koodali

Wednesday, December 7, 2011

ఈ విధంగా భావించవచ్చేమో .........



శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అవతారం చాలా గొప్పది.

శ్రీమహావిష్ణువు శ్రీవామనావతారంలో మొదట చిన్నరూపంతో కనిపించినా క్రమంగా విశ్వరూపాన్ని పొంది భూమి నుంచి అంతరిక్షం వరకూ పెరిగిన విషయం తెలిసిందే.

గీతను బోధించే సందర్భంలో శ్రీకృష్ణుల వారు అర్జునునికి విశ్వరూపాన్ని చూపిస్తారు. ఆ రూపాన్ని దర్శించిన తరువాత అర్జునుని ప్రార్ధనమేరకు తిరిగి మునుపటి రూపాన్నే ధరిస్తారు.

అలాగే నరసింహావతారంలో హిరణ్యకశిపుని సంహరించిన తరువాత నరసింహస్వామి వారు కూడా విశ్వరూపాన్ని ప్రదర్శించారేమో , ప్రహ్లాదులు ప్రార్ధించగా మరల పూర్వపు రూపాన్ని ధరించి వారిని అనుగ్రహించారేమో ? అనిపిస్తుంది.

( ఈ ఆలోచన సరైనదో కాదో నాకు తెలియదు. పొరపాట్లు ఉంటే దైవం క్షమించాలని ప్రార్ధిస్తున్నాను. )

ప్రాచీనులకు మనకన్నా ఎక్కువగా విజ్ఞానం తెలుసు అనీ , ప్రాచీన గ్రంధాలను చదివి , పైపైన ఆలోచించి అపార్ధం చేసుకోకూడదు అనీ అనిపిస్తుంది.


అప్పటివారు కొందరు కుండలలో పిండాలను భద్రపరిచి పెంచినట్లు నేను ఒక దగ్గర చదివాను. ఆ విధానం ఇప్పటి టెస్ట్ ట్యూబు బేబీ పద్ధతి లాంటిది అనిపిస్తుంది కదా !

ఇలా ఇప్పటికే చాలా విషయాల్లో , ఈ నాటి శాస్త్రవిజ్ఞానం ద్వారా ప్రాచీన గ్రంధాలలోని విషయాలు ఆచరణ సాధ్యమేనని నిరూపించబడ్డాయి.

ఈ రోజుల్లో సంతానం లేని కొందరు తల్లిదండ్రులు స్పెర్మ్ బ్యాంకుల సహాయంతో సంతానాన్ని పొందుతున్నారు. అలా పుట్టిన బిడ్డలకు వీర్యదాత ఎవరో గ్రహీతకు కూడా తెలియనివ్వరట. ఈ విధంగా స్త్రీపురుషుల సాన్నిహిత్యం లేకుండానే సంతానాన్ని పొందటం సాధ్యమే.. అని కూడా ఇప్పుడు ఋజువయ్యింది కదా !


( సృష్టిలో కొన్ని మొక్కలలో కూడా పరపరాగసంపర్కం , ఫలదీకరణం అవసరం లేకుండానే వంశాభివృద్ధి జరిగే పద్ధతి ఉంది. ఉదా....ఒక మొక్క
యొక్క ,. కొమ్మను విరిచి నేలలో పాతితే కొత్త మొక్కగా పెరుగుతుంది. )


ప్రాచీనగ్రంధాలలో..... అనివార్యకారణాలవల్ల , తప్పనిసరి పరిస్థితులలో , ఇతరపద్ధతులలో సంతానాన్ని పొందిన కొందరు వ్యక్తుల కధలు ఉంటాయి. ఈనాటి వారు కొందరు ఆ కధలను అపార్ధం చేసుకుంటారు.


నా అభిప్రాయం ఏమంటే , .........ఆ కధలలోని వ్యక్తులు , స్త్రీపురుషుల సాన్నిహిత్యం అనేది లేకుండా , పైన మనం చెప్పుకున్నటువంటి వైజ్ఞానిక పద్ధతుల ద్వారా గానీ .... లేక ....... తపశ్శక్తి, యోగశక్తితో గానీ సంతానాన్ని పొంది ఉండవచ్చు కదా అనిపిస్తుంది.

ఏమైనా ఆనాటి వాళ్ళకి మనకన్నా మెరుగైన ( సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేని ) శాస్త్రవిజ్ఞానం తెలుసేమో అనిపిస్తుంది.


