koodali

Friday, December 23, 2011

ఈరోజుల్లో ఆర్ధికమాంద్యం, నిరుద్యోగం, పేదరికం, వంటి వాటికి ఎన్నో........

 
నేడు రైతు దినోత్సవమట. మొన్న మేము షాప్ లో పెసలు కొంటే ఒక . కిలో 90 రూపాయలు. అందులో సగం ధర అయినా రైతుకు చెల్లించరేమో ? వాటి రేట్లు చూసి పండించే రైతుకు, కొనే వినియోగదారులకూ కళ్ళు తిరుగుతున్నాయి. మరి మధ్యలో జరుగుతున్న మాయాజాలం ఏమిటో మనకు అర్ధం కాదు.


పేదవారు పేదవారిగానే ఉండిపోతున్నారు. ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు. దైవం జీవుల అవసరాల కోసం గాలినీ, నీటినీ, పంటలను, ఖనిజాల వంటి సహజ వనరులను సృష్టించి ఇచ్చినా కూడా సంపద కొందరి చేతుల్లోనే ఉండటం , పధకాల అమలులో సరైన ప్రణాళిక లేకపోవటం, అమలు చేసే కొందరిలో చిత్తశుద్ధి లోపం వంటి కొన్ని కారణాల వల్ల ప్రపంచంలో పేదరికం తగ్గటం లేదు.


ఈ సమస్యలు ఇలా ఉన్నంతకాలం ఎన్ని పరిశ్రమలు పెట్టినా, ఏం చేసినా వాతావరణకాలుష్యం, పెరిగిపోవటం, సహజవనరులు తరిగిపోవటం తప్ప పేదరికం తగ్గదు.


ఇప్పుడు చూస్తున్నాము కదా ! కరెంట్ కోత. బొగ్గు నిల్వలు తగ్గిపోతున్నాయి. పెట్రో, సహజవాయు నిల్వలు కూడా కొంతకాలానికి అయిపోతాయంట. అందుకే అణువిద్యుత్ అవసరం అంటున్నారు. అణుశక్తి కనిపెట్టిన తరువాత కొన్ని దేశాలు తమ దేశ రక్షణకు ఉపయోగించుకున్నాయి. దేశరక్షణ వంటి విషయాల్లో మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా మనమూ రక్షణ ఏర్పాట్లు గట్టిగా చేసుకోవాలి.


కానీ అణువిద్యుత్ తయారీ విషయంలో మాత్రం అలాంటి తప్పనిసరి అవసరం లేదు. అణువిద్యుత్ కన్నా మనం సౌరశక్తి వంటి మార్గాలను అభివృద్ధి చేసుకోవచ్చు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా అణువిద్యుత్ విషయంలో వెనుకంజ వేస్తుంటే మనవాళ్ళు ఎందుకు ఇంత మక్కువ చూపిస్తున్నారో మరి. .అంతా దురదృష్టం.


విద్యుత్ ఉంటే పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వచ్చి పేదరికం పోతుంది అని వారు అంటుంటారు.


కానీ, పేదరికం పోగొట్టాలంటే ..........సంపద కొందరి వద్ద మాత్రమే కాకుండా అందరికీ చెందేలా గట్టి చర్యలు తీసుకోవాలి. అప్పుడే పేదరికం పోతుంది.

అదీకాక పరిశ్రమలు నెలకొల్పాలన్నా విద్యుత్ ఒక్కటి ఉంటే సరిపోదు కదా ! వస్తువులను తయారుచేయటానికి ఇనుము, అల్యూమినియం వంటి ఎన్నో ఖనిజాలు అవసరమవుతాయి.


పరిశ్రమలు బాగా నెలకొల్పి బాగా వస్తువులు తయారు చేసేకొద్దీ ఖనిజనిల్వలు తగ్గిపోతాయి. అప్పుడు పరిశ్రమలకు కావలసిన ముడిసరుకు ఎక్కడినుంచీ తెస్తారు ?


ఇలాగే ఉపాధి అవకాశాల కోసం వస్తువులను ఉత్పత్తి చేసుకుంటూ పోతే ఇంకో 50 ఏళ్ళకు ముడిసరుకు కూడా లభ్యం కానంతగా ఖనిజసంపద తగ్గిపోతుంది. . ( ఎంత రీసైక్లింగ్ చేసినా కూడా )


ఇదంతా ఆలోచించే కొన్ని దేశాలవాళ్ళు ముందు జాగ్రత్తగా తమ దేశాలలోని ఖనిజాలను తవ్వటం ఆపేసి గనులను మూసేసారట. ( భవిష్యత్తు అవసరాల కోసం. )


మరి కొందరు వనరుల కోసం బోలెడు డబ్బు ఖర్చుపెట్టి ఇతరగ్రహాలపై కూడా వెతుకుతున్నారు.

