koodali

Friday, May 4, 2012

లోకహితం కోసం.......

ఓం..
శ్రీ  నృసింహ స్వామి  వారి   జయంతి   సందర్భంగా  అందరికి  శుభాకాంక్షలండి.

.......................................

 సత్య యుగం,   త్రేతా యుగం,  ద్వాపర యుగం,    గడిచి    కలి యుగం  వచ్చేటప్పటికి   క్రమేపీ     లోకంలో   పాపాత్ముల  సంఖ్య   విపరీతంగా   పెరిగిపోతుందట.  

రావణుడు  పరస్త్రీ  వ్యామోహం  , ఇంకా  ఇతర     దుర్గుణాల    వల్ల  తాను  పతనమవటమే  కాకుండా  తన  చుట్టూ  ఉన్నవారిని  కూడా   కష్టాలపాలు  చేసాడు.   ,

  దుర్యోధనుడు  అసూయ,  లోభం  ,  ఇంకా  ఇతర    దుర్గుణాల  వల్ల  తాను  పతనమవటమే  కాకుండా  తన  చుట్టూ  ఉన్నవారిని  కూడా   కష్టాలపాలు  చేసాడు. 

  త్రేతాయుగం,  ద్వాపరయుగాల్లో  రావణుడు,  దుర్యోధనుడు  వంటివారు  కొద్దిమందే  ఉంటే  ,   కలియుగం  వచ్చేటప్పటికి  ఇలాంటివారు  విపరీతంగా  పెరిగిపోతారట.

  అందుకే  ,   ప్రతి  ద్వాపరయుగంలోనూ   లోకహితం  కోసం  ,  వ్యాసమహర్షి   వేదాలను  విభజించి,  పురాణాలను  రచించి  ప్రజలకు    అందివ్వటం  జరుగుతుందట.

విష్ణుమూర్తి  వ్యాసునిగా  జన్మిస్తారట.

అంతర్జాలంలో  .....  ".వేదవ్యాసుడు "........ " పురాణములు "........ అన్న  లింకులో  చాలా  విషయములున్నాయి. 

వేదాలు ప్రజలకు క్లిష్టమైనవి కనుక అందుబాటులో లేనివి కనుక ,  వేదవ్యాసుడు వేద ఉపనిషత్తు సారంతో కూడిన అష్టాదశ పురాణాలను రచించాడు....ఇలా  ఎన్నో  విషయములు  ఉన్నాయండి.



No comments:

Post a Comment