యుద్ధ ధర్మాలు వర్తించవు.

 ఇక నీవు శిక్షార్హుడవు గనుక నీతో నేను నా కార్యాలు సాధించుకో దగదు. అన్యుల సహాయం పైని ఆధారపడేవాడిని కానని నా చరిత్రే చెబుతుంది. కనుక స్వలాభం కోసం నిన్ను వధించాననుకోవడం అవివేకం.

 నీ వధకు మరొక అలౌకిక పరమార్ధ కారణం ఉంది. 

నీవు ఇంద్రుని పుత్రుడవు. సృష్టి కర్త ఆజ్ఞ మేరకు రావణ వధలో వానరులు నాకు సహకరించాలి. 

కాని నీవు రావణుడి మిత్రుడవయ్యావు. కనుక నీవు నాకు సహాయ పడితే మిత్ర ద్రోహివవుతావు.

 రావణుడి పక్షాన ఉంటే పితృద్రోహివవుతావు. అటువంటి మహాపాతకాలు నీకు అంటకుండా నిన్ను రక్షించాను. 

ఇకనైనా నా చేతలో ధర్మాన్ని తెలిసికొని చిత్త క్షోభను వర్జించి శాంతిని పొందు.

వాలి చివరి కోరికలు..

వాలి ఇలా అన్నాడు– రామా! సర్వజ్ఞుడవైన నీకు బదులు చెప్పగలిగేవాడను కాను. నీ చేతిలో మరణించడం నా పూర్వ జన్మ సుకృతం. గారాబంగా పెరిగిన నా కొడుకు అంగదుని కూడా సుగ్రీవునిలాగానే నీవు రక్షించు. నామీద వున్న ద్వేషంతో సుగ్రీవుడు తారను హింసించకుండా చూడు. నా ప్రేలాపననూ, అపరాధాలనూ మన్నించు.

తరువాత వాలి సుగ్రీవుని పిలచి తన మెడలోని కాంచనమాలను అతనికిచ్చాడు. అంగదుడిని స్వంత కొడుకులాగానే చూసుకోమన్నాడు. తార హితోక్తులను అమలు చేయమన్నాడు. రాఘవుల కార్యాలను అలక్ష్యం చేయవద్దన్నాడు.పిన తండ్రిని కూడా తండ్రిని లాగానే గౌరవించమని అంగదునికి చెప్పాడు. దేశ కాలాలు గుర్తించి ప్రభువు పట్ల విధేయుడై ఉండాలన్నాడు. ఎవరితోనూ అతి స్నేహమూ, తీవ్ర వైరమూ మంచివికావన్నాడు. అందరి వద్దా సెలవు తీసికొని, నోరు తెరచియే మరణించాడు.

అందరూ గొల్లుమన్నారు. తనను కూడా చంపి భర్త దగ్గరకు పంపమని తార రాముని ప్రాధేయపడింది. సుగ్రీవుడు పశ్చాత్తాపంతో కుమిలి పోయి తాను కూడా మరణిస్తానన్నాడు. 

అందరినీ ఓదార్చి రాముడు వాలికి అంత్య క్రియలను జరపమన్నాడు. 

అనంతరం రాముని ఆనతిపై రాజుగా సుగ్రీవుడు, యువరాజుగా అంగదుడు అభిషిక్తులయ్యారు.

(ఈ విషయాలు అంతర్జాలంలో వాలి-వికీపీడియా ద్వారా చదివినవి.)
............

ఇక్కడ వ్రాసిన విషయాలు, వాల్మీకి రామాయణము .. నుండి చూసి వ్రాసాను. ( Chenna Kesava Kumar Bonu గారి  బ్లాగ్ లో చదివాను  ).
(  వారికి ఏమైనా అభ్యంతరం ఉంటే తొలగించుతాను .)

వాలి లోపలికి వెళ్ళి ఒక సంవత్సర కాలం గడిచిపోయింది. నేను బయట అలాగే నిలబడ్డాను. అలా చాలాకాలం తరువాత లోపలినుండి రాక్షసుల కేకలు వినపడ్డాయి. ఆ ద్వారం దెగ్గర నురగతో కూడిన నెత్తురు ప్రవహిస్తూ బయటకి వచ్చింది. ఎక్కడా వాలి మాట కాని, వాలి అలికిడి కాని వినపడలేదు... 

.బహుశా మా అన్నగారైన వాలిని ఈ రాక్షసులు సంహరించి ఉంటారు అనుకొని, ఈ రాక్షసులు బయటకి వస్తే ప్రమాదము అని, నేను ఒక పెద్ద శిలని తీసుకొచ్చి ఆ బిలానికి అడ్డుగా పెట్టాను. 

అప్పుడు నేను చనిపోయాడనుకున్న వాలికి అక్కడే ఉదకక్రియ నిర్వహించి తర్పణలు విడిచిపెట్టాను.అని సుగ్రీవుడు చెబుతాడు.
............ 

