koodali

Friday, November 30, 2012

స్త్రీలు ఆభరణాలను ధరించటం గురించి...


ఈ  బ్లాగ్  ను  ప్రోత్సహిస్తున్న  సభ్యులకు  మరియు  అందరికి  అనేక  కృతజ్ఞతలండి.

 ................................

స్త్రీలు ఆభరణాలను   ధరించటం  గురించి...  నేను  పాత    టపాలలో  వ్రాసిన కొన్ని   విషయాలను  ఇక్కడ   ఇస్తున్నానండి.  

జున్,   2011

స్త్రీలు ఆభరణాలు వేసుకోవాలి అనటం ద్వారా ................ స్త్రీలకు ఆభరణాల రూపంలో ఆర్ధికలాభాన్ని ఏర్పాటు చేశారేమో పెద్దలు అనిపిస్తుంది.

పూర్వం ఆడవాళ్ళు ఇప్పటిలా ఉద్యోగాలు చేసి సంపాదించటం తక్కువగా ఉండేది.

భర్త ఎంత ధనికుడయినా ఆడవారికి తమకంటూ సొంతానికి కొంత ధనం ఉంటే వాళ్ళకు స్వతంత్రంగా ఉంటుంది.

ఒక ఇంట్లో ఆడపిల్లలు, మగపిల్లలు ఉంటే .......... పండుగలకు కొత్త బట్టలు, ఆడుకొనే బొమ్మలు, తినే వస్తువులు ఇవన్నీ .......... తల్లిదండ్రులు పిల్లలు అందరికి ఇస్తుంటారు.

అలాగే,   తల్లిదండ్రులు   తమ ఆడపిల్లలకు    వారి వివాహం సందర్భంగా ........... ముచ్చటపడి ఆ పిల్లలకు కానుకలు ఇచ్చి అత్తవారింటికి పంపేవారు.

డబ్బు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎక్కువగా ,........ తక్కువగా ఉన్నవాళ్ళు తమకున్నంతలో కానుకలు ఇచ్చుకొనేవారు.

ఆ కానుకలు   ఆ ఆడ పిల్లలకు ఒకోసారి ఆపదలో అండగా కూడా ఉపయోగపడేవి.

అలా ఆడవాళ్ళు  పుట్టింటినుంచి తెచ్చుకున్న ధనాన్ని,  భర్త మొదలైన వారు కూడా వాడుకోవటానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు.


(  ఆ  రోజుల్లోని  వాళ్ళు.  )

స్రీ ధనంగా భావించి దానిని ఆమెకే ఉంచేసేవారు. ఆ కానుకలు ఆమె తమ పిల్లలకు ఇచ్చుకోవటం జరిగేది.

అలా ముచ్చటగా మొదలైన వ్యవహారం ............. ఇప్పుడు వికృతరూపం దాల్చి ఆ కానుకల కోసం ఎంతకైనా తెగించేస్థాయికి పరిస్థితులు వచ్చాయి.

తప్పు ఎక్కడ వచ్చింది అంటే,  మనుషుల మనస్తత్వాలు మారటం వల్ల వచ్చింది.

డబ్బు కోసం ఎంతకైనా తెగించే మనస్తత్వాలు పెరిగిపోవటం,  తేరగా ఎదుటి వాళ్ళ సొమ్ముకు ఆశ పడటం, డబ్బు కోసం హుందాతనం లేకుండా లేకిగా ప్రవర్తించటం, మానవసంబంధాలు ఆర్ధిక సంబంధాలుగా మారిపోవటం వల్ల........... ఈ అనర్ధాలన్నీ జరుగుతున్నాయి.

చాలామంది మగవారినే ఆడిపోసుకుంటారు గానీ ........... ఈ డబ్బు గొడవల్లో భర్త ఒక్కడే కాదు. చాలా సార్లు అత్తా, ఆడపడుచుల ప్రమేయం కూడా ఉంటుంది. ....

ఒక భర్త తన భార్యను కొడుతున్నప్పుడు తోటి ఆడవాళ్ళుగా అత్తగారు , ఆడపడుచులు, అలా చేయటం తప్పు అని చెపితే ............... భార్యను కొట్టే భర్త ప్రవర్తన మారే అవకాశం ఎంతయినా ఉంది.

అలా చేయకపోగా కొందరు అత్తగార్లు, ఆడపడుచులు విషయాన్ని మరింత పెద్దది చేస్తారు.
...............


 స్త్రీలు ఆభరణాలు వేసుకోమని చెప్పటం వల్ల చాలా లాభాలున్నాయి. వాటిని ధరించటం వల్ల అందం, అలంకారం అని అందరికీ తెలుసు. 


ఇంకా ,
బంగారు ఆభరణాలు ధరించటం ,మట్టిగాజులు ధరించటం వల్ల ఆరోగ్యం కలుగుతుందట. 


స్త్రీలకు వివాహ సమయంలో పుట్టింటివారు, అత్తింటివారు ఆభరణాలు చేయిస్తారు.

ఈ ఆభరణాలు స్త్రీల దగ్గరే ఉంటాయి.  కాబట్టి,   అవి స్త్రీలకు ఆస్తిలాగా ఆపద సమయంలో ఆదుకుంటాయి.

ఉదా........ఆభరణాలను తాకట్టు పెట్టి డబ్బు తీసుకోవచ్చు.