ఇతరగ్రహాలపైన వనరులను ఉపయోగించి తయారు చేసే వస్తువుల ధర సామాన్యులకు అందుబాటులో ఉంటుందా ? ఇతర గ్రహాల పైకి సామాన్యులు వెళ్ళగలరా ? కోట్లాది డబ్బు వ్యయం చేసి ఇతరగ్రహాలను ఎందుకు వెతుకుతున్నారో అర్ధంకాదు.


అందుకే వస్తూత్పత్తి రంగం ద్వారా ఉపాధి అవకాశాలు అనే కాన్సెప్ట్ ను కొద్దిగా తగ్గించుకుని ఇతర రంగాల ద్వారా ఉపాధి అవకాశాలను పెంచుకోవాలి.

ఇంకా నిరుద్యోగం తగ్గాలంటే యంత్రాల వినియోగం కొద్దిగానైనా తగ్గించాలి. చేతివృత్తులను ప్రోత్సహించాలి.

పూర్వం ఆడవాళ్ళు అంతగా ఉద్యోగాలు చేసేవారు కాదు. ఇల్లు చక్కదిద్దుకోవటం, ఇంట్లోనే కూరగాయలు పెంపకం, పాడి, కుట్లు అల్లికలు వంటివి చేస్తూ కుటుంబానికి సాయంగా ఉండేవారు.


ఈ రోజుల్లో మరి ఆకాశంలో సగం అంటూ అన్ని ఉద్యోగాలకూ మహిళలు పోటీపడుతున్నారు. బాగానే ఉంది. కానీ ఆడవాళ్ళకీ, మగవాళ్ళకీ అందరికీ అన్ని ఉద్యోగాలు ఎక్కడినుంచీ వస్తాయి ?


ఈ రోజుల్లో నిరుద్యోగం బాగా పెరిగిపోవటానికి ఇది కూడా ఒక కారణం అనిపిస్తుంది. ( ఇది చదివి చాలామంది నన్ను తిట్టుకుంటారు లెండి. ) ఈ విషయంలో మా ఇంట్లో వాళ్ళతో కూడా నాకు వాగ్వివాదాలు జరుగుతూ ఉంటాయి. వైద్యం, అధ్యాపక వృత్తి .. వంటి కొన్ని రంగాలలో ఆడవాళ్ళు పనిచేయటం అవసరమే.


కానీ, ఆడవాళ్ళకీ, మగవాళ్ళకీ అందరికీ అన్ని ఉద్యోగాలు ఏ ప్రభుత్వమైనా ఎవరు మాత్రం ఎక్కడి నుంచీ సృష్టించగలరు ? ఉద్యోగాలు ఆడవాళ్ళు చెయ్యాలా ? లేక మగవాళ్ళా ? అన్నది కాదు ఇప్పుడు చర్చ. అందరికీ అన్ని ఉద్యోగాలు ఎక్కడి నుంచీ సృష్టించగలరు ? అన్నది సమస్య.


ఇలా ఈరోజుల్లో ఆర్ధికమాంద్యం, నిరుద్యోగం, పేదరికం, వంటి వాటికి ఎన్నో కారణాలున్నాయి.

అన్నింటికీ ప్రధాన కారణం సమాజంలో నైతికవిలువలకు ప్రాధాన్యత తగ్గిపోవటం, అత్యాశ , కోరికలు పెరిగిపోవటం మొదలైనవి..

ఇప్పటి కరెంట్ కోతకే ఇలా ఉంటే , కొంతకాలానికి సహజవనరులన్నీ అయిపోతే మన పరిస్థితి ఏమిటి ? అందుకే ఇప్పటినుంచే యంత్రాలను కొద్దిగా ప్రక్కన పెట్టి మళ్ళీ మన పనులను మనమే చేసుకోవటానికి అలవాటుపడటం మంచిది..


15 comments:

  1. >>>>>ఇతరగ్రహాలపైన వనరులను ఉపయోగించి తయారు చేసే వస్తువుల ధర సామాన్యులకు అందుబాటులో ఉంటుందా ? ఇతర గ్రహాల పైకి సామాన్యులు వెళ్ళగలరా ? కోట్లాది డబ్బు వ్యయం చేసి ఇతరగ్రహాలను ఎందుకు వెతుకుతున్నారో అర్ధంకాదు<<<<<<< ardham kaanappudu calm ga koorchovaali.chese vallemee pichi vaallu kaadu!

