koodali

Monday, February 19, 2018

ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వయంకృతాపరాధాలు....


జరిగిన విషయాలలో   ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వయంకృతాపరాధాలు కూడా ఉన్నాయి.
 ఇప్పుడు చాలామంది ఏపి ప్రజలు విభజన వల్ల అన్యాయం జరిగిందని అంటున్నారు. . .


విభజన తరువాత ఎంతమంది  ఏపీ వాళ్ళు  ఏపీలో పెట్టుబడులు పెట్టారు ? రాష్ట్ర విభజన తరువాత ఎంతమంది ఏపీ వాళ్లు ఏపీలో పరిశ్రమలు గానీ అభివృద్ధికి  కానీ ముందుకు వచ్చారు ? 


సుమారు 10 సంవత్సరాల కాలం తెలంగాణావాళ్ళు విడిపోతామని ఉద్యమాలు చేస్తుంటే,   అప్పుడు కూడా  ఏపీలో అభివృద్ధి గురించి  పట్టించుకోకుండా,  హైదరాబాదులో పెట్టుబడులు పెట్టుకుంటూ  ఉన్నారు.  అప్పుడు  దూరదృష్టి  లేకుండా .... ఇప్పుడు తీరిగ్గా విచారించి ఏం లాభం.

భవిష్యత్తులో  హైదరాబాద్ రెండో రాజధాని అవుతుందేమోనని కొందరు  ఏపీ వాళ్ళు  అనుకుంటున్నారేమో  ? విభజన సమయంలోనే హైదరాబాద్  దేశానికి రెండో రాజధానిగా  ఒప్పుకున్న  పరిస్థితి లేదు. 


  ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు తెలంగాణాలో పెట్టుబడులను పెట్టినా కూడా ..ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టుబడులు  పెట్టి అభివృద్ధిలో పాల్గొనాలి. 

ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలామంది తమ  అభివృద్ధి  వరకే ఆలోచిస్తారు.  తాము ఎక్కడుంటే  అదే  తమ ప్రాంతం అనుకుంటారు. ఎక్కడుంటే అదే మన ప్రాంతం అని మనం  అనుకుంటే   సరిపోదు... అవతలివారు కూడా  మనల్ని  తమవారేనని  అనుకోవాలి కదా!


 హైదరాబాద్ తో కూడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు వల్ల ఆంధ్ర ప్రదేశ్ విపరీతంగా  నష్టపోయింది. రాజధాని  అని  ఏపీ ప్రజలు చాలామంది   హైదరాబాద్లో పెట్టుబడులు  పెట్టారు.


 అప్పట్లో  హైదరాబాద్ లో కాకుండా,  ఆంధ్రప్రదేశ్ లోనే రాజధాని ఏర్పాటు అయినట్లయితే ,  ఆంధ్రప్రదేశ్ వారి పెట్టుబడులు హైదరాబాద్ లో ఉండేవి కాదు.

బోలెడు కాలం గడిచిపోయింది. ఇప్పుడు అంతా మొదటినుంచీ  పని  అన్నట్లుంది.  ఇప్పటికైనా  హైదరాబాద్లో ఉన్న ఏపీ  వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టుబడులు పెట్టి ఇక్కడి అభివృద్ధికి ముందుకురావాలి. 


ఎంతకూ కేంద్రప్రభుత్వాన్నో మరెవరినో ఆడిపోసుకోవటం కాకుండా  ఎవరి రాష్ట్రాన్ని వారు  అభివృద్ధి చేసుకోవటం అవసరం.


************

ఈ మధ్య  ఒకరు ...హైదరాబాద్ లో  చాలా  ఆదాయం ఏపీ  ప్రజల నుంచే  వస్తోంది..వీళ్లందరూ ఏపీకి వెళ్తే నిధుల అవసరం తీరుతుందని  అన్నారు.. ఆసక్తి ఉన్నవారు  ఇక్కడ క్లిక్ చేసి చూడగలరు.  

Hyderabad Andhras key to AP development....

************

Amaravati: NITI Aayog has a sure-fire solution for state’s problem of funds: Let 40 per cent of people in Hyderabad who are of Andhra origin, shift to AP. The taxes they are paying to Telangana state would then go to Andhra. As NITI Aayog vice-chairman Dr Rajiv Kumar made the suggestion in lighter vein to Chief Minister N Chandrababu Naidu here on Thursday but in fact it held the key since Telangana is rich because of tax revenue mainly from Hyderabad.

“NITI Aayog will help you out but it is not a bad idea if Andhra origin people shift to AP,” he said, while assuring Chandrababu Naidu that his institution would help the state in every possible way.....

************

 ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు తెలివితేటలు, కష్టపడే తత్వమూ  బాగా ఉన్నాయి. అయితే, తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన అంతగా ఉండదు. ఆ ఒక్క విషయంలో కొంత ముందుకు వస్తే ఇక ఏపీ అభివృద్ధి  విషయంలో ముందుకు  వెళ్తుంది.


No comments:

Post a Comment