koodali

Friday, December 9, 2011

కొన్ని విషయాలు, ఇంకా ......ఆధునిక సైన్స్ ను మాత్రం పూర్తిగా ఎందుకు ,ఎలా నమ్మాలి ?

 

*నిన్న తిరువణ్ణామలైలో కార్తీకమహాదీపోత్సవం టీవీలో చూస్తుంటే మేము అక్కడకు వెళ్ళినప్పటి సంగతులు గుర్తు వచ్చాయి.

ఆ ఉత్సవం, ఇంకా పున్నమి వెన్నెలలో చేసే గిరిప్రదక్షిణ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి .

............................

ఇక, కొందరు ఏమంటారంటే ..
విద్యుత్ ఉంటే చాలు ఇక బ్రహ్మాండం బద్దలైపోయేంత అభివృద్ధి జరిగిపోతుందంటూ ఊదరగొట్టేస్తుంటారు
.

ఇప్పుడు అందరు విద్యుత్
విద్యుత్ అంటూ వెంపర్లాడి పోతున్నారు.

అప్పుడు సోలార్ ఎనర్జీ వల్ల విద్యుత్తును పొంద వచ్చు కదా ! సోలార్ ఎనర్జీనే తక్కువ ఖర్చుతో ఎలా పొందాలో పరిశోధనలు చెయ్యాలి గానీ ..ప్రమాద కరమైన...?


అణుకేంద్రాలనుండి విడుదలయ్యే వ్యర్ధాలను ఏం చేస్తారో ? ఈ వ్యర్ధాలు కొన్నిసార్లు సముద్రాలలో కూడా కలిసే అవకాశం ఉందట.రేడియేషన్ వల్ల ప్రపంచానికంతా దీర్ఘకాలంలో ఎన్నో దుష్పరిణామాలు ఉంటాయని చెబుతున్నారు.

ఇలా ఎంతో రిస్క్ ఉన్న వీటిని మేధావులు కూడా ప్రోత్సహించటం దురదృష్టకరం.


* అయినా ,పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే విద్యుత్ ఒక్కటి ఉంటే సరిపోదు కదా ! ఎన్నో సహజవనరులు వాడుకోవలసి ఉంటుంది. ఇలా అన్నీ వనరులనూ వాడేసి కొత్త వస్తువులు తయారుచేయటమేనా మనిషి జీవితధ్యేయం ?

పోనీ ప్రపంచం ఏమైపోయినా పట్టించుకోకుండా కొత్తకొత్త వస్తువులు సృష్టిస్తే అప్పుడు మనుషులు ఆనందంగా ఉంటారని ఏమిటి గ్యారంటీ ?


ఇవన్నీ లేకపోయినా మన పూర్వులు హాయిగా వెన్నెల్లో విందుభోజనాలు చేసి కూడా ఎంతో సంతోషంగా జీవించారు.
ప్పటివాళ్ళు ప్రకృతికి దూరమై ఏసి గదులు తప్ప వెన్నెల అంటే కూడా ఇప్పుడు చాలామందికి తెలియదు.

ప్రపంచం అసలు ఎటు పోతున్నదో అర్ధం కావటంలేదు
.
......................

ఇక ,ఆధునిక విజ్ఞానం విషయానికి వస్తే..........
.
నాకు ఆధునిక విజ్ఞానం అన్నా గౌరవమే. ఒక రకంగా చూస్తే ఈనాటి పరిశోధనల వల్ల కూడా ప్రాచీన విజ్ఞానం యొక్క గొప్పదనం అందరికీ తెలుస్తోంది.

* ఆధునిక సైన్స్ ను కూడా పూర్తిగా ఎందుకు ,ఎలా నమ్మాలి?  ఆధునిక విజ్ఞానం విషయంలో కూడా ఒకసారి నిరూపణ అయిన విషయాలే కొంతకాలానికి పొరపాటుగా ఋజువయిన సంఘటనలు తరచుగా చూస్తూనే ఉన్నాము.

ఈ మధ్యే " కాంతి యొక్క వేగం " విషయంలో .... ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.

* శాస్త్రవేత్తలు అంటే నాకు గౌరవమే. నేను ఎవరినీ తప్పుపట్టడం లేదు. పొరపాట్లు ఎవరికైనా వస్తాయి.

* అయితే శాస్త్రవేత్తల మధ్య కూడా సిద్ధాంత రాద్ధాంతాలు జరుగుతూనే ఉంటాయి. ఒకరు అవునన్న దానిని ఇంకొకరు కాదంటూ ఉంటారు.

