koodali

Friday, May 25, 2012

కొన్ని విషయాలు....


 మేము  చెన్నై  వెళ్ళి  నిన్న  ఉదయమే  తిరిగి  వచ్చామండి. ఇప్పుడు   ఎండలు  బాగా  మండిపోతున్నాయి.  నాకు  ఏమనిపించిందంటే,  ఈ  వేడిని   విద్యుత్ గా    మార్చి  నిల్వ  చేసుకుంటే  వచ్చే  వేసవి  వరకూ  విద్యుత్  కొరత  ఉండదు  కదా  !   అని . . ఎండలు  అంత  తీవ్రంగా  ఉన్నాయి    మరి.  ఈ  విషయం  అలా  ఉంచితే.....
............

ఆదిపరాశక్తి అయిన పరమాత్మ విశ్వాన్ని సృష్టించారు.

విశ్వంలో ఎన్నో లోకాలున్నట్లు పెద్దలు తెలియజేసారు.


 "ఒక యోగి ఆత్మ కధ " గ్రంధములో పెద్దలు ఎన్నో విషయాలను చెప్పటం జరిగింది.

శ్రీ యోగానంద గారి గురుదేవులైన శ్రీ యుక్తేశ్వర్ గారు .......తాము పరమపదించిన కొన్ని రోజుల తరువాత పునరుత్ధానం చెంది....... ఆయా లోకాల గురించి తమ శిష్యునికి చెప్పటం జరిగింది.


అందులో కొన్ని విషయములు........

"సూక్ష్మ శరీరులతో నిండిన సూక్ష్మ గ్రహాలు చాలా ఉన్నాయి."


అక్కడి వాళ్ళెవరూ స్త్రీ గర్భాన జన్మించిన వారు కారు: సూక్ష్మలోకవాసులు తమ విశ్వ సంకల్ప శక్తి సహాయంతో ప్రత్యేక ( అవయవ ) నిర్మాణమూ ,సూక్ష్మ శరీరమూ గల సంతానాన్ని సృష్టించుకుంటారు.


సూక్ష్మలోకవాసులందరి మధ్య భావసంపర్కం పూర్తిగా , మానసికప్రసార ( టెలిపతీ ) సూక్ష్మదూరదర్శనాల ( ఆస్ట్రల్ టెలివిజన్ ) ద్వారా జరుగుతుంది.


మానవుడు ప్రధానంగా ఘన,ద్రవ,వాయు పదార్ధాల మీదా గాలిలో ఉన్న ప్రాణ శక్తి మీదా ఆధారపడి ఉన్నవాడు : కానీ సూక్ష్మలోకవాసులు ప్రధానంగా విశ్వకాంతి మీదే ఆధారపడి బతుకుతారు.


సూక్ష్మలోక జీవులు తమ రూపాల్ని సంకల్పానుసారంగా సాక్షాత్కరింపజేయటం , అదృశ్యం చేయటం చేస్తూంటారు.


సూక్ష్మ ప్రపంచం అత్యంత ఆకర్షణీయమైనదీ పరిశుభ్రమైనదీ పరిశుద్ధమైనదీ సువ్యవస్థితమైనదీ.


ఇలా ఎన్నో విషయాలు శ్రీ యోగానంద గారి గురుదేవులైన శ్రీ యుక్తేశ్వర్ గారు తమ శిష్యునికి చెప్పటం జరిగింది.
................................

పై  విషయాలను  గమనిస్తే    నాకు ఇలా అనిపించింది.......

సృష్టిలో , దేవతలు, మానవులు, పశుపక్ష్యాదులు , దానవులు, ఉన్నారు.


దేవతలు, మానవులు, దానవులు..  వీరందరి ధర్మాలు, గుణాలలో భేదం ఉంటుంది.

ఇతరలోకాల వారికి , మానవులకు   ఎన్నో  భేదాలున్నాయి.


ఇతరలోకాల వారికి , మానవులకు ఇన్ని తేడాలు ఉన్నప్పుడు , మరి మానవులకు దేవతలకు ఎన్నో తేడాలుంటాయి  కదా  !

  మనం దేవతల చర్యలను మన ఆలోచనా కోణం నుండి మాత్రమే చూస్తాము.....కానీ, దేవతలకు మానవులకు ఉన్న రీతిలో రాగద్వేషములు ఉండవు.


దేవతల చర్యలు , మానవులకు ఉన్నటువంటి రాగద్వేషాలను పోలి ఉండవు. ........దేవతల చర్యలను మానవ ధర్మాలు,  గుణముల కోణం నుండి చూడకూడదు..........ఇలాంటి విషయాలలో మనకు తెలియని ఎన్నో   అంతరార్ధాలు  ఉంటాయి.


దేవతలు ,  మానవులుగా అవతరించిన సందర్భంలో మాత్రము ,....... వారి చర్యలను కొంతవరకు , మానవధర్మముల కోణము నుండి చూడవచ్చు ....పురాణేతిహాసాలలోని   విషయాలలో మనకు తెలియని    ఎన్నో అర్ధాలు    దాగుంటాయి.