    >>>>>>కానీ, ఆడవాళ్ళకీ, మగవాళ్ళకీ అందరికీ అన్ని ఉద్యోగాలు ఏ ప్రభుత్వమైనా ఎవరు మాత్రం ఎక్కడి నుంచీ సృష్టించగలరు ? ఉద్యోగాలు ఆడవాళ్ళు చెయ్యాలా ? లేక మగవాళ్ళా ? అన్నది కాదు ఇప్పుడు చర్చ. అందరికీ అన్ని ఉద్యోగాలు ఎక్కడి నుంచీ సృష్టించగలరు ? అన్నది సమస్య.<<<<<<< poni, kontha mandi jannalanu champeddaama??

    >>>>>>కానీ అణువిద్యుత్ తయారీ విషయంలో మాత్రం అలాంటి తప్పనిసరి అవసరం లేదు. అణువిద్యుత్ కన్నా మనం సౌరశక్తి వంటి మార్గాలను అభివృద్ధి చేసుకోవచ్చు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా అణువిద్యుత్ విషయంలో వెనుకంజ వేస్తుంటే మనవాళ్ళు ఎందుకు ఇంత మక్కువ చూపిస్తున్నారో మరి. .అంతా దురదృష్టం.<<<<<< solar energy ki nuclear energy ki teda emito meeku telusaa?

    emi teliyakundaa...enduku raastarandee blagulu?? aaa?

    ReplyDelete
  2. హమ్మయ్య ! నేను ఊహించినట్లే ఒకరు వ్రాశారు. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    >>>>>కానీ, ఆడవాళ్ళకీ, మగవాళ్ళకీ అందరికీ అన్ని ఉద్యోగాలు ఏ ప్రభుత్వమైనా ఎవరు మాత్రం ఎక్కడి నుంచీ సృష్టించగలరు ? ఉద్యోగాలు ఆడవాళ్ళు చెయ్యాలా ? లేక మగవాళ్ళా ? అన్నది కాదు ఇప్పుడు చర్చ. అందరికీ అన్ని ఉద్యోగాలు ఎక్కడి నుంచీ సృష్టించగలరు ? అన్నది సమస్య.<<<<<<< poni, kontha mandi jannalanu champeddaama??

    మీరు ఎందుకు ఇంతగా ఇరిటేట్ అయిపోతున్నారో అర్ధం కావటం లేదు. ఆడవాళ్ళు ఉద్యోగం చేయటం గురించి నా అభిప్రాయము క్లుప్తంగా..........

    .ఆడవాళ్ళకు తాము ఉద్యోగం చెయ్యకపోతే తప్ప ఇంట్లో భోజనానికి కూడా ఇబ్బంది ఉండే పరిస్థితి ఉన్నప్పుడు, ..... తాను ఉద్యోగం చెయ్యటం వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది అనుకున్నప్పుడు .... ...ఇలాంటప్పుడు తప్పకుండా ఉద్యోగం చెయ్యాలి.

    అంతే కానీ ఇంట్లో ఏమీ తోచక కాలక్షేపానికి , .... లేక ఇంట్లో అత్తమామలకు ఎక్కడ సేవ చెయ్యాలో అని, ...... లేక మరిన్ని విలాసవస్తువులు కొనుక్కోవటానికో, ..... లేక మరింత సంపాదన పెంచుకోవటానికో ..... ఉద్యోగం చెయ్యటం బాగుండదు అని నా అభిప్రాయం.

    కొందరు ఆడవాళ్ళు తమకు ఇష్టం లేకపోయినా మరింత సంపాదన కోసం భర్త చెయ్యమనటం వల్ల ఉద్యోగాలు చేస్తారు. కొందరు తమ ప్రతిభ ప్రపంచానికి తెలియాలని చేస్తారు. ( ప్రతిభ ఉండీ ఉద్యోగాలు దొరకని మగవాళ్ళెందరో ఉన్నారు. )


    * కానీ అంతగా అవసరం లేకపోయినా ఉద్యోగం చేసే ఆడవాళ్ళ వల్ల ...ఉద్యోగమే ప్రాణావసరమైన కుటుంబాల్లోని మగపిల్లలకు ఉద్యోగాలు దొరకపోవచ్చు. ఇలాంటి వాళ్ళ వల్ల ఒక పేద కుటుంబంలోని వారు ఉద్యోగం దొరకక ఇబ్బంది పడటం అన్యాయం కదా !

