ఈ రోజులలో సరైన ఉపాధి అవకాశాలు లేక ఎందరో ప్రజలు ఇతర రాష్ట్రాలకు , విదేశాలకు వెళ్లి అక్కడ ..ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సమస్యలు ఉన్నాయి.
అందువల్ల అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు అభివృద్ధి చెందాలి. ఎక్కడికక్కడ విద్య మరియు ఉపాధి లభించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
స్థానికంగా మా ఉద్యోగాలు మాకే కావాలి.... అనే పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పరిస్థితిలో .. ఎక్కడివారికి అక్కడ ఉపాధి అవకాశాలను కల్పించటం తప్పనిసరి.
మనవాళ్ళు విదేశాలకు వెళ్లే అవసరం లేకుండా స్థానికంగానే ఉపాధి లభించాలి. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టే సంస్థలు స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలి.
............................
పరిశ్రమలతో పాటు వ్యవసాయరంగం కూడా అభివృద్ధి చెందాలి.సారవంతమైన నేలలు, ఎన్నో నదులు, శ్రమించే వ్యక్తులు ఉండి కూడా ..ఇప్పటికీ భారతదేశం పప్పుదినుసులను ఇతరదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితిలో ఉండటం స్వయంకృతాపరాధం.
పండించిన పంటలను నిల్వ చేసుకునే సౌకర్యాలు లేక పండిన పంటలు పాడైపోతున్నాయి..
పండించిన పంటను నిల్వ చేసుకునే సౌకర్యాలను కల్పిస్తే , ఇతరదేశాల నుంచి దిగుమతి చేసుకునే అవసరం ఉండదు. ఎంతో ధనం వృధా కాకుండా ఉంటుంది.
ఆహారపదార్ధాల తయారీ సంస్థల ద్వారా కూడా ఎందరికో ఉపాధి లభిస్తోంది.
ఇప్పటి యాంత్రిక కాలంలో కొన్ని పెద్దపెద్ద పరిశ్రమలవాళ్ళు కూడా ...20 వేలమందికి ఉపాధి కల్పిస్తామని సరిగ్గా చెప్పలేని పరిస్థితి ఉంది.
అయితే, కడియం తోటల పై ఆధారపడి సుమారు 20 వేలమందికి ఉపాధి లభిస్తున్నదని వార్తల ద్వారా తెలుస్తోంది.
.................................
భారతీయతల్లితండ్రి తమ పిల్లలను ఎప్పుడూ ఐటి రంగమే కాకుండా వ్యాపారాలు, వ్యవసాయం, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు ప్రోత్సహించాలి.
ఎక్కడెక్కడివాళ్లు వ్యవసాయం, వ్యాపారం..చక్కగా చేసుకుంటుంటే, భారతీయులకు ఏమైందో?
...............................
పెద్ద పరిశ్రమలతో పాటు చిన్న, మధ్యతరగతి పరిశ్రమలనూ ప్రోత్సహించాలి...
పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి కూడా ఎన్నో దేశాలు చాలా ఆదాయాన్ని పొందుతున్నారు. ఎంతో మందికి ఉపాధి అభిస్తోంది.
...................................
పెద్ద పరిశ్రమలతో పాటు చిన్న, మధ్యతరగతి పరిశ్రమలనూ ప్రోత్సహించాలి...
పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి కూడా ఎన్నో దేశాలు చాలా ఆదాయాన్ని పొందుతున్నారు. ఎంతో మందికి ఉపాధి అభిస్తోంది.
...................................
చాలా దేశాలవాళ్లు తమ స్థానికులకే ఉద్యోగాలు ఉండాలని, విదేశీయులకు ఉద్యోగాలు ఇవ్వకూడదని అనుకుంటున్నారు, అక్కడి కంపెనీలకు కూడా చెబుతున్నారు. ఇందులో తప్పేముంది? ఎక్కడైనా స్థానికులకు ఉద్యోగాలు ఉండాలికదా..
