koodali

Wednesday, December 28, 2011

దశావతారాలను పరిణామసిద్ధాంతం ప్రకారం....కరెక్ట్ కాదేమో...

ఇంతకుముందు వ్రాసిన టపాలో దశావతారాలను పరిణామసిద్ధాంతం ప్రకారం ఉదాహరిస్తూ వ్రాశాను కదండి. అయితే ఆ ఆలోచన కరెక్ట్ కాదేమో అనిపించింది.

తరువాత శ్రీ దేవీ భాగవతం గ్రంధములో కశ్యపుని సంతానంగా దేవ, దానవ, పశుపక్ష్యాదులు జన్మించాయని చదివిన తరువాత నాకు అనేక సందేహాలు ,ఆలోచనలు వచ్చాయి.

ఆ ఆలోచనలు,
సందేహాలు ఇక్కడ ..........

విష్ణుమూర్తి యొక్క దశావతారాలను పరిణామసిద్ధాంతం ప్రకారం చెప్పాలంటే ముందు వరాహావతారం కదా రావలసింది. ఎందుకంటే భూమిని సముద్రం నుంచి పైకి తీసినతరువాతే కదా భూమిపై జీవం ఏర్పడుతుంది...ఇలా సందేహాలు వచ్చాయి.

కనుక దశావతారాలు పరిణామక్రమం అని చెప్పలేము. ..... కశ్యపుని సంతానమైన దేవదానవులు, పశుపక్ష్యాదులు, ఎలా
డైరెక్ట్ పుట్టడం జరిగిందో ... మానవులు కూడా అలాగే డైరెక్ట్ గా పుట్టారు. .. అంతేకాని కోతి నుండి మానవులు పరిణామం చెందలేదని కచ్చితంగా చెప్పుకోవచ్చు.


విష్ణుమూర్తి మత్శ్యావతారం ధరించి సోమకాసురుని వధించి వేదములను రక్షించారు. అని  ఒక కధను పెద్దలు తెలిపారు.

ప్రళయం వచ్చేముందు విష్ణుమూర్తి మత్శ్యావతారం ధరించి భూమిపైని విత్తనాలు, పశుపక్ష్యాదులు, ఒక పడవలో దాచి ఆ పడవను తాను లాగి కాపాడారని ...... మరల సృష్టి ప్రారంభమయినప్పుడు పడవలోని బీజములతో మరల కొత్త సృష్టి ప్రారంభమయిందని  ఇంకొక కధ కూడా పెద్దలు తెలిపారు.

ఇక కూర్మావతార సందర్భంలో...... దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలికే సందర్భంలో విష్ణుమూర్తి కూర్మావతరం ధరించి దేవతలకు సహాయపడటం జరిగింది.

నాకు ఏం సందేహం వచ్చిందంటే ....దేవదానవులు , వాసుకి మొదలైనవారు కశ్ప్యపుల వారికి సంతానం అంటారు కదా ! మరి కశ్యపుల వారి సంతానమైన దేవదానవులు, వాసుకి మొదలగు సర్పజాతులు వరాహస్వామి భూమిని రక్షించిన తరువాత జన్మించారా ? లేక ముందే జన్మించారా ? దేవదానవులు ,వాసుకి మొదలైన వారు కూర్మావతార సమయంలోనే ఎలా ఉన్నారు ? వగైరా సందేహాలు వచ్చాయి.

విశ్వంలో ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయట. భూమి ప్రళయంలో మునిగిపోయినా కూడా ఇతర బ్రహ్మాండాలలోని జీవులు అలాగే ఉంటాయట. ఆదిపరాశక్తి అయిన పరమాత్మ ఉండే మణిద్వీపంలో అన్ని బ్రహ్మాండాలలోని దేవతలు తమతమ రూపాలతో ఎప్పుడూ ఉంటారట. క్షీరసాగరమధనంలో పాల్గొన్న దేవతలు
ఇతర బ్రహ్మాండాలలోని దేవదానవులు, సర్పజాతులూ ఏమో ? అని అనిపించింది. యిలా ఎన్నో ఆలోచనలు వచ్చాయి.
...........................

* బ్రహ్మ దేవుడు తన మానసపుత్రులను సృష్టించటం అనే సంఘటన భూమిపై కాకుండా సత్యలోకంలోనో , మరేలోకంలోనో జరిగింది..... అలాగే కశ్యపుడు సంతానాన్ని పొందటం ఏ లోకంలో జరిగిందో తెలియదు. తరువాత కశ్యపులవారి సంతానమైన దేవతలు స్వర్గలోకంలో, దైత్యులు పాతాళలోకంలో, మానవులు, పశుపక్ష్యాదులు భూలోకంలో నివాసం ఏర్పరుచుకున్నారని మనం భావించవచ్చు..

* నరసింహస్వామి వారు పరిణామ క్రమంలో చెప్పినట్లు మనిషిజంతువు నుంచి పరిణామం చెందిన దానికి ఉదాహరణ కాదు అని గట్టిగా చెప్పవచ్చు.

.........................................

* ఈ పైన చెప్పిన ఆలోచనలు తరువాత నాకు ఇలా అనిపించింది.....

