koodali

Friday, August 3, 2018

మంచిని ప్రోత్సహించాలి, చెడును పారద్రోలాలి... ఆచారవ్యవహారాలలో.. కొందరు తెలిసితెలియని వాళ్లవల్లా, కొందరు స్వార్ధపరుల వల్లా సమాజంలో కొన్ని మూఢాచారాలు ప్రవేశించాయి. వాటిని వ్యతిరేకించవలసిందే. 

 
అలాగని ప్రతి ఆచారాన్ని వ్యతిరేకించటం కూడా మూఢత్వమే. పూర్వీకులు తెలియజేసిన ఆచారవ్యవహారాల్లో ఎన్నో మంచి విషయాలున్నాయి.ఎంతో సైన్స్ ఉంది.


భక్తులు  కూడా కొన్ని విషయాలను తెలుసుకోవాలి. 

పాపపుపనులు చేసి సంపాదించిన సొమ్ముతో పూజలు చేస్తే పుణ్యం రాకపోగా, పాపం చుట్టుకుంటుందని పెద్దలు తెలియజేసారు.


రావణాసురుడు కూడా ఎన్నో పూజలు చేశాడు.  అతని పాపాలు కొట్టుకుపోలేదు. 

అతను చేసిన పాపాల వల్ల అతనూ, అతని వారసులూ కూడా కొట్టుకుపోయారు. 

 దైవకృపను పొందాలంటే పూజతో పాటు సత్ప్రవర్తనతో జీవించటానికి ప్రయత్నించాలి.

..................
 సమస్యలు పోవాలంటే వ్యక్తులలో చెడులక్షణాలు పోవాలి. కోపం, స్వార్ధం..వంటి లక్షణాలు ఉంటే మనకే నష్టం. 

అయితే.. కోపం, స్వార్ధం..వంటివి ఉండకూడదని చెపుతున్న నేను కూడా కోపాన్ని, స్వార్ధాన్ని పోగొట్టుకోవటంలో ఇంకా పూర్తిగా విజయాన్ని సాధించలేదు. 

అయితే, అందరం పట్టుదలగా ప్రయత్నించి చెడు లక్షణాలను వదిలించుకుంటే మనకే మంచిది.

 మనలో చెడులక్షణాలు పోవాలని దైవాన్ని ప్రార్ధించాలి.
...............


Friday, September 2, 2011

దైవం ఎప్పటికప్పుడు ధర్మమును కాపాడటం జరుగుతుంది...


.................
కొన్ని ఆధునిక ఆవిష్కరణల వల్ల ఉపయోగాలు కలుగుతున్నాయి. కొన్నింటి  వల్ల నష్టాలూ కలుగుతున్నాయి. మంచిని ఉంచుకుని చెడును వదిలెయ్యాలి.


 ఆధునికకాలంలో పర్యావరణానికి  అపారమైన నష్టం కలుగుతోంది.గ్లోబల్ వార్మింగ్, పారిశ్రామిక   కాలుష్యం..వంటి వాటి వల్ల ఎన్నో జీవజాతులకు ముప్పు కలుగుతోంది.  ఇలాంటి వాటిని వ్యతిరేకించాలి. 


.....................


ఈ రోజుల్లో ఎన్నో ఘోరమైన విషయాలను వింటున్నాము.  

మానవ అక్రమరవాణా, స్త్రీల పట్ల అకృత్యాలు, చిన్నపిల్లలను అపహరించి హింసించటం, మత్తుమందుల అమ్మకాలు,  అవినీతి, లంచగొండులు, గ్లోబల్ వార్మింగ్, పారిశ్రామిక కాలుష్యం, పెరుగుతున్న వ్యాధులు...ఇలాంటివెన్నో   సమస్యలున్నాయి. సమాజంలో  జరుగుతున్న అఘాయిత్యాలు వింటుంటే మనిషనే ఎవరికైనా రక్తం మరిగిపోతుంది. అలాంటి నేరాలను చేసే నేరస్తులను కఠినంగా శిక్షించాలి. ఆ శిక్షలు ఎలా ఉండాలంటే, అలాంటి నేరాలు చేయాలనే ఊహ రావడానికే భయపడేలా శిక్షలుండాలి.భౌతికవాదులు, నాస్తికులు ..  అనబడేవారు కొందరు.. ఎంతసేపూ..  


గ్రహణసమయంలో అందరూ బయటకు రావాలి, అన్నీ తినాలి..ఇలాంటి విషయాల గురించి ఎక్కువగా    మాట్లాడటం కన్నా,  సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న ఎన్నో సమస్యలపై  గట్టిగా పోరాడవచ్చు కదా!
ప్రాచీనులకు  ఏమీ  తెలియదు, ఆధునిక సైన్స్ మాత్రమే గొప్ప..   అని మాట్లాడే వాళ్ళు..  ఆధునికకాలంలో  గ్లోబల్ వార్మింగ్, పారిశ్రామిక   కాలుష్యం, పెరుగుతున్న రేడియేషన్ ముప్పు ..వంటి ఎన్నో సమస్యల  గురించి ఏం  చెబుతారు?


ఏ కాలంలోనైనా ,  ఎక్కడైనా , ఏ విషయంలోనైనా  చెడును పారద్రోలాలి,  మంచిని ప్రోత్సహించాలి. 4 comments:

 1. Replies
  1. ధన్యవాదాలండి. అంతా దైవం దయ.

   Delete
 2. Even though I am non believer .Good day .

  ReplyDelete
 3. నాకు చిన్నతనంలో దైవభక్తి ఉండేది.

  అయితే, హైస్కూల్ రోజుల్లో స్కూల్లో ఒక నాస్తిక టీచర్ చెప్పిన పాఠాల వల్ల నాస్తికత కలిగింది.

  ఏ స్థాయిలో అంటే, ఇప్పుడు నాకు గుర్తున్నంతలో...

  ఒకసారి స్కూల్ ఫ్రెండ్స్ ముందు దేవుని బొమ్మను కాలితో తొక్కి చూపించటం, ఇంట్లోవాళ్ళు దైవప్రసాదం ఇస్తే తిరస్కరించటం.. స్థాయిలో.

  తిరిగి కొంతకాలానికి,

  జీవితంలో తెలుసుకున్న పాఠాల వల్ల బుద్ధి వచ్చి, నాస్తికత పోయి దైవభక్తి కలిగింది.

  ReplyDelete