త్రిమూర్తుల  గురించి,   త్రిశక్తులైన  లక్ష్మీదేవి,   సరస్వతీదేవి,  పార్వతీదేవి  గురించి  " శ్రీపాద  శ్రీ  వల్లభ  సంపూర్ణ  చరితామృతము " గ్రంధములో  ఎన్నో  విషయములు    ఉన్నాయి.        ఇంకా    అనేక  ఆసక్తికరమైన   విషయములు  కూడా ఈ   గ్రంధంలో  ఉన్నాయి. 

 

2 comments:

  1. నాకు ఏమనిపించిందంటే, ఈ వేడిని విద్యుత్ గా మార్చి నిల్వ చేసుకుంటే వచ్చే వేసవి వరకూ విద్యుత్ కొరత ఉండదు కదా !
    ------------
    అమెరికాలో వేడి నీళ్ళకి విద్యుత్ కి సూర్యరశ్మిని ఉపయోగిస్తారు. మనమూ చెయ్యొచ్చు చెయ్యాలనుకుంటే.

    Solar Thermal Energy is the most cost effective solar option for energy generation!
    Solar thermal systems store the energy they collect in water or some other medium.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ఇండియాలో కూడా అమెరికాలోలాగా విద్యుత్ కి సూర్యరశ్మిని వాడితే బాగుండు. సూర్యరశ్మి తక్కువగా ఉండే కొన్ని విదేశాల్లోనే వీలైనంతవరకూ సూర్యరశ్మిని వాడటానికి ప్రయత్నిస్తున్నప్పుడు సూర్యరశ్మి బాగా ఉండే ఇండియాలో ఎందుకు ఉపయోగించటంలేదో అర్ధం కావటం లేదు. .


    ఇక్కడ కొందరు సోలార్ ఎనెర్జి ఎక్కువ ఖరీదు అంటారు. కానీ సోలార్ ఎనెర్జి వాడటం వల్ల బొగ్గు, పెట్రోల్ వంటి సహజవనరులు మిగులుతాయి. ఇంకా పర్యావరణ కాలుష్యం, ఆ కాలుష్యం వల్ల వస్తున్న విపరీతమైన వాతావరణ మార్పులు, తద్వారా వస్తున్న అనారోగ్యం .......ఈ సమస్యల నివారణకు ప్రభుత్వం పెడుతున్న ఖర్చు.......ఇవన్నీ తగ్గుతాయి.....అందుకే సోలార్ ఎనెర్జి ఎంతో నయం.



    ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే . వచ్చిన సమస్యల్లా భారతదేశపు ప్రజల్లో, పాలకుల్లో ఉన్న నిర్లక్ష్యం, నిర్లిప్తత, నీరసం, వగైరా,,,,

    ................


    అయితే , విద్యుత్ విస్తారంగా లభించితే ఇక పట్టపగ్గాల్లేకుండా పరిశ్రమలు పెట్టేసి వస్తువుల్ని తయారు చేస్తుంటే , ఇనుము, బాక్సైట్ వంటి సహజవనరులు అయిపోవటం , వాతావరణ కాలుష్యం వంటి ......అనేక సమస్యలు వస్తాయి.

    ( ఇలాంటి కొన్ని ఖనిజాలను విపరీతంగా తవ్వటం వల్ల అనేక సమస్యలు వస్తాయట. భూగర్భ జలాలు తగ్గిపోవటం , ఇంకా ఉన్న జలాలు కలుషితం అయిపోతాయట. )


    జనాలకు అతి చేష్టలు ఎక్కువ కదా ! ఏదైనా అవసరమైనంతవరకూ మాత్రమే వాడుకోవాలి అనే వివేకం వచ్చేవరకు ప్రతి విషయమూ సమస్యే........... . . ఆ వివేకం రానంత వరకూ ఇలా విద్యుత్ కొరత ఉండటమే ప్రపంచానికి , ప్రపంచంలోని ఇతర మూగజీవులకు ఎంతో మంచిది.


    అందుకేనేమో వివేకం లేని విజ్ఞానం ...... పిచ్చివాని చేతిలో రాయి వంటిదని పెద్దలు చెబుతుంటారు. ......మనుషులు తమ అంతులేని కోరికలతో తమ వినాశనాన్ని తామే కొనితెచ్చుకుంటున్నారు.


    రకరకాల ఊళ్ళు తిరిగి వచ్చాక అభివృధ్ధి పేరుతో గుట్టలుగా పేరుకున్న మురికి, పొల్యూషన్ చూసిన తరువాత నాకు చాలా బాధగా అనిపిస్తుంది.


    ఇదంతా ఒక టపాలో రాయాలనుకున్నాను. ఆ బాధ ఇలా వ్యాఖ్య ద్వారా రాసాను. దయచేసి తప్పుగా అర్ధం చేసుకోవద్దండి.

    ReplyDelete