భర్తకు ఎప్పుడయినా అవసరమయితే భార్య తన ఆభరణాలు ఇవ్వటం ద్వారా కుటుంబాన్ని ఆదుకోవచ్చు.

ఆ ఆభరణాలను తన పిల్లలకో , మనుమలకు, మనుమరాళ్ళకు ఇచ్చుకోవచ్చు.

ఇంకా,   పూర్వం మహారాణులు వంటి వారు కష్టాలలో ఉన్నప్పుడు ( ఉదా...శత్రువులు ముట్టడించినప్పుడు ) వారి ఆభరణాలు వారికి ఉపయోగపడేవట.


సీతమ్మ వారి జాడ కనుగొనే సందర్భంలో ఆమె జారవిడిచిన ఆభరణాల పాత్ర అందరికి తెలిసిందే.

స్త్రీలు ఆభరణాలు వేసుకోవాలి అనటం ద్వారా ................ స్త్రీలకు ఆభరణాల రూపంలో ఆర్ధికలాభాన్ని ఏర్పాటు చేశారేమో పెద్దలు అనిపిస్తుంది.

ఎందుకంటే, ఇంట్లో వాళ్ళు.... ఆడవాళ్ళ ఆభరణాలను అంత త్వరగా తీసుకోరు కదా !.మరీ కష్టాల్లో ఉంటే తప్ప. (ఇప్పుడు  పరిస్థితి   మారిపోయింది  లెండి.)

అయితే మితిమీరిన భోగాల వెనుక రోగాలు ఉన్నట్లు, మితిమీరి పసిడిని ప్రోగుచేస్తే దాని వెనుక దొంగల భయం వంటి ప్రమాదాలు ఉంటాయి.

ఇవన్నీ చూస్తే పెద్దలు ప్రవేశపెట్టిన ఆచారాల వెనుక... ఎన్నో విషయాలు ఉంటాయని అనిపిస్తుంది.



4 comments:



  1. స్త్రీలు ఆభరణాలను ధరించడమన్నది అంతో ఇంతో మిగతా దేశాలలో కూడా ఆచారం ఉంది.బంగారం,వజ్రాలు లేకపోతే రంగురాళ్ళు,వెండి ,ఇత్తడి,గవ్వలు, ఆల్చిప్పలు, పూసలు ఏవో ఒకటి ధరిస్తారు.మార్క్సిస్టులు వీటిని స్త్రీల బానిసత్వచిహ్నాలుగా భావిస్తారు.కాని పురుషులు కూదా ధరించడం ఉంది.(ముఖ్యంగా కొన్నేళ్ళ కిందివరకు ,రాజులు,నవాబులు,ధనికులు,కొందరు మధ్యతరగతివారు,పేదవారు కూడా ధరించేవారు.) మా చిన్నతనంలో మగవాళ్ళు కూడా ,పోగులు,కుండలాలు,దుద్దులు,హారాలు.ముంగురులు ధరించేవారు.ఇక స్త్రీల ఆభరణ ధారణకి కారణాలు ఇవి కావచ్చును.1.అందాన్ని,ఆకర్షణని పెంచడానికి. 2.మత,కుల,ఆచారాలు,3.దోషం తొలగుతుందనే నమ్మకం.4.స్త్రీధనంగా ఉపయోగపడుతుంది.5.అవసరాలకి పనికి రావచ్చును.6.దర్పానికి,డాబుకి ( superiority) 7.స్త్రీలకి,కొంతవరకు కాస్మెటిక్స్ మీద,అలంకారాల మీద ఉండే మోజు.8.బంగారం.వెండి ,రత్నాలు ఆస్తి గా జమ అవుతాయికాబట్టి.

    ReplyDelete

  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    నిజమేనండి. బంగారం, వెండి ఆభరణాల వల్ల స్త్రీలకు అందం, ఆరోగ్యం, ఆర్ధికభద్రత లభిస్తుంది.

    ఇలా అనేక విధాలుగా ఆలోచించి ప్రాచీనులు ఇవన్నీ ఆచారాలుగా ఏర్పాటు చేసి ఉంటారు.

    అయితే ఈ రోజుల్లో కొందరు, ఆభరణ ధారణను స్త్రీల బానిసత్వచిహ్నాలు అని ప్రచారం చేస్తున్నారు.

    ప్రాచీనకాలంలో పురుషులు కూడా ఆభరణాలను ధరించటం జరిగేదన్న విషయం, నాకు ఈ టపాను పోస్ట్ చేసిన తరువాత గుర్తు వచ్చిందండి. ఆ వాక్యం మళ్ళీ రాద్దామనుకున్నాను. ఇప్పుడు బ్లాగ్ చూస్తే, మీరు మీ వ్యాఖ్యలో ఈ విషయాన్ని వ్రాసారండి.

    మీరన్నట్లు,కొన్నేళ్ళ కిందివరకు రాజులు,నవాబులు,ధనికులు,... కూడా ఆభరణాలను ధరించేవారు.

    ఇవన్నీ గమనిస్తే, ఆభరణ ధారణ స్త్రీల బానిసత్వ చిహ్నం కాదు అని తెలుస్తోంది.

    ReplyDelete
  3. Get Your Website on Google's 1st Page with QUALITY Backlinks ! Receive free Backlinks for your site today, no registration necessary .... submit your site here
    http://www.freebacklinkszone.weebly.com

    ReplyDelete
  4. మీకు కృతజ్ఞతలండి.

    ReplyDelete