    సమాజంలో ఆడవాళ్ళు ఉద్యోగం చెయ్యకపోయినా పెద్దగా ఎవరూ ఏమీ అనరు. కాని మగవాళ్ళు ఉద్యోగం ( ఏదైనా పని ) దొరకకపోతే చాలా ఫీలయ్యి ఆత్మహత్య చేసుకోవాలన్నంత డిప్రెస్ అవుతారు.


    >>>>>ఇతరగ్రహాలపైన వనరులను ఉపయోగించి తయారు చేసే వస్తువుల ధర సామాన్యులకు అందుబాటులో ఉంటుందా ? ఇతర గ్రహాల పైకి సామాన్యులు వెళ్ళగలరా ? కోట్లాది డబ్బు వ్యయం చేసి ఇతరగ్రహాలను ఎందుకు వెతుకుతున్నారో అర్ధంకాదు<<<<<<< "ardham kaanappudu calm ga koorchovaali.chese vallemee pichi vaallu kaadu!"

    నాకు అర్ధం కాలేదు. నిజమే మీకు అర్ధమయితే దయచేసి చెప్పగలరు.

    >>>>>>కానీ అణువిద్యుత్ తయారీ విషయంలో మాత్రం అలాంటి తప్పనిసరి అవసరం లేదు. అణువిద్యుత్ కన్నా మనం సౌరశక్తి వంటి మార్గాలను అభివృద్ధి చేసుకోవచ్చు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా అణువిద్యుత్ విషయంలో వెనుకంజ వేస్తుంటే మనవాళ్ళు ఎందుకు ఇంత మక్కువ చూపిస్తున్నారో మరి. .అంతా దురదృష్టం.<<<<<< solar energy ki nuclear energy ki teda emito meeku telusaa?

    అబ్బే ! నాకు తెలియదండి. మీకు తెలిసింది చెప్పగలరు....

    ReplyDelete
  3. english lo raastunnanduku sorry...

    suppose, pelli ayina 4 years tarvata, bhartaku emaina ayithe...aavida paristhithi emiti? appudu evaru job ivvaru kadaa! emantaru??

    aadavallu enduku job cheyyali ante independent gaa brathakadaaniki.
    aadavaallu bhartha meede depend avvali anedi, matham (religion) create chesina oka darridram!

    ayithe...inni jobulu ekkadi nunchi vastayi antaara?? anduke kadandee....govt subsideelu, sez lu, petti, interest unna vaallani company lu pettamani mottukontundi!!....manavallaku adi chetakaaka memu udyogaalu matrame chestaam...ante tappu evaridi? manadenandi...antala alochinchoddu...meedi, naadeenu.
    oorike govt. ni tiduthoo kurchunte saripodu kadaa! okkasai govt. website la loki velli choodandi enni rakala offers isthondo, kotta company start cheyyadaniki!
    Ikapote aa technical vishayaalu antaara...google lo kodithe meeke telustundi...

    Of course, emi raasukontaaro mee ishtam! kaani emi teliyani vaallu ide nijamani namme pramadamundi kadaa! alaa mislead cheyyakoodadu kadaa....info antha mee daggara undi anna tarvate raasudu suru cheyyale kadaa...
    untaanandi!

    ReplyDelete
  4. indaakaa cheppatam marachanu...

    ithara grahaalalo materials emunnayo verukutunaadi.....vaatini ikkadaku techesi vadesukondaamani kaadu.....enduko teliyaalante...koddigaa..science elaa work avutundo kooda telisi undaali...ledante...google undigaa...use it! bye.

    ReplyDelete
  5. Infosys....okkka machine vaadadu..computerlu tappa...mari 100,000 mandiki udyogaalu kalpinchaledooo...ilantivi enni companies unnayo india lo meeku telusaa?

    facebook....vaadukonnaduku meeru dabbulu kattaru (ee blog kooda)..ayinaa...daani founder billionaire....elaaa?ikkada ""parisrameekarana"" lede!!aaa! aaaaaa!!

    maarutunna kaalanni batti bathakadam nerchukovaali...

    petrol, diesel pothe....fuel cell, hydrogen vastaayi....em..raaava?? phone poyi 2G adi poyi 3G .....alochistunnaraaa..

