koodali

Monday, May 7, 2012

నాకు అర్ధమయినది సముద్రంలో నీటిబొట్టంత మాత్రమే..



పురాణేతిహాసాలు  ఎంతో  గొప్పవి. 

లోకంలో  మానవులకు  అవసరమైన  ఎన్నో    విషయాలు  వాటిలో  ఉన్నాయి.  విజ్ఞానశాస్త్రం,  మనో  విజ్ఞాన శాస్త్రం,  సామాజిక  శాస్త్రం ......   ఇంకా   ఎన్నో    విషయాలను  పెద్దలు  మనకు  పురాణేతిహాసాల  ద్వారా  అందించారు.


 పురాణేతిహాసాలలో   పైకి  కనిపించే  అర్ధం  మాత్రమే  కాకుండా ,    అంతరార్ధాలు  కూడా  అనేకం  ఉంటాయట.  పురాణాన్ని   చదువుతున్న    కొద్దీ     కొత్త  అర్ధాలు స్ఫురిస్తూనే  ఉంటాయట. 


 నాకు  ఉన్న  పాండిత్యం  చాలాచాలా  తక్కువ.     పురాణేతిహాసాలను  అపార్ధం  చేసుకుని  కొందరు   హేళన  చేస్తుంటే   బాధగా   అనిపించి  నాకు  తెలిసినంతలో   చెప్పాలని  ఇలా  వ్రాస్తున్నాను. 


   పురాణేతిహాసాలలోని   కధలను పోలిన కధలు    ఈ  రోజుల్లో  కూడా   జరగటం   చూస్తున్నాము.  ఏ  యుగంలోనైనా  అధర్మం  పెరిపోయినప్పుడు  దైవం    అవతరించి   ధర్మసంరక్షణ   చేయటం  జరుగుతుంది.   


  మాఇంట్లో " శ్రీ  దేవీ  భాగవతము",...." శ్రీ  పాద  శ్రీవల్లభ సంపూర్ణ  చరితామృతము",...." ఒక  యోగి  ఆత్మ కధ"  వంటి  గ్రంధాలున్నాయి.  అయితే  ,  ఈ  గ్రంధాలలో  నాకు అర్ధమయినది  సముద్రంలో  నీటిబొట్టంత  మాత్రమే. 


 మనకు    అర్ధమయిన  అన్ని  విషయాలను    ఇతరులకు     అర్ధమయ్యే  విధంగా   చెప్పాలన్నా  కూడా  కష్టమే.   ఎందుకంటే,   మనం  సరిగ్గా  మన    అభిప్రాయాన్ని     చెప్పలేకపోతే  ఇతరులు  అపార్ధం  చేసుకునే   ప్రమాదం  కూడా  ఉంది. 


అలాగని  మన  అభిప్రాయాలను  అసలే  చెప్పకపోతే  పురాణేతిహాసాలను    అపార్ధం  చేసుకోవటం ,  హేళన  చేయటం,   ఎక్కువైపోతుంది  కదా  !


    కొన్ని    గ్రంధాలలోని   కొన్ని   విషయాలను  అలాగే    బహిరంగంగా    చెప్పకూడదనే  ఆంక్షలూ      ఉంటాయి.   ఆంక్షలు  లేకపోయినా  కూడా మనకు  అర్ధమైన   కొన్ని  విషయాలను  ఇతరులకు  చక్కగా  వివరించలేకపోవటం ... అనే  సమస్య  ఎదురవుతుంది. ,


 (     ఎవరికి  వారు  గ్రంధములను  స్వయంగా  చదివి    అర్ధం  చేసుకుంటేనే   కొన్ని  విషయాలు  బాగా  అర్ధమవుతాయి.  )

  ఇంకా,   ఇలా ...... బ్లాగుల్లో  బహిరంగంగా  వ్రాయలేని  విషయాలు  కొన్ని   ఉంటాయి,  ఇలా  ఎన్నో  కారణాల  వల్ల  నా  అభిప్రాయాలను  ఉన్నదున్నట్లుగా  వ్రాయలేకపోతున్నా  , అయితే,    ఈ  మాత్రం  వ్రాసే  అదృష్టాన్ని  ప్రసాదిస్తున్న  భగవంతునికి  కృతజ్ఞతలు  .అంతా  దైవం  దయ..



