koodali

Friday, July 10, 2015

ఓం.. రామాయణము అమృత వృక్షము..అద్భుత వృక్షము..

 
ఓం 
  వాల్మీకి మహర్షి  రామాయణమును  లోకానికి అందించారు..

  శ్రీ మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించటం, రావణాసురుణ్ణి సంహరించటం ఇదంతా ముందే ఒక ప్రణాళిక ప్రకారమే జరిగిందని మనం పెద్దల ద్వారా తెలుసుకున్నాము.

 పురాణముల ద్వారా మనము జీవితములో ఎలా ప్రవర్తించాలి , ఎలా ప్రవర్తించకూడదు , ఎలా ప్రవర్తిస్తే ఎలాంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంది ..వంటి విషయాలను  కూడా తెలుసుకోవచ్చు అని నా అభిప్రాయము.


లోకంలో ఉండే రకరకముల వ్యక్తుల మనస్తత్వమూ, వారి ప్రవృత్తి, వాటి వల్ల జరిగే సంఘటనలు, పరిణామములు .. ఇలా ఎన్నో మనకు తెలియని గొప్ప విషయములు పెద్దలు మనకు పురాణేతిహాసముల ద్వారా తెలియచేశారు. 


రామాయణములో చూడండి..సీతారాములు ఎన్నో కష్టాలు అనుభవించినా కూడా ధర్మాన్ని వీడలేదు. ధర్మం కోసం వారు ఆ కష్టాలను తట్టుకున్నారు. అందుకే వారి సంతానము చక్కగా ఉన్నారు, రాజ్యమును కూడా పాలించారు. 

మరి రావణాసురుడు... కొంతకాలం సుఖములను అనుభవించినా కూడా ,  తరువాత తన అధర్మ ప్రవర్తన, అత్యాశ.. ఇత్యాది కారణాల వల్ల తాను నాశనం అవటమేకాక తనతోపాటు తన బంధువులు, సంతానము .. నాశనానికి కారకుడయ్యాడు. ధర్మమును అనుసరించిన విభీషణుడు రాజ్యాన్ని పాలించాడు.

 దీనివల్ల ఏం తెలుసుకోవచ్చంటే...మనము జీవితములో ఎంతో జాగ్రత్తగా ప్రవర్తించాలి. అని.
 ..........

రామాయణము కావ్యము గురించి అనేక మంది తమ అభిప్రాయములను తెలియజేసారు. కొందరు రామాయణము తెలుసుకుని తమ జీవితాలను బాగుచేసుకున్నారు. కొందరు ఆ విషయాలను సరిగ్గా అర్ధం చేసుకోకుండా  తిడుతూ జీవితాన్ని గడిపేవాళ్ళూ ఉన్నారు. ఎవరి అదృష్టం వాళ్లది. 

 రామాయణము గురించి నాకు తెలిసినంతలో కొన్ని అభిప్రాయములను ఇంతకుముందు కొన్ని టపాల ద్వారా వ్రాయటం జరిగింది. మరికొన్ని అభిప్రాయాలనూ వ్రాయాలనుకుంటున్నాను. అంతా దైవము దయ.
..............
దశరధుడు.. కౌసల్య, సుమిత్ర, కైకేయి  ..
 వీరి పుత్రులు శ్రీ రాముడు, లక్ష్మణుడు ,భరతుడు, శత్రుఘ్నుడు . 

జనకుడు మిథిలా నగరానికి రాజు. రామాయణంలో సీత తండ్రిగా ప్రసిద్ధుడు.  భార్య రత్నమాల. కుశధ్వజుడు జనకుని సోదరుడు.  

శ్రీ రామునికి సీతాదేవితో వివాహము జరుగుతుంది. లక్ష్మణుడికి ఊర్మిళతోను, భరతుడికి మాండవితోను, శత్రుఘ్నుడికి శృతకీర్తితోను వివాహం  జరుగుతుంది.

వశిష్టుడు , విశ్వామిత్రుడు..గురువులు. 

మారుతి (హనుమంతుడు) కూడా రామాయణములో  ముఖ్యమైన పాత్ర.

ఇంకా ఎన్నో పాత్రలున్నాయి. ప్రతి పాత్రకు దాని ప్రాముఖ్యత దానికున్నది.

అంతర్జాలంలో వాల్మీకి రామాయణము క్లుప్తంగా చదవవచ్చును. 
...................

రామాయణములో ఎన్నో ప్రక్షిప్తాలున్నాయని అంటారు.

కొందరు రామాయణాన్ని తమకు తోచినట్లు వ్రాసినవారు కూడా ఉన్నారు.

రామాయణ విషవృక్షంలో రచయిత్రి తనకు తోచినట్లు సంభాషణలను ప్రవేశపెట్టడం జరిగింది.

ఈ టపా తరువాత భాగం అయిన ..  రామునికి  రాజ్యంపై హక్కు..అనే టపాను చదవవచ్చును.

No comments:

Post a Comment