    1000 years kritam shippulalo business chestaarani appati manushulu oohinchi untaara..?500 years kritam vimaanaalalo manushulu prayanistharani appati manushulu oohinchaara..?

    mee alochanaloo maaraali..meeroo marali....glass lo migili unna water nu choodandi...ayipoyina water ni kaadu!

    ReplyDelete
  6. ఆడవాళ్ళు ఉద్యోగాలు అసలే చెయ్యకూడదని నేను అనలేదండి. అంతగా అవసరం లేకపోయినా ఉద్యోగం చేసేవాళ్ళు , ఇంకా ఇలాంటి కొందరి వల్ల ఉద్యోగమే ప్రాణావసరమైన వారికి నష్టం జరగకూడదని ....

    ఇక భర్త చనిపోయిన స్త్రీల రక్షణ , ఆడవాళ్ళు భర్త మీదే డిపెండ్ అవ్వాలా ...ఇలాంటి విషయాల గురించి నా అభిప్రాయాలు మీకు నచ్చకపోవచ్చు అనుకుంటున్నాను. అందుకే ఇప్పుడు చెప్పటం లేదండి.

    అంతేకాక ఒక్కొక్కరి జీవితాన్ని ఎన్నో కోణాలనుంచి చూస్తేనే ఒక భార్యది తప్పా ? లేక భర్తది తప్పా ? అన్నది తెలుస్తుంది. ఒకోసారి ఎవరిది తప్పు అన్నది తెలియకపోవచ్చు కూడా .

    నేను స్త్రీల తరపు కాదు. పురుషుల తరపు కాదు. మనం న్యాయం ఎవరి వైపు ఉంటే వారివైపు మాట్లాడాలి. అడవాళ్ళు పూర్వం కూడా ఇంట్లో ఖాళీగా కూర్చునేవారు కాదండి. ఇంటి పని పూర్తి చేసి ఇంట్లోనే కుట్లు అల్లికలు, కూరగాయలు పెంచటం, పాలు, వెన్న తయారుచేయటం ( కుటీరపరిశ్రమల వంటివి ) ఇలాంటివి చేసి ఆదాయం పొందేవారు. ఈ రోజుల్లో ఇలాంటివే చిన్న పరిశ్రమలుగా స్థాపిస్తున్నారు కదా!

    ఇక ఇతర గ్రహాలలోని వనరుల గురించి జరుగుతున్న పరిశోధనల గురించి , అణుశక్తి, సోలార్ పవర్ వంటివిషయాల గురించి నా అభిప్రాయం నాకు కరెక్ట్ గానే అనిపిస్తుంది. నా అభిప్రాయం నాది. మీ అభిప్రాయం మీది.
    ............................................

    ఇతరగ్రహాల్లోని మెటీరియల్స్ ఇక్కడికి తేరు. సరే మరి ఇక్కడి వాళ్ళే ఇతర గ్రహాలకు వెళ్ళి నివసిస్తారు. ఇదంతా ధనవంతులకు తప్ప సామాన్యులకు సాధ్యమయ్యే పనా ?

    ఇక మీరు చెప్పినట్లు బోలెడు కంపెనీలు, ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి. నిజమే, మరి గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ పొరకు హాని, అనూహ్యంగా మారిపోతున్న వాతావరణం , అణుశక్తి కర్మాగారాల నుంచి ప్రమాదాల వల్ల వెలువడే రేడియేషన్, వేగంగా తరిగిపోతున్న సహజవనరులు .. వీటి సంగతి ఏమిటి ?

    ఇన్ని ఉద్యోగాలు, కంపెనీలు ఉన్నాయి నిజమే ఆకలితో చనిపోతున్న ప్రజల సంగతి ఏమిటి ?, పేదరికం ఎందుకు తగ్గటం లేదో ?

    పెట్రోల్ అయిపోయినా హైడ్రోజెన్ వస్తాయి అన్నారు. మరి వెహికల్ తయారు చెయ్యాలంటే ఖనిజ నిల్వలు అయిపోయాక దేనితో తయారు చేస్తారు,. ఏదో ఒక కొత్త పదార్ధం తయారు చేస్తారు. అది ప్లాస్టిక్ లా పర్యావరణానికి హాని చేస్తుంది.

    ఈ విమానాలు, ఓడలు అవి పూర్వ కాలం లోనే ఉన్నాయి. అయినా నేను విజ్ఞానానికి వ్యతిరేకం కాదు. పర్యావరణానికి హాని జరగని విజ్ఞానం కనిపెట్టాలని నా అభిప్రాయం.

    అంతేకాక మనిషి కోరికలు తగ్గించుకుంటేనే అన్నిటికీ మంచిది.

    ఏ సోలార్ తుఫానో రావటం జరిగి శాటిలైట్స్ ఫెయిల్ అయితే అంతే సంగతులు. ప్రపంచం అంతా గందరగోళం. పాపం శమించుగాక !

    ReplyDelete
  7. యంత్రాలను కొద్దిగా ప్రక్కన పెట్టి మళ్ళీ మన పనులను మనమే చేసుకోవటానికి అలవాటుపడటం మంచిది..

    Gr8 Conclusion

    :)

    ?!

    ReplyDelete
  8. >>>>ఇతరగ్రహాల్లోని మెటీరియల్స్ ఇక్కడికి తేరు. సరే మరి ఇక్కడి వాళ్ళే ఇతర గ్రహాలకు వెళ్ళి నివసిస్తారు. ఇదంతా ధనవంతులకు తప్ప సామాన్యులకు సాధ్యమయ్యే పనా ?>>
    Sir, they do research, not to live there, but, just to find out to know the unknown...they do know that it is impossible to live there for a human..they r not idiots!

    why researching if you cant live there??? god! help him! check the by-products of space travel research..that became useful for us in daily life, including this internet!

    global warming....that's why the fuel cell and hydrogen fuel sir...please!because the petrol and diesel are harming the ozone layer,we are going for hydrogen and fuel cell! why don't u understand????
    we r trying to replace them with hydrogen, so that, we can have a better earth!

    ఇన్ని ఉద్యోగాలు, కంపెనీలు ఉన్నాయి నిజమే ఆకలితో చనిపోతున్న ప్రజల సంగతి ఏమిటి ?, పేదరికం ఎందుకు తగ్గటం లేదో ? nenu already cheppanu, india lo, company lu pette dammu unna vallu leru! pedarikam, pani create avvakapovatam vallane florish avutundi!, pani create chese badhyatha chaduvukunna vallade..govt. di kaadu!

    aaa badhyata vadilesi, ooorike, interentlo...blogulu raasukuntoo koorchunte..meeru anukontunatluga....pedarikam chaavadu...kanuka...pani modalettandi...so that...inkoka 10 mandiki jeevanopadhi doriketluga....

    పెట్రోల్ అయిపోయినా హైడ్రోజెన్ వస్తాయి అన్నారు. మరి వెహికల్ తయారు చెయ్యాలంటే ఖనిజ నిల్వలు అయిపోయాక దేనితో తయారు చేస్తారు,. ఏదో ఒక కొత్త పదార్ధం తయారు చేస్తారు. అది ప్లాస్టిక్ లా పర్యావరణానికి హాని చేస్తుంది.

    mastaroooo....unna cars lo ne petrol engine thesesi hydrogen engine pedatharu...meeru worry avvadhu! daani kosam memu unnam!

    ఏ సోలార్ తుఫానో రావటం జరిగి శాటిలైట్స్ ఫెయిల్ అయితే అంతే సంగతులు. ప్రపంచం అంతా గందరగోళం. పాపం శమించుగాక !

    solar thoofan ante emitoooo??? technical details emaina istaraa? oorike sapistaaraa?

    ReplyDelete
  9. Ilanti burra thakkuva blogs rayakunda.....

    global warming, pllution tagginchdaaniki, evaru ee rakanga krushi chestunnaro vraste..baaaguntundi..Sir! avunu le...daani kosam malli chala search cheyyali,,,,chadavaali mari!

    alage, mee illu gree bulding aaa????
    meeru ae vidhangaanainaa power save chestunnara???
    rain water harvesting mee intlo undaa?
    solar power mee intlo (very cheap) vaadutunnara??

    tanaku maalina dharmam vadhu Sir!

    Ikkada, power engineering field lo unna vaallandaru...green earth kosame try chestunnaam!!
    mee laanotoollu..unna..chachina...maaku pedda theda emi vundadhu!

    kaakapothe...meeru cheppina..aaaa...debba tagilina kaalunu (leg) cut chesedhamante.....mee burra Ae range lo undo mari..
    Meeku answelu istunna...nenu entha edhavano mari......

    ReplyDelete
  10. green building? ani naa udhesyam!

    Sir, burra unna vallandaroo, right way lo ne work chestunnaru....meeku answer cheppukovalsina dusthithi lo leru....

    Meeru kooda...meeku chatanainantavaraku, ee polution ni aapataaniki try cheyyandi, mee laanti vallu cheyyanidhi....maa lanti vallu enta chesina upayogam undadu...kaakarakaya kaburlu manesi naluguriki cheppandi, cheyinchandi....oorike blogullo salahalu(free) isthoo...kochovaddu...anneeee telisina meeku, oka nissahayudi request (from Indian.Govt).

    ReplyDelete
  11. సోదరులు శివ గారికి వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలండి.

    ReplyDelete
  12. ఇంతకు ముందు ఒక అజ్ఞాత ఏం చెప్పారంటే... ఒకవేళ భర్త మరణిస్తే ఆడవాళ్ళకి జీవనోపధి కష్టమవుతుందని ఆలోచించి , ఆందుకే కొందరు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తారని అన్నారు. అలా అన్నీ సందేహించాలంటే ఉద్యోగం చేసినంత మాత్రాన ఎవరికైనా రక్షణ ఉంటుందని నేను అనుకోను. ఆరోగ్యం బాగున్నంత వరకే ఉద్యోగాలు ఉంటాయి. ఖర్మకాలి పెద్ద అనారోగ్యం రావటం ,లేక యాక్సిడెంట్ వంటిది జరిగి ఉద్యోగానికి పొకపోతే ఉద్యోగం పీకేస్తారు. అప్పుడు ఏది రక్షణ ? ఇవన్నీ ఆలోచించే పెద్దలు ఆడవాళ్ళకు రక్షణ కోసం స్త్రీ ధనం, ఆభరణాలు వేసుకోవటం వంటివి ఏర్పాటు చేశారు. ఆపదలో పనికివస్తాయని. అయితే ఇప్పుడు కొందరికి అత్యాశ పెరిగి స్త్రీ ధనం కోసమే ఆడవాళ్ళను ఇబ్బంది పెడుతున్నారు. పూర్వం స్త్రీ ధనం మగవారు తీసుకునేవారు కాదు. ఇంకా ఎంత ఉద్యోగం చేసినా ముసలివాళ్ళయాక కొందరు పిల్లలే పెద్దవాళ్ళ దగ్గర డబ్బు లాక్కుని బయటకు గెంటుతున్నారు. అందుకని రక్షణ అనేది డబ్బులోనో ... ఉద్యోగంలోనో లేదు. మనం కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ఉండాలి. మనం ఎంత మంచిగా ఉన్నా ఎదుటి వారు మనల్ని ఇబ్బంది పెడితే ఇక అది మన ఖర్మ అనుకోవాలి... వ్యాఖ్యానించిన అందరికీ కృతజ్ఞతలండి.

    ReplyDelete
  13. పైన వ్రాసిన అజ్ఞాత లందరూ ఒకరేనా ? వేరువేరో నాకు తెలియదు. వారికి కృతజ్ఞతలండి. అజ్ఞాతలకు నేను చెప్పేదేమిటంటే నేను అందరికీ మంచి జరగాలనే వ్రాసిన టపాను వారు ఎందుకు అపార్ధం చేసుకున్నారో అర్ధం కావటం లేదు.

    ఇప్పుడు బొగ్గు నిల్వలు, నీటి కొరత వల్ల కరెంట్ లేక ఇబ్బంది పడుతున్నాము. అలాగే భవిష్యత్తులో సహజవనరులు అయిపోతే ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెపితే తప్పేమిటో అర్ధం కావటం లేదు. ?

    ఇతరగ్రహాలపై మనుషుల నివాసాలు ఏర్పాటు కోసం ఇంకా , అక్కడ ఏమైనా నీటి జాడలు ఉన్నాయా అనీ ? ఇంకా హీలియం వంటి వనరుల కోసం శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు అని వార్తలు వచ్చాయి కదా ! అందుకే అలా వ్రాశాను.

    ఇంకా హైడ్రోజెన్ వంటి వాటివల్ల వాతావరణ కాలుష్యం ఉంటుందో ? ఉండదో ఇప్పటికైతే తెలియదు. ఉండకపోతే మంచిదే. ఏమైనా పర్యావరణానికి హాని జరగని విజ్ఞానం కనిపెట్టాలనే అందరూ కోరుకుంటారు. మీరు అలాంటివి కనిపెడితే మెచ్చుకునే వారిలో నేనూ ఒకరిని.

    ఇక .. unna cars lo ne petrol engine thesesi hydrogen engine pedatharu...meeru worry avvadhu! daani kosam memu unnam!

    ఒక 50 ఏళ్ళ తరువాత సంగతి నేను చెప్పింది. ఇప్పుడున్న కార్లు అప్పటికి పనికిరావు కదండి. అప్పటికి ఖనిజవనరులు అయిపోతే కార్లు దేనితో తయారు చేస్తారని నాకు సందేహం కలిగి ఖనిజవనరులు జాగ్రత్తగా వాడుకోవాలి. అన్నాను.

    pedarikam, pani create avvakapovatam vallane florish avutundi!,


    మీరు చెప్పినది నిజమే . అయితే వస్తూత్పత్తి రంగాలలో తగ్గించి ఇతరరంగాలలో ఉపాధి అవకాశాలు పెంచటం ద్వారా సహజవనరులు వేగంగా తరిగిపోవు. పనీ ఉంటుంది అని టపాలో వ్రాశానండి.

    ఇక నేను ఇతరులకు చెప్పటమే కాదు. నాకు వీలున్నంతలో పర్యావరణానికి హాని కలగకుండా ప్రయత్నిస్తున్నాను.


    సోలార్ తుఫాన్ లు అంటే ..కొన్నిసార్లు సూర్యునిపై తుఫాన్లు వస్తాయట. వాటివల్ల శాటిలైట్స్ ఆగిపోయే ప్రమాదముందట. అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్స్ . పనిచేయవట. ఇంకా వాటిలోని ఇంఫర్మేషన్ అంతా పోతుందని వార్తాపత్రికల్లో చదివాను. ఈ సోలార్ తుఫాన్ల వల్ల కమ్యూనికేషన్ వ్యవస్థ బాగా పాడవుతుందని చెప్పారు.

    మీరు పర్యావరణానికి హాని చెయ్యని ఆవిష్కరణలు కనుగొని ప్రపంచానికి మేలు చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానండి.
    వ్యాఖ్యానించిన అందరికీ కృతజ్ఞతలండి..

    ReplyDelete
  14. ayyaa....
    aa agnatha okkare...adi nene...

    meeku artham kavadam ledu...adavaallu pani cheyyalsindi rakhsana kosam kaadu...dignified gaa..independent gaa...bratakadaaniki. magavaaniki sampadinchadam kante...extra qualification edainaa undemo cheppandi...aadavalla kannaa..??

    migatha vishayaalalo...mee parignanam chala takkuvaga..undi....vaati gurinchi meeku ikkada chinna blogulo cheppadam evari valla kaadu...

    koncham, manasu visalam (broad mind) tho alochinchi choodandi...annee ave artham avutaayi. mee bhayaalanni kevalam bhayaale ani telusukontaaru.
    blogullo raasthu time waste chesukovaddu! mee samayam ee desaniki entho viluvainadi!
    untaanandi!

    ReplyDelete
  15. పాపం మీరు ఎంతో శ్రమ తీసుకుని నా బ్లాగులో వ్యాఖ్యానిస్తున్నందుకు ధన్యవాదాలండి.

    .adavaallu pani cheyyalsindi rakhsana kosam kaadu...dignified gaa..independent gaa...bratakadaaniki..అన్నారు.మీరు.

    ఉద్యోగాలు దొరకక , ఏదైనా వ్యాపారం చేసుకుని బ్రతుకుదామంటే ఆస్తి లేక , సంసారాన్ని ఎలా పోషించాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఎందరో మగవాళ్ళున్నారు. అలాంటప్పుడు.,, డిగ్నిఫైడ్ గా, ఇండిపెండెంట్ గా బ్రతకటం కోసం మాత్రమే ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయటం అంటే అన్యాయం కదండి.

    ఆడవాళ్ళు ఉద్యోగం చేయటానికి ....మగవాళ్ళు ఉద్యోగం చేయటానికి చాలా తేడాలు, ఇబ్బందులు ఉన్నాయిలెండి. అయినా నేను ఆడవాళ్ళు జీవనోపాధి పొందకూడదు అనలేదు కదా !

    .ఇక మిగతావిషయాలగురించి నా పరిజ్ఞానం గురించి మీరు ఎక్కువ వర్రీ అయి ఇబ్బంది పడవద్దు.

    ఇంకో విషయం, పాపం శమించుగాక ! అంటే అర్ధం చెడు జరగకూడదని కోరుకోవటం. అంతే కానీ మీరనుకున్నట్లు ఆ వాక్యానికి అర్ధం.....శపించటం కాదండి. ఇలా అపార్ధం చేసుకుంటే ఏం చెప్పగలం ?

    అంతా దైవం దయ.
    ఉంటానండి......

    ReplyDelete