koodali

Wednesday, November 7, 2012

వాస్తు.కొన్ని విషయాలు.... 2 వ భాగం.


వాస్తు  ప్రకారం  గృహనిర్మాణం  చేసుకుంటే   ఎంతో  మంచి  జరుగుతుంది.    వాస్తు  గురించి ,  కొందరు  చెప్పే  విషయాలకు ,   మరి  కొందరు  చెప్పే
విషయాలకు  కొన్ని   తేడాలు  ఉంటూ  ఉంటాయి.  ఇలాంటప్పుడు    ఎవరు  చెప్పిన   విషయాలను  పాటించాలో    అర్ధం  కాదు.
.......................


నాకు  కొన్ని  ధర్మసందేహాలు  వస్తుంటాయి.  ఉదా..ఈశాన్యం  భాగం  పూజకు  మంచిది,  ఆ ప్రదేశాన్ని   శుభ్రంగా  ఉంచుకోవాలి,  చెత్తా,  చెదారం  వంటివి   పడేయకూడదు  అంటారు  కదా  !  

మరి, మనం  వాడిన  మురికి  నీరు  కూడా  ఈశాన్యం  వైపు  నుంచి  బయటకు  వెళితే  మంచిది . అని  కూడా  కొందరు   చెబుతారు.   ఈ  విషయం  నాకు  అర్ధం  కాలేదు.

ఈశాన్యం  భాగాన  పూజ , బావి  లేక  బోర్ పంపు  వంటివి  ఉంటాయి.   ఎంతో   పవిత్రంగా  ఉంచుకోవలసిన  ఈశాన్యం  భాగం  నుంచి  మనం  వాడిన  మురికి  నీరు  పంపించటం  మంచిది  కాదేమో...అని  నాకు  అనిపిస్తోంది.  


వాడిన  మురికి  నీరును  ఈశాన్యానికి  వెళ్ళకుండా  తూర్పు  లేక  ఉత్తరం  వైపు  నుండి  బైటకు   వెళ్లేటట్లు  చేస్తే  మంచిది  అని  నాకు  అనిపించిందండి.

 కొందరు  అపార్ట్మెంట్స్  వారు  ఏం  చేస్తారంటే,  ఏకంగా  ఈశాన్యాన టాయ్ లెట్  ,  వాష్  బేసిన్  పెట్టేస్తున్నారు. 


 ఇదేమిటి  ?  పవిత్రంగా   ఉంచవలసిన   ఈశాన్యాన  టాయ్ లెట్ ,వాష్  బేసిన్   పెట్టారేమిటి ?  అని  అడిగామనుకోండి, ఈశాన్యం నుంచి  వాడిన  నీరు  పోతే  మంచిదట  కదా  ! అని  సమాధానమిచ్చే  అవకాశం  ఉంది. 

పూర్వం  వంటగదులు    కూడా  విడిగానే  ఉండేవి.  


 వంటగదిలో  సింక్ ను  కూడా ,  గాలి  వచ్చి  తడి  త్వరగా  ఆరిపోయే  ప్రదేశంలో   నిర్మించుకోవాలి.   కిచెన్ లో    సింక్    ఈశాన్యాన   కాకుండా    కొద్దిగా  ఖాళీని  వదిలి  ఏర్పాటు  చేసుకుంటే  మంచిదనిపిస్తోంది.
............................. 


పూర్వీకులకు మురుగు  నీటి పారుదల వ్యవస్థ  గురించి  తెలియదు  అనుకుంటారు  కొందరుకానీ  ,మొహంజదారో    త్రవ్వకాల్లో  ఆ  నగరాలకు    చక్కటి  నీటిపారుదల  వ్యవస్థ  ఉన్నట్లు    పురావస్తు  త్రవ్వకాల  ద్వారా  తెలిసింది.
.....................


పూర్వీకులు  టాయిలెట్స్ను  (  స్నానాల  గదులు )  ఇంటికి  దూరంగా  నిర్మించేవారు.

 ఈ  రోజుల్లో   భద్రత  గురించి  టాయిలెట్స్     ఇంట్లోనే  నిర్మిస్తున్నారు.   ఇంట్లోనే  టాయిలెట్స్  నిర్మించటం  వల్ల  ఇంట్లోని  వారికి  ఆరోగ్య  సమస్యలు  వచ్చే  అవకాశం  ఎంతో   ఉంది. 

