koodali

Friday, August 27, 2010

నిన్నటి సాయి భక్తురాలి విషయంలో నా అభిప్రాయం..........

 

 

నిన్న టి.వి. లో ఒకామె సాయి తన కలలోకి వచ్చి ఆమె చనిపోతుందని చెప్పినట్లు చూపించారు కదండి. ఇలా కలలు వచ్చినప్పుడు కొంచెం భయంగానే ఉంటుంది. ఇలాంటప్పుడు అన్నీ తెలిసిన పెద్దలు , మంచి సలహా ఇచ్చేవాళ్ళు దొరికితే అదృష్టమే. కానీ అలాకాక తెలిసితెలియనివారికి చెపితే వారు కంగారుపడి మనలను కంగారుపెడతారు. .బయటివాళ్ళ దగ్గర కంగారు పడితే మోసం చేసే అవకాశం కూడా ఉంది.


సాయిబాబా వారి జీవితచరిత్రంలోని ఒక సంఘటన ఇక్కడ చెప్పాలి. దాము అన్నా అన్న అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు. కానీ అతనికి సంతానం లేరు. తన జాతకములో దుష్టగ్రహప్రభావము ఉండుటచే తనకు సంతానము లేదని అతను అనుకుంటాడు. కానీ అతనికి బాబా యందు మిక్కిలి నమ్మకము కలదు.


ఒకనాడు రాలే అను ఒక భక్తుడు గోవా నుంచి 200 మామిడి పండ్ల పార్సెల్ శ్యామా పేరున బాబాకు పంపెను. బాబా అందులో నాలుగు పండ్లు తీసి కుండలో పెట్టి ఈ నాలుగు దాము అన్నాకు, అవి యక్కడనే యుండవలెననెను.


మామిడిపండ్లు బాబాకు అందిన రెండు గంటలకు దాము అన్నా శిరిడీకి చేరి , బాబాకు నమస్కరించుటకు పోగా బాబా ఇట్లనెను. అందరు మామిడి పండ్ల వైపు చూచుచున్నారు. కాని అవి దాము కొరకుంచినవి. కావున అవి దాము తిని చావవలెను. దాము ఈ మాటలు విని భయపడెను.


కానీ మహళ్సాపతి {బాబా ముఖ్య భక్తుడు } దాని నిట్లు సమర్ధించెను. చావనునది యహంకారమును గూర్చి. దానిని బాబా ముందు చంపుట యొక యాశీర్వాదము. బాబా దామూతో యిట్లనెను. నీవు తినవద్దు. నీ చిన్న భార్య కిమ్ము. ఈ యామ్రలీల ఆమెకు నలుగురు కొడుకులను, నలుగురు కొమార్తెలను ప్రసాదించును.


దాము ఆ ప్రకారమే చేసెను. కొంతకాలమునకు బాబా మాటలు నిజమాయెను. జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయెను.

ఇందులో బాబా దామును చావవలెను అన్నా కూడా అర్ధము వేరే. నిన్న ఒకామె సంఘటనలో కూడా ఇలా చావటం అన్న మాట వచ్చింది. ఇలాంటప్పుడు భయపడక భగవంతుని నమ్మితే ఆయనే దారి చూపిస్తారు. భగవంతుడు దయామయుడు. 

 


4 comments:

  1. వాస్తవానికి ఆ రోజు బాబా, దామోదర్ రాస్నే (దామూ) కోసం తీసి పెట్టింది ఎనిమిది మామిడి పళ్ళు. అయితే అతడు వచ్చె లోగానే అక్కడ పిల్లలు ఆ పళ్ళలో నాలుగు తినేస్తారు. తర్వాత వచ్చిన దామూతో బాబా దామ్యా ని చూచి నవ్వుతూ " ఈ పళ్ళు తీసుకె ళ్ళి నీ భార్యకివ్వు నీకు బిడ్డలు కలుగుతారు" అని చెబుతారు. కొన్నాళ్ళకు దామ్యా కి ఎనిమిది మంది బిడ్డలు కలిగి నలుగురు మరణించారు :))

    ReplyDelete
  2. Srinivas is what you said is true ?, i never read any where like that..

    ReplyDelete
  3. నేను బ్లాగ్ ను ఇప్పుడే చూశాను సార్. రిప్లై ఇవ్వటానికి లేటయినందుకు సారీ సార్. పోస్ట్ చదివినందుకు చాలా థాంక్స్ అండి. అయితే నేను చదివిన గ్రంధములో ఇలాగనే ఉందండి మరి. ఏదేమైనా మీరు చెప్పిన దానికి థాంక్స్ అండి. .

    ReplyDelete
  4. నేను బ్లాగ్ ను ఇప్పుడే చూశాను సార్. రిప్లై ఇవ్వటానికి లేటయినందుకు సారీ సార్. పోస్ట్ చదివినందుకు చాలా థాంక్స్ అండి.

    ReplyDelete