koodali

Saturday, April 25, 2015

వేసవి వానలు ...


 ఈ మధ్యన పడిన వానకు సేదతీరిన పక్షులు చేస్తున్న కిలకిలారావాలు వినిపిస్తున్నాయి. 

........................... 

మండే వేసవికాలంలో నీరు త్రాగకుండా ఎక్కువసేపు  తట్టుకోలేము. మరి దాహం అని చెప్పుకోవటం   చేతకాని మూగజీవులైన మొక్కలు, పశుపక్ష్యాదుల సంగతి ఏమిటి ? 


అందుకే వేసవిలో  కొద్దిగానైనా వాన పడాలి.   ఆ నీటితో మొక్కలు, పశుపక్ష్యాదులు సేదతీరుతాయి. పాపం వాటికీ దాహం వేస్తుంది కదా ! ఎంతకీ మనుషుల ఆకలిదప్పులే ముఖ్యం అనుకోకూడదు.


భూమిపై నివసించటానికి  మనుషులకే కాదు.. పశుపక్ష్యాదులకూ హక్కు ఉంది . 

...............

వేసవికాలంలో కొద్దిపాటి వర్షాలు పడటం  సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. 


పాతకాలంలో, ఎండాకాలంలో ఎండిన  చెరువులు, కుంటల వద్ద  కొద్దిగా అయినా నీరుండేది.   ఈ రోజుల్లో అయితే  మనుషుల అవసరాలకు ఎక్కడి భూమీ  చాలటం లేదు. చెరువులను, కుంటలను కూడా కబ్జాచేసేసి  ఏదో ఒక నిర్మాణాలు నిర్మించేస్తున్నారు.



 మట్టినేలలో వర్షపు నీరు ఇంకకుండా  ఎక్కువ భాగం నేలను   సిమెంటుతో కప్పేస్తున్నారు. పశుపక్ష్యాదులకు త్రాగటానికి నీరన్నది దొరకకుండా చేస్తున్నారు.

..................

ముఖ్యంగా సిటీలలో నీరు అన్నది బయట కనబడకుండా అండర్ డ్రైనేజ్ వ్యవస్థ ఉంటుంది కదా ! 


 మేము చెన్నైలో ఉన్నప్పుడు  డాబా పైన .. ఒక  
ప్లాస్టిక్ బౌల్  తో నీళ్లు పెడితే  కాకులు,  ఉడుతలు.. వచ్చి నీరు  త్రాగేవి.


(  ప్లాస్టిక్ బౌల్ బదులు  మట్టిముంత  కూడా ..ఉపయోగించ వచ్చు. )

 
 బౌల్ లో  రెండురోజుల కొకసారి  కొత్తగా నీరు పోస్తే సరిపోయేది. అప్పుడప్పుడు  బౌల్  శుభ్రం  చేస్తే  బాగుంటుంది. 


(ఎండకు నీళ్లు సలసలా వేడెక్క కుండా ... నీటి పాత్ర నీడలో పెట్టాలి.)

......................... 

 ఇళ్ల ముందు  ఎత్తు  తక్కువ ఉన్న  వెడల్పాటి  నీటితొట్టెలను నెలకొల్పి ,  వాటిలో నీటిని నింపితే పశుపక్ష్యాదులు త్రాగటానికి బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది .  


 ( అయితే,  పసిపిల్లలు  నీటి  తొట్టెలలో పడే  ప్రమాదం నుంచి  జాగ్రత్తగా ఉండాలంటే... 
నీటితొట్టె  ఎత్తు తక్కువ  ఉండాలి. )

..............

 ఈ రోజుల్లో వాతావరణంలో వస్తున్న విపరీతమైన మార్పుల వల్ల   వేసవిలో  అల్పపీడనం  ఏర్పడి , తీవ్రమైన గాలివానలు  వస్తున్నాయి.   ఈ   గాలివానల వల్ల పంటలు దెబ్బతింటున్నాయంటున్నారు.


 (పంటలు  నష్టపోయిన రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలి.)
........................... 
వాతావరణంలో సమతుల్యత ఉంటే , వేసవిలో అల్పపీడనం.. తీవ్రమైన గాలివానలు రాకుండా.. కొద్దిపాటి వాన మాత్రం పడి,  ఎండల నుంచి జీవజాలం కొద్దిగా తేరుకుంటుంది .  తీవ్రమైన  గాలిలేని..  కొద్దిపాటి వాన వల్ల పంటనష్టం చాలా తక్కువగా ఉంటుంది. 


వాతావరణంలో పెనుమార్పులు రాకుండా  ఉండాలంటే...  పర్యావరణాన్ని పాడుచేసుకోకూడదు. 



No comments:

Post a Comment