koodali

Wednesday, January 3, 2018

మూఢనమ్మకాలను , మూఢత్వాన్ని వదిలి......


మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా దెశంలోని కొన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.

 మూఢనమ్మకాలకు   వ్యతిరేకంగా చర్యలు తీసుకోవటం మంచివిషయం. 

జీవితంలో దైవభక్తి, సత్ప్రవర్తన.. చాలా అవసరం. 

దైవకృపను పొందడానికి  మరియు చక్కటి జీవితానికి ఉపయోగపడేలా  పెద్దలు చక్కటి పూజావిధానం  మరియు  ఆచారవ్యవహారాలను తెలియజేసారు. 

అయితే,  కొందరి వల్ల కొన్ని ఆచారవ్యవహారాలలో కొన్ని  మూఢనమ్మకాలు  కూడా చేరటం  జరిగింది. 


దైవభక్తి పెరిగేలా  ఆచారవ్యవహారాలు  ఉండాలి . 


అంతేకానీ, చారవ్యవహారాలంటేనే  విసుగు,  భయం కలిగే  పరిస్థితి  తెచ్చుకోవటం సరైనది కాదు.  

కొందరు ప్రజలు ఆచారవ్యవహారాలను  విపరీతధోరణితో  చేస్తున్నారు. 

  ఏం చేస్తే ఏం తప్పో ? అన్నట్లు భయపడే ధోరణి పెరుగుతోంది. 

ఇలాంటి విపరీతధోరణి ఇంకా పెరిగితే ....

నోరు అంటే ఉమ్మి ఉంటుంది, ఉమ్మిఅంటే  ఎంగిలి,  అశుచి, అంటు కాబట్టి .. నోటితో పవిత్రమైన  దైవనామాలను, మంత్రాలను పలకడం కూడా తప్పేమో ? అని కూడా ముందుముందు ఎవరికైనా సందేహాలు  కలుగుతాయేమో ? 

ఇలాంటి  పరిస్థితి రాకూడదు . 
...............
ఆచారవ్యవహారాల్లో క్లిష్టతను పెంచితే , అవన్నీ పాటించలేక కొందరు ప్రజలు సరళంగా ఉండే ఆచారవ్యవహారాలు గల మత పద్ధతిలోకి  మారే పరిస్థితి కూడా కలగవచ్చు.
***************
 కొందరు పూజ చేసేటప్పుడు భక్తి కన్నా పూజలో ఎక్కడ పొరపాట్లు వస్తాయో ? వస్తే ఏమవుతుందో ? అనే భయంతో పూజలు చేస్తూ ఉంటారు.

కానీ ఆ భయం వల్ల  పూజకే దూరం అయ్యే పరిస్థితి రాకూడదు .

కష్టంలోనూ, సుఖం లోనూ అందరికి తోడునీడ దైవమే.

మన అందరికీ హితులు, స్నేహితులు, జన్మజన్మల బంధువు, ఆత్మ, పరమాత్మ అన్నీ దైవమే.

మనకు ఎవరైనా విసుగుతో పంచభక్ష్య పరమాణ్ణాలు పెట్టిన  దానికన్నా .....ప్రేమతో  పెట్టిన  పదార్ధాలే బాగుంటాయి.

  ఎవరైనా  భయం వల్ల ..  మనల్ని  పలకరించటం కన్నా ..... ప్రేమగా పలకరించటమే బాగుంటుందని మనకు  అనిపిస్తుంది కదా !
    అలాగే , దైవాన్ని కూడా మనము ప్రేమగా ఆరాధించటమే బాగుంటుంది.

దైవం కోరుకునేది.. అందరూ పరమపదాన్ని పొంది ఎప్పటికీ పరమానందంగా ఉండాలనే.

ప్రజలు  మూఢత్వాన్ని వదిలి  దైవానికి దగ్గరకావడానికి ప్రయత్నించడం మంచిది.



No comments:

Post a Comment