రాముడు వాలితో చెప్పిన కొన్ని విషయాలు..నీ తండ్రి మరణించడం చేత, నువ్వు పెద్దవాడివి అవడం చేత నువ్వు తండ్రితో సమానము. నీ తమ్ముడు సుగ్రీవుడు, ఆయన భార్య అయిన రుమ నీకు కోడలితో సమానము.

 కాని సుగ్రీవుడు బతికి ఉన్నాడని తెలిసి, కోడలితో సమానమైన రుమని నువ్వు అనుభవించి, నీ భార్యగా కామ సుఖాలని పొందుతున్నావు .

మరి కొన్ని విషయాలు...

వాలి బిలంలో ఉండిపోయినప్పుడు, వాలి మరణించాడు అనుకొని సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. అప్పుడు సుగ్రీవుడు వాలి భార్య అయిన తారని తన భార్యగా అనుభవించాడు. మరి సుగ్రీవుడు చేసింది దోషం కాదా? ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, 

సంధ్యావందనం చేసే వానర జాతికి, రాజ్యపాలన చేసే వానర జాతికి, మంత్రులచేత సేవింపబడే వానర జాతికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ జాతిలోని స్త్రీలు తమ భర్త మరణిస్తే మరిదిని పునర్వివాహం చేసుకొని, వారితో ఉండచ్చు. ఆనాడు వాలి చనిపోయాడనుకొని తార సుగ్రీవుడిని వివాహమాడింది. కనుక సుగ్రీవుడితో ఆనాడు తార ఉండడం ధర్మం తప్పడం కాదు.

కాని సుగ్రీవుడు బతికే ఉన్నాడని తెలిసి కూడా ఆయన భార్యతో కామ సుఖాలని అనుభవించడం వాలి యొక్క దోషం. ఈ నియమం కేవలం పైన చెప్పిన వానర జాతికి మాత్రమే, మనుష్యులకి కాదు. 

అలాగే వాలికి రెండు శక్తులు ఉన్నాయి. ఒకటి, ఇంద్రుడు ఇచ్చిన మాలని మెడలో వేసుకుంటే, వాలి అపారమైన ఉత్సాహంతో ఉంటాడు.

 రెండు, ఎవరన్నా వాలికి ఎదురుగా వెళితే, వాళ్ళ శక్తిలో సగం శక్తిని ఈయన లాగేసుకుంటాడు, ఇది బ్రహ్మగారు వాలికి ఇచ్చిన వరం.

 అలాగే వాలికి రావణాసురుడికి స్నేహం ఉంది, వాళ్ళిద్దరూ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు.... 

.దాని ప్రకారం వాలి అనుభవించే స్త్రీని రావణుడు అనుభవించచ్చు, వాలికి శత్రువు రావణుడికి శత్రువే........అలా కొన్ని విషయాలలో ఒప్పందం కుదుర్చుకున్నారు .
.............

ఇవన్నీ  చదివిన తరువాత నాకు ఏమనిపించిందంటే,

బిలం వద్ద నుంచి సుగ్రీవుడు వెంటనే తిరిగి వెళ్ళిపోలేదుకదా ! చాలాకాలం వాలికోసం ఎదురు చూశాడు.

 (కొందరు నెలరోజులు అని, కొందరు సంవత్సరం ఎదురుచూసాడని వ్రాసారు.) 

  అలా చాలాకాలం ఎదురుచూసిన  సుగ్రీవుడు, వాలి  చనిపోయాడని  భావించి , వాలిని  చంపిన  రాక్షసుడు  బయటకు  రాకుండా  గుహను  మూసి  వెళ్ళిపోవటంలో ఆశ్చర్యం  ఏమీలేదు. 

వాలి అపార్ధం  చేసుకున్నట్లు లోకంలో  చాలామంది ఇతరులను  అనుమానించటం  కూడా   జరుగుతుంటుంది.

వాలి  సుగ్రీవుని  అర్ధం  చేసుకుని  క్షమించి  ఉంటే  సరిపోయేది.

  సుగ్రీవుడు   తాను   పొరపాటు  చేసానని  ఒప్పుకున్నా  కూడా,   వాలి  సుగ్రీవుని  యందు  అనుమానంతో    అతనిని క్షమించకుండా  అతని  భార్యను  తాను  వివాహం  చేసుకోవటం,  సుగ్రీవుని  చంపటానికి  ప్రయత్నించటం .....  అలా  వ్యవహారాన్ని  తెగేవరకూ  లాగి  తన  ప్రాణం  మీదకు  తెచ్చుకున్నాడు. 
.............

ఇక, రాముడు  చెట్టు  చాటునుండి  వాలిని చంపటం  గురించి  కొందరు  తప్పుపడతారు.  అందులో  తప్పేముంది? 

