koodali

Wednesday, November 14, 2012

కొన్ని అభిప్రాయాలు...సీతారాముల గురించి కొన్ని విషయములు..


ఈ  బ్లాగ్  ను  ప్రోత్సహిస్తున్న  సభ్యులకు  మరియు  అందరికి  అనేక  కృతజ్ఞతలండి.
 ..........................

శ్రీ దశరధ మహారాజు సత్యానికి కట్టుబడిన వారు. కైకేయికి ఇచ్చిన మాటకు కట్టుబడి.. శ్రీ రామ పట్టాభిషేకం, వనవాసం..వంటి విషయాలలో నిస్సహాయులైనారు.
...............

 సీతాదేవిని  అడవులకు  పంపటం  గురించి  ఒక  దగ్గర    ఇలా  ఉంది...

 రామరాజ్యం

శ్రీ రామ పట్టాభిషేకం తరువాత అయోధ్యలో అంతటా సుఖ సంతోషాలు వెల్లివిరిసాయి. శ్రీ రాముని పాలనలో ప్రజలు ఏ కష్టం లేకుండా సుఖంగా జీవనం సాగించేవారు. అందుకే ఇప్పటికీ శ్రేయో రాజ్య పరిపాలనకు రామ రాజ్యాన్ని ఉదాహరణగా వాడతారు. 

ఇలా ఉండగా ఒక రోజు రాముడు ఏకాంతసమయంలో సీతను చేరి" దేవీ! నీవు తల్లివి కాబోతున్నావు. నీ మనస్సులో ఏమైనా కోరిక ఉంటే చెప్పు. " అని అడిగాడు. అందుకు సీత " నాధా గంగా తీరంలో ఉన్న ముని ఆశ్రమాలలో పళ్ళు, కందమూలాలు ఆరగిస్తూ ఒక్కరోజు గడపాలని ఉంది. ": అంటుంది. అందుకు సరే నంటాడు రాముడు. కానీ సీత కోరిక వినగానే వ్యాకులచిత్తుడవుతాడు.
 
సీత గురించిన నింద
 


అక్కడనుండి సభామంటపానికి వెళ్ళిన రాముడిని విజయుడు, మధుమత్తుడు, కాశ్యపుడు, పింగళుడు, కుటుడు, సురాజు, మొదలైన వారు హాస్య కధలు చెప్పి రాముడిని సంతోషపరుస్తారు. రాముడు ప్రసన్నుడై భద్రునితో" భద్రా! నా పరిపాలన ఎలావున్నది? ప్రజలకు ఎలాంటి సమస్యలు లేవుగదా? నిజం చెప్పు.?" అని అడుగుతాడు.

 అందుకు భద్రుడు" మహారాజా! సత్యసంధుడివైన నీకు నిజం చెప్తున్నాను. ప్రజలు నీ పరాక్రమాలను, రావణ సంహారాన్ని వేనోళ్ల పొగడుతున్నారు. అయితే, రావణ చెరలో కొన్నాళ్ళు ఉన్న సీతను తిరిగి మీరు భార్యగా స్వీకరించడం గురించి మాత్రం రక రకాలుగా చెప్పుకొంటున్నారు. ఇలా అంటున్నందుకు నన్ను మన్నించండి" అన్నాడు.

 రాముడు సరేనని వారినందరిని పంపించి విషాదచిత్తుడై తమ్ముళ్ళను పిలిపిస్తాడు. వారు రావడంతోనే రాముని వదనం చూసి నిశ్చేష్టులవుతారు.


 రాముడు వారిని కూర్చోమని జరిగిన సంగతి అంతా వివరిస్తాడు. " లక్ష్మణా! సూర్య చంద్రులు, అగ్ని,ఇంద్రాది దేవతలు కూడా ఆమె సౌశీల్యాన్ని శ్లాఘించారు. కానీ ఆమెపై అయోధ్యలో ఇంకా అపవాదు తొలగలేదు. ప్రజాభీష్టం లేని పరిపాలన సూర్యుడులేని పగలు వంటిది. ఇప్పుడు నాకు ఆమెను పరిత్యజించడం తప్ప వేరు మార్గం కనపడ్డం లేదు. కొద్ది సమయం కిందటే సీత తనకు మున్యాశ్రమాలు చూడాలని కోరికగా ఉన్నదని కోరగా ఆమెకు సరే అని అనుమతిచ్చాను. నువ్వు మారు మాటాడక ఆమెను గంగానదీ తీరంలోని ఆశ్రమాల వద్ద వదిలిరా. ఇది నా ఆజ్ఞ" అంటాడు. 
.......................


