koodali

Friday, May 18, 2012

అష్టలక్ష్ములు...



మా  ఇంట్లో  ,   ఒక   పుస్తకంలో  ఉన్న  అష్టలక్ష్మీ  స్తోత్రంలో   ఆదిలక్ష్మీ ,    ధాన్యలక్ష్మి,     ధైర్యలక్ష్మి,   గజలక్ష్మి,  సంతానలక్ష్మి,    విజయలక్ష్మి,   విద్యాలక్ష్మి,     ధనలక్ష్మి....అని  నామములు  ఉన్నాయి. 


 ఆ  అష్టలక్ష్మీ  స్తోత్రంలో   విద్యాలక్ష్మి  యొక్క  స్తోత్రం  కూడా  ఉంది.


 మా  ఇంట్లో    అష్టలక్ష్మీదేవిల   చిత్రాలు    ఉన్న  ఒక  క్యాలెండర్  ఉంది.  ఆ    పటానికి   నేను  అప్పుడప్పుడు  నమస్కరించుకుంటూ  ఉంటాను.  అయితే  ఆ  క్యాలెండర్లో  ఉన్న  అమ్మవారి   చిత్రాల  క్రింద  రాసి  ఉన్న  నామముల  గురించి  నేను  అంతగా    పట్టించుకోలేదు.   అష్టలక్ష్మీదేవి      అని  నమస్కరించుకోవటం  జరిగేది.


అయితే,  నిన్న  నాకు  ఒక  ఆలోచన  వచ్చింది  అష్టలక్ష్ములలో  ఒకరైన   విద్యాలక్ష్మి  యొక్క  ఆకారవిశేషాలు  ఎలా  ఉంటాయో  తెలుసుకోవాలన్న  ఆలోచన  వచ్చి,     క్యాలెండర్ లో  చిత్రాల   క్రింద  ఉన్న  పేర్లు  చదివితే  అందులో  విద్యాలక్ష్మి  పేరు  లేదు.. ఇందులో    విద్యాలక్ష్మి  పేరు   లేదేంటి  చెప్మా  !  అని   తిరిగి  చదివితే,      గజలక్ష్మి,     ఆదిలక్ష్మి,   విజయలక్ష్మి,     వీరలక్ష్మి,    ధనలక్ష్మి,    సంతానలక్ష్మి,   ధాన్యలక్ష్మి,   ఐశ్వర్యలక్ష్మి,...... అని   నామములు  ఉన్నాయి.


అప్పుడు  నాకు  అనిపించింది ......   అష్టలక్ష్ములు  అంటే  ఒకే  రకమైన  పేర్లు    కాకుండా ,     .ఇలా  వివిధ రకములైన  నామములు  కూడా   ఉంటాయి  కాబోలు   అనిపించింది. ,  కొందరు  ఇలా     కొన్నిరకాల   మార్పులు,  చేర్పులతో  కూడా    పూజిస్తారు  కాబోలు  అనిపించింది.  


 చాలాకాలం  నుండి  మా  ఇంట్లో  ఆ  క్యాలెండర్  ఉన్నా  ,అప్పుడప్పుడూ    నమస్కరించటమే  కానీ,  ఎప్పుడూ  ఆ  నామముల  గురించి  పరిశీలించలేదు  . మన  కళ్ళెదుటే  ఉన్నా    చాలా  విషయాలను   మనం  సరిగ్గా  పరిశీలించము.   


అందుకే  నాకు  ఏమనిపిస్తుందంటే,  నాకు  ఏమైనా  తెలివితేటలు  గాని  లేక  మంచి  ఆలోచన  గానీ  వచ్చిందంటే ,  అది  నా  సొంత  ప్రతిభగా  నేను  భావించను.  నాకు  కలిగిన  ఆ    చక్కటి  ఆలోచనలు   దైవం  యొక్క  దయవల్ల  కలిగినవి    మాత్రమే  అని  నేను  అనుకుంటాను.


  బ్లాగులో   నేను   వ్రాసే  విషయాల్లో  కూడా  చక్కటి  ఆలోచనలను  భగవంతుని  దయగాను,  పొరపాట్లు  రాస్తే  ఆ  పొరపాట్లను    నేను  చేసిన  తప్పులుగానూ  నేను  భావిస్తాను........



3 comments:

  1. nijamea mana kaLLa mundu vunna chaala vishayaalani manamu paTTinchukomu.chaala manchi vishayam cheppaaru.

    ReplyDelete
    Replies
    1. ప్రియగారు, మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      Delete
  2. శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి గారు, మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ReplyDelete