ఆధునిక ఆవిష్కరణల వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతున్నాయి....... కొన్ని విపరీత ఆవిష్కరణల వల్ల ప్రమాదాలూ కలుగుతున్నాయి.


రేడియేషన్ తో ట్రీట్ మెంట్ వల్ల వైద్యరంగంలో కాన్సర్ వంటి వ్యాధులు కొంతవరకూ తగ్గుతున్నాయి అంటున్నారు కానీ, నాకు అనిపిస్తుంది ఈ రకమైన ట్రీట్ మెంట్స్ వల్ల 100 మందికి వ్యాధి తగ్గితే , ఈ రేడియేషన్ వ్యర్ధాలు గాలిలో, నీటిలో, భూమిలో కలవటం వల్ల 1000 మందికి కొత్తగా వచ్చే అవకాశమూ ఉంది అనిపిస్తుంది..

 
  అణుశక్తిని విద్యుత్ రంగంలోను, వైద్యరంగంలోను వాడుతున్నారు. అయితే, తద్వారా వచ్చే రేడియేషన్ సమస్యలు ఉన్నాయి..అణువ్యర్ధాల విషయంలోనూ ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. .విద్యుత్ మరియు  వైద్యానికి అణుశక్తి కాకుండా ఎన్నో విధానాలున్నాయి.అవి వాడుకోవచ్చు.

కొన్ని ప్రయోజనాల కొరకు.. పెద్దప్రమాదాలు ఉన్నదానిని పట్టుకోవటం ఎంతవరకు సరైనదో ? తెలియటం లేదు.

  
ఇంకా ప్లాస్టిక్ వంటి విషయాల్లో మొదట అద్భుతంగా చెప్పుకున్న విషయాలే కాలం గడిచాక ఇప్పుడు.... వాటివల్ల కలిగే కొన్ని నష్టాలను అనుభవిస్తూనే ఉన్నాము.

ఇలా చాలా ఉంటాయి. నేను ఎవరినీ తప్పుపట్టడం లేదు. పొరపాట్లు ఎవరికైనా వస్తాయి.

*అయితే , ప్రతిదానికీ దైవాన్ని ప్రాచీన గ్రంధాలనూ విమర్శించటం తప్పు అన్నదే నా అభిప్రాయమండి.


ప్రాచీనులకు కూడా ఇప్పటి కన్నా మెరుగైన విజ్ఞానం తెలుసేమో ? కొన్ని కారణాలవల్ల ఆ నాగరికత కాలగర్భంలో కలిసిపోయిందేమో ? అనిపిస్తుంది..
................

అణురియాక్టర్లు ప్రమాదానికి గురయినప్పుడు సీల్ చేసి వాటిని మూసివేస్తారంటారు. కానీ మామూలుగా పనిచేసే రోజుల్లో కూడా వ్యర్ధపదార్ధాలు వస్తాయట. మరి రోజూ వ్యర్ధాలుగా వచ్చే వాటిని ఏం చేస్తారన్నది ? నాకు
తెలియదండి.

ఈ పేరా వ్యాఖ్యలు చూసాక వ్రాసానండి.


16 comments:

  1. అణుకేంద్రాలనుండి విడుదలయ్యే వ్యర్ధాలను ఏం చేస్తారో ? ఈ వ్యర్ధాలు కొన్నిసార్లు సముద్రాలలో కూడా కలిసే అవకాశం ఉందట.
    --------------
    మొట్ట మొదట్లో రియాక్టర్లు వచ్చినప్పుడు వ్యర్ధాలని సీలు చేసి సముద్రములో పారేసేవారని విన్నాను. అది ఎంతవరకూ నిజమో తెలియదు.

    ReplyDelete
  2. ప్రాచీన విజ్ఞానంకూడా విజ్ఞానమే కదండీ. ఎప్పటికైనా విజ్ఞానం మంచిదే. కాకపోతే దాన్ని ఎల్లా ఉపయోగించుకోవాలి అనేదానికి కొంచెం విచక్షణ కావాలి. అది మనకలవడుతుందని ఆశించాలేతప్ప, అలా అలవర్చుకోవడానికి ప్రయత్నించాలేతప్ప దాన్ని కాదని వెనకటికాలానికి వెళ్ళడం practical కాదు.

