koodali

Thursday, January 11, 2018

కొన్ని వంటగది విషయాల....

 
 
మిక్సీ వాడిన తరువాత ...నీటితో కడిగి తరువాత కూడా ...బ్లేడ్ వద్ద కొన్ని పదార్ధాలు ఇరుక్కుని ఉండే అవకాశం ఉంది. 

అలా  బ్లేడ్ల మధ్య మిగిలిన పదార్ధాల వల్ల అనారోగ్యం కలిగే అవకాశం ఉంది.

అందువల్ల  ఒకసారి  మిక్సీ  శుభ్రం చేసిన  తరువాత  , మరల   మిక్సీలో  కొద్దిగా మంచి నీరు పోసి ...ఒకసారి తిప్పి బోర్లిస్తే ,బ్లేడ్లో  ఇరుక్కున్న పదార్ధాలు వచ్చేస్తాయి. 


*************


ఈ మధ్య కూరగాయలు తరిగే కట్టర్స్ వచ్చాయి. వీటి వల్ల కూరలు తరగటం తేలికగానే ఉంది.

అయితే, వీటితో కూరలు తరిగిన తరువాత వెంటనే శుభ్రం చేసి ఎండలో పెడితే మంచిది.

లేకుంటే కట్టర్లో మిగిలిన పదార్ధాలు కుళ్లి అనారోగ్యకర బాక్టీరియా చేరే అవకాశం ఉంది. 


No comments:

Post a Comment