11 comments:

  1. మీ బ్లాగు బాగుందండీ...
    మీకు సముద్రంలో నీటిబొట్టంత అన్నా అర్థమైంది.. సంతోషం. :)

    "ఎవరికీ వారు గ్రంధములను స్వయంగా చదివి అర్థం చేసుకుంటే " వారికి ఉన్న పరిధిలో మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు కదా!.. తమ పరిధిని దాటి.. ఆ వాక్యాలలో ఉన్న నిఘుడమైన అర్థాన్ని.. తెలుసుకోవడం ఎలా?

    "నిశ్చలమైన మనసుతో శూన్యాన్ని భరించి, మనఃశుద్ధి కలిగి ఏకాగ్రచిత్తంతో పఠించ గలిగితే.. ఆ పదాలలో దాగివున్న అంతర్లీనమైన... అద్భుతమైన... అర్థాన్ని.. గ్రహించగలమని.. నా అభిప్రాయం.

    ఈరోజే మీ బ్లాగు చూసాను, ఇంకా మీ బ్లాగు పూర్తిగా చదవలేదు.. వీలుకుదిరినప్పుడు.. తప్పకుండా చదువుతాను.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. పనివత్తిడి వల్ల బ్లాగ్ ఆలస్యంగా చూశానండి. ( కొద్దిసేపటి క్రితమే ) రిప్లై ఇవ్వటం ఆలస్యమైనందుకు దయచేసి క్షమించండి.

      "నిశ్చలమైన మనసుతో శూన్యాన్ని భరించి, మనఃశుద్ధి కలిగి ఏకాగ్రచిత్తంతో పఠించ గలిగితే.. ఆ పదాలలో దాగివున్న అంతర్లీనమైన... అద్భుతమైన... అర్థాన్ని.. గ్రహించగలమని.. నా అభిప్రాయం. " ......చక్కగా చెప్పారండి..

      Delete
  2. స్వీయ గ్రంధ పఠనం వలన అంతరార్థాలు ఎప్పటికీ తెలియవు. ఒకసారి ఇలానే ఒకాయన రామాయణం చదువుతూ లంకలో ఉన్న సీతని వర్ణిస్తూ "ఏకవేణి" అని అంటే ఒక మహానుభావుడు ఆయన స్వంత అర్థంతో సీతా దేవి బాధలో ఉంది కనుక ఒక జడ వేసుకుంది, ఆనందంగా ఉంటే రెండు జడలు వేసుకునేది అని వివరించాడుట. అది చదివి ఎంతో మదన పడిన ఒక పండితుడు అప్పుడు అందులోని అర్థాన్ని వివరించాడుట. రాముని నుండి దూరమయినప్పుడు సీతమ్మ ఏ జడయితే వేసుకుందో అదే జడతో ఉంది అని వర్ణనలో తీసుకోవాలి, మీ ఇష్టానుసారం అర్థాలను తీసుకొంటే ఇదిగో ఇలా అఘవరిస్తుంది. అయినా అమ్మ బాధలో ఉన్న ఆ ఘట్టం చదువుతుంటే ఇలాంటి గొప్ప ఆలోచన మీకెలా వచ్చిందో కూడా అర్థం కావటం లేదు అని అన్నారుట. కనుకనే మన పెద్దలు చెప్పారు మన పురాణ, ఇతిహాసాలు ఏవయితే ఉన్నాయో అవన్నీ కూడా గురు ముఖతః నేర్చుకుంటేనే సరయిన అర్థం అంతరార్థం బోధపడతాయి అని. ఉదాహరణకి ఇది చూడండి.
    http://magazine.maalika.org/2012/03/17/%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B5%E0%B0%A7%E0%B0%A8%E0%B1%81%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B8%E0%B1%81/

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. పనివత్తిడి వల్ల బ్లాగ్ ఆలస్యంగా చూశానండి. ( కొద్దిసేపటి క్రితమే ) రిప్లై ఇవ్వటం ఆలస్యమైనందుకు దయచేసి క్షమించండి.

      మీరు శివధనుస్సు గురించి చక్కగా వ్రాసారండి.


      ..." మన పెద్దలు చెప్పారు మన పురాణ, ఇతిహాసాలు ఏవయితే ఉన్నాయో అవన్నీ కూడా గురు ముఖతః నేర్చుకుంటేనే సరయిన అర్థం అంతరార్థం బోధపడతాయి అని." .... ఈ విషయం నూటికి నూరుపాళ్ళూ నిజమండి.