పై  విషయాలను  గమనించితే , ఒక్క  పామరుడు  వ్యాఖ్యానించటమే    కాకుండా,  మిగతా   ప్రజలకు  కూడా   , రాముడు  సీతను  తిరిగి  భార్యగా స్వీకరించడం  గురించి  రకరకాల  అభిప్రాయాలు  ఉన్నట్లు  తెలుస్తోంది.
..........................................
 


 సీతమ్మను అడవులకు   పంపించటం  గురించి    ఇంకొక  దగ్గర  ఎలా  చెప్పారంటే,...........

 ఆ  కాలంలో,  ఒక  పామరుని  భార్య  కొన్ని  కారణాల  వల్ల  పరపురుషుని  ఇంటివద్ద  కొన్నాళ్ళు  ఉండి  రాగా,   పరపురుషుని  ఇంటివద్ద  ఉండి   వచ్చిన  భార్యను  తాను  ఏలుకోనని  అంటూ,    ఆ  పామరుడు  అలా   వ్యాఖ్యానిస్తాడట.
 ఆ  భార్యాభర్తలకు  జరుగుతున్న   గొడవను    జనం  గుమికూడి  చూస్తుంటారు.  ఆ  జనంలోని  గూఢచారుల   ద్వారా ,   ఆ  పామరుడు  అన్న  వ్యాఖ్య  గురించి  శ్రీ రామునికి  తెలుస్తుందట.

..........................................

    సీతాదేవి దైవాంశసంభూతురాలు.  రావణుడు ఆరు బయట అశోకవనంలో ఆమెను  రాక్షస స్త్రీల మధ్య   ఉంచి ,  తనను  వివాహమాడమని   బెదిరించటం  తప్ప,  మరో విధంగా  ఆమెకు  హాని  కలిగించలేకపోయాడు.

    సీతాదేవి  సాక్షాత్తు  లక్ష్మీదేవి  అవతారం. ఆమె మహిమ గురించి  రామునికి తెలుసు. 


సీతాదేవిని అరణ్యాలకు పంపించిన తరువాత అశ్వమేధ యాగ సమయంలో ఇంకో వివాహం చేసుకొమ్మని  కొందరు సలహా  ఇచ్చినా,   రాముడు వినలేదు. 


స్వర్ణ  సీతాదేవి  ప్రతిమను  తయారుచేయించి  భార్యగా భావించి యాగాన్ని నిర్వహించారు. ఈ  ఒక్క ఉదాహరణ చాలు ,  సీతాదేవి గురించి రాముని అభిప్రాయం లోకానికి తెలియటానికి.


 మరి రామునికి సీతాదేవి అంటే అంత గొప్పభావం ఉన్నప్పుడు, ఆమెను  అడవులకు  ఎందుకు   పంపించారు ? అంటే ,

ప్రజాభీష్టంతో  పాటూ   ఎన్నో  విషయాలను   కూడా   పరిగణనలోకి  తీసుకుని  రాముని  వంటి  వారు  నిర్ణయాలను  తీసుకుంటారు. 


     సామాన్య వ్యక్తి   ఏం చేసినా లోకం అంతగా పట్టించుకోదు. రాముడు చక్రవర్తి.  రాజు ప్రజల  గురించి ఎన్నో రకాలుగా,  ఎంతో  దూరదృష్టితో    ఆలోచించవలసి ఉంటుంది. 


తాము  చేసిన  పనివల్ల  భవిష్యత్తులో  కలగబోయే  పరిణామాలను  కూడా   ఎంతో  దూరదృష్టితో   ఆలోచించి రాజు నిర్ణయాలను  తీసుకోవలసి  ఉంటుంది.


అంటే,  తాము   తీసుకున్న  నిర్ణయం  యొక్క   పర్యవసానాలు,   భవిష్యత్  తరాలపై  దాని  ప్రభావం ....ఇలా  ఎన్నో  రకాలుగా  ఆలోచించి ,    సమాజంలో  కొన్ని  విలువలను  పరిరక్షించటం  కోసం  , సీతాదేవిని  అడవికి  పంపించారనే  నిందను  తనపై  వేసుకున్నారు. రామునికి  తగ్గ  భార్యగా   సీతాదేవి  కూడా  త్యాగాలను  చేసారు. సీతారాములు  ఆదర్శదంపతులు.
 ..................................

అయితే,     రాముడు  సామాన్య మానవుడుగా జన్మిస్తే ,  సీతాదేవిని అడవులకు  పంపించేవారు  కాదు .   అనిపిస్తుంది.
................................................

సమాజంలో  గొప్ప  బాధ్యతలున్న  కుటుంబాలలోని  వ్యక్తులు,   సమాజశ్రేయస్సు  కోసం ,  కొన్నిసార్లు తమ సుఖాలను  త్యాగం  చేయటం  జరుగుతుంటుంది. 