మత్శ్యావతారం............


మత్శ్యావతారం
వరాహస్వామి భూమిని సముద్రం నుంచి పైకి తీయటానికి ముందు జరిగిన సంఘటన కాబట్టి........మత్శ్యం పరిణామక్రమంలో నీటిలో నివసించిన జీవికి ఉదాహరణ కాదు.

కూర్మావతారం ..... అవతారం
కూడా భూమిని సముద్రం నుంచి పైకి తీయటానికి ముందు జరిగిన సంఘటన ......కాబట్టి కూర్మావతారం నీటిపై ,నేలపై జీవించే పరిణామక్రమానికి ఉదాహరణ కాదు.

వరాహావతారం..... ఇప్పుడు భూమి సముద్రం నుంచీ పైకి తీయబడింది కాబట్టి ...

* ఈ అవతారం తరువాతే భూమిపై జీవం వృద్ధి జరిగింది అనిపిస్తుంది. .


* కశ్యపుడు అదితి యొక్క ...సంతానమైన దేవతలకు స్వర్గలోకం నివాసంగా నిర్ణయించబడింది. దితి సంతానమైన దైత్యులకు పాతాళాదిలోకాలు నివాసంగా నిర్ణయించబడ్డాయి.

( హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు మొదలైనవారు పాతాళంలోనే ఉండేవారట. అయితే వీళ్ళలో కొందరు
అప్పుడప్పుడు స్వర్గలోకపు వాళ్ళతోనూ, భూలోకపు వాళ్ళతోనూ యుద్ధాలు చేస్తుంటారు.)

*
కశ్యపుని వారసులైన మానవులకు , పశుపక్ష్యాదులు, మొదలైన వాటికి మాత్రం భూమి నివాసంగా నిర్ణయించబడింది. అప్పటినుంచీ మానవులు, పశుపక్ష్యాదులు మొదలైనవి భూమిపై అభివృద్ధి చెందాయి.

అయితే ఈ మానవులు, పశుపక్ష్యాదులు మొదలైన జీవులు అన్నీ ఒకేసారి జన్మించాయా ? లేక ఒకదాని తరువాత ఒకటి క్రమంగా వృద్ధి చెందాయా ? అన్నది తెలియదు. కశ్యపుని సంతానమైన పశుపక్ష్యాదులు ఏ క్రమంలో జన్మించాయని గ్రంధాలలో ఉందో నాకు తెలియదు. అందుకని నరసింహస్వామి వారి అవతారం కచ్చితంగా మానవుడు జంతురూపం నుంచీ మనిషిగా మారే జీవికి ఉదాహరణ కాదు అనుకోవచ్చు.

ఇక వామనావతారం, పరశురామావతారం, రామావతారం, కృష్ణావతారం వంటి వాటి విషయంలో సందేహాలు రావు.
..............................

* విష్ణుపురాణంలో సృష్టిక్రమం గురించి విపులంగా వర్ణించబడిందని విన్నాను. నేను విష్ణుపురాణం చదవలేదండి. మా ఇంట్లో మరీ ఎక్కువ గ్రంధాలు లేవు.

శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి కాణిపాకం క్షేత్ర మాహాత్మ్యం , శ్రీ దేవీ భాగవతము. శ్రీపాదశ్రీవల్లభచరితామృతము, ఒక యోగి ఆత్మ కధ, భగవద్గీత
, శ్రీ అన్నవరం క్షేత్రం స్థల పురాణము , శ్రీ అరుణాచల మాహాత్మ్యము, శ్రీశైల చరిత్రము, శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ... ఇలా ఇంకా కొన్ని ఉన్నాయండి. ఈ గ్రంధాలలోని విషయాలలో నాకు అర్ధమయింది సముద్రంలో నీటిబొట్టంత.

* ఈ టపాలో దశావతారముల గురించి వ్రాసిన వాటిలో కొన్ని విషయాలు నా ఊహ మాత్రమే.అవి ఎంతవరకూ నిజమో భగవంతునికే తెలియాలి.

వ్రాసిన వాటిలో పొరపాట్లు ఉన్నచో దైవం దయచేసి క్షమించాలని ప్రార్ధిస్తున్నాను.




3 comments:

  1. వచ్చేది కల్కి అవతారమే.నరుకుడే నరుకుడు, ఇచ్చుడో సచ్చుడో.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
    లోకంలో అన్యాయం, అధర్మం మితిమీరిపోయినప్పుడు దుష్టసంహారం చేయటానికి దైవం అవతారం ధరించి రావటం జరుగుతుంది మరి..

    ReplyDelete
  3. ఇ విశ్వం ఎలా పుట్టింది అనేది అందరికీ ఉన్న సందేహం.కొందరు దేవుడు పుట్టించాడు అంటున్నారు.అలా అనుకుంటే ఇ విశ్వం తనంతట తానే పుట్టిలేదు ఎవరో పుట్టించారు అదే దేవుడు అంటున్నారు.అలా అయితే దేవుడు కూడ తనంతట తాను పుట్టడు కద దేవుడు ఎలా పుట్టాడు

    ReplyDelete