koodali

Monday, April 13, 2015

ఖనిజవనరులు అత్యంత విలువైనవి...


ప్రకృతిలో ఖనిజాలు వంటి సహజవనరులు ఏర్పాడాలంటే ఎన్నో వేల సంవత్సరాలకు పైనే పడుతుంది. ఇలాంటి సహజవనరులు  అమూల్యమైనవి. వీటిని పొదుపుగా వాడుకోవాలి.

 మన పాత తరాలవాళ్ళు వాటిని విచ్చలవిడిగా వాడేసి ఉన్నట్లయితే,  ఇప్పుడు మన పని అధ్వాన్నంగా ఉండేది. వాళ్ళు అలా చేయలేదు కాబట్టి ఇప్పుడు మనకు ఎంతో ఖనిజ సంపద ఉంది.


 అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ?


 టెక్నాలజీ, ఉపాధి కోసం ...అంటూ సహజవనరులను విచ్చలవిడిగా తవ్వేసి ఖాళీ చేసేస్తున్నాము.పరిస్థితి ఇలాగే ఉంటే ముందు తరాలవారి చేతికి  చిప్ప కూడా మిగలకపోవచ్చు. 


 దూరదృష్టి ఉన్న కొన్ని పాశ్చాత్య దేశాల వాళ్ళు రాబోయే పరిస్థితిని అంచనావేసి తమ దేశాలలోని  ఖనిజవనరుల త్రవ్వకాలను గణనీయంగా తగ్గించి ఖనిజాలను దాచుకుంటున్నారట. 


వారి అవసరాల కొరకు ఇతరదేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్నారట.మనకు  కూడా  దూరదృష్టి ఎంతో అవసరం. 


ఖనిజాలను  ఎంతవరకూ అవసరమో అంతవరకే వాడుకోవాలి.  మన కోరికలను  కొంతమేరకు తగ్గించుకోవాలి. 



ఉపాధి కోసం అంటూ విచ్చలవిడిగా  ఖనిజవనరులను  త్రవ్వేస్తే రాబోయే కాలంలో విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. 


దురదృష్టం ఏమిటంటే,  ఈ రోజుల్లో ఇలాంటి జాగ్రత్తలను పట్టించుకునే వారు తగ్గిపోయారు.


  ఇప్పటి అవసరాలు తీరటమే ముఖ్యం. రాబోయే తరాల వారి గోల మనకేల ? అనుకునే వాళ్లు ఎక్కువయ్యారు. 


ఖనిజవనరులు అప్పుడే అయిపోతాయా ఏమిటి ? అని అనుకునే వాళ్లూ ఎక్కువగా ఉన్నారు.


విపరీతమైన వాడకం వల్ల  పెట్రోల్, సహజవాయువు వంటి ఇంధన వనరులు  మరి కొద్ది కాలంలోనే అయిపోయే పరిస్థితి వచ్చిందని శాస్త్రవేత్తలే హెచ్చరిస్తున్నారు కదా !


ఇప్పటికే కాపర్..వంటివి తక్కువగా ఉన్నాయని అంటున్నారు.

ఖనిజాలనూ విపరీతంగా వాడేస్తే అవీ అయిపోయే రోజూ వస్తుంది. అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

No comments:

Post a Comment