koodali

Monday, February 19, 2018

నదీ జలాల విషయాలు..



కొన్ని  నదులు ఎక్కడో  పుట్టి  ..  ప్రవహించి.. సముద్రంలో కలుస్తాయి. ఇలా జరగటం ప్రకృతిలో  సహజమైన విషయం.   ప్రజలు నీటిని పొదుపుగా  వాడుకోవాలి.  ఉన్న నీటిని అందరూ పంచుకుని వాడుకోవాలి .  


ఎగువ రాష్ట్రాలైనా, దిగువ రాష్ట్రాలయినా ప్రజలందరికీ నీరు అవసరమే. అయితే,   కొందరు ఎగువ ప్రాంతాల వాళ్ళు  ..తమకు బోలెడు నీరు కావాలంటూ   దిగువకు  సరిగ్గా  వదలకుండా   ఆపటం ప్రకృతికి వ్యతిరేకం. ...నీరు  క్రిందకు వదలం ...అనే హక్కు ఎవరికీ లేదు.


రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి   ఆంధ్ర.. తెలంగాణా  రెండు రాష్ట్రాలకూ విడిగా కేటాయింపులు జరగాలంటున్నారు. మరి `భవిష్యత్తులో మహారాష్ట్ర విభజన జరిగితే ...అప్పుడు ఆ రెండు రాష్ట్రాలకూ వేరువేరుగా కేటాయింపులు జరిపితే దిగువ రాష్ట్రాల పరిస్థితేమిటి ? 


ఇప్పుడు కూడా  ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర వాళ్లు ఇబ్బడిముబ్బడిగా నీటి ప్రాజెక్టులు కట్టుకుంటున్నారు. వాళ్ళకు దిగువ రాష్ట్రమైన తెలంగాణా  వాళ్ళు ఏపీ  వాళ్లను ఆడిపొసుకోవటం తప్ప ,  ఎగువ రాష్ట్రాలను ఏమనలేక   వారితో  స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు.


భవిష్యత్తులో ఎగువ రాష్ట్రాల వాళ్లు మరిన్ని ప్రాజెక్టులు కట్టి   క్రిందికి చుక్క నీరు రాకుంటే అప్పుడు పరిస్థితి ఏమిటో ?

నీటి విషయంలో గొడవలు తగ్గాలంటే న్యాయబద్ధంగా ఎవరికి రావలసిన వాటాను వారికి కేటాయించే పెద్దమనుషులుండాలి. ఇందులో ఎవరి వాదన వారిదే  అన్నట్లు  ఉండే గొడవలు తప్ప చేయగలిగిందేమీ లేదు. రాజకీయాలు కూడా ఉంటే అసలే చెప్పనక్కర లేదు.



 సముద్రపు నీటిని మంచి నీటిగా మార్చుకుని వాడుకోవచ్చు కానీ, అందువల్ల మిగిలిన ఉప్పువల్ల వాతావరకాలుష్యం వంటి సమస్యలు ఉంటాయి. నీటిని పొదుపుగా వాడుకుంటూ , న్యాయబద్ధంగా ఎవరి వాటా వారు  వాడుకుంటే సమస్యలు రావు.  

********

  ఆంధ్రప్రదేశ్ వాళ్లు ఎన్నో సహజవనరులున్నా కూడా, రాష్ట్రాన్ని సరిగ్గా అభివృద్ధి చేసుకోలేకపోతున్నారు.. తెలివితేటలు ఉండికూడా ఎప్పుడూ ఇతరరప్రాంతాలకు, ఇతరదేశాలకు వలసలు పోతుంటారు. మాకు సహాయం చేయండి..అంటూ ప్రతిచిన్నవిషయానికి కేంద్రాన్ని అడుగుతుంటారు.

ఏపి వాళ్ళు ప్రతిదానికి ఇతరులపై ఆధారపడటం కాకుండా, వారి రాష్ట్రాన్ని వారు అభివృద్ధి చేసుకోవాలి. వారి సమస్యలు వారు పరిష్కరించుకోవాలి. వనరులు, దేవాలయాల విషయాలు, అన్నిప్రాంతాల సమస్యలు తమకుతాము పరిష్కరించుకోవాలి.
 
 ఎవరేది చెబితే అది నమ్మటం కాకుండా, ప్రజలు విచక్షణతో ఉండాలి.
ఇతరరాష్ట్రాలతో కలిసి ఉండే నదీజలాల వంటివి అలా ఉంచితే, తమరాష్ట్రంలోని సమస్యలు తామే పరిష్కరించుకోవటానికి ప్రయత్నించాలి.


1 comment:

  1. ఈ విభజన విషయాల గురించి ఈ బ్లాగ్ లో ఇంతకుముందు చాలాసార్లు చర్చలు జరిగాయి. ప్రస్తుతం బ్లాగ్ లో తిరిగి చర్చలు జరగాలని నేను అనుకోవటం లేదు. ఎవరూ పాజిటివ్ గా గానీ, నెగటివ్ గా గానీ వ్యాఖ్యలు వేయొద్దండి.

    ReplyDelete