koodali

Wednesday, August 15, 2018

కొన్ని విషయాలు ..


 శ్రావణ పంచమి సందర్భంగా శుభాకాంక్షలు.

*************

ఆగష్టు 15 న  దేశానికి స్వాతంత్య్రం వచ్చిన  శుభసమయం.  

 ఎందరో మహనీయులు ఎన్నో కష్టాలకు ఓర్చి , ఎన్నో త్యాగాలతో   దేశానికి  స్వాతంత్య్రం  సాధించారని  అందరూ  గుర్తు చేసుకోవలసిన అవసరం ఉంది.  

..........................

ఎవరికైనా మనసు బాగోనప్పుడు ...

ధ్యానం చేయటం.. మంచి పాటలు వినటం ..మంచి పుస్తకాలు చదువుకోవటం..మంచి వ్యక్తులతో  కొంతసేపు కబుర్లు చెప్పుకోవటం..పనిలో  నిమగ్నమవటం..ఇలా  ఎన్నో మార్గాలున్నాయి.  తద్వారా  మనస్సు కుదుటపడే అవకాశం ఉంది.
.........................
  
పని  ముగించి ఖాళీగా కూర్చుంటే మళ్ళీ ఆలోచనలు విజృంభించే అవకాశమూ ఉంది. అందుకని అప్పుడప్పుడూ దైవనామ స్మరణ చేయటం అలవాటు చేసుకోవాలి.  కుదిరితే  కనీసం 10 నిమిషాలకు ఒకసారైనా దైవనామాన్ని స్మరించుకుంటే మంచిది.

  ధర్మబద్ధంగా  జీవించాలి.  అయితే,    కొన్నిసార్లు ...ఏది సరైన పద్ధతో ?   ఏది సరైనది కాదో  ? ఏం చేయాలో ?   ఏం చేయకూడదో ?   తెలియని గందరగోళ పరిస్థితులూ ఎదురుకావచ్చు.

అందువల్ల ,  సరైనవిధంగా  నడిచేలా  సాయం చేయమని   దైవాన్ని ప్రార్ధించాలి . దైవాన్ని శరణు వేడాలి. 
 

No comments:

Post a Comment