koodali

Friday, November 16, 2012

సంతాన ఫల మంత్రం.

ఓం.

రేపు  నాగుల  చవితి  సందర్భంగా,   సంతాన  ఫల మంత్రం.

సంతానం  లేకపోవడానికి  నాగదోషం  లేదా  సర్పదోషం  కారణమని  అంటారు.

  ఈ  నాగదోషం  తొలగాలంటే  గర్భం  ధరించిన  నెలలోపులో  లేదా  గర్భధారణకి  పూర్వమే  అయినా  ఈ  క్రింది  శ్లోకాన్ని  రోజూ  స్నానం   చేశాక  ముమ్మారు  పఠించాలి. ఇలా  చదివితే  తప్పక  108  రోజుల్లో  నాగదోషం  తొలగుతుందనేది  అనుభవంలో  వున్న  సత్యం.  చక్కని  సంతానం  కలిగారనేది  వాస్తవం.

ఏ  నిత్య  నివేదనలూ  నియమాలూ  లేవు.   108వ  రోజు  చదవడం  పూర్తయ్యాక  నువ్వుల  చిమ్మిలి  నైవేద్యం  పెట్టాలి.  ఆ  మంత్రం లాంటి  శ్లోకం  ఇదిగో.

జరత్కారుర్జగద్గౌరీ  మానసా  సిద్ధయోగినీ


వైష్ణవీ నాగభగినీ  శైవీ  నాగేశ్వరీ  తధా !


జరత్కారుప్రియాస్తీక మాతా  విషహారేతి  చ


మహాజ్ఞానయుతా  చైవ సా  దేవీ విశ్వపూజితా  !!

ద్వాదశైతాని  నామాని  పూజాకాలే తు  యః పఠేత్  !
 తస్య  నాగభయం నాస్తి  తస్య  వంశోద్భవస్యచ  !!
 

..................... 
ఇలాంటి  చక్కటి  విషయాలను  తెలియజేసిన  పెద్దలకు  కృతజ్ఞతలు.
..............................

నాగులచవితి  రోజున  పుట్ట  వద్ద  దీపాలు  వెలిగించకూడదని  పండితులు  అంటున్నారు.  ఇందుకు  అనేక  కారణాలు  ఉండవచ్చు.  

  పుట్ట  వద్ద  పాలు  సమర్పించి  అందరూ  ఇళ్ళకు  వెళ్ళి,  జనసంచారం   సద్దుమణిగిన  తరువాత,  పుట్టలోని  పాములు  బయటకు  వస్తే,  వెలుగుతున్న  దీపాలు  వాటికి  తగిలే  అవకాశం  కూడా   ఉంది.


పుట్ట  వద్ద  దీపాలు  వెలిగించకూడదని  చెప్పటానికి  బహుశా  ఇది  కూడా  ఒక  కారణం  అయిఉండవచ్చు.

 పిల్లలు , పుట్ట  వద్ద  టపాసులు  కాల్చితే,   మిగిలిన  వేడి  ఇనుప  తీగలను  పుట్ట  వద్దే  పడేయకుండా ,  పుట్టకు  దూరంగా  చెత్తకుండీలో  వెయ్యటం   మంచిది. 


 వ్రాసిన విషయాలలో ఏమైనా  అచ్చుతప్పులు, పొరపాట్లు వంటివి ఉంటే ,  దయచేసి  క్షమించమని దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.
 
 

2 comments:

  1. బాగుంది. సరిఅయిన సమయంలో తెలియజేశారు.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ReplyDelete