 ఉదాహరణకు .. ఎవరైనా, తమకు  హాని చేయటానికి ప్రయత్నించే  జంతువునో  లేక  వ్యక్తినో  తుపాకీతో  కొట్టాలంటే, ఏ చెట్టు  చాటు నుండో  లేక  చెట్టు  ఎక్కో  తుపాకీ పేల్చటానికి ప్రయత్నిస్తారు కానీ, ఆ బలమైన జంతువుకు  లేక  బలమైన వ్యక్తికి  ఎదురుగానే  నుంచుని  తుపాకీ పేల్చాలని రూలేమీ లేదు కదా !

కొన్ని ప్రత్యేక సందర్భాలలో, ఆత్మరక్షణ కోసం  లేక  ఇతరులను రక్షించటం కోసం  ఆయుధాన్ని ఉపయోగించటంలో తప్పు లేదని  పెద్దలు అంటారు కదా!

మరి , సుగ్రీవుని రక్షణ కోసం రాముడు ఆయుధాన్ని ప్రయోగిస్తే తప్పేమిటి ?  

వాలి ఎవరికీ ఏమీ హాని చేయని అమాయకుడేమీ కాదు కదా ! 
 ...........

వాలి  తన  ఎదురుగా  ఎవరు  నిలబడి  యుద్ధం  చేసినా ,  వారియొక్క సగం  బలం  తనకు  వచ్చేటట్లు  వరం  పొందిన  వ్యక్తి. 

ఇలాంటి ప్రత్యేకమైన  వరాలు  పొందిన  ప్రత్యేక  కేసులలో  ధర్మాలు  కూడా ప్రత్యేకంగానే ఉంటాయి  మరి.
 ...............

  రావణ సంహారం  విషయంలో  వానరుల  పాత్ర  ఉండాలి  కాబట్టి ,  దేవతలే  వానరులుగా  జన్మించారట.  
.............. 
ఇంకో విషయం ఏమిటంటే,

రాముడు , వాలిని చంపటం  ద్వారా .. తాను  రావణుని  సంహరించగలనని  ముందే  రావణుని  హెచ్చరించినట్లు  అయింది. 

 ( వాలి  రావణుని జయించిన  వాడు. తరువాత  వాలి, రావణులు  స్నేహితులయ్యారట.  )
...................  

హనుమంతుడు  సీతాన్వేషణ  చేయటం,  తరువాత  కధ  అందరికీ  తెలిసిందే.

సుగ్రీవుడు మొదలైన వారు , మానవులకు  వలె  నాగరికత  తెలిసిన  వానరులు  అనిపిస్తుంది.

  చీమలలోనే  రాణి  చీమ,  శ్రామిక  చీమలు ,  వాటి  కాలనీలు  ....  ఇలా ఎన్నో  రకాలు  ఉంటాయట. 

 మరి  ఉత్తమజాతికి  చెందిన  వానరులలో  రాజ్యాలు,  రాజులు,  రాణులు  ,  సైన్యం  ఉండటంలో  ఆశ్చర్యం  లేదు. 

 పురాణేతిహాసాల ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు.


4 comments:

  1. రాముడు వానరుడైన సుగ్రీవునితో స్నేహం చేసాడు.

    ఈ వానరులు సాధారణ వానరులు కాదు.సంధ్యావందనం చేయటం, రాజ్యపాలన చేయటం..వంటివి తెలిసిన జాతి వానరాలు.

    వానరుడైన వాలి రాక్షసుడైన రావణుడితో స్నేహం చేశాడు.

    అలా ఒక జాతి వాళ్లు ఇంకొక జాతి వారితో స్నేహం చేయటం జరిగింది.

    సీతను లంక నుండి తీసుకురావటంతో పాటూ.. రావణ వధ కూడా జరిగితీరాలి.

    రావణుడు దేవతలను పీడిస్తున్నాడు. జనస్థానాలను ఆక్రమించి రాక్షసులతో ఋషులను బాధలు పెట్టిస్తున్నాడు.

    స్త్రీలను ఎత్తుకొస్తున్నాడు. లోకంలో విలువైనవి తనకి కావాలనే కోరికలు కలిగినవాడు.

    ఇలాంటి రావణుని వధ, మరియు రావణునికి సహకరించే రాక్షసుల వధ జరగటం కూడా రాముని ఉద్దేశ్యం.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
    అంతా దైవం దయ.

    ReplyDelete

  3. వానరము అంటే కోతి అని ఒక అర్ధం ఉంది.

    వానర అంటే ఇంకో అర్ధం కూడా ఉందట. వనములలో సంచరించే జాతి అని.

    నర అంటే మానవులు..అంటే వనాలలో నివసించే మానవజాతి అని.. బహుశా ఆటవికులు కావచ్చు.. అన్నట్లు ఒక చోట చదివాను.

    ReplyDelete