      Delete
  3. మీరు ఒక యోగి ఆత్మా కధ చదువుతూనే ఉండండి....అవి అక్షరాలూ కావు వాటి వెనుక ఒక శక్తి ఉంటుంది.వివేకానండులవారివి కూడా...మంచి అభిప్రాయాలు మీవి...అభినందనలు

    ReplyDelete
  4. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. పనివత్తిడి వల్ల బ్లాగ్ ఆలస్యంగా చూశానండి. ( కొద్దిసేపటి క్రితమే ) రిప్లై ఇవ్వటం ఆలస్యమైనందుకు దయచేసి క్షమించండి.

    అవునండి. ఒక యోగి ఆత్మ కధ అద్భుతమైన గ్రంధం. మీరన్నట్లు .అవి అక్షరాలూ కావు వాటి వెనుక ఒక శక్తి ఉంటుంది. వివేకానందుల వారు కూడా ఒక అద్భుతమైన శక్తి .

    ReplyDelete
  5. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. పనివత్తిడి వల్ల బ్లాగ్ ఆలస్యంగా చూశానండి. ( కొద్దిసేపటి క్రితమే ) రిప్లై ఇవ్వటం ఆలస్యమైనందుకు దయచేసి క్షమించండి.

    అవునండి. ఒక యోగి ఆత్మ కధ అద్భుతమైన గ్రంధం. మీరన్నట్లు .అవి అక్షరాలూ కావు వాటి వెనుక ఒక శక్తి ఉంటుంది. వివేకానందుల వారు కూడా ఒక అద్భుతమైన శక్తి .

    ReplyDelete
  6. అమ్మో అనూరాధ గారు.. మీరు సింధువులో..బిందువు అనుకున్నారు. పర్వాలేదు.
    నాకైతే.. అసలు ఏమి తెలియదు. అది అంతే!
    అందుకే మీ బ్లాగ్ లో నేను కామెంట్స్ పెట్టలేను.
    కాస్త సమాజంలో తొంగి చూడండి మేడం. మీ శైలి బాగుంటుంది.
    ఇంకొక విషయం..పైన శశి టీచర్ ఉన్నారే..ఆవిడ అంతే..అన్నీ కలగా పులగం చేసి రాసి పడేస్తారు. నా స్థాయి మాత్రం ఎప్పుడూ స్టూడెంట్ స్థాయీ ఏ నండీ.. ప్లీజ్ అర్ధం చేసుకోండి. కాస్త మామూలు పోస్ట్ లు వ్రాయండి .
    చదివి..ఓ..స్పందన తెలిపి పోతాను.

    ReplyDelete
  7. చాలా గొప్పటపా చూశానండి ఒక మాట లేకుండానండి. మరేనండి, మీ ఆడంగులంతా వచ్చేశారు కదండీ, అనూరాధగారూ, మరి మొగంగులం శలవుతీసుకుంటామండీ! ఇదేంటండీ మీలా అయిపోయానండీ!!! :) :) :)

    ReplyDelete
  8. అక్షరసత్యములంటే ఇవే....చాలా నచ్చింది నాకు...!!

    ReplyDelete
  9. వనజవనమాలిగారు, kastephale శర్మగారు, సీతగారు అందరికి కృతజ్ఞతలండి. మీకు నాపేరు ఎలా తెలిసిందో అర్ధం కావటం లేదండి. చాలా ఆశ్చర్యంగా ఉంది.

    ఇంటిపని + ఈ రోజు రాయవలసిన టపా గురించి ఆలోచిస్తూ బ్లాగ్ చూడలేదండి. రిప్లై ఆలస్యంగా ఇస్తున్నందుకు దయచేసి క్షమించండి.

    ఆడవాళ్ళకు ఇంటిపని తప్పదు కదండి. నేను పనికి సహాయంగా కూడా ఎవరినీ పెట్టుకోలేదు. అందుకే నాకు ఇంట్లో పని ఎక్కువే. అందుకే ఒకోసారి వ్యాఖ్యలకు రిప్లై ఇవ్వటం ఆలస్యం అవుతోంది.

    నేను వ్రాసిన విషయాలు బాగున్నాయని మెచ్చుకోవటం మీ అందరి గొప్ప మనసును తెలియజేస్తుంది. . మీరు అందరూ కూడా చాలా బాగా వ్రాస్తున్నారండి. మీ అందరికి మరొక్కసారి పేరుపేరునా కృతజ్ఞతలు.

    ReplyDelete