అయితే,  సేఫ్టి కూడా   ముఖ్యమే  కాబట్టి ,  టాయిలెట్స్  ఇంట్లో  కాకుండా  బాల్కనీలో  ఏర్పాటు  చేసుకుంటే  బాగుంటుంది.  అందువల్ల  ఎండా  ,  గాలి  తగిలి  టాయిలెట్స్  పొడిగా  ఉండి  శుభ్రంగా  ఉంటాయి. 

 హాల్  కు  బయట  ఒకటి  ఉంటే ,  బెడ్రూం  కు  ఆనుకుని  ఇంకో  టాయిలెట్  ఉంటే  బాగుంటుంది. 


హాల్ కు  ఆనుకుని  బయట   ఉన్న   టాయిలెట్  ఇంట్లోని  అందరూ  ఉపయోగించవచ్చు. హాల్  బయట    గ్రిల్  ఏర్పాటు  చేసుకుంటే  రాత్రిపూట  కూడా  టాయిలెట్  వాడుకోవటానికి  సేఫ్టీగా  ఉంటుంది.
...............


వాస్తు  ప్రకారం  వంటగదికి,  పూజ  గదికి  ఆనుకుని  టాయిలెట్స్  ఉండకూడదంటారు.   అయినా    ఫరవాలేదు  అంటూ   ఈ  రోజుల్లో,   ఇలా  కూడా  కట్టుకుంటున్నారు. 

గోడకు  ఒక  ప్రక్కన  టాయిలెట్,   రెండో  ప్రక్కన    వంటగది  లేక  పూజ  గది  ఉండటం  ఆరోగ్యరీత్యా  మంచిది  కాదు.  


వర్షాకాలంలో ,  చలికాలంలో  టాయిలెట్స్  గోడలకు    చెమ్మ  ఏర్పడి , ఆ   తడి  వంటగదిలోకి,  పూజ గదిలోకి  వచ్చి ఆ   బాక్టీరియా  వల్ల  అనేక  రోగాలు  వచ్చే  అవకాశం  ఉంది.
...............


వాస్తు  అనేది  ఇంట్లో  ఉండే  కుటుంబసభ్యులకు  అనేక  ఉపయోగాలను  కలిగిస్తూ,   వారు   ఆరోగ్యంగా  ఉండటానికి  కూడా  ఉపయోగపడాలని  ఆలోచించి , పూర్వీకులు  వాస్తును  ఏర్పాటు  చేసారు.

ఇలా  ఇళ్ళలో  టాయిలెట్స్  ఏర్పాటు  వాస్తుకు  అనుగుణం  కాదు  అనుకోవచ్చు.  ఎందుకంటే,  పూర్వీకులు  స్నానాల గదులను  ఇంట్లో  కట్టుకోలేదు.  (  నాకు  తెలిసినంతలో  ).
.....................

    మాకు  తెలిసిన  వారు  ఇండిపెండెంట్  ఇంటికి   కూడా  బాల్కనీలు  ఏర్పాటు  చేసుకున్నారు.

 వంట గదికి  బయట  నేలమీద   పొట్టి  గోడ  కట్టి , దానికి  గ్రిల్  అమర్చి , బాల్కనీలా  ఏర్పాటు   చేసుకుని  బయట  గిన్నెలు  శుభ్రం  చేయటం. దుస్తులు  ఉతకటం వంటి  పనులు   చేస్తారు. 


 ఇందువల్ల  మురికి   దుస్తులు,  మురికి  పాత్రలు  వంటగదిలో  కాకుండా  బయట  వేసే   అవకాశం  కలిగింది.  గ్రిల్  ఉండటం  వల్ల  రక్షణ   కూడా  ఉంటుంది. వాళ్ళ  అయిడియా  నాకు  నచ్చింది. 

 
 ఇలాగే  గ్రిల్  అమర్చి  బెడ్రూంస్  ప్రక్కన  బయటకు  టాయిలెట్స్  కూడా  కట్టుకోవచ్చు.  సేఫ్టి  ఉంటుంది  +  టాయిలెట్స్  బయట  ఉండి  శుభ్రంగా  ఉంటాయి.
..............................