    మీరన్నట్లు scienceలో ఉన్న గొప్పదనం అప్పటివరకూ ప్రచారంలో ఉన్న విషయం తప్పని నిరూపితమైతే నిర్ద్వందంగా ఒప్పుకుంటుంది. ఆచెప్పింది ఐన్‌స్టైనే అయినా తప్పనిచెబుతారేతప్ప, "మనవాళ్ళుచెప్పింది ఇన్నివిషయాలు రైటైనప్పుడు ఇదికూడా రైటేఅయ్యుండాలి" అని కొట్టిపారెయ్యరు. నిజానికి "మనవాళ్ళుకూడా" ఒప్పుకొనేవారేమో ఏమైనా తప్పని ఋజువయ్యుంటే కానీ "మనవాళ్ళు" అనే ప్రేమతో వళ్ళూచెప్పినది సరైనది కాదేమోనన్న ఆలోచననే "మనం" కొట్టిపారేస్తుంటాం.

    ఇహ మీ అణువిద్యుత్తుదగ్గరకేవస్తే... నిరంతరాయంగా (విద్యుత్‌కోతలులేకుండా) విద్యుత్తునందించాలంటే అణువిచ్చేదమే ప్రస్తుతానికిగతి. కేంద్రక సంలీననాన్ని మనం అదుపుచేయగలిగేంతవరకూ లేదా antimater universe(ప్రతిద్రవ్యంతో తయారయిన మరోప్రపంచం) మనకు కళ్ళబడేవరకు మనకది necessary evil. మీరు ఈ అణు(కర్మాగార) రాజకీయాలగురించి మాట్లాడుతున్నట్లయితే, నేనూ మీతో ఏకీభవిస్తున్నాను. నాదీ అదేమాట.

    ReplyDelete
  3. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
    అవునండి . .నేనూ చదివాను. సిమెంట్ తో లేక మరి దేనితో సీల్ చేస్తారో తెలియదు . కానీ, ఎంతైనా ఏ పొరపాటూ జరగకుండా సీల్ చేయటం కష్టం కదా !.
    అయినా ఇదంతా అదేదో సామెత చెప్పినట్లు " అడుసు తొక్కనేల...కాలు కడగనేల " అన్నట్లుగా ........

    ReplyDelete
  4. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    .నాకు ప్రాచీనవిజ్ఞానం లేక ఆధునిక విజ్ఞానం... మన వాళ్ళా లేక ఇతరులా ..... అనే తేడాలేదు.

    ఏ విజ్ఞానమైనా ప్రపంచానికి మేలు చెయ్యకపోయినా ఫరవాలేదు. హాని మాత్రం చెయ్యకూడదు అని అంతేనండి. ! .
    ఈనాటి ఆధునిక విజ్ఞానంలో లాభం కొద్దిగా ఉంటే .... నష్టం ఎక్కువగా కనిపిస్తోంది.


    గ్లోబల్ వార్మింగ్, వగైరాల గురించి వింటూనే ఉన్నాము. భూమిని , పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ప్రజలు తమ కోరికలను తగ్గించుకోవాలి.

    లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ లేని సోలార్ విద్యుత్ వంటి వాటి గురించి మరింతగా ప్రయోగాలు చేయాలి.

    అంతే కానీ , ప్రపంచానికి హాని జరుగుతున్నా కూడా మనకు మాత్రం ఏదో ఒక విధంగా విద్యుత్ ,

    సహజవనరులు వేగంగా తరిగిపోతున్నా కూడా పరిశ్రమలు.... కావాల్సిందే . అనుకోవటం నాకు సరిగ్గా అనిపించటంలేదండి.

    ReplyDelete
  5. ప్రాచీనులకు కూడా ఇప్పటి కన్నా మెరుగైన విజ్ఞానం తెలుసేమో ? కొన్ని కారణాలవల్ల ఆ నాగరికత కాలగర్భంలో కలిసిపోయిందేమో ? అనిపిస్తుంది.
    ఆ నాగరికతను మనమే దూరం చేసుకుంటున్నాము

    ఆధునిక శాస్త్రవిజ్ఞానం అని ప్రకృతిధర్మాలను విస్మరించి ప్రవర్తించడమే మనం చెస్తున్న తప్పు

    ప్రాచీనులు గురుత్వాకర్షణ శక్తిని యుగ యుగాలుగా గుర్తుంచుకొనెట్లుగా దైవత్వాన్ని ఆపాదించి ఫరమశివుని రూపంలో అందిచిన మహానుభావులు