పురాణేతిహాసాలలోని  త్యాగపూరితమైన  ఈ  పాత్రలు  తరువాత  తరాల  వారికి  ఎంతో  స్పూర్తిని  కలిగించాయి.

 ప్రజలలో  స్వార్ధం  తగ్గించి , సమాజశ్రేయస్సు  కోసం  తమ  వంతుగా  సాయం  చేయటానికి    తోడ్పడ్డాయి.  


స్వాతంత్ర్యోద్యమం  జరిగినప్పుడు  ఎందరో వ్యక్తులు   పురాణేతిహాసాలలోని  వ్యక్తులను  స్పూర్తిగా  తీసుకుని  తమకు  తోచిన  త్యాగాలను  చేసారు.

 గాంధీజీ  వంటివారు  తమపై  పురాణేతిహాసాల  ప్రభావం  ఎంతో  ఉందని  చెప్పటం  జరిగింది.


 ఆ  రోజుల్లో,  ఎందరో  స్వాతంత్ర్యసమరయోధులు  తమ  ఆస్తులను  స్వాతంత్ర్యోద్యమానికి  సమర్పించి , తమ   కుటుంబాలను  జనారణ్యంలో  వదిలి,   తాము  జైళ్ళలో  గడిపారు. 


 అప్పటి  వాళ్ళందరి   త్యాగాల  వల్లా  ఈ  దేశానికి  స్వాతంత్ర్యం  వచ్చింది.  


  సమాజంలో  బాధ్యతాయుత  స్థానాలలో  ఉన్నవారికి  కొన్నిసార్లు ,  కుటుంబశ్రేయస్సా   ?  లేక  సమాజశ్రేయస్సా  ? ఏది  ముందు  ?  ఏది  వెనుక  ? అనే   క్లిష్టపరిస్థితులు   ఎదురవుతాయి. 


 ఇలాంటప్పుడు  దేశం  గురించి  రాజుకు  బాధ్యత  ఉన్నట్లే  రాణికి  కూడా  బాధ్యత  ఉంటుంది.  


 ఎన్నో  విధాలుగా   ఆలోచించి   ఉత్తమ మైన రాజుగా రామయ్య ..ఉత్తమమైన   రాణిగా సీతమ్మ   తమ జీవితంలోని సుఖసంతోషాలను త్యాగం చేసి ఉంటారు.  అనిపిస్తుంది.

ఎవరికైనా  కుటుంబం,  సమాజం  రెండూ   ముఖ్యమే. 

శ్రీరాముడు కూడా ,
కుటుంబం,  సమాజం .. రెండూ ముఖ్యమే  అని   భావించి,   కుటుంబసభ్యుల  పట్ల,   సమాజం  పట్ల ..  తన  బాధ్యతను (  ధర్మాన్ని  ) నెరవేర్చటానికి  ఎంతో  కృషి  చేసారు. సీతాదేవి  కూడా  శ్రీరామునికి  తగిన  ఉత్తమురాలైన  భార్య. 

అయితే,
అందరూ  పరిపూర్ణంగా  ఆనందంగా  ఉండాలంటే  ఈ  లోకంలో  సాధ్యమయ్యే  పని  కాదు. అసలు  కష్టాలే   లేని  పరిపూర్ణమైన  ఆనందం  కావాలంటే   పరమాత్మను  చేరినప్పుడు (  మోక్షాన్ని  పొందినవారికి )  మాత్రమే  సాధ్యం. 

మనిషిగా  జన్మను  ధరించిన  తరువాత  అవతారమూర్తులు  కూడా  మానవులకు  వలే  భావాలను  ప్రకటిస్తారట.
............................

 సీతారాములు ఎన్నో  కష్టాలను  అనుభవించినా   ,  వారి  సంతానం  చక్కగా  జీవించి  రాజ్యాలను  పాలించారు. 

రావణుడు,   అతని  కుటుంబం  కొంతకాలం   సుఖాలను  అనుభవించినా,    చివరికి   రావణుడు  ,  తన   సంతానంతో  సహా  నశించారు.


 రావణాసురుని  వంటి    వారివల్ల  మంచివాళ్ళకు   కూడా  కొన్ని కష్టాలు   వస్తాయి. 

.............................. 
మరి  కొన్ని  అభిప్రాయాలూ  ఈ  లింక్  లో  ఉన్నాయండి.

కొందరు ప్రజల చిత్రమైన ప్రవర్తనలు....

............................................
వాల్మీకి  వారి  మూల  రామాయణాన్ని  నేను  చదవలేదు. . నాకు  తెలిసినంతలో   వ్రాసాను.
 ..................................


వ్రాసిన  విషయాలలో  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.



No comments:

Post a Comment