 బయట  ఉండే  టాయిలెట్స్  కూడా   శుభ్రంగా  ఉంచుకోకపోతే  రోగాలు  వస్తాయి.  


ఇక  ఇంట్లో  ఉండే  టాయిలెట్స్  అయితే ,  ఎండాకాలం  బాగానే  ఉన్నా,  వర్షాకాలంలో,  చలికాలంలో  సరిగ్గా  గాలి, ఎండ  లేక  ఎంత  బాగా  శుభ్రం  చేసినా  చెమ్మగా  ఉండి   అదో  రకం  వాసన  వస్తాయి. 

ఇక, వాటిని  శుభ్రపరచటానికి  ఎన్నో  ఘాటైన  పొగలు  వచ్చే  రసాయనాలు  ,  రూం  ఫ్రెష్నర్స్  వాడవలసి  వస్తుంది.


  ఈ  రసాయనాలు  మళ్ళీ  భూమిలో,  నీటిలో,  గాలిలో  కలిసి    పర్యావరణానికి   ఎంతో   నష్టం  కలుగుతుంది.
.............................


  ఈ  రోజుల్లో  గదిగదికీ  టాయిలెట్స్,  వాష్  బేసిన్స్   కడుతున్నారు.  ఇలా  కట్టటం    చాలా  అనారోగ్యకరం. 


  కొన్ని  అపార్ట్మెంట్స్ లో   5  లేక  6  అంతస్తు  వారికి  కూడా  చెదలు,  ఇంట్లోకి  కాలుజెర్రుల  వంటివి  రావటం  జరుగుతుంది. .  భూమికి   అంత  ఎత్తులో  కూడా  ఇవన్నీ  ఎలా  వస్తాయంటే,   డ్రైనేజ్  పైపుల  వల్ల  ఇలాంటి  సమస్యలు  వస్తాయని    తెలిసిన నిపుణులు   చెబుతున్నారు.

అందువల్ల  టాయిలెట్స్  బయట  బాల్కనీలో   ఏర్పాటు  చేసుకుంటే,   కొంతయినా  రక్షణ  కలుగుతుంది.

..............................


 
ఇప్పటికే   ఇంట్లో  టాయిలెట్స్   ఉన్నవాళ్ళు  హాలు   బయట  కూడా  ఒకటి  ఏర్పాటు  చేసుకుని  పగలు    బయట  ఉన్న  టాయిలెట్    వాడుకుంటూ ,  రాత్రి  సమయంలో  ఇంట్లోది  వాడుకోవచ్చు.
.........................

ఇంటి  గోడకు,  లేక  ప్రహరీకి   ఆనుకుని  నిర్మించకూడదు  అనుకుంటే,   బాల్కనీకు   గ్రిల్  ఏర్పరిచి  ఇంటి  గోడలకు  తగలకుండా  కొంచెం  స్థలం  వదిలి  బాల్కనీలో  టాయిలెట్స్  కట్టుకోవచ్చు. 


లేకపోతే   వాయవ్యం,  నైరుతి   వంటి  కొన్ని  దిక్కులలో  ఉపగృహాలు  నిర్మించవచ్చని  అంటారు.

 దక్షిణం,  పడమర  వైపున  తలుపులు  ఉండకూడదని  కొందరంటారు.  కానీ,  దక్షిణ  ,  పడమర   సింహ ద్వారాలు  కూడా   ఉండే  ఇళ్ళు  కూడా  ఉంటాయి  కాబట్టి,  దక్షిణం,  పడమర  వైపున  తలుపులు   ఉండటంలో  తప్పులేదనిపిస్తుంది. 


  బెడ్రూంస్  కు  తలుపు  ఏర్పాటు  చేసుకుని  బాల్కనీలో  టాయిలెట్స్   కట్టుకోవచ్చు. 

 ఎలాగైనా  టాయిలెట్స్  బయట  ఉంటేనే  బాగుంటుంది.

.......................


వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే,  దయచేసి  క్షమించాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.
 

1 comment:

  1. chalaa baagaa chepparu.good.nenu metho okasaari sambhaashinchaali .nenu oka astrologistni. dayachesi mee fon number telupagalaru.ledaa 9440848011 ki meru call cheste nene tirigi reply call chestaanu.

    ReplyDelete