    ఒక్కసారి మననం చెసుకొంటే అవగతం అవుతుంది

    ReplyDelete
  6. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    నిజమేనండి. ఈనాటి మానవులు ఎండమావుల వంటి కోరికలతో ప్రకృతికి దూరమవుతున్నారు. ఆహ్లాదకరమైన ప్రకృతికి దూరమవుతూ భూతశక్తి వంటి అణుశక్తుల వంటి వాటికి దగ్గరవుతున్నారు,

    ఈ కర్మాగారాల భద్రత కోసం ఎంతో ఖర్చు అవుతుంది. ఖర్మ కాలి ఏమైనా ప్రమాదాలు జరిగితే , ఈ అణుశక్తి కర్మాగారాలను సమాధి చెయ్యటానికే బోలెడు ఖర్చు అవుతుంది. అందుకని సోలార్ ఎనెర్జీనే నయం.

    ఇంకా, టీవీలు, కంప్యూటర్, సెల్ ఫోన్, x-rays ..... వల్ల కూడా రేడియేషన్ కు గురవుతారు అంటున్నారు, అందుకేనేమో ఈ మధ్య కాలంలో కాన్సర్ వంటి వ్యాధులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

    ఇదంతా చూస్తుంటే మానవజాతి పురోగమనం కాదు తిరోగమనం వైపు పయనిస్తూందేమో ? అనిపిస్తుంది. సైన్స్ ను ఎంతవరకూ వాడుకోవాలో అంతవరకే వాడుకుంటే మంచిది అనిపిస్తూంది...

    ReplyDelete
  7. ( indian minerva ) సీత గారూ, నాకు అర్ధమవటానికి వ్యాఖ్య తెలుగులో వ్రాసినందుకు కృతజ్ఞతలండి.

    ReplyDelete
  8. అణుశక్తి వంటివి మనుషులు తట్టుకోలేరు. అయితే, ఇలాంటివి సృష్టిలో ఎందుకు ఉన్నాయని అనుమానాలు వస్తాయి. సృష్టిలో ఎన్నో లోకాలున్నాయి. అక్కడి జీవులకు వాటిని తట్టుకునే శక్తి ఉంటుందేమో? దైవసృష్టిలో ఎన్నో రహస్యాలుంటాయి.

    ReplyDelete
  9. సృష్టి లో మనకు తెలిసిన వాటి కన్నిటికీ వాటి వాటి పరిమితులు వున్నాయి. అవి తెలుసుకుని వాటిని ఉపయోగించుకోవాలి.
    ఉదాహరణకి కూరగాయలు తినటం చాలా మంచిది. అవి ఎప్పుడూతినాలి ఎంత తినాలి తెలియకుండా తింటే మనమనుకున్న ఫలితం రాక పోవచ్చు.

    ReplyDelete
  10. Mentions of radioactivity can send the mind in a dramatic direction, but many ordinary items are technically radioactive — including the humble banana. Radioactivity occurs when elements decay, and for bananas, this radioactivity comes from a potassium isotope called K-40. Although it makes up only 0.012% of the atoms found in potassium, K-40 can spontaneously decay, which releases beta and gamma radiation. That amount of radiation is harmless in one banana, but a truckload of bananas has been known to fool radiation detectors designed to sniff out nuclear weapons. In fact, bananas are so well known for their radioactive properties that there’s even an informal radiation measurement named the Banana Equivalent Dose, or BED.

    So does this mean bananas are unhealthy? Well, no. The human body always stores roughly 16 mg of K-40, which technically makes humans 280 times more radioactive than your average banana. Although bananas do introduce more of this radioactive isotope, the body keeps potassium in balance (or homeostasis), and your metabolism excretes any excess potassium. A person would have to eat many millions of bananas in one sitting to get a lethal dose (at which point you’d likely have lots of other problems).

    ReplyDelete
  11. సర్! మీకు ధన్యవాదములండి. నాకు కొన్ని ఆలోచనలు వచ్చాయండి.అంటే..చేపలు వంటివి నీటిలో చక్కగా ఉండగలవు. మనుషులు అలా ఉండలేరు. ఒక్కొక్క దగ్గర పరిస్థితి ఒక్కోలా ఉంటుంది కదా. ఇతరలోకాలలో శక్తివంతమైన జీవులుంటే, శా వారికి అణుశక్తిని తట్టుకునే శక్తి ఉంటుందేమో? అని విచిత్రమైన ఆలోచనలు వచ్చి వ్రాసాను.సృష్టిలో ఎన్నో రహస్యాలుంటాయి.