అలాగే భారతదేశంలో కూడా అన్నిరంగాల్లో భారతీయులకే అవకాశాలు ఉండటం ముఖ్యం.
భారతదేశంలో విస్తారమైన భూమిలేదు, ఇప్పటికే ఇక్కడ జనాభా ఎక్కువుంది. అందువల్ల అక్రమవలసదారులను రానివ్వకపోవటంలో తప్పేమిటి?
భారతదేశంలోకి భారీగా అక్రమవలసవాళ్లు వచ్చిపడితే, స్వదేశీయులకు ఉద్యోగాలు, వ్యాపారాలు కూడా తగ్గిపోతాయి. అప్పుడు, ప్రజలు తమకు ఉపాధి కల్పించటంలేదని ప్రభుత్వాలను తిడతారు.
ఇలా వచ్చే అక్రమవలసదారులు ఓట్లు, రేషన్ కార్డులు కూడా పొందుతున్నారు. దొంగదారుల్లో వచ్చే అక్రమవలసదారులను ఎలాగైనా అడ్దుకోవటానికి ప్రయత్నిస్తుంటే కొందరు అడ్డుపడటం ఏమిటో?
ఎవరి దేశాన్ని వారు బాగు చేసుకోవాలి కాని, బాగున్న దేశాలకు వెళ్లటం కాదు. కొద్దిమంది వలసలు వెళ్తే తిరుగుబాట్లు రాకపోవచ్చుకాని, వలసలు విపరీతంగా పెరిగితే తిరుగుబాట్లు వస్తాయి.
భారతీయులు కూడా విదేశాలకు వెళ్లటంకన్నా, ఇక్కడ వ్యవస్థను మెరుగుపరచటంలో భాగస్వాములవ్వాలి.
ఎవరి ఇంటిని వాళ్లు చక్కదిద్దుకుంటారు కాని, బాగుందని పక్కింటికి వెళ్లి ఉంటే ఎంతకాలం సరిగ్గా ఉంటుందో? ఎవరి దేశాన్ని వాళ్లు, ఎవరి రాష్ట్రాన్ని వాళ్లు చక్కదిద్దుకుంటే అందరూ బాగుంటారు.
............................. దేశంలో పేదరికం పోవాలన్నా, అందరికీ ఉపాధి లభించాలన్నా, ఆర్ధిక అసమానతలు తగ్గాలన్నా మనుషుల్లో స్వార్ధం పోవాలి... నల్లడబ్బు, అవినీతి వంటివి ఉండకూడదు.
సంపద కొందరి వద్దే పోగయ్యే పరిస్థితి ఉండకూడదు.
సంపద కొందరి వద్దే పోగయ్యే పరిస్థితి ఉండకూడదు.
..................................
ఇంకా ఏమనిపిస్తుందంటే, మనుషులకు నిత్యావసరాలు తప్పనిసరిగా తీరాలి. కొంత ఆహ్లాదమూ ఉండాలి. అంటే, పార్కులు, కొండలు, అలా ప్రకృతిలో సుందరదృశ్యాల మధ్య గడపటం, ఆటలు,కధలు వినటం..ఇలాంటివి ఉండాలి.
అయితే, అభివృద్ధి అని ఆడంబరంగా సంపద పోగేసుకుంటే ఆ సంపద కొరకు ఇతరులు వచ్చే అవకాశం ఉంది.
సంపదతో ఉన్న ప్రాచీన భారతదేశానికి ఎందరో వచ్చి ఎంతో సొమ్మును తీసుకుపోయారు.
ఎంతో కష్టపడి ఎన్నో సమకూర్చుకుంటే ఎవరో వచ్చి లాగేసుకుంటే ఎంతో బాధకదా..
అందువల్ల, అభివృద్ధి అని అతి తాపత్రయం తగ్గించుకుని, అవసరమైనంతలో ఉంటే మంచిదనిపిస్తుంది.