" శ్రీ దేవీ భాగవతము ", " శ్రీ పాద శ్రీవల్లభ  సంపూర్ణ చరితామృతము " వంటి గ్రంధములలో ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. నా బోటివాళ్ళకు ఆ గ్రంధములలోని కొన్ని విషయాలు అస్సలు అర్ధం కావు. కొన్ని విషయాలు అర్ధం అయినట్లుగా అనిపిస్తాయి.


కొన్ని ప్రాచీన గ్రంధములలోని కొన్ని విషయములు పైకి ఒక విధంగా అర్ధం స్ఫురిస్తూ , లోతుగా ఆలోచిస్తే వేరొక అర్ధం కూడా స్ఫురించేలా
ఉంటాయట.
 


 కొన్ని విషయాలు చదివినకొద్దీ ఎప్పటికప్పుడు కొత్త అర్ధాలు స్ఫురిస్తూ కూడా ఉంటాయట. అంచేత వాటిని చదివి మనకు తోచినట్లుగా అపార్ధం చేసుకోకూడదు.

వ్రాసిన విషయాల్లో ఎక్కడైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.




2 comments:

  1. మీరు అంటున్నఈ ప్రాచీన గ్రంధాలు అనే వాటిని "ఇతి హాసాలు" అని కుడా వ్యవహరిస్తుంటారు ఇతి హాసం అంటేనే "ఇలా (ఇది) జరిగినది" అని అర్థం.
    పుష్పక విమానం సొగసే వేరు ఎంత మంది ఎక్కినా మరొక్కరికి చోటు ఉంటుందంట, ఆధునీకులు విమానం కనుగొన్నారు కానీ అపరిమిత స్థాయికి ఇంకా technology develop కాలేదనే చెప్పాలి.
    ఏమంటారు?
    ఇక్కడ ఈ మధ్య కొందరు మరోలా ప్రశ్నలు సంధిస్తున్నారు, అదే మంటే ఏదైనా కొత్త సంగతి వెలుగులోకి వస్తే ఆ ఇది మా వేదాలలో ఎప్పుడో చెప్పారు అంటూ వెలుగులోకి తీసుకు వస్తారు ఆ అంశాన్ని
    అందాక అది వెలుగు చూడనిదే అవుతుంది
    కానీ సైన్సు మటుకు నిరూపణ లేనిదే దేనిని నమ్మడు కదా!
    Nice post

    Nice views

    Thanks

    ?!

    ReplyDelete
  2. మీకు కృతజ్ఞతలండి.

    నాకు ఆధునిక విజ్ఞానం అన్నా గౌరవమేనండి. . ఒక రకంగా చూస్తే ఈనాటి పరిశోధనల వల్ల కూడా ప్రాచీన విజ్ఞానం యొక్క గొప్పదనం అందరికీ తెలుస్తోంది.

    వేదవిజ్ఞానం ఎంతో గొప్పది . కాబట్టే గొప్పది అంటున్నాము.

    ఇక , " సైన్సు మటుకు నిరూపణ లేనిదే దేనిని నమ్మదు కదా!" అన్నారు.

    ఆధునిక సైన్స్ ను కూడా ఎంతవరకూ నమ్మాలి ? ఒకసారి నిరూపణ అయిన విషయాలే కొంతకాలానికి పొరపాటుగా ఋజువయిన సంఘటనలు తరచుగా చూస్తూనే ఉన్నాము. ఈ మధ్యే కాంతి యొక్క వేగం ............విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.

    ఇంకా ప్లాస్టిక్ వంటి విషయాల్లో మొదట అద్భుతంగా చెప్పుకున్న విషయాలే కాలం గడిచాక ఇప్పుడు వాటివల్ల కలిగే కొన్ని నష్టాలను అనుభవిస్తూనే ఉన్నాము. ఇలా చాలా ఉంటాయి. ఈ నాటి శాస్త్రవేత్తలన్నా నాకు గౌరవమే. నేను ఎవరినీ తప్పుపట్టడం లేదు. పొరపాట్లు ఎవరికైనా వస్తాయి.

    ప్రతిదానికీ దైవాన్ని ప్రాచీన గ్రంధాలనూ విమర్శించటం తప్పు అన్నదే నా అభిప్రాయమండి. ప్రాచీనులకు ఇప్పటి కన్నా మెరుగైన విజ్ఞానం తెలుసేమో ? కొన్ని కారణాలవల్ల ఆ నాగరికత కాలగర్భంలో కలిసిపోయిందేమో ? అనిపిస్తుందండి...

    ReplyDelete