    మీరు వ్రాసినది నిజమండి.సృష్టి లో మనకు తెలిసిన వాటి కన్నిటికీ వాటి వాటి పరిమితులు వున్నాయి. అవి తెలుసుకుని వాటిని ఉపయోగించుకోవాలి.

    ReplyDelete
  12. సైన్సు, మతము రెండిటినీ సరైన పంథాలో ఆచరించకపోతే అనర్థం తప్పదు. ఈ రెండు విషయాలలో సనాతన ధర్మం ఆచరించడం మానవాళికి శ్రేయస్కరం.

    ReplyDelete
  13. మీకు ధన్యవాదములండి.

    ReplyDelete

  14. ఇంకా నాకు ఏమనిపిస్తుందంటే..ప్రకృతిలో ఉన్న రేడియోధార్మికత వల్ల మనుషులకు అంత ప్రమాదమేమీలేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అయితే, అణుశక్తిని బయటకు తీసి వినియోగించటం వల్ల పెద్ద సమస్యలు ఉన్నాయి.

    అణుశక్తివంటి వాటివల్ల జరిగే అనర్ధాలు అత్యంతతీవ్రమైనవి. ఉదా..అనేక అణ్వాయుధాలను తయారుచేసారు. ఒక అణుబాంబు ప్రయోగిస్తే అక్కడికక్కడే కొన్నివేలమంది చనిపోవటం, బ్రతికిన వారిలో కూడా కొన్ని వేలమంది క్రమంగా తీవ్రమైన అనారోగ్యంతో చనిపోవటం జరిగిందని..కొన్నిసంవత్సరాల వరకు ఆ ప్రాంతంలో రేడియేషన్ ఉండి, తరువాత జన్మించినవారిలో కొందరు అనారోగ్యంతో జన్మించారని వార్తల ద్వారా తెలుస్తోంది.

    అందువల్ల అణుశక్తి వంటివాటిని ప్రకృతినుండి బయటకు తేవటం, వాటిని వాడటం అనేది మనుషులు చేసిన తీవ్రమైన తప్పని అనిపిస్తుంది. అణ్వాయుధప్రయోగం లేకుండా దైవమే కాపాడాలి.

    నాకు తెలిసినంతలో వ్రాసాను.దయచేసి తప్పుగా భావించవద్దండి.

    ReplyDelete
  15. ***************

    బాక్టీరియా, వైరస్ల వల్ల కూడా రోగాలు వస్తాయి. అయితే, కొన్నిసార్లు వాటితో మనుషులు చేసే ప్రయోగాల వల్ల కూడా రోగాలు విపరీతంగా వ్యాపిస్తాయని కొందరి అభిప్రాయం.
    ......
    కరోనా వచ్చినప్పుడు ప్రపంచ ప్రజలు అల్లాడిపోయారు. ఎందరో మరణించారు. అయితే, రెండుసంవత్సరాలకయినా ప్రపంచం కొంత కుదుటపడి ఎవరి పనులు వారు చేసుకోగలుగుతున్నారు.

    అణుబాంబులతో వ్యవహారం అలా ఉండదు కదా..ఎంతో తీవ్రమయిన పరిస్థితి ఉంటుంది. ఈ రోజుల్లో మరింత శక్తివంతమయిన అణుబాంబులను తయారుచేసారు.

    అణుశక్తి కర్మాగారం వద్ద ప్రమాదం జరిగితే అణుధార్మికత విపరీతంగా వ్యాపించకుండా ఆ కర్మాగారాన్ని సిమెంటుతో సమాధి చేస్తారట. ఆ ప్రదేశంలో చాలా సంవత్సరాల వరకూ తీవ్రమయిన పరిస్థితి ఉంటుందట. అణు ప్రయోగాల వల్ల కలిగే తీవ్రమయిన బాధలు మనుషుల స్వయంకృతాపరాధాలే.

    ReplyDelete
  16. ఈ మధ్యన మూడవప్రపంచయుద్ధం అనీ, అణుబాంబు ప్రయోగం అనీ పుకార్లు వచ్చాయి. ఇలాంటప్పుడు అణుశక్తిని ఎందుకు కనుగొన్నారో? అనిపిస్